ప్లాస్టిక్ వస్తువులలో ఆహారాన్ని భద్రపరుస్తున్నారా...?
ప్లాస్టిక్ పదార్థాలలో బిస్ ఫినాల్ ఏ (BPA), పాల్థాలేట్
అనే రెండు రకాల రసాయన పదార్థాలు కలిసి ఉంటాయి. అందువలన ఇటువంటి వాటిలో
ఉంచిన ఆహారాన్ని తినడం వలన ఆ రసాయన పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించి
అనారోగ్యానికి గురిచేస్తాయి. అందువలన అటువంటి వాటిలో ఆహారాన్ని భద్రపరచటం,
లేదా తయారు చేయటం చేయకూడదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా
మైక్రోవేవ్‌ల ద్వారా తయారు చేసిన ఆహారంలో, ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే
శీతలపానియాలలో ఈ రసాయన పదార్థాలు సులభంగా కలిసిపోతాయి. అదే విధంగా ఈ రసాయన
పదార్థాలు ఆటోమెబైల్ పరికరాలు, వైద్య పరికరాలు, పరిమళ ద్రవ్యాలు,
దుస్తుల్లో కూడా ఉంటాయి. అందువలన వీలైనంత వరకూ ప్లాస్టిక్ వాడకాన్ని
తగ్గించుకుని మనల్ని, మన పరిశరాలను కాపాడుకుందాం.
No comments:
Post a Comment