Sunday, August 2, 2015

జాతీయ పతాకం నియమాలు

జాతీయ పతాకాన్ని కొన్ని స్థలాలలో అన్నిరోజులూ , కొన్ని స్థలాలలో
కొన్ని సందర్భాలలో ఎగురవేస్తారు . జాతీయ పతాకం
ఎగురవేయడంలో సరియైన పద్దతులు , సంప్రదాయాలు
పాటించాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసినది .
వీటిని ఫ్లాగ్ కోడ్ - ఇండియాలో పొందు పరిచారు . దీనిలోని
ముఖ్యాంశాలు ఇలాఉన్నాయి .
అధికార పూర్వకంగా ప్రదర్శన కొరకు ఉపయోగించే పతాకం
అన్నిసందర్భాలలోనూ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ
నిర్దేసించిన స్పెసిఫికేషన్స్కి కట్టుబడి ఉండి , ఐ .యస్ .ఐ
మార్కుని కలిగి ఉండాలి . మిగిలిన అనధికార సంధర్భాలలో కూడా
సరయిన కొలతలతో తయారైన పతకాలను ఉపయోగించడం
సమంజసం . జాతీయ జెండా కొలతలు : 21'X 14'; 12'X 8', 6'X 4', 3'X 2', 9'X6', సైజుల్లో ఉండాలి . సందర్భాన్ని బట్టి జెండా
ఏసైజులో ఉండాలో ఫ్లాగ్ కోడ్ లో పేర్కొన్నారు . జెండా
మధ్యభాగంలో ధర్మచక్రం నేవీ బ్లూ రంగులోనే ఉండాలి .
ధర్మచక్రంలో 24 గీతలు ఉండాలి .జాతీయజెండాని అలంకరణ
కోసం వాడకూడదు. అలానే జెండా ఎగురవేసేటప్పుడు ఎట్టి
పరిస్థితులలో నేలను తాకకూడదు. ఎగరవేసేటప్పుడు
వేగంగాను , అవనతం చేసేటప్పుడు మెల్లగానూ దించాలి .
కాషాయ రంగు అగ్రభాగాన ఉండాలి .సూర్యోదయానంతరం
మాత్రమే పతాకం ఎగురవేయాలి . అలాగే సూర్యాస్తమయం కాగానే
జెండాను దించాలి . పతాకాన్ని ఏవిధమయిన ప్రకటనలకు
ఉపయోగించరాదు . అంతేకాక పతాక స్థంభం పైన ప్రకటనలను
అంటించరాదు, కట్టరాదు . ప్రముఖనాయకులు , పెద్దలూ
మరణించిన సందర్భాలలో సంతాప సూచికంగా జాతీయ పతాకాన్ని
అవనతం చేయాలి . జాతీయ పతాకం వాడుకలో ఈ నియమాలన్నీ ప్రతి
భారతీయుడూ విధిగా పాటించాలి . జైహింద్!

Wednesday, July 1, 2015

మీరు కొనే వస్తువులు మంచివా లేక నకిలీవా

మీరు కొనే వస్తువులు మంచివా లేక నకిలీవా అని తెలుసుకోవడం చాలా అవసరం..
మీరు కొనే వస్తువులు ఏ దేశానివో తెలుసుకుని కొనడానికి ఉపయోగపడే
బార్ కోడ్స్ ఇవి..........ప్రతి ఒక్కరూ నోట్ చేసుకుని మోసపోకుండా మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోండి........విజయ.కె.

00-13: USA & Canada
20-29: In-Store Functions
30-37: France
40-44: Germany
45: Japan (also 49)
46: Russian Federation
471: Taiwan
474: Estonia
475: Latvia
477: Lithuania
479: Sri Lanka
480: Philippines
482: Ukraine
484: Moldova
485: Armenia
486: Georgia
487: Kazakhstan
489: Hong Kong
49: Japan (JAN-13)
50: United Kingdom
520: Greece
528: Lebanon
529: Cyprus
531: Macedonia
535: Malta
539: Ireland
54: Belgium & Luxembourg
560: Portugal
569: Iceland
57: Denmark
590: Poland
594: Romania
599: Hungary
600 & 601: South Africa
609: Mauritius
611: Morocco
613: Algeria
619: Tunisia
622: Egypt
625: Jordan
626: Iran
64: Finland
690-692: China
70: Norway
729: Israel
73: Sweden
740: Guatemala
741: El Salvador
742: Honduras
743: Nicaragua
744: Costa Rica
746: Dominican Republic
750: Mexico
759: Venezuela
76: Switzerland
770: Colombia
773: Uruguay
775: Peru
777: Bolivia
779: Argentina
780: Chile
784: Paraguay
785: Peru
786: Ecuador
789: Brazil
80 – 83: Italy
84: Spain
850: Cuba
858: Slovakia
859: Czech Republic
860: Yugoslavia
869: Turkey
87: Netherlands
880: South Korea
885: Thailand
888: Singapore
890: India
893: Vietnam
899: Indonesia
90 & 91: Austria
93: Australia
94: New Zealand
955: Malaysia
977: International Standard Serial Number for Periodicals (ISSN)
978: International Standard Book Numbering (ISBN)
979: International Standard Music Number (ISMN)
980: Refund receipts
981 & 982: Common Currency Coupons

శ్రీకృష్ణుడి కుటుంబము

శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు.
రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు.
సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు.
జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.
నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు.
కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు.
లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.
మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు.
కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు.
ఈ అష్ట మహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది కృష్ణుడి భార్యల ద్వారా కూడా ఒక్కొక్కరికి పది మంది సంతతి కలిగింది.
కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు. అన్ని వేల మంది తో కేవలం సరససల్లాపాలు మాత్రమె చేసాడు.
అల్లరి చేసాడు, అల్లరి పెట్టాడు.
అంతవరకే కానీ ఏ నాడు ఆయన అతిక్రమించలేదు.
గోపికలు కృష్ణుల మద్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే.
కృష్ణుడు భోగి గా కనిపించే యోగి.
ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది.
అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి జాతీయ పక్షిగా ప్రకటించబడుతుంది.
పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు.
అందుకే నెమలి పించం తలపై ఉండి శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది.

జీ మెయిల్‌లో ఈ ఫీచర్స్ మీకు తెలుసా!


కంపోజ్‌ చేయడం, ఫైల్‌ను అటాచ్‌ చేయడం, సెండ్‌ కొట్టడం, అప్పుడప్పుడూ చాట్‌ చేయడం.. ఈ ఫీచర్స్‌ని ఉపయోగించడం అందరూ చేసేదే. ఇవే కాకుండా జీమెయిల్‌లో బోలెడు ఫీచర్స్‌ ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే మరింత ఉపయోగం..
 
అన్‌డు సెండ్‌
చకా చకా మెయిల్‌లో టైప్‌ చేస్తారు. తొందరలో తప్పులను గుర్తించకుండా సెండ్‌ కొట్టేస్తారు. ఆ తరువాత అయ్యో తప్పులున్నాయి కదా అని తలపట్టుకుంటారు. ఒక్కసారి సెండ్‌ కొడితే మెయిల్‌ వెళ్లిపోయినట్లే కదా. కాని జీమెయిల్‌లో ఒక ఫీచర్‌ ఉంది. చాలా మందికి ఈ ఫీచర్‌ గురించి తెలియదు. సెండ్‌ కొట్టిన మెయిల్‌ను అన్‌డు కొట్టొచ్చు. అంటే మెయిల్‌ వారికి చేరకముందే ఆగిపోతుంది. ఇందుకోసం చేయాల్సిందల్లా జీమెయిల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అన్‌ డు సెండ్‌ని ఎనేబుల్‌లో పెట్టుకోవాలి. ఎన్ని సెకన్ల పాటు వెయిట్‌ చేయాలో ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి 30 సెకండ్లు సెలక్ట్‌ చేసుకుంటే కనుక మీరు మెయిల్‌ సెండ్‌ కొట్టిన 30 సెకండ్ల తరువాతే మెయిల్‌ వెళుతుంది. ఆ లోపు కావాలంటే అన్‌డు కొట్టొచ్చు.
 
కీబోర్డ్‌ షార్ట్‌కట్స్‌
షార్ట్‌కట్స్‌ను ఇష్టపడని వారు ఎవరుంటారు? కాని జీమెయిల్‌లో షార్ట్‌కట్స్‌ ఎలా? అంటే జీమెయిల్‌ ల్యాబ్స్‌లో కస్టమ్‌ కీబోర్డ్‌ షార్ట్‌కట్స్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఇందులో మీ సొంత షార్ట్‌కట్స్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు.
 
ఆటో అడ్వాన్స్‌
మీ జీమెయిల్‌ ఇన్‌బాక్స్‌లోకి రోజూ లెక్కలేనన్ని మెయిల్స్‌ వచ్చిపడుతూ ఉంటాయి. వాటిని ఓపెన్‌ చేసి పనికి రానివి డిలీట్‌ చేయడం, వెంటనే మళ్లీ ఇన్‌బాక్స్‌ స్ర్కీన్‌ ఓపెన్‌ కావడం... ఇదంతా తలనొప్పిగా ఉంటుంది. అలా కాకుండా జీమెయిల్‌ ల్యాబ్స్‌లో ఉన్న ఆటో అడ్వాన్స్‌ ఫీచర్‌ని ఎంచుకుంటే కనుక మెయిల్‌ డిలీట్‌ చేయగానే ఆ తరువాత మెయిల్‌ ఓపెన్‌ అవుతుంది. సింపుల్‌గా అనిపించినా ఈ ఫీచర్‌ మీ సమయాన్ని ఆదా చేస్తుంది.
 
సెండ్‌ అండ్‌ ఆర్చివ్‌
జీమెయిల్‌ జనరల్‌ సెట్టింగ్స్‌లో ‘షో సెండ్‌ అండ్‌ ఆర్చివ్‌’ బటన్‌ని ఎంచుకోవాలి. ఈ మెయిల్‌కు రిప్లై ఇచ్చాక సెండ్‌ కొడితే ఆ మెయిల్‌ ఇన్‌బాక్స్‌లో ఉండకుండా ఆర్చివ్‌ థ్రెడ్‌లోకి వెళుతుంది. సెంట్‌ మెయిల్‌లో ఆ మెయిల్‌ను చెక్‌ చేసుకోవచ్చు. ఇన్‌బాక్స్‌ క్లీన్‌గా ఉంచుకోవడానికి ఈ ఫీచర్‌ ఉపకరిస్తుంది.
 
యాప్స్‌ సెర్చ్‌
ఒకవేళ మీరు గూగుల్‌ డాక్స్‌, గూగుల్‌ సైట్స్‌ ఉపయోగిస్తున్నట్లయితే యాప్‌ సెర్చ్‌ ఫీచర్‌ మీకు బాగా ఉపయోగపడుతుంది. ల్యాబ్స్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. జీమెయిల్‌లో మీరు సెర్చ్‌ చేస్తున్నట్లయితే ఈ ఫీచర్‌ మీకు డాక్స్‌, సైట్స్‌లో ఉన్నవి కూడా సెర్చ్‌ చేసి చూపిస్తుంది. జీమెయిల్‌లో నుంచే ఫైల్‌ ఎక్కడుందీ వెతకొచ్చు.
 
రిప్లై ఆల్‌ను డిఫాల్ట్‌గా ఎంచుకోండి
కొన్ని మెయిల్స్‌ మల్టిపుల్‌ పీపుల్‌కి పంపించాల్సి ఉంటుంది. ఈమెయిల్‌ థ్రెడ్‌లో మల్టిపుల్‌ పీపుల్‌ ఇన్‌వాల్వ్‌ అయి ఉంటారు. మెయిల్‌ పంపించే సమయంలో రిప్లై ఆల్‌కు బదులుగా రిప్లై బటన్‌ని ఎంచుకుంటే ఒక్కరు తప్ప అందరూ ఆ మెయిల్‌ని మిస్‌ అయిపోతారు. అలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండాలంటే జీమెయిల్‌ జనరల్‌ సెట్టింగ్స్‌లో ఉన్న డిఫాల్ట్‌ రిప్లై బిహేవియర్‌లో రిప్లై ఆల్‌ని ఎంచుకోవాలి.
 
క్విక్‌ లింక్స్‌
ముఖ్యమైన మెయిల్స్‌కు స్టార్‌ పెట్టుకోవడం తెలిసిందే. అయితే అంతకన్నా సులభంగా ముఖ్యమైన మెయిల్స్‌ని యాక్సెస్‌ చేసుకునే విధంగా పెట్టుకోవాలంటే క్విక్‌ లింక్స్‌ని ఎంచుకోవాలి. జీమెయిల్‌ ల్యాబ్స్‌లో ఉన్న క్విక్‌ లింక్స్‌ని ఒక్కసారి ఎనేబుల్‌ చేస్తే చాలు. మెయిల్‌లో ఎడమవైపు ఒక బాక్స్‌ కనిపిస్తుంది. మీరు బుక్‌మార్క్‌ చేసుకున్న మెయిల్స్‌ అన్నీ ఇందులో ఒక్క క్లిక్‌ చేసుకునే విధంగా ఉంటాయి. ప్రత్యేక మెసేజ్‌లు, లేబుల్స్‌, సెర్చ్‌ చేసినవి..ఇలా అన్నీ ఇందులో ఉంటాయి.
 
అన్‌రీడ్‌ ఐకాన్‌
మీకు న్యూ మెయిల్‌ వచ్చినపుడు జీమెయిల్‌ ట్యాబ్‌ తెలియజేస్తుంది. కాని మీ ఇన్‌బాక్స్‌లో ఎన్ని అన్‌రీడ్‌ మెయిల్స్‌ ఉన్నాయో తెలుసుకోవాలంటే జీమెయిల్‌ ల్యాబ్స్‌లోని ‘అన్‌రీడ్‌ మేసేజ్‌ ఐకాన్‌’ ఉపయోగపడుతుంది.

స్పామ్‌ హ్యాండ్లింగ్‌
జీమెయిల్‌ అడ్ర్‌సలో డాట్‌కు ఉన్న ప్రాధాన్యం ఎంతో మీకు తెలుసా? ఉదాహరణకి మీ మెయిల్‌ durga.reddy@gmail.comఅనుకుందాం. అప్పుడు durgareddy@gmail.com లేక d.urgareddy@gmail.com మెయిల్‌ అడ్ర్‌సతో పంపిన మెయిల్స్‌ కూడా మీ ఇన్‌బాక్స్‌లోకి వస్తుంటాయి. ఈ ఇబ్బంది పోవాలంటే ఫిల్టర్‌ రూల్స్‌ని సెటప్‌ చేసుకోవాలి. ఒక్కసారి రిజిస్టర్‌ చేసుకుంటే చాలు. ఏయే మెయిల్‌ ఐడీల నుంచి మెయిల్స్‌ వచ్చే అవకాశం ఉందో ఆ మెయిల్‌ఐడీలను టైప్‌ చేసి ఈమెయిల్‌ ఫిల్టర్‌ క్రియేట్‌ చేసుకోవాలి. అప్పుడు ఆ ఐడీలతో వచ్చే మెయిల్స్‌ అన్నీ ఆటోమెటిక్‌గా డిలీట్‌ అవుతాయి.
 
సార్టింగ్‌ సులువు
ఎన్నో చోట్ల మెయిల్‌ ఐడీ ఇస్తుంటారు. ఎన్నో మెయిల్స్‌ వస్తుంటాయి. ఏ మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే అన్నీ చెక్‌ చేయాల్సిందే. అలా కాకుండా మెయిల్‌ ఐడీని ఇచ్చే సమయంలోనే + ఫీచర్‌ని ఉపయోగించినట్లయితే సార్టింగ్‌ చేయడం సులువవుతుంది. ఉదాహరణకి మీరు ఆఫర్స్‌కు సంబంధించిన సమాచారం కోసం రిజిస్టర్‌ చేసుకుని ఐడీ ఇచ్చారనుకుందాం. ఆ సమయంలోనే ఐడీలో + ఫీచర్‌ని జోడించాలి. ఉదాహరణకి మీ మెయిల్‌ ఐడీ durga.reddy@gmail.com అయితే కనుక durga.reddy+offers@gmail.com అని టైప్‌ చేసి ఇవ్వాలి. ఇలా ఇచ్చినా మెయిల్స్‌ మీ ఇన్‌బాక్స్‌లోకే వస్తుంటాయి. మీరు సెర్చ్‌ చేసే సమయంలోoffers అని టైప్‌ చేస్తే చాలు. అక్కడి నుంచి వచ్చిన మెయిల్స్‌ అన్నీ కనిపిస్తాయి. అలా మీరు ఐడీ ఇచ్చిన ప్రతీ చోట ఒక్కో ఫిల్టర్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు.
 
రీస్టోర్‌ అడ్రస్‌
స్మార్ట్‌ఫోన్‌లో నుంచి కాంటాక్ట్స్‌ను డిలీట్‌ చేస్తే గూగుల్‌ అకౌంట్‌లో నుంచి కూడా డిలీట్‌ అయిపోతాయి. అయితే డిలీట్‌ చేసిన ముప్పై రోజుల్లోగా వాటిని రికవరీ చేసుకోవచ్చు. ఇందుకోసం కాంటాక్ట్స్‌లోకి వెళ్లి, మోర్‌లో రీస్టోర్‌ కాంటాక్ట్స్‌పై క్లిక్‌ చేయాలి. డిలీట్‌ అయిన కాంటాక్ట్స్‌ అన్నీ స్టోర్‌ అవుతాయి.
 
డైలీ షెడ్యూల్‌
క్యాలెండర్‌ ఫీచర్‌ సహాయంతో రోజు వారి, నెల వారి షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసుకోవచ్చు. క్రియేట్‌ చేసుకున్న క్యాలెండర్‌ను మెయిల్‌లో ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లోనూ ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. జీమెయిల్‌ క్యాలెండర్‌ ఫీచర్‌ని ఉపయోగించుకోవాలంటే మెయిల్‌ కుడివైపు పైభాగంలో ఉన్న గేర్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ల్యాబ్స్‌ని ఎంచుకోవాలి. తరువాత గూగుల్‌ క్యాలెండర్‌ గ్యాడ్జెట్‌ బటన్‌ని ఎనేబుల్‌లో పెట్టుకుని ఛేంజె్‌సని సేవ్‌ చేయాలి. సింపుల్‌గా ఉన్నా ఈ ఫీచర్స్‌ బాగా ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు కదూ.

కాంటాక్ట్స్‌ మెర్జ్‌
మెయిల్‌లో డూప్లికేట్‌ కాంటాక్ట్స్‌ ఉంటే చాలా చికాకుగా ఉంటుంది. ఏ ఐడీకి మెయిల్‌ పంపించాలో ఒక్కోసారి అర్థంకాదు. అలాంటప్పుడు కాంటాక్ట్స్‌ని మెర్జ్‌ చేస్తే సరిపోతుంది. ఇందుకోసం మెయిల్‌లో ఎడమవైపు పైభాగంలో ఉన్న కాంటాక్ట్స్‌లోకి వెళ్లాలి. అందులో ఫైండ్‌ డూప్లికేట్‌ కాంటాక్ట్స్‌ని ఎంచుకుంటే డూప్లికేట్స్‌ అన్నీ కనిపిస్తాయి. మోర్‌ ఆప్షన్‌లోకి వెళ్లి మెర్జ్‌ కాంటాక్ట్స్‌ని ఎంచుకుంటే కాంటాక్ట్స్‌ అన్నీ మెర్జ్‌ అవుతాయి.

Monday, June 29, 2015

ఇవి మీకు తెలుసా ?

• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
• బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.
• మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
• ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

Saturday, June 27, 2015

ఉదయం తింటేనే మేలు

చాలామంది రాత్రిపూట భోజనం చేశాక పండ్లు తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. నిజానికి పండ్లని ఉదయం పూట అల్పాహారంతోపాటూ తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఉపయోగాలు.
* పండ్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. యాపిల్‌, అరటి, నారింజ, పుచ్చకాయ వంటి వాటిలో గ్త్లెసమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. ప్లేటు నిండా ఈ పండ్ల ముక్కలు తినేసి వెళితే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.
* పండ్లను ఉదయం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటమే కాదు.. శుభ్రంగానూ ఉంటుంది. పండ్లు వ్యర్థాలనూ బయటకు పంపుతాయి. ఎలాంటి ఆహారం తీసుకున్నా ఇట్టే జీర్ణమవుతుంది. మలబద్ధకం కూడా బాధించదు. అలానే పండ్లలో లభించే పోషకాల్లో ఎంజైములు అధికంగా ఉంటాయి. ఇవి అరుగుదల మీద ప్రభావం చూపుతాయి.
* పండ్లను తీసుకోవడం వల్ల మానసికంగానూ సానుకూల ప్రభావం కలుగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. పండ్ల వల్ల శరీరంలోకి సహజ గ్లూకోజు అంది మొదడు ఉత్తేజితమవుతుంది. చదువుకొనే పిల్లలకు అల్పాహారంతో పాటు ఈ ముక్కలు తినిపిస్తే మంచిది. చదువుపై శ్రద్ధ పెడతారు.
* పండ్లలో లభించే విటమిన్‌ సి శరీరంలో రోగనిరోధకశక్తి పెంచుతుంది. రకరకాల ఇన్‌ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి నీటి శాతం ఎక్కువగానే అందుతుంది. డీహైడ్రేషన్‌ బాధించదు. దీనివల్ల చర్మం కూడా మృదువుగా మారుతుంది.
* బరువు తగ్గాలనుకునే వారు కాలానికనుగుణంగా దొరికే పండ్లను తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. వ్యాయామాల అనంతరం, అల్పాహారం తీసుకున్నాక తినాలి. పొట్టనిండుతుంది. కెలొరీలు కూడా చేరవు.

పడుకునే ముందు తినకూడని ఆహారం...!

సరిగా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి లోనయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. రోజు మనం తీసుకునే ఆహారం, సేవించే పానీయాలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. నిద్రలేమికి మరో ముఖ్యం కారణం కూడా ఉంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. మరి రాత్రిల్లో తీనకూడని కొన్ని అధిక క్యాలరీ ఫుడ్స్ లిస్ట్ క్రింది విధంగా ఉన్నాయి… నిద్రించే ముందు మీరు ఖచ్చితంగా తినకూడని 10 హై క్యాలరీ ఫుడ్స్…
పిజ్జా: పెద్దగా జ్యూసిగా, రుచికరమైన పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వీటిని పగలు తింటే జీర్ణం అవ్వడానికి సరిపడా సమయం ఉంటుంది. అదే రాత్రుల్లో తీసుకుంటే, నిద్రించే సమయంలో అవయవాలన్ని చాలా నిధానంగా పనిచేయడం వల్ల జీర్ణక్రియకు కూడా నిధానం అవుతుంది. దాంతో తిన్న ఆహారం అరగక కొవ్వుగా మారుతుంది . పిజ్జా చాలా జిడ్డుగా ఉంటుంది. నూనెలతో తయారు చేయడం వల్ల గుండెల్లో ప్రమాదం పెరుగుతుంది. దాంతో హార్ట్ బర్న్ కు కారణం అవుతుంది.
షుగర్ క్యాండీస్: ఈ ప్రపంచంలో క్యాండీస్ అంటే ఇష్టపడని వారు ఉండరంటే ఆశ్చర్యపడాల్సిందే. ఎవరైనా సరే ఏదో ఒక వయస్సులో వీటిని టేస్ట్ చూసే ఉంటారు. అంతే కాదు, ఇప్పటీకి వీటి మీద మక్కువ ఏమాత్రం తగ్గదు. అయితే బరువు తగ్గించుకోవాలనుకొనే డైటర్స్ మాత్రం వీటికి దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరిగేలా చేస్తుంది. ఇవి రాత్రి సమయంలో తినడం వల్ల అలసటకు గురిచేస్తుంది. మీకు ప్రశాంతంగా మరియు పీస్ ఫుల్ గా నిద్రించాలంటే, జంక్ ఫుడ్స్ ను తీసుకోవడం నివారించి ఓట్ మీల్, లేదా తక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవాలి.
చాక్లెట్స్ : చాక్లెట్స్ లో ప్యాట్స్, కెఫిన్ మరియు కోకా అధికంగా ఉండటం వల్ల ఎసిడిటి సమస్యను తీవ్రతరం చేస్తాయి. డిన్నర్ తర్వాత కొన్ని డిజర్ట్స్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రుల్లో చాక్లెట్స్ కు దూరంగా ఉండాలి. లేదంటే మీకు నిద్రలేకుండా చేస్తుంది.
వెజిటేబుల్స్: కూరగాయలు రుచికరమైనవి, న్యూట్రీషియన్ డైట్ ఫుడ్స్, కానీ రాత్రిల్లో నిద్రించే ముందు తీసుకోవడం అంత మంచిది కాదు, చాలా సింపుల్ కారణం : వెజిటేబల్స్ లోని ఉల్లిపాయ, బ్రొకోలీ లేదా క్యాబేజ్ వంటి అధిక మొత్తంలో కరగని ఫైబర్ ఉంటుంది. వీటి అరుగుదలకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. పగలు కంటే రాత్రిల్లో ఫైబర్ ఫుడ్స్ అరగడం చాలా కష్టం, దాంతో జీర్ణ వ్యవస్థ చాలా నిదానంగా జరిగి అపానవాయువు ఏర్పడటానికి కారణం అవుతుంది.
మద్యం/కార్బోనేటెడ్ డ్రింక్స్: చాలా మంది రాత్రి సమయంలో మద్యపానం సేవించడం వల్ల మంచి నిద్ర పడుతుందనుకుంటారు కానీ అది తప్పు. మద్యం నిద్రకు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండి, ఎక్కువ సార్లు రెస్ట్ రూమ్ కు పోయేలా చేసి నిద్రకు భంగం కలిగిస్తుంది. అతిగా మద్యపానం, నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి నిద్రించే ముందు మితంగా తీసుకోవడం మంచిది. కాఫీ, టీ, కోలా డ్రింక్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌, సోడా, తదితరాలను మానేయాలి. ఇవి ఆన్నాశయంలోని వాల్వులను వదులయ్యేలా చేసి యాసిడ్‌ని అన్ననాళం లోకి లీక్‌ అయ్యేలా చేస్తాయి. దాంతో ఎసిడిటికి కారణం అవుతుంది. ఫలితంగా నిద్రలేమి. కాబట్టి ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం చాలా మంచిది.
బర్గర్స్: ఇతర ఫ్యాటీ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్, చీజ్ బర్గర్స్ వంటి ఆహారాలను నింద్రించే ముందు తప్పనిసరిగా నివారించాలి. ఎందుకంటే అవి కడుపులో నేచురల్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి హార్ట్ బర్న్ కు దారితీస్తుంది.
చిల్లీ సాస్/టమోటో సాస్: చిల్లీ సాస్ కొన్నిమసాలా దినుసులతో చేర్చినప్పుడు చాలా ఆరోగ్యం మరియు ఉపయోగకరం. కానీ అలాగే వేటితోనూ కలపకుండా సపరేట్ గా తీసుకోవడం చాలా ప్రమాధకరం. ఈ హై క్యాలరీ ఫుడ్ ప్రోటీనులు మరియు స్లో బర్నింగ్ కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉంటుంది. టమోటో సాస్ యాసిడ్ రిఫ్లెక్షన్ కు కారణం అవుతుంది మరియు జీర్ణక్రియను నిధానం చేస్తుంది . పిజ్జా చీజ్ తో నింపి ఉంటుంది మరియు టమోటో సాస్ కూడా. కాబట్టి రాత్రుల్లో దీన్ని అవాయిడ్ చేయడం బెస్ట్.సిడిటి ఉన్నవారు టమోటోలను పూర్తిగా మానేయమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. సాధారణంగా టమోటో జ్యూసీగా ఉండి ఎసిడిటికి కారణం అవుతుంది. దాంతో ఛాతీలో మంట పుడుతుంది. నిద్రలేమికి కారణం అవుతుంది