రోజుకో యాపిల్ తింటే రక్తపోటు సమస్యకు చెక్ పెట్టొచ్చు
నేటి
ఉరుకులు పరుగుల జీవితంలో మానవుడు సవాలక్ష రోగాలతో సతమతమవుతున్నాడు. వీటిలో
బీపీ(రక్తపోటు) ఒకటి. బీపీను తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో
ఉన్నా అవి శరీరానికి హాని కలిగిస్తాయని పరిశోధనలు వెల్లడించాయి. కనుక
రోజుకో యాపిల్‌ను తొక్క తీయకుండా తింటే రక్తపోటును
తగ్గించుకోవచ్చంటున్నారు.బీపీను
తగ్గించుకునేందుకు కొందరు "గ్రీన్ టీ" తాగడం, "బ్లూ బెర్రీస్" తినడం వల్ల,
రోజుకో యాపిల్ తినడం ద్వారా ఎటువంటి హానీ లేకుండా బీపీను
తగ్గించుకోవచ్చంటున్నారు. బీపీను తగ్గించే ఔషధ గుణాలు యాపిల్ తొక్కలో ఆరు
రెట్లు ఎక్కువ ఉన్నాయని, కాలంతో సంబంధం లేకుండా దొరికే పండు కనుక రోజుకో
యాపిల్ తీసుకోవడం వల్ల బీపీకు చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్యులు.
No comments:
Post a Comment