Sunday, April 7, 2013

గొర్రె - సింహం కథ


ఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. 

ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. ‘ఏ క్రూరమృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను. ఈ తోలును కప్పుకుంటే నేను కూడా సింహంలా కనబడతాను. అప్పుడు నా జోలికి ఎవరు రారు’ అని అనుకుంది.  వెంటనే గొర్రె ఆ తోలును తీసుకుని కప్పుకుంది. ఇప్పుడది వింత జంతువులా కనబడసాగింది. 

గొర్రె ఆ కారం చూసి కుందేళ్ళు, జింకలు, ఎలుగుబంటులు, నక్కలు భయంతో పరుగులు పెట్టాయి. చివరకు పులులు, సింహాలు కూడా గతుక్కుమన్నాయి. అది చూసి గొర్రెకు చాలా సంతోషం కలిగింది. వాటిని ఇంకా భయపెట్టడానికి గొంతు కాస్త మార్చి విచిత్ర శబ్దాలు చేయడం, కాలు నేలకు రాస్తూ జంతువుల మీదకు దాడి చేస్తున్నట్టు నటించడం చేయసాగింది. దానితో ఆ అడవి జంతువులన్నీ బిక్కచచ్చిపోయాయి. వాటి కంటి మీద కునుకు లేకుండా పోయింది. 

గొర్రె కడుపునిండా గడ్డిమేస్తూ యధేచ్ఛగా తిరగసాగింది. ఒకరోజు గొర్రె ఒక కాలువ ఒడ్డుకు షికారు వెళ్ళింది. అక్కడి ప్రదేశమంతా పచ్చటి గడ్డితో ఎంతో అందంగా ఉంది. ఆ లేత గడ్డిని చూసి గొర్రె ఎంతో హుషారుగా వాటిని మేయడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఒక సింహం దాహం తీర్చుకోడానికి వచ్చి గొర్రెను చూసింది. ‘ఇదేమి విచిత్రం, సింహం జాతికి చెందిన జంతువు గడ్డిమేయడమా? సింహం ఆకలితో చస్తుంది. కానీ గడ్డి మాత్రం మేయదు. బహుశా ఇది క్రూర జంతువు కాకపోవచ్చు’ అని ఆలోచించి ఒక్కసారిగా గర్జించింది. ఆ అరుపువిని గొర్రె భయపడిపోయింది. 

తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగుపెట్టింది. ఇంతలో గొర్రె కప్పుకుని ఉన్న సింహం తోలు దాని ఒంటి మీద నుండి జారిపోయింది. ఎదురుగా ప్రత్యక్షమైన గొర్రెను చూసి సింహం నోరు వెళ్ళబెట్టింది. గొర్రె ఎలాగోలా సింహానికి దొరక్కుండా అక్కడి నుండి పారిపోయింది. ఎదో విధంగా అడవిని దాటి తనకు కనబడి న ఊళ్లోకి వెళ్లిపోయింది. ఆ సంగతి తెలిసి జంతువులన్నీ నవ్వుకున్నాయి. ఇక ఆ తరువాత అడవిలో నిర్భయంగా సంచరించసాగాయి.

పులి మీసం


ఒక అడవి దగ్గరలో ఒక మహిళ ఉండేది. ఆవిడ పేరు ధర్మావతి. ఆమె వుంటున్న ఊరికి ఒక ఋషి వచ్చాడు. చాలామంది ఋషి వద్దకు వెళ్ళి సలహాలు పొదుతున్నారు. ఈ సంగతి ధర్మావతి కూడా విన్నది. ధర్మావతి కొన్ని కష్టాలు వున్నాయి. ఆ ఋషి దగ్గరకు వెళ్ళి సలహా తీసుకోవాలి. ఆయన దగ్గర కొన్ని శక్తులు కూడా వున్నాయి. పొరుగువారు చెప్పగా విన్నది. 

కొంత కాలంగా ఆమె భర్తలో ఏదో మార్పు వచ్చింది. ధర్మావతి భత్ర యుద్దంలో పని చేసి వచ్చాడు. మూడు సంవత్సరాలు భార్యకు దూరంగా వున్నాడు. ఆ తరువాత తిరిగి వచ్చాడు ఆమె భర్త. అప్పతి నుండీ అతనిలో ఏదో తేడా వచ్చింది. ఆమెతో సరిగా మాటలాడటంలేదు. భార్యమీద యిది వరకు ప్రేమ చూపడం లేదు. ఇది ధర్మావతిని ఎంతో బాధించింది. తన భర్త ప్రేమ పొదడానికి ఏదైనా చిట్కా కావాలి.  అందుకోసం ఆమె ఋషి వద్దకు వచ్చింది. వినయ విధేయతలతో చేతులు జోడించింది. 

నమస్కారం స్వామీజీ! నా పేరు ధర్మావతి. నాభర్త నాతో ప్రేమగా వుండటంలేదు. నా భర్త నాతో మునుపటిలాగా ప్రేమగా వుండాలి. అందుకు ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుంది. ఋషి ఆలోచించాడు. నీ భర్త యిది వరకులా నీతో ప్రేమగా వుండాలి. నేను ఒక మందు తయారు చేసి యిస్తాను. ఆ మందు అతని చేత తినిపించు. కొద్ది రోజులలో అతను నీకు దగ్గర అవుతాడు. నిన్ను గౌరవంగా చూసుకుంటాడు. నీ మీద ప్రేమను చూపుతాడు. నిన్ను వదిలి వుండలేదు అన్నాడు. ధర్మావతి సంతోషించింది. 'ధన్యవాదాలు స్వామీ' అంది. 

అయితే ఒక యిబ్బంది వుంది. ఆ మందుకు అన్నీ వున్నాయి. ఒక దినుసు తక్కువ అయింది. మరి ఆ దినుసు నీవు తీసుకు రాగలవా? అన్నారు స్వామీజీ. అలాగే స్వామీ. నా భర్తకోసం ప్రాణాలకు తెగిస్తాను. ఆ దినుసును తెస్తాను అంది. అప్పుడు ఆ ఋషి యిలా అన్నాడు. అది పెద్ద పులి మీసం. అది నువ్వు తీసుకు రాగలిగితే చక్కని మందు తయారవుతుంది. నీ భర్తలో మంచి మార్పు వస్తుంది. అలాగే స్వామీ. మీరు చెప్పిన విధంగానే చేస్తాను. నా ప్రాణాలకు తెగించి అయినా పెద్దపులి మీసం తెస్తాను.  పులి ధర్మావతిని చూస్తూనే గాండ్రించింది. భయంతో గజగజ వణికి పోయింది ధర్మావతి. అయినా గుండెదిటవు చేసుకొని నిలబడింది. 

అలా కాసేపు నిలబడి తన యింటికి తిరిగి వెళ్ళింది. మరుసటి రోజు తిరిగి అడవికి వెళ్ళింది. అక్కడ ఇంకోచోట నిలబడింది. పులి మళ్ళి గట్టిగా గాండ్రించింది. ధర్మావతి అలాగే నిలబడింది. ఇలా కొన్ని రోజులు జరిగాయి. రోజులు గడిచే కొద్దీ ధర్మావతిని చూసి పులి అరవడం మానుకుంది. ఆతర్వాత కొన్ని పిండి వంటలు వండి పులికి పెట్టింది. ధర్మావతి వండిన వంటకాలు రుచి చూసింది పులి. ఆవురు ఆవురు మంటూ తిన్నది. నాలుకతో మూతి తుడుచుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. 

ఇంకొన్ని నాళ్ళకు పులి బాగా అలవాటు అయింది. ఇప్పుడూ ధర్మావతి ముట్టుకున్నా పులి ఏమీ అనడం లేదు.  చివరికి ఒక రోజు ఆ పులిని నిమురుతూ వుంది ధర్మావతి. అదను చూసి పులి మీసం పీకింది. పులి మూలిగిందేగానీ ఏమీ అనలేదు. ధర్మావతి పర్గుపరుగున వచ్చింది. పులి మీసం తీసుకొని ముని వద్దకు వచ్చింది. స్వామీ ఎంతో శ్రమ పడి పులి మీసం సంపాదించాను తీసుకోండి అన్నది ధర్మావతి. ఋషి ఆమె యిచ్చిన పులి మీసాన్ని అందుకుని మంటలో పడవేశాడు. ధర్మావతి ఆశ్చర్యపోయింద్ది. అయ్యో స్వామీ! యిలా చేశారేంటి? అని తెగ గాధపడింది. అప్పుడు ఋషి యిలా అన్నాడు. అమ్మా ధర్మావతీ నీకు ఏ మందుతోనూ పనిలేదు. 

నువ్వు నాకు ఓక సంగతి చెప్పు. పులిని నువ్వు ఎలా లొంగదీసుకున్నావు? ప్రేమ, ఆప్యాయతలతో! అవునా? ఎంతో కౄరమైన జంతువునే లొంగదీసుకున్నావు. అంత ఓర్పుగల నీవు నీ భర్తను లొంగదీసుకోలేవా? ఇదే ప్రేమ, అనురాగం నీ భర్తపై చూపించు. సహనంతో అతనిని నీ వైపుకు మళ్ళించుకో. నీ ప్రేమను పంచి, అతని ప్రేమను పొందు. అని చెప్పాడు ఋషి. ధర్మావతికి కళ్ళు తెరచుకున్నాయి. ధైర్యంగా యింటికి వెళ్ళింది. భర్తలో మార్పు తెచ్చింది. అతని నుండి వెనకటి ప్రేమను పొందింది. 

ఒక నక్క - తోడేళ్ల కథ


ఒక అడవిలో ఒక నక్కను కొన్ని తోడేళ్లు తరుముతున్నాయి. నక్క గుక్క తిప్పుకోకుండా, ప్రాణభయంతో, ఊపిరి బిగబట్టి పరుగుతీస్తోంది. తోడేళ్లు తమ ఆహారాన్ని వదలలేక మరింత వేగంగా దూసుకొస్తున్నాయి. నక్క ఇక పరిగెత్తలేక ఒక గుడిసె వెనకాల దాక్కుంది. 

ఆ గుడిసె ముందు చెట్టుపై ఒకతను కట్టెలు కొడుతున్నాడు. నక్క అతన్ని చూసి "అయ్యా! నేను ప్రాణ భయంతో పరిగెత్తుకు వస్తున్నాను. నన్ను తోడేళ్లు తరుముతున్నాయి. అవి వస్తే దయచేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పకు" అని అంది. బదులుగా అతను "సరే ! నువ్వు ప్రాణం అరచేతిలో పెట్టుకుని వస్తున్నావు. నువ్వు ఇక్కడ దాక్కున్నావని చెప్పనులే" అన్నాడు.  

అంతలో తోడేళ్లు రొప్పుతూ అతని ముందుకొచ్చాయి. " అయ్యా! మేము ఒక నక్క కోసం వెతుకుతున్నాం. ఆ నక్క గాని ఇటు వైపు వచ్చిందా? చెప్పండి. మీకు మేము రుణపడి ఉంటాం", అని అన్నాయి తోడేళ్లు ముక్తకంఠంతో. కొద్దిసేపు ఆలోచించి ఆ కట్టెలు కొట్టేవాడు, ఒక వైపు చేయి నక్కవైపు, మరో చేయి రోడ్డువైపు చూపిస్తూ, " అటుగా వెళ్ళింది" అని పలికాడు. అతని సంజ్ఞను అర్ధం చేసుకోలేని వెర్రి తోడేళ్లు అతను చూపించిన రోడ్డువైపు పరిగెత్తాయి. 

"హమ్మయ్య" అని బయటకొచ్చిన నక్క తన దారిలో తాను వెళ్తుంటే కట్టెలు కొట్టేవాడు నక్కతో, " నువ్వు మామూలు వాడివి అయితే కృతజ్ఞతలు చెప్పేదాన్ని. కానీ నువ్వు రెండు నాలుకలవాడివి. నావైపు చూపిస్తూ మరోవైపు వెళ్లిందని చెప్పావు. నీలాంటి వాడికి కృతజ్ఞతలు చెప్పడం కూడా సంస్కారం అనిపించుకోదు" అంది నక్క.

పులి- బ్రాహ్మణులు


పులులు చాలా ప్రమాదకరమైనవి. ప్రమాదకరమైన వాటితో ఆడుకునేవాళ్లను అజ్ఞానులే అనాలి. అయితే తెలివిలేకగానీ, అహంకారంతోటిగానీ వాళ్ళు ప్రమాదాలకు ప్రాణం పోస్తే, ఆ మంటల్లో చిక్కుకుని, సామాన్యులూ కష్టాలపాలౌతుంటారు. నలుగురు బ్రాహ్మణులు ఒకప్పుడు భారతదేశమంతా తిరిగి, రకరకాల విద్యలు నేర్చుకున్నారట. ఎంతో విజ్ఞానాన్ని మూటగట్టుకున్నారు వాళ్ళుతమకున్న నేర్పునూ, తాము నేర్చిన విద్యల మహత్తునూ తోటి మిత్రులకు చూపాలని ఎదురుచూస్తున్నారంతా.  

ఆ నలుగురూ ఒక అడవిలో కలిశారు. వాళ్లలో ఒకడికి అక్కడ ఒక ఎముక దొరికింది. అది ఒక పులి తుంటి ఎముక. దాన్ని సంపాదించిన బ్రాహ్మణుడు అన్నాడు - "చూడండి - ఇది ఏ జంతువైనా కావొచ్చు. దీని ఎముక ఒక్కటి ఉంటే చాలు - నా శక్తితో నేను దీని అస్థిపంజరాన్ని సంపూర్ణంగా నిర్మించగలను." అలా అని, వాడు ఆ ఎముక మీద తన ఉత్తరీయాన్ని కప్పి, ఏదో మంత్రం పఠించాడు. వెంటనే ఎముక స్థానంలో పులి అస్థిపంజరం తయారైంది.  

రెండవ బ్రాహ్మణుడు అన్నాడు - " నేను దానికి మాంసం, రక్తం, చర్మం ఇవ్వగలను" అని. అతని మంత్ర ప్రభావం వల్ల అస్థిపంజరానికి మాంసమూ, రక్తమూ, చర్మమూ లభించాయి. ఇప్పుడు వాళ్లముందు ప్రాణంలేని పులి ఒకటి పడి ఉన్నది - చారలతోటీ, మీసాలతోటీ. 

మూడో బ్రాహ్మణుడు అన్నాడు - "నేను ఏం చేయగలనో తెలుసా, మీకు? దానికి ప్రాణం పోయటం ఎలాగో నాకు తెలుసు!" అని. నాలుగోవాడికి మిగతా ముగ్గురికి ఉన్నంత విజ్ఞానం లేదు. "ఆగాగు! దానికి ప్రాణం పొయ్యకు! నీ శక్తి యుక్తులమీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది." అన్నాడు వాడు కంగారుగా.  "ఏదైనా చేసేందుకు శక్తి ఉండీ ఆ పని చెయ్యకపోతే ఏం లాభం? నా మంత్ర శక్తిని పరీక్షించే అవకాశం నాకు ఇప్పటివరకూ రాలేదు. నేనిప్పుడు దీనికి ప్రాణం పోసి తీరతాను. చూస్తూండు, ఊరికే" అన్నాడు మూడోవాడు.  

"నువ్వంత గట్టిగా పట్టు పడితే, సరే. కానీ కొంచెం సేపు ఆగు. నన్ను ముందు ఈ చెట్టు ఎక్కనీ" అని, నాలుగోవాడు దగ్గర్లో ఉన్న చెట్టును ఎగబ్రాకాడు.  అప్పుడు మూడోవాడు తన మంత్ర మహిమతో పులికి ప్రాణం పోశాడు. ప్రాణం రాగానే దానికి విపరీతమైన ఆకలివేసి, తినేందుకు ఏది దొరుకుతుందా' అని చుట్టూ చూసింది. భయంతో ముడుచుకొని కూర్చున్న ముగ్గురు బ్రాహ్మణుల్నీ చూడగానే అది గర్జిస్తూ వాళ్ళమీదికి దూకింది. 

పారిపోవటానికి కూడా కాళ్ళు రాక, ఆ ముగ్గురూ అట్లా పులికి ఆహారం అయిపోయారు.  తన మిత్రులు ముగ్గురూ పులికి ఆహారమౌతుంటే చూస్తూ, రాయిలా కదలక-మెదలక కూర్చోవటం మినహా నాలుగోవాడు మరేమీ చేయలేకపోయాడు. పులి భోజనం ముగించుకొని సంతృప్తిగా అడవిలోకి వెళ్లిపోయిన తర్వాత చాలాసేపటికి, వాడు క్రిందికి దిగి, వణికే కాళ్లతో ఇంటివైపుకు పరుగు తీశాడు.  

పులులకు ప్రాణం పోశాక, ఇంక ఎవరూ ఏమీ చెయ్యలేరు - అవి తమ భోజనం ముగించుకొని, తృప్తిగా తమ దారిన తాము వెళ్ళిపోయేంతవరకూ. ఆపైన మిగిలిన వాళ్ళు తమకు మిగిలిన దారుల్ని- అప్పుడు- వెతుక్కుంటారు.

తోక తెగిన నక్క


అదొక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. ఓసారి అది, జంతువులను పట్టుకోటానికి వేటగాడు వేసిన ఉచ్చులో చిక్కుకుంది. దాన్నుంచి బయటపడాలని చాలా ప్రయత్నించింది. చివరకు తప్పించుకుంది.

కానీ ఆ ప్రయత్నంలో అనుకోకుండా దాని తోక తెగిపోయింది. దాంతో ఎక్కడలేని దిగులూ నక్కకు పట్టుకుంది.   ‘‘అయ్యో, నా తోక తెగిపోయిందే. ఇప్పుడెలా! తోక లేని నన్ను చూసి అడవిలోని మిగిలిన నక్కలన్నీ గేలి చేస్తాయేమో’’ అంటూ బెంగపడింది. ఆ అవమానాలు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించడం మొదలెట్టింది.

అప్పుడు దానికో ఉపాయం తట్టింది. వెంటనే మిగిలిన నక్కలన్నిటినీ పిలిచి, ఓ సమావేశం ఏర్పాటు చేసింది. అన్నీ వచ్చాక ఇలా అంది.   ‘‘చూడండి మిత్రులారా! ఇవాళ నేనో కొత్త విషయం తెలుసుకున్నాను. అది మీ అందరికీ చెప్పాలనే ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మనం మామూలుగానే అందంగా ఉంటాం.

కానీ మన తోకలు కత్తిరించుకుంటే ఇంకా అందంగా ఉంటాం. అయినా తోక వల్ల మనకు పెద్ద ఉపయోగమేమీ లేదు సరికదా అదో బరువు కూడా. అందుకే మీరందరూ కూడా నాలా తోకలు కత్తిరించుకుంటే మరింత సుందరంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఓసారి ఆలోచించండి’’ అంది.

అక్కడున్న నక్కల్లో ఒకదానికి విషయం అర్థమయ్యింది. ‘‘మిత్రమా! నువ్వు తోక ను అందం కోసం కత్తిరించుకోలేదని, అది ప్రమాదంలో తెగిపోయిందని నాకు తెలుసు. అయినా నీ తోక తెగిపోకుండా ఉంటే, నువ్విలాగే చెప్పేదానివా’’ అని అడిగింది.

తన పథకం వారికి తెలిసిపోవడంతో నక్క మారు మాట్లాడలేకపోయింది. అతి తెలివికి పోతే మనమే బోల్తా పడతామని తెలుసుకుని, మెల్లగా అక్కడ్నుంచి జారుకుంది.

మంచి స్నేహితులు

జన్నారపు అడవిలో నివసించే తాబేలు, ఎలుక, కొంగ చాలా మంచి స్నేహితులు. అవి రోజూ ఆడుతూ, పాడుతూ ఉండేవి- దాహం వేసినప్పుడల్లా అక్కడే ఉన్న చిన్న చెరువుకు వెళ్ళేవి. అక్కడ తాబేలు గెంతుతూ, కొంగ ఈత కొడుతూ, ఎలుక స్నానం చేస్తూ, ఆనందంగా గడిపేవి. అయితే ఒక సంవత్సరం వర్షాలు లేవు- ఎండలు మండిపోయాయి. ఆ చిన్న చెరువులో నీళ్లు, ఒక్కసారిగా ఎండిపోయాయి.

కొంగకు, ఎలుకకు, తాబేలుకు చాలా దాహం వేసి, ఎప్పటిలాగానే పరిగెత్తు కుంటూ చెరువు దగ్గరికి వచ్చి చూస్తే ఏముంది?- చుక్క నీళ్ళు లేవు! "ఆగండి, నేను చూస్తాను" అని చెరువు మధ్యలో సూటిగా ఒక బొరియను త్రవ్వింది ఎలుక. అయినా, ఎంత లోతు పోయినా మట్టిలో తేమ తప్ప, నీళ్ళు ఉండే సూచనలే కనిపించలేదు. నీళ్ళు లేక మూడూ త్వరలోనే చాలా నీరసించి పోయాయి.

 కొంగయితే మరీ కదల్లేని పరిస్థితికి చేరుకున్నది. స్నేహితులిద్దరితోనూ అది అన్నది-"ఓ నేస్తాల్లారా! నేను చాలా నీరసించిపోయాను. నాకు నీళ్ళతోబాటు తినేందుకు ఇంత ఆహారం కూడా అవసరం. మీరు ఎవరైనా నాకు కొంచెం ఆహారం, ఇన్ని నీళ్ళు తెచ్చిపెట్టండి, దయచేసి" అని. తాబేలు ఎలుక ఆలోచించాయి. ఎలుక తాబేలుతో‌ అన్నది- 

"నేను పడమర వైపుకు వెళ్తాను; నువ్వు తూర్పు వైపుకు వెళ్లు- ఎక్కడైనా చెరువులు కనిపిస్తే తిరిగి వచ్చి ఎలాగో ఒకలాగా కొంగను తీసుకెళ్దాం, ఇద్దరం" అని. తాబేలు 'సరే' అన్నది. రెండూ అడవంతా తిరిగి వెతకటం మొదలు పెట్టాయి. అంతలో ఎలుకకు ఒక పావురాల గుంపు కనిపించింది. వాటిని చూడగానే ఎలుక భయపడి దాక్కున్నది కొంతసేపు. అయితే అవేవీ ఎగరటం లేదు- ఎంత సేపు చూసినా నేలమీదే తిరుగుతున్నాయి.

"ఎందుకిలా?" అని చూసిన ఎలుకకు నేలంతా పరచుకున్న వల ఒకటి కనిపించింది. అది పావురాలతో అన్నది- "మీరంతా పాపం, వలలో చిక్కుకున్నట్లున్నది. నన్ను ఏమీ చెయ్యమని మాట ఇస్తే నేను ఈ వలను కొరికి మిమ్మల్ని కాపాడేందుకు ప్రయత్నించగలను" అని. పావురాలన్నీ సంతోషంగా "మా పాలిట దేవుడిలాగా వచ్చావు. మమ్మల్ని కాపాడు; నీకు ఏ పని కావాలంటే అది చేసిపెడతాం, మేం" అన్నాయి. అప్పుడు ఎలుక వలను కొరికి తెంపివేయగానే పావురాలన్నీ దానికి ధన్యవాదాలు తెలుపుకున్నాయి. "నాకు ఈ ధన్యవాదాలు వద్దు- మా మిత్రుడు కొంగ చావు బ్రతుకుల్లో ఉన్నది. మరొక మిత్రుడు తాబేలు, నేను నీళ్లకోసం అడవంతా వెతుకుతున్నాం.

మీకు తెలిసి ఎక్కడైనా ఒక చెరువు ఉంటే చెప్పండి చాలు" అన్నది ఎలుక వాటితో. "అయ్యో! దానిదేమి భాగ్యం?! మేముండే చోటనే నిజానికి ఒక పెద్ద చెరువు ఉన్నది. దానిలో‌ పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. మిమ్మల్ని ముగ్గురినీ మేం‌ అక్కడికి తీసుకెళ్తాం" అని పావురాలు ఎలుక వెంట వచ్చాయి. ఆలోగా తాబేలు కొంగ దగ్గరికి చేరుకున్నది.

దానికి పాపం చెరువు దొరకనేలేదు. "నాకు ఏమీ కనిపించలేదు" అని అది చెబుతుండగానే అక్కడికి ఎలుక, పావురాలు వచ్చి చేరుకున్నాయి. "మా మీద కూర్చోండి! మేం తీసుకెళ్తాం మిమ్మల్ని!" అని పావురాలన్నీ‌ రథం మాదిరి నిల్చున్నాయి. కొంగ, ఎలుక, తాబేలులను ముగ్గురినీ మోసుకొని కొద్ది సేపటిలోనే అవి ఒక పెద్ద చెరువును చేరుకున్నాయి! నీటితో నిండి, ఎండలో తళతళలాడుతున్న ఆ చెరువును చూడగానే మిత్రులు ముగ్గురికీ‌ ప్రాణం లేచివచ్చినట్లు అయింది. ఆనాటినుండీ అవి, పావురాలు అన్నీ కలసి సంతోషంగా బ్రతికాయి. 'ఎండిపోయిన చెరువు పుణ్యమా' అని చాలామంది మిత్రులయ్యారు!

తెలుగు రాశులు

క్రమ సంఖ్య

రాశి పేరు

ఆంగ్ల నామము

1
మేషము
Aries
2
వృషభము
Taurus
3
మిథునము
Gemini
4
కర్కాటకము
Cancer
5
సింహము
Leo
6
కన్య
Virgo
7
తుల
Libra
8
వృచ్చికము
Scorpio
9
ధనుస్సు
Sagitarus
10
మకరము
Capricorn
11
కుంభము
Aquarius
12
మీనము
Pisces 

తెలుగు అంకెలు

తెలుగు పేరు

తెలుగు సంఖ్య

ఇండో అరబిక్ అంకెలు

సున్న
0
ఒకటి
1
రెండు
2
మూడు
3
నాలుగు
4
ఐదు
5
ఆరు
6
ఏడు
7
ఎనిమిది
8
తొమ్మిది
9

తెలుగు పక్షములు

తెలుగు పక్షములు

క్రమ సంఖ్య

పక్షం

పక్షము యొక్క ఫలితము

1
శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం(శుక్లం అంటే తెలుపు
ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు) ఈ పక్షము నందు చంద్రడు క్రమేపీ పెరుగుతూ పౌర్ణమి సమయానికి నిండుగా తాయారగును.
2
కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం(కృష్ణ అంటే నల్లని అని అర్థం)
(ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు)ఈ పక్షము నందు చంద్రడు క్రమేపీ తగ్గుతూ అమావాస్య సమయానికి పూర్తిగా క్షీణించును .

తెలుగు తిధులు

ఖ్య

రాశి పేరు

1
పాడ్యమి
2
విదియ
3
తదియ
4
చవితి
5
పంచమి
6
షష్టి
7
సప్తమి
8
అష్టమి
9
నవమి
10
దశమి
11
ఏకాదశి
12
ద్వాదశి
13
త్రయోదశి
14
చతుర్ధశి
15
పౌర్ణమి
16
అమావాస్య

తెలుగు నక్షత్రాలు

తెలుగు నక్షత్రాలు- 27

క్రమ సంఖ్య

నక్షత్రం పేరు

క్రమ సంఖ్య

నక్షత్రం పేరు

అశ్విని
౧౫
స్వాతి
భరణి
౧౬
విశాఖ
కృతిక
౧౭
అనురాధ
రోహిణి
౧౮
జ్యేష్ట
మృగశిర
౧౯
మూల
ఆర్తర
౨౦
పూర్వాషాడ
పునర్వసు
౨౧
ఉత్తరాషాడ
పుష్యమి
౨౨
శ్రావణ
ఆశ్లేష
౨౩
ధనిష్ఠ
౧౦
మఖ
౨౪
శతభిష
౧౧
పుబ్బ
౨౫
పూర్వాభాద్ర
౧౨
ఉత్తర
౨౬
ఉత్తరాభాద్ర
౧౩
హస్త
౨౭
రేవతి
౧౪
చిత్త

తెలుగు వారాలు

క్రమ సంఖ్య

వారం పేరు

ఆంగ్ల నామము

1
ఆదివారము
Sunday
2
సోమవారము
Monday
3
మంగళవారము
Tuesday
4
బుధవారము
Wednesday
5
గురువారము
Thursday
6
శుక్ర్రవారము
Friday
7
శనివారము
Saturday 

తెలుగు నెలలు

తెలుగు నెలలు - 12 అవి

క్రమ సంఖ్య

నెల

ఋతువు

కాలం

1
చైత్రము
వసంత ఋతువు
వేసవి కాలం
(ఎండలు ఎక్కువగా ఉండును,వేడి గాలులు వీచును)
2
వైశాఖము
3
జ్యేష్ఠము
గ్రీష్మ ఋతువు
4
ఆషాఢము
5
శ్రావణము
వర్ష ఋతువు
వర్షా కాలం
(వర్షాలు విస్తారంగా కురుయిను)
6
భాద్రపదము
7
ఆశ్వయుజము

శరత్ ఋతువు
8
కార్తీకము
9
మార్గశిరము
హేమంత ఋతువు
శీతా కాలం
(చలి గాలులు వీచును)
10
పుష్యము
11
మాఘము
శిశిర ఋతువు
12
ఫాల్గుణము

తెలుగు సంవత్సరములు


క్రమ సంఖ్య

సంవత్సరము పేరు

సంవత్సరము యొక్క ఫలితము

1
ప్రభవ
యజ్ఞములు ఎక్కువగా జరుగును
2
విభవ
ప్రజలు సుఖంగా జీవించెదరు
3
శుక్ల
సర్వ శస్యములు సమృధిగా ఉండును
4
ప్రమోద్యూత
అందరికీ ఆనందానిచ్చును
5
ప్రజోత్పత్తి
అన్నిటిలోనూ అభివృద్ది
6
అంగీరస
భోగములు కలుగును
7
శ్రీముఖ
లోకములన్నీ సమృధ్దిగా ఉండును
8
భావ
ఉన్నత భావాలు కలిగించును
9
యువ
ఇంద్రుడు వర్షాలు కురిపించి సమృద్దిగా పండించును
10
ధాత
అన్ని ఓషధులు ఫలించును
11
ఈశ్వర
క్షేమము - అరోగ్యాన్నిచ్చును
12
బహుధాన్య
దెశము సుభీక్షముగా ఉండును
13
ప్రమాది
వర్షములు మధ్యస్తముగా కురియును
14
విక్రమ
సశ్యములు సమృద్దిగా పండును
15
వృష
వర్షములు సమృద్దిగా కురియును
16
చిత్రభాను
చిత్ర విచిత్ర అలంకారాలిచ్చును
17
స్వభాను
క్షేమము,ఆరోగ్యానిచ్చును
18
తారణ
మేఘములు సరైన సమయములో వర్షించి సమృద్దిగా ఉండును
19
పార్ధివ
సంపదలు వృద్ది అగును
20
వ్యయ
అతి వృష్టి కలుగును
21
సర్వజిత్తు
ప్రజలు సంతోషించునట్టు వర్షాలు కురియును
22
సర్వధారి
సుభీక్షంగా ఉండును
23
విరోధి
మేఘములు హరించి వర్షములు లేకుండా చేయును
24
వికృతి
భయంకరంగా ఉండును
25
ఖర
పుషులు వీరులగుదురు
26
నందన
ప్రజలు ఆనందంతో ఉండును
27
విజయ
శత్రువులను సం హరించును
28
జయ
శత్రువులపైనా,రోగములపైనా విజయం సాధిస్తారు.
29
మన్మధ
జ్వరాది భాదలు తొలిగిపోవును
30
దుర్ముఖి
ప్రజలు దుఖర్మలు చేయువారగుదురు

సంఖ్య

సంవత్సరము పేరు

సంవత్సరము యొక్క ఫలితము

31
హేవళంబి
ప్రజలు సంతోషంగా ఉండును
32
విళంబి
సుభీక్షముగా ఉండును
33
వికారి
శత్రువులకు చాలా కోపం కలింగించును
34
శార్వరి
అక్కడక్కడా సశ్యములు ఫలించును
35
ప్లవ
నీరు సమృద్దిగా ఫలించును
36
శుభకృతు
ప్రజలు సుఖంగా ఉండును
37
శోభకృతు
ప్రజలు సుఖంగా ఉండును
38
క్రోధి
కోప స్వభావం పెరుగును
39
విశ్వావసు
ధనం సమృద్దిగా ఉండును
40
పరాభవ
ప్రజలు పరాభవాలకు గురి అగుదురు
41
ప్లవంగ
నీరు సమృద్దిగా ఉండును
42
కీలక
సశ్యం సమృద్దిగా ఉండును
43
సౌమ్య
శుభములు కలుగును
44
సాధారణ
సామాన్య శుభాలు కలుగును
45
విరోధికృతు
ప్రజల్లో విరోధములు కలుగును
46
పరీధావి
ప్రజల్లో భయం కలిగించును
47
ప్రమాదీచ
ప్రామాదములు ఎక్కువగా కలుగును
48
ఆనంద
ఆనందము కలిగించును
49
రాక్షస
ప్రజలు కఠిణ హృదయిలై ఉండెదరు
50
నల
సశ్యం సమృద్దిగా ఉండును
51
పింగళ
సామాన్య శుభములు కలుగును
52
కాళయుక్తి
కాలయిక్తమయునది
53
సిద్ధార్ధి
అన్ని కార్యములు సిద్దించును
54
రౌద్రి
ప్రజలకు భాద కలిగించును
55
దుర్మతి
వర్షములు సామాన్యముగా ఉండును
56
దుందుభి
క్షేమము,ధాన్యాన్నిచ్చును
57
రుధిరోద్గారి
రక్త ధారలు ప్రవహించును
58
రక్తాక్షి
రక్త ధారలు ప్రవహించును
59
క్రోధన
జయమును కలిగించును
60
అక్షయ
లోకములో ధనం క్షీణించును

ఉపనిషత్తులు

ఉపనిషత్తులు మెత్తం 108 అవి
1. ఈశావాస్యోపనిషత్
37. తేజోబిందూపనిషత్
73. అధ్యాత్మోపనిషత్
2. కేసోపనిషత్
38. నాదబిందూపనిషత్
74. కుండికోపనిషత్
3. కఠోపనిషత్
39. ధ్యానబిందూపనిషత్
75. సావిత్ర్యుపనిషత్
4. ప్రశ్నోపనిషత్
40. బ్రహ్మవిద్యోపనిషత్
76. ఆత్మోపనిషత్
5. ముండకోపనిషత్
41. యోగతత్వోపనిషత్
77. పాశుపతబ్రహ్మోపనిషత్
6. మాండూక్యోపనిషత్
42. ఆత్మబోధోపనిషత్
78. పరబ్రహ్మోపనిషత్
7. తైత్తిరీయోపనిషత్
43. నారదపరివ్రాజకోపనిషత్
79. అవధూతో పనిషత్
8. ఐతరేయోపనిషత్
44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్
80. త్రిపురతాపిన్యుపనిషత్
9. ఛాందోగ్యోపనిషత్
45. సీతోపనిషత్
81. శ్రీదేవ్యుపనిషత్
10. బౄహదారణ్య కోపనిషత్
46. యోగచూడామణ్యు పనిషత్
82. త్రిపురోఒపనిషత్
11. బ్రహ్మోపనిషత్
47. నిర్వాణోపనిషత్
83. కఠరుద్రోపనిషత్
12. కైవల్యోపనిషత్
48. మండల బ్రాహ్మణోపనిషత్
84. భావనోపనిషత్
13. జాబాలోపనిషత్
49. దక్షిణామూర్త్యుపనిషత్
85. రుద్రహౄదయోపనిషత్
14. శ్వేతాశ్వతరోపనిషత్
50. శరభోపనిషత్
86. యోగకుండల్యుపనిషత్
15. హంసోపనిషత్
51. స్కందోపనిషత్
87. భస్మజాబాలోపనిషత్
16. అరుణికోపనిషత్
52. మహానారాయణోపనిషత్
88. రుద్రాక్షజాబాలోపనిషత్
17. గర్భోపనిషత్
53. అద్వయతారకోపనిషత్
89. గణపత్యుపనిషత్
18. నారాయణోపనిషత్
54. రామరహస్యోపనిషత్
90. దర్శనోపనిషత్
19. పరమహంసోపనిషత్
55. రామతాపిన్యుపనిషత్ (పూర్వతాపిన్యుపనిషత్ , ఉత్తరతాపిన్యుపనిషత్)
91. తారసారోపనిషత్
20. అమౄతబిందూపనిషత్
56. వాసుదేవోపనిషత్
92. మహావాక్యోపనిషత్
21. అమౄతబిందూపనిషత్
57. ముద్గలోపనిషత్
93. పంచబ్రహ్మోపనిషత్
22. అథర్వనాదోపనిషత్
58. శాండిల్యోపనిషత్
94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్
23. అథర్వఖోపనిషత్
59. పైంగలోపనిషత్
95. గోపాలతాపిన్యుపనిషత్
24. మైత్రాయణ్యుపనిషత్
60. భిక్షుకోపనిషత్
96. కౄష్ణోపనిషత్
25. కౌషితకీబ్రాహ్మణోపనిషత్
61. మహోపనిషత్
97. యాజ్ణ్జవల్క్యోపనిషత్
26. బౄహజ్జాబాలోపనిషత్
62. శారీరకోపనిషత్
98. వరాహోపనిషత్
27. నౄసిమ్హతాపిన్యుపనిషత్ (పూర్వతాపిని, ఉత్తరతాపిని)
63. యోగశిఖోపనిషత్
99. శాట్యాయనీయొపనిషత్
28. కాలాగ్నిరుద్రోపనిషత్
64. తురీయాతీతోపనిషత్
100. హయగ్రీవోపనిషత్
29. మైత్రేయోపనిషత్
65. సన్న్యాసోపనిషత్
101. దత్తత్రేయోపనిషత్
30. సుబాలోపనిషత్
66. పరమహంసపరివ్రాజకోపనిషత్
102. గారుడోపనిషత్
31. క్షురికోపనిషత్
67. అక్షమాలికోపనిషత్
103. కలిసంతారణోపనిషత్
32. మంత్రికోపనిషత్
68. అవ్యక్తోపనిషత్
104. బాల్యుపనిషత్
33. సర్వసారోపనిషత్
69. ఏకాక్షరోపనిషత్
105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్
34. నిరాలంబోపనిషత్
70. అన్నపూర్ణోపనిషత్
106. సరస్వతీ రహస్యోపనిషత్
35. శుకరహస్యోపనిషత్
71. సూర్యోపనిషత్
107. బహ్వౄచోపనిషత్
36. వజ్రసూచ్యుపనిషత్
72. అక్ష్యుపనిషత్
108. ముక్తికోపనిషత్