Tuesday, July 17, 2012

నదుల ప్రాశస్త్యము


భారతదేశం ఎన్నో పుణ్యనదులు, తీర్ధాలకు నిలయం. ఇవన్నీ భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో స్నానమాచరిస్తే అనంత పుణ్యాన్ని, అత్మతత్వాన్ని ప్రసాదింపజేసి పునర్జన్మరాహిత్యాన్ని కలిగిస్తాయి.


భారతదేశం ఖండాంతరాల్లో పెరుగాదించడానికి మూలకారణం ఈ దేశం యొక్క నగ-నన-నదీ-తీర్థ కలయికతో గూడిన ప్రకృతి.


ఋగ్వేదంలో నదుల మహిమల గురించి ఇలా చెప్పారు. “గంగానదీ తీరమున దానం చేయటంవల్ల మానవుడు పరితాత్ముడౌతాడు. సరస్వతీ మొదలగు ప్రఖ్యాతాలైన పుణ్యనదీతీరముల యందు యజ్ఞాది వైదికకర్మలను ఆచరించుట చాలా మంచిది. సరస్వతీనది శ్రేష్ఠమైన తల్లిగా సంబోధింపబడింది".


నదిలో కొన్ని పవిత్ర స్థలాలున్నాయి. తైత్తిరీయ సంహిత ఇలా చెప్పింది -


తీర్థే, స్నాయి తీర్థమేవ సమానానాంభవతి


నదులన్నీ దైవతాలుగా ప్రస్తావింపబడ్డాయి. సరస్వతీ నది సర్వోత్తమమైన నదీదేవత.


మన దైనందినజీవితంలో శ్రౌత, స్మార్తాది కర్మలలోని కలశారాధనలో నదులపేర్లను ఈ విధంగా స్మరిస్తాం.


గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి,


నర్మదే సింధు కావేరి, జలే స్మిన్ సన్నిధం కురు ||


“దివ్యములైన ఈ జలాలు మంగళకరాలైన మా అభీష్టమును తీర్చుగాక! మాకు త్రాగుటకు అనువైన నీటిని ఇచ్చుగాక! మావైపు ప్రవహించు గాక!” ఇవి జలవైశిష్ట్యాన్ని సంపూర్ణంగా అర్థంచేసుకున్న వేదఋషులు త్రికరణశుద్ధిగా జలదేవతను ప్రార్థించిన మంత్రం యొక్క భావం.


ఇంటిలో స్నానం చేస్తున్నా కూడా “గంగేచ యమునే కృష్ణేగోదావరి సరస్వతి" అంటూ ఆ నదులను స్మరిస్తూ చేసే స్నానం వల్ల వచ్చే ఫలాలను అర్షులు ఇలా చెప్పారు.


    నదీస్నానం చేస్తే శారీరకంగా కనబడే మాలిన్యం పోతుంది.
    నిండు ప్రవాహమున్ననదిలో స్నానం చేయడంవల్ల శరీర మంతటికీ సుఖస్పర్శ కలిగి శరీరంలో ఉష్ణాధిక్యత తగ్గుతుంది.
    నడీనీటిలోని చల్లదనం ఇంద్రియతాపాలను తగ్గించి మనస్సుకూ, వాక్కుకూ శుచిత్వాన్ని కలిగిస్తుంది. కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధిస్తుంది.
    పుణ్యనదీతీర్థాల్లో చేసే స్నానం మనసుకు ఏకాగ్రతనిస్తుంది.
    తీర్థమందు స్నానం చేసినవాడు తనకు సంబంధించిన వారిలో చాలా శ్రేష్ఠమైన వాడవుతాడు.
    మహర్షుల యొక్క దీక్షా, తపస్సుల విశేషాలు, శక్తి నదీ జలాల్లో ఉన్నవని వేదం నిర్దేశించింది. కావున నదీస్నానంచే వాటిని మనము స్వీకరించి పవిత్రులమౌతాం.


అందుచేతే నదీజల స్నానం సర్వథా, సర్వదా యోగ్యమని అర్షుల వాక్కు.


భారతదేశంలో పుణ్యనదులకు కొరతేలేదు. పుట్టింది మొదలు మానవులు చేసే పాపాలు విశిష్టదినాల్లో అనగా – పుష్కర సమయంలో, గ్రహణ సమయాల్లోను, మకర సంక్రమణ సమయంలో, కార్తీక, మాఘమాసాల్లో నదీ స్నాన మాచారిస్తే త్రికరణశుద్ధిగా పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి.


    గంగానదీ స్నానం అరవైయోజనాల పవిత్ర ప్రదేశం. అరవై పాపాలు హరించే పుణ్యమూర్తి. గంగాద్వారా స్నానఫలం దీనికి రెట్టింపు.
    యమునానదీ తీరం ఇరువది యోజనాలు విస్తరించి, ఇరవై రకాల పాపాలు పరిహరిస్తుంది.
    సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించి ఇరవైనాలుగు యోజనాలు విస్తరించిన ఈ నది ఇరవై పాపాలు పోగొడుతుంది.
    వరుణ, కుశావర్త; శతద్రువు; విపాశక; శరావతి; వితస్త; ఆశిక్ని; మధుమతి; ఘ్రుతవతి; మొదలిఅన నదీతీరాల్ సందర్శనం శుభప్రదం. దేవనడిగా ప్రఖ్యాతమైన ఆ నదీ పరీవాహక ప్రాంతం పదియోజనాలు విస్తరించి; పదిహేను రకాల పాపాలను పోగొడుతుంది. రేవానదీ స్నానం బ్రహ్మ హత్యాపాతకాన్ని నాశనం చేస్తుంది. చంద్రభాగ, రేవతి, సరయు, గోమతి, కౌశిక, మందాకినీ, సహస్త్రవక్ర్త, పూర్ణ, పుణ్య, బాహుదాలనే నదులు పదహారు యోజనాలు విస్తరించాయి. నదీ సంగమ ప్రదేశాల్లో చేసే స్నానం, సంధ్యాదికాలు అనంత పుణ్యఫలాలనిస్తాయి.
    గోదావరీతీరం ఆరు యోజనాలు విస్తరించి ఉంది. ఒక్కసారి గోదావరి తీరం చుట్టి వచ్చినవారికి “వాజపేయ” యాగ ఫలం లభిస్తుంది.
    భీమేశ్వరం, వంజర సంగమస్థానాలు ప్రయాగాతో సమానం. ద్వాదశ యోజనాలు విస్తరించిన కుశస్థలీనది ముప్ఫై ఆరు పాపాలను, పూర్ణానది యాత్ర ముప్ఫై పాపాలను, కృష్ణవేణి పదిహేను పాపాలను, తుంగభద్ర ఇరవైపాపాలను ప్రక్షాలనం చేస్తాయి.
    పంపాసరోవర శక్తి అనంతం. పాండురంగా మాతులింగ, గంధర్వ నగరాలు తీర్థాలతో విలసిల్లుతున్నాయి. రామేశ్వరంలో 108 తీర్థాలు, ఆదివరాహక్షేత్రమైన తిరుమలలో దాదాపు 18 తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి పుణ్యఫలం కలుగుతుంది.
    మహానది, తామ్రపర్ణి నదుల పుణ్యం వర్ణశక్యముకాదు. కుంభకోణంలో స్నానం సమస్త తీర్థాల సమానం.


కొన్ని సమయాల్లో నదులు, తీర్థాలలో స్నానమాచరించటం నిషేధించటం జరిగింది. రవి కర్కాటకంలో ఉన్న సంక్రమణ సమయం రెండుమాసాలు నదీ రజస్వల సమయం. ఆ సమయంలో నదీస్నానం దోషం. నదీ తీరప్రాంత వాసులకు ఈ దోషముండదు.


నదీ రజస్వల అంటే, కొత్తనీరు రావటమన్న మాట. అప్పుడు స్నానం చేయడం, మహాదోషం. తీర్థసేవన విషయంలో ఇది సాధారణ విషయమైనా, ఈ సమయంలో తీర్థ దర్శనం చేయవలసివస్తే స్నాన, క్షౌర, ఉపవాసాదులు ఆచరించాలి. కాబట్టి “జాగ్రత్త" అని హెచ్చరించారు.


ప్రతి నదీ పాపహారిణే, పుణ్యమూర్తే. నది స్త్రీ రూపం. అందుకే స్త్రీలు పసుపు, కుంకుమ, పువ్వులతో విశేషంగా నదిని పూజిస్తారు.


ప్రతి జీవనడికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. జీవన ప్రదాతలైన నదులకు కృతజ్ఞత  చెప్పటం పుష్కరాల ప్రధానోద్దేశం. పెద్దలకు పిండ ప్రదానం చేసి పితృఋణం తీర్చుకోవటం ఒక ధార్మిక, సాంస్కృతిక ప్రయోజనం.


మేషం మొదలైన పన్నెండు రాశులలో బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కో సంవత్సరం ఉంటాడు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినపుడు గోదావరి నది పుష్కరాలు వస్తాయి. అలాగే కన్యారాశిలో బృహస్పతి ప్రవేశించినపుడు కృష్ణానదికీ పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో నదీస్నానం చేస్తే వెయ్యి గోదానాలు చేసిన పుణ్యం లభిస్తుంది.

62 కళలు అంటారు..అవి ఏవి?


62 కాదు. చతుష్టష్టి కళలు అంటారు. అనగా 64. వీటినే విద్యాలని కూడ అంటారు. ఈ లెక్కలో కూడ కొన్ని మతభేదాలున్నాయి. కొందరు వేదాలన్నింటిని ఒక్కటిగా లెక్కించారు. కొందరు వాటిని నాలుగుగా చూపారు.
  1. వేదం
  2. శాస్త్రం
  3. ధర్మశాస్త్రం (స్మృత్రి)
  4. వ్యాకరణం
  5. జ్యోతిశ్శాస్త్రం
  6. ఆయుర్వేదం
  7. సంగీతశాస్త్రం (గాంధర్వం)
  8. కవిత్వం
  9. స్వరశాస్త్రం
  10. సాముద్రికశాస్త్రం
  11. కొక్కోకం (కామశాస్త్రం)
  12. శకునశాస్త్రం
  13. మల్లయుద్ధవిద్య
  14. గారుడం
  15. వాక్చమత్కృతి
  16. అర్థవేదం
  17. దేశభాషా పాండిత్యం
  18. వివిధ లిపిజ్ఞానం
  19. లేఖనం
  20. రథగమనం
  21. రత్నపరీక్ష
  22. అస్త్రవిద్య
  23. పాకశాస్త్రజ్ఞానం
  24. శిక్ష
  25. వృక్షదోహదాలు
  26. ఆగమశాస్త్రం
  27. ఇంద్రజాలికం (గారడీ)
  28. కల్పం
  29. కుట్టుపని
  30. శిల్పశాస్త్రనైపుణ్యం
  31. రసవిద్య (బంగారం చేయటం – రసవాదం)
  32. నృపాలనిధి (రాజనీతిశాస్త్రం)
  33. అంజనవిశేషాలు (కాటుకలు)
  34. వాయుజలస్తంభన
  35. ధ్వనివిశేషం
  36. ఘటికాశుద్ధి
  37. పశురక్షణ
  38. విహంగ భేదాగమన విద్య
  39. చిత్రలేఖనం
  40. అభినయశాస్త్రవిద్య
  41. దొంగతనం
  42. వాస్తుశాస్త్రం
  43. మణిమంత్రౌషధసిద్ధి
  44. లోహకార విద్య
  45. స్వప్న శాస్త్రం
  46. అష్టసిద్ధులు
  47. వడ్రంగం
  48. మూలికౌషదసిద్ధి
  49. చర్మకారక విద్య
  50. గణితశాస్త్రం
  51. సూతికాకృత్యం
  52. కార్యకారణవిద్య
  53. చరాచారాన్యధాకరణం
  54. తంతువిద్య
  55. యోగవిద్య
  56. వ్యవసాయం
  57. ప్రశ్నశాస్త్రం
  58. వ్యాపారం
  59. మిగ్రభేదం
  60. వేట
  61. తుఅరగారోహణవిద్య
  62. అలంకారాలు
  63. ఉచ్చాటనం
  64. నృత్యం.
వీనిలో కొన్నింటిని తీసివేసి కొందరు; అదృశ్యవిద్య, ధాతుపరీక్ష, శాంతి, నాటకం, పురాణం, సుషిణ, అనర్ధ, ఘనా అనేవాటిని చేర్చారు

సన్యాసుల చేతిలో పొడవైన కర్ర ఎందుకు?


వైరాగ్యానికి, తాత్వికతకూ, ద్వైత, అద్వైత భావానికీ పొడవైన కర్ర గుర్తుగా పెట్టుకొంటారు సన్యాసులు! (యతులు).


‘Y’ ఆకారంగల పద్దెనిమిది అంగుళాల పొడవున్న ‘యోగదండ’ మనే పేరుగల దండాన్నీ, కమండలాన్నీ పట్టుకొని వుండేవారిని ‘తాపసులు’ అంటారు. ‘ఋషులు’ అని కూడా అంటారు.


గాలి-నీరు-భూమి-అగ్ని-ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనేమ్ మనిషి కాబట్టి ఐదు అడుగుల పొడవైన చేతి కర్రను ధరిస్తారు. ఇందులో ఏకదండి, ద్విదండి, త్రిదండి అని మూడు విధాలు వున్నాయి. ఒకే ఒక కర్రను ధరించి వుండేవారు అద్వైత సిద్ధాంతం కలవారు. అద్వైతం అంటే జీవుడు దేవుడు (శ్రీ శంకరాచార్యమతం) ఒక్కటేననే సిద్ధాంతం మనిషిలోనే దేవుడున్నాడు. పరభ్రహ్మత్వమే  మనిషిని నడిపిస్తున్నది. స్వర్గము నరకము ఇక్కడే వున్నాయి. అంతరాత్మకు (పరమాత్మకు) విరుద్ధంగా, దైవత్వాన్ని మరుగున పెట్టి, అక్రమ మార్గాన చరిస్తే, ఆ పాపఫలితాన్ని మనం ఏదో ఒక రూపంలో ఇక్కడే అనుభవించాల్సి వస్తుంది అంటుంది అద్వైతం. ఈ అద్వైతం సిద్ధాంతం బోధించేవారి వద్ద ఒకే ఒక్క కర్ర వుంటుంద. జ్ఞానానికి సంకేతమైన అశ్వద్ధ వృక్షం (రావిచెట్టు) నుండి సేకరించుకుంటారు.


రెండు కర్రలను కలిపి ఒక్కటిగాకట్టి చేతధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు. వీర్ని ‘ద్విదండి’ అంటారు. దేవుడు వేరు జీవుడు వేరు (జీవాత్మ పరమాత్మ వేరువేరు) అని బోధిస్తారు. వీరందరూ వైష్ణవ భక్తులే. ఈ సిద్ధాంతాన్నే భారతయుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తాడు. ద్వైత సిద్ధాంతానికున్న ప్రాచురత్యం అద్వైతానికి అంతగా లేదు. రామానుజాచార్యులు మొదలైన వారెందరో ఈ మతానికి ప్రాణంపోసి ప్రాముఖ్యతను కల్గించారు.  ఈ మతం వారిని ‘జీయరు’ లని అంటారు.


మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి భుజాన పెట్టుకొనే వారు కూడా వున్నారు. దీన్ని ‘తత్వత్రయం’ అంటారు. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఈ మూడింటిని నారాయణ తత్వంగా భావిస్తూ బోధనలు చేస్తారు.


పొడవైన ఈ దండాలతో దుష్టప్రాణులనుండి రక్షణ కల్పించుకొంటారు. ఫలపుష్పాలను ఈ దండం సహాయంతో సేకరించుకొంటూ భగవధ్యానంతో జీవితం గడుపుతుంటారు.


ఋషుల చేతిలో వుండే 18 అంగుళాల యోగదండం జపం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రుద్రాక్షమాల నేలపైబడి అపవిత్రం కాకుండా ‘Y’ అకారంగల కర్రపై కుడిచేతిని పెట్టి జపమాల త్రిప్పుతుంటారు. ఈ యోగదండం కూడా ఆత్మరక్షణకు యోగీశ్వరత్వానికి వుపయోగపడుతుంది

చతుర్వేదములు


పూర్వము ౠషులు యజ్ఞయాగాదులు నిర్వహించినపుడు ఈ వేదములందలి మంత్రములు వినియోగించి నారు. వేదములు దైవవాక్కులు, పరమేశ్వర విశ్వాసములు. వేదములు నాలుగు. అవి ౠగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము.


ఋగ్వేదము


పాదబద్దములగు మంత్రమును ‘ఋక్కూ’ అని అందురు. ఈ వేదమునందు ఇటువంటి మంత్రములే ఉండుట వలన దీనికి ‘ౠగ్వేదమూ అని పేరు. ఈ వేదమునకు 21 శాఖలు కలవు. ఆ 21 శాఖలలో శాకలశాఖ, బాష్కలశాఖ అనే రెండు శాఖలు మాత్రం ప్రస్తుతం లభించుచున్నవి. ఇందు వ్యవసాయ విధానం, వ్యాపార విధానం, ఓడలు, విమానం, రైలు తయారుచేయువిధానం, టెలిగ్రాం, వైరలెస్ వంటి అనేక ఆధునిక శాస్త్రములు ఈ ౠగ్వేదమునందు గలవు. యజ్ఞ సమయమునందు హవిర్భాగముల గ్రహించు నిమిత్తం హెతయను ౠత్విక్కు ఈ వేదమత్రంములతో దేవతలను ఆహ్వనించును. అందుచే ఈ వేదమునకు ‘హౌత్రవేదా మనిపేరు. ఈ ౠగ్వేదముని 10 మండలములుగ విభజించిరి. ఒక శాఖవారు 8 అష్టకములుగా విభజించారు.

యజుర్వేదము

ఇందు కౄష్ణయజుర్వేదము, శుక్లయజుర్వేదము అనియు రెండు విధములు కలవు. ‘తెత్తిరీ అనుపేరు గజ ఆచార్Yఉడు శిష్యప్రశిష్యులకు బొధించెను. అందుచే ‘తైత్తిరీయా మని పేరు వచ్చింది. ఈ తైత్తిరీయవేదమునకు సమ్హిత, బ్రాహ్మణము, ఆరణ్యకము అను మూడు భాగములు ఉన్నవి. ఈ సమ్హితయందు 7 అష్టకములు (కాండములు), 44 ప్రశ్నలు (ప్రపాఠకములు), 651 అనువాకములు, 2196 పంచాశత్తులు (పనసలు) ఉన్నవి.


ఇందులో కర్మలను తెలుపు శాస్త్రము, బ్రహ్మవిద్య, సౄష్టివిద్య, గణిత విద్య, శారీరిక శాస్త్రవిద్య, అంతరిక్ష విద్య మొదలగునవి గలవు.


పనస: ప్రతి పనసయందు ఏభయి పదములు ఉన్నవి. అనివాకాంతమునందున్న పనసలకును, అనువాకము నందున్న పనసలకును పదములు కొంచెము హెచ్చుతగ్గులు ఉండును. సంస్కౄత భాషలొ దినిని ‘పంచాశత్తూ అని అందురు.


శుక్లయజుర్వేదము


వాజలనేయ సమ్హిత అని దీనికి మరొక పేరు. ప్రస్తుతం ఈ వేదమునందు మాధ్యందిన శాఖ, కాణ్వశాఖ అని రెండు శాఖలు కలవు. ఈ రెండు శాఖల వారిని తెలుగునాట ‘ప్రధమశాఖా అంటారు. శుక్లయజుర్వేదము లో 40 అధ్యాయములు కలవు. ఈ వేదమునకు ‘శతపధ బ్రాహ్మణమూ అని పేరు. ఈ వేదమంత్రములతో ‘అధ్వర్యుడూ అను ౠత్విక్కు యజ్ఞమునందు హెమాది ప్రధాన కౄత్యములను అచరించును. సకల కర్మలు ఆపస్తంబ మహర్షి చేసిన కల్ప సూత్రమును అనుసరించి జరిపించుకుంటారు.

సామవేదము


ఇది ఈశ్వరభక్తి ప్రభోధించు శాస్త్రము. సామము అనగా గానము. గానము చేయదగిన మంత్రములు గల వేదము కావున ‘సామవేదమూ అని పేరు వచ్చింది. ఈ వేదమునకు 1000 శాఖలు కలవని సంప్రదాయం. ఆయితే ఇప్పుడు ఒకే శాఖ మాత్రమే లభించుచున్నది. యజ్ఞ కాలమునందు ‘ఉద్గాతా అను ౠత్విక్కు ఈ వేదమంత్రములతో గానము చేయుచూ దేవతలను స్తుతించును. అందుచేతనే ఈ వేదమునకు ‘ఉద్గాతౄవేదమూ అని మరొక పేరు ఉంది. ఈ వేదమునకు తాండ్యబ్రాహ్మణము మున్నగు  బ్రాహ్మణ గ్రంధములు ఎనిమిది కలవు.

అధర్వవేదము


భౌతిక విజ్ఞానము తెలుపు శాస్త్రం ఇది. ఇందు కూడ బ్రహ్మవిద్య, సౄష్టి విద్యా, ఉపాసనాది విధి భగవత్ర్పార్ధన, బ్రహ్మచర్యవిధి, పంచయజ్ఞవిధి వంటి విషయములు గలవు. ఈ వేదమును 20 కాండములుగా విభజించిరి. ఒకప్పుడు ఈ వేదమునకు తొమ్మిది శాఖలు ఉండేవి. ఇప్పుడు ఒక శాఖ మాత్రమే లభించుచున్నది. ౠత్విక్కు (బ్రహ్మ) అవశ్యము తెలుసుకొనవలసిన విధి ఈ వేదము నందు కలదు. అందుచేత దీనిని బ్రహ్మవేదము అని కూడా అందురు. ఇతర వేదములకంటె శాంతికి, పౌష్టిక కర్మలు ఈ వేదమునందు అధికముగా ఉన్నవి. దీనికి ‘గోపధ బ్రాహ్మణమూ అని మరొక పేరు కలదు.
వేదమునందు సమ్హిత అనియు, బ్రాహ్మణము అనియు ప్రధాన భాగములు కలవు. సమ్హిత అనగ మంత్రములు మాత్రము గల భాగము. బ్రాహ్మణము అనగా అర్ధగాంభీర్యం గల మంత్రముల అర్ధములను వివరించునట్టి గాని తెలియజేయునట్టి గ్రంధము.

మన సంస్కారాల అంతరార్థం


భారతీయ సంస్కౄతిలో చెప్పబడినవన్నీ సమజహితం కోసమే ఉద్దేశించబడినవి. సమాజం అంటే మనుష్యులు తప్ప వేరెవరో కాదు. అందుకే మన సంప్రదాయయలు మానవ వికాసానికై ౠషులచే నిర్దేశించబడ్డాయి. ఈ సంప్రదాయలనే సంస్కారాలు అని చెబుతారు. మన జీవితాలు ఏదో ఒక దశలో ఈ సంప్రదాయలను అనుసరించే ముందుకు సాగుతుంటాయి. 
  మనుస్మౄతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా గుర్తించింది. 1. వివాహాం, 2. గర్భాధానం, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశనం, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణం, 10. ఉపనయనం, 11. కేశాంతం, 12. సమావర్తనం. అయితే మరికొంతమంది స్మౄతికాకురులు ఈ సంస్కారలను షోడశ (16) సంస్కారాలుగా పేర్కొన్నారు. కర్ణభేధం, విద్యారంభం, వేదారంభం, అంత్యేష్టి అంటూ మనువు చెప్పిన 12 సంస్కారాలకు, ఈ నాలుగు సంస్కారాలను జోడించి షొడశ సంస్కారాలుగా గుర్తించారు.
   మనిషి పుట్టుకనుంచి చనిపోయేవరకు సంస్కారమయమే. ఇందులో అంత్యేష్టి తప్ప మిగిలిన 15 కర్మల ద్వారా జీవుడు సంస్కరింపబడుతూ మరణం తర్వాత ఉత్తమలోక ప్రాప్తిని పొందడం జరుగుతుంది. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడ తొలిగి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిధ్దిస్తుంది. సంస్కారల ఆచరణ మనిషి జీవితంలో వివాహాంతో మొదలవుతుంది. అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలన్నదే. స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది. అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలన్నదే. స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది. తద్వారా మన సంస్కారములు ప్రధానోద్దేశ్యం జీవుల క్షేమమేనని తేటతెల్లమవుతోంది. వేదోపనిషత్తుల ప్రకారం మన శరీరం ఐదు అంశాలమయంగా విభజింపబడింది.


1. అన్నమయ కోశం – భౌతిక శరీరం
2. ప్రాణమయ కోశం – శక్తి కేంద్రం
3. మనోమయ కోశం – చింతనా కేంద్రం
4. బుద్ధిమయ కోశం – వివేకం
5. అనందమయ కోశం – పరమశాంతి
మన శరీరంలో ఈ ఐదు అంశాలు షోడశ సంస్కారాల ద్వారా సక్రమమైన రీతిలో చలిస్తాయనేది శాస్త్రవచనం ఈ సంస్కారాల వెనుకనున్న వైజ్ణానిక రహస్యాలు నేతి వైజ్ణానికులకు సైతం అశ్చర్యపరుస్తాయి.


1. వివాహం : వివాహం సమయంలో వధూవరులచే పలుమంత్రాలు చెప్పించబడుతుంటాయి. ఆ సమయంలో వరుడు, “భగ, ఆర్యమ, సవిత, పురంధి అనే దేవతలు గార్హపత్యం కోసం నిన్ను నాకు అనుగ్రహించగా, నా జీవితం సుఖమయమయ్Yఏందుకు నీ చేయిని నేను పట్టుకున్నాను” అని చెబుతాడు.
2. గర్భాదానం : స్త్రీ పురష సంయోగం ద్వారా పుట్టబోయే సంతానం యోగ్యులుగా ఉండేందుకై ఈ సంస్కారం నిర్దేశించబడింది.
3. పుంసవనం : తల్లిం గర్భంలోని పిండం పవిత్రంగా ఏర్పడేందుకు ఉద్దేశించబడిన సంస్కారమే పుంసవనం.
4. సీమతం : గర్భవతికి ఈ సంస్కారాన్ని నిర్వహించడం వల్ల దుష్టశక్తుల నుంచి రక్షింపబడుతుంది.
5. జారకకర్మ : బిడ్డకు నెయ్యిని రుచి చూపి, పది నెలలు తల్లి గర్భంలో ఉండి ఈ ప్రపంచానికి వచ్చిన జీవికి జరిపే తొలి సంస్కారం ఇది.
6. నామకరణం : బిడ్డ ఈ సమజంలో తనకంటూ ఓ వ్యక్తిత్వంతో వౄద్ధిలోకి రావాలన్న కోరికతో తల్లి దండ్రులు జరిపే సంస్కారం.
7. నిష్ర్కమణం : బిడ్దను తొలిసారిగా బయటకు తీసుకెళ్ళడం, చంటిబిడ్డను విభిన్న వాతావరణాలకు పరిచYఅం చేయడమో ఈ సంస్కారంలోని అంతరార్ధం.
8. అన్నప్రాశనం : బిడ్డకు బలవర్ధకమైన, ఆహారాన్ని పరిచయం చేయడం.
9. చూడాకర్మ : పుట్టువెంట్రుకలను తీయించడం ఈ సంస్కారంలోని ప్రత్యేకత.
10. కర్ణబేధ : చెవులు కుట్టించడం.
11. ఉపనయనం : బాల బ్రహ్మచారికి జరిపే సంస్కారం.
12. వేదారంభం : సమవర్తన సంస్కారాన్ని చక్కగా ముగించేందుకే వేదారంభం.
13. సమావర్తనం : పిల్లలు విద్య ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ సంస్కారం జరుపబడుతుంది.
14. వానప్రస్ధం : బాధ్యతలను వారసులకు అప్పగించి వచ్చే జన్మకై జరిపే కర్మ.
15. సన్యాసం : ఐహిక బంధాల నుంచి విముక్తి పొందడం.
16. అంత్యేష్టి : పిత్రూణం తీర్చుకునేందుకు పుత్రులు చేసే సంస్కారం.

యోగసాధన


భారతీయ షట్ దర్శనాల్లో యోగ ఒకటి. “యోగ: చిత్తవృత్తి నిరోధ:” అని అన్నారు మహర్షి పతంజలి. అనగా చంచలమైన  మనో నడవడికలను, ఆలోచనలను నిరోధించి ఏకాగ్రతను సాధించేదే యోగము.


ఆధ్యాత్మికుల మాటల్లో  చెప్పాలంటే ఇది ఆత్మ – పరమాత్మల సంయోగానికి మార్గం. యుజ్ అనే సంస్కృత పదానికి సమ్యోగం అని అర్ధం. ఈ యుజ్ నుంచి యోగ వచ్చింది. బయతి ప్రప్రంచంలోని అసత్య రూపాలతోను, ఆకర్షణలతోను మునిగి ఉన్న అహం కారపూరిత మనస్తత్వం కలిగి ఉన్న మానవ జీవాత్మను సర్వోపగతమైన పరమాత్మ యొక్క అనుగ్రహం పొందగల స్థితికి చేర్చు ప్రయత్నమే యోగాభ్యాసం.


యోగ శాస్త్రాన్ని క్రీస్తుపూర్వం రెండు శతాబ్దాల నాడు మహర్షి పతంజలి క్రమబద్ధం చేసి గ్రంథస్థం చేశారు. అంతకుముందు కొన్ని వందల సంవత్సరాల నుంచే యోగ భిన్న పద్ధతులలో ఉండవచ్చన్నది చరిత్ర కారుల అభిప్రాయం.


సాంఖ్య దర్శనానికి యోగ కొనసాగింపు.


యోగలో మొత్తం ఎనిమిది దశలున్నాయి. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాథి.ఈ ఆఖరి స్థితొలోనే ఆత్మను పరమాత్మతో సమ్యోగం చేయవచ్చన్నది దార్శనికుల విశ్వాసం.


1. యమ అనగా పది ధర్మములను అబ్య్హసించటం. అవి అహింస, సత్యం, దొంగతనం చేయకుండుత, బ్రహ్మచర్యం, దయ, నీతి, క్షమ, పట్టుదల, మితాహారము తీసుకొనుట మరియు శుభ్రము.
2. నియమమనగా 8 ధర్మములను అబ్యసించటం. అవి త్రుప్తి, వేదములను నమ్మటం, దానము, దైవపూజ, వేదములను పఠించటం, అణకువ, మనియు జపము.
3. ఆసన: అయిదు ముఖ్యమైన కూర్చుండు విధములను పాటించటం. అవి ఏమనగా పద్మాసన, స్వస్తికాసన,భద్రాసన, వజ్రాసన మరియు విరాసన.
4. ప్రాణామాయం అంటే గాలిని లోనికి పీల్చి, కొంత సేపు అట్లాగే ఉంచి తరువాత వదలి వేయుట. గాలిని ముక్కు యొక్క ఎడమ రంధ్రంతో 16 మాత్రల కాలము పీల్థి, 64 మాతల కాలం లోపల ఉంచి తరువాత ముక్కు యొక్క కుడి రంధమునిండి 32 మాత్రల కాలము వదలి పెట్టాలి. ఈ ప్రాణాయామం వీలయినన్నిసార్లు ఎక్కువ కాలం అభసించాలి. ఈ ప్రణాయామ అభాసంలో శరీర మునకు మిక్కిలి చెమట పడితే అది సామాన్య ప్రాణామాయం. శరీరము కుదిపినట్లయిన మధరకమైనది. శరీరము నేలనుండి పైకి లేచిన అది సర్వోత్కృష్టమైనది.  
5. ప్రత్యాహారము: జ్ఞానేంద్రియములను రూప రసగంధాది విషయాలనుండి బలవంతంగా విముఖంగానుండునట్లు అంతర్ముఖం చేయటం.
6. ధారణ: భగవంతుని తప్ప మైయొకటి ఎరుగని స్థితిలో ఉండటం.
7. ధ్యానం: ఇష్ట దైవాన్ని ఏకాగ్రతతో ప్రార్థించటం.
8. సమాధి: ఈ స్థితిలో ఆత్మను పరమాత్మతో సమ్యోగం చేయవచ్చునని దార్శనికుల విశ్వాసం.


ఆధునిక కాలంలో దాదాపు వందేళ్ళుగా ఇటు భారతదేశంలోను, అటు పశ్చిమదేశాల్లోను విస్తృతంగా ఆచరిస్తున్న యోగకు మాత్రం శారీరక, మానసిక ప్రశాంతతే లక్ష్యం అష్టాంగయోగలోని మూడు, నాలుగు దశలు ఆసన (శారీరక వ్యయామం) ప్రాణాయమ (ఉచ్చ్వాస, నిశ్వాసాల నియంత్రణ)ను ప్రప్రంచంవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఆచరిస్తున్నారు.    శారీరక ఆరోగ్యానికి, శారీరక, దార్ద్యానికి తిరుగులేని మార్గంగా నమ్ముతున్నరు.

ప్రార్థన ఎందుకుచేయాలి?

ఎంతటి అర్ధబలం ఉన్నా, అంగబలం ఉన్నా, అధికార బలంఉన్నా, మానవమాత్రుడైన ప్రతివ్యక్తికి తన జీవనయాత్రలో ఏనాడో ఒకనాడు క్లిష్టతర సమస్యలను ఎదుర్కొనక తప్పదు. పరమాత్మ కరుణకు పాత్రుడైనవాడు ఎట్టి కష్టాలనైనా సునాయాసంగా ఎదుర్కొనగలడు. ఆ దయా సముద్రుని కరుణకోసం మనకు లభించిన 24 గంటల కాలంలో కనీసం ఓ గంట అయినా త్రికరణసుద్ధిగా ఆ దేవదేవుని ప్రార్థించడం ఎంతైనా అవసరమే.  శ్రద్ధ, భక్తి విశ్వాసాల స్థాయికి అనుకూలంగా సకాలంలో సత్వర ఫలితాలను పొందవచ్చు. విశేషించి ఈ కలియుగంలో – ‘కలౌ స్మరణన్ ముక్తి:’ అన్న సూక్తిని సర్వదా జ్ణ్జప్తిలో ఉంచుకుంటూ భగవన్నామాన్ని స్మరించండి. భగవచ్ఛక్తి ఎట్టిదో, మహాత్మ్యాలు ఎంత శక్తి సంపన్నమైనవో వర్ణించగలవారు లేరు.  అందుకు మచ్చుతునకగా ఈ ఉదాహరణ.

ఓ భయంకర అరణ్య మధ్యభాగంలో పూర్ణగర్భవతి అయిన ఓ లేడి తన రెండ్ పిల్లలతో పచ్చిక కోసం తిరుగుతుండగ, వేట కోసం వేటగాడు పెట్టిన వలలో చిక్కుకు పోతాననుకుంటూ వెనుకకు మరలేసరికి, ఆ వైపు నుండి వేటకుక్కలు రెండు భయంకరంగా మొరుగుతూ తన వైపే రావడం చూసి, ఎడమవైపుకు తిరిగి అలా పోదామనుకునే సరికి, ఆహారం కోసం వస్తూన్న ఎలుగుబంటి తనమీదకు రావడం చూసింది.  పోని, కుడివైపు తిరిగి ఆ దిశగ పోదామంటే తమ వైపే శరవేగంతో వస్తున్న ఓ తోడేలు దాని కంటబడింది. భగవంతుడా? ఏమిటీ దశ? ఎలా పోదామన్నా మౄత్యువే కనబడుతున్నదే అనుకొంటూ ఉండగా, ఆ ప్రక్కనే ఉన్న మర్రిచేట్తునెక్కి తనవైపు గురుచూస్తూ వేటగాడు బాణాన్ని ధనస్సుకు సంధిస్తున్న దౄశ్యం కనబడింది.

అంతలోనే దావానలంవల్ల దగ్ధమవుతున్న అరణ్య పరిసర ప్రదేశమంతా కనిపిస్తోంది.  ఆ దావానలం నుండి బయల్వెడలిన పొగలకూ, అగ్నిజ్వాలలకూ కొండగుహలలో నిదురిస్తున్న సిమ్హాలు బయటకు వచ్చి, కొండ శిఖరాలను ఎక్కి భయంకరంగా గర్జించసాగాయి. ఆ భయంకర గర్జనలకు అరణ్యంలోని మౄగాలన్నీ తల్లడిల్లిపోసాగాయి.

అట్టి భయంకర విపత్కర పరిస్థితి ఎదురవడంతో, పిల్లలతో సహా ఆ లేడి గజగజలాడ సాగింది. అప్పుడు ఆ లేడి వేదన పడూతూనే – కన్నులు మూసికొని ‘లక్ష్మినాథ: త్వమిహశరణం కిం కరోమి క్వయామి?’ ఆర్తత్రాణ పరాయణా! ఆది నారాయణ! భయంకరమైన ఈ విపత్తు నుండి నీవు తప్ప మమ్మల్ని రక్షించగల వారెవరు తండ్రి! అంటూ ఆర్తనాదం చేసింది. మనసావాచాకర్మణా – పరమాత్మను నమ్మి చెడినవారు ఈ ప్రపంచంలో ఉన్నారా?
మర్రిచెట్టు మీదన్నున్న వేటగాణ్ణి కాలసర్పం కాటువేయడంతో  ’అబ్బా’ అంటూ వాడు నేలకూలాడు. వాడి చేతులోని నిశిత శరం వచ్చి ఎలుగుబంటికి తగిలి, అది వేంటనే మరణించింది. తమ వేట జంతువును తోడేలు కొట్టుకు పోతుందేమోనని వేటకుక్కలు దాని వెంటబడి తరుముకుంట్టు అడవిలోకి దూరంగా పోయాయి. ఈలోగా ప్రచండ వాయు ప్రేరణవల్ల దావానలం నుండి అగ్ని కణం ఒకటి వచ్చి వలమయంలోనే అంబరమంతా కారు మేఘాలతో నిండి కుంభవౄష్టి కురిసి దావానలమంతా చల్లారిపోయింది. పూర్ణ గర్భవతి అయిన ఆ హరిణి ప్రసవించ, నవజాత శాబకాలు మాతౄస్తన్యాన్ని పానం చేయసాగాయి!  చూశారా! కరుణాసముద్రుడైన  నారాయణ దేవుని అనుగ్రహం! ఆస్థితిని చూసి ఆ కురంగం ఎంతగా ఉప్పొంగిపోయింతో అనుభవైకవేద్యమైనది.  అపార కరుణావరుణాలయుడైన శ్రీహరిని స్మరించుకొంటూ అది తన బిడ్డలతో సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయింది.  ఇది కేవలం లేడి గురించి చెప్పిన కథ మాత్రం కాదు.  మనుష్యుడై పుట్టినవాడు తన జీవయాత్రలో ఎప్పుడో ఒకప్పుడు క్లిష్టతర సమస్యలను ఎదుర్కొనక తప్పదు.  వాని అంగబలం, అర్థబలం, అధికార బలం ఇవన్నీ కలిసినా సమస్యలు తీరవు.  వార్థక్యంలో సాధన చేద్దాంలే, ఇప్పటి నుండీ ప్రార్ధన ఎందుకు? అని అనుకోక, ధ్రువ, ప్రహ్లాదులవలె చిన్ననాటి నుండి దైవ ప్రార్థన చేసికొంటూ, కుటుంబపరివార, అనుచర, సహచర వర్గానికి కూడా దైవకరుణ, లీలామహాత్మ్యాదులను గురించి బోధించి అనేకులను తరింపజేసి, జన్మను చరితార్థం చేసుకోవాలి

ఏడు వారాల నగలు


పూర్వము ఏడు వారాల నగలలు ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నది. ఏడువారాల నగల గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఈనాడు కూడా వాటి గురించి తెలుసుకోవడం అశక్తికరమే! మన పూర్వీకులు గ్రహాల అనుగ్రహము కోసము, ఆరోగ్యరీత్య స్త్రీ పురుషులు బంగారు నగలను ధరించెడివారు. వారము రోజులు అనగ ఆదివారము మోదలు శనివారము వరక్ రోజుకొక విధమైన బంగారు ఆభరణముల్ను ధరించెడివారు. వీటినే ఏడు వారాల నగలు అందురు. గ్రహాలకు అనుకూలముగా కంఠహారములు, గాజులు, కమ్ములు, ముక్కుపుడకలు, పాపిటబిల్ల, దండెకడేము (ఈనాటి వంకీ), ఉంగరాలు మొదలగు ఆభరణాలౌ ధరించెడివారు.


ఏ రోజున ఏయే నగలు ధరించవలెనో ఈ విధముగా తెలియజేయబడినది:


ఆదివారము: సూర్యుని కోసము కెంపుల కమ్మలు, హారాలు మొదలగునవి.


సోమవారము: చంద్రునికోసము ముత్యాలహారాలు, గాజులు మొదలగునవి.


మంగళవారము: కుజునికోసము పగడాల దండలు, ఉంగరాలు మొదలగునవి.


బుధవారము: బుధునికోసము పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి.


గురువారము: బౄహస్పతికోసము పుష్యరాగము కమ్ములు ఉంగరాలు మొదలగునవి


శుక్రవారము: శుక్రుని కోసము వజ్రాల హారాలు ముక్కుపుడక మొదలగునవి.


శనివారము: శనికోసము నీలమణి మణిహారాలు మొదలగునవి.

మంత్రవేత్త విశ్వామిత్ర మహర్షి!


విశ్వామిత్ర మహర్షి పేరు ప్రఖ్యాతలు ప్రపంచ విఖ్యాతమే. ‘జగమెరిగిన బ్రాహ్మణుడుకి జంధ్యమేలా అనే సామెత తెలుగు నాట రోజూ వనబడేదే. అలాంటిదే విశ్వామిత్రునిగురించి చెప్పుకోవటం. కానీ మహర్షుల, మహా తపస్సంపన్నుల, మంత్రవేత్తల చరిత్రలను మననం చేసుకుంటేనే మనోల్లాసం, మన: సంతౄప్తి కదా. ఆ మంత్ర వేత్తని స్మరించాలని ఆకాంక్ష!

మహర్షి విశ్వామిత్రుని జన్మవౄత్తాంతం మహాభారతంలోనూ, పురాణాలలోను కూడా చెప్పబడింది. ఈయన మహా తపస్సంపన్నుడైన భౄగుమహర్షి సుపుత్రుడు రుచీకుని యొక్క కుమారుడు. ఈయన జన్మమే విలక్షణంగా అయింది. ఈయన మాతామహుడు గాధి అనే మహారాజు. ఆయనకి సత్యవతి అనే సద్గుణ సంపన్నురాలు ఏకైక కుమార్తె. ఆ కుమార్తెకు రుచీకునికిచ్చి వివాహం చేశాడు. ఆవిడ మహాపతివ్రత. సౌందర్యరాశి. భర్తకి ఏలోటూ రాకుండా ఆయన మనసెరిగి మసలుకొంటూవుండేది. ఆవిడ పతిభక్తికి మెచ్చి రుచీకుడొకనాడు యజ్ణ్జము చేసినటువంటి చెరుకుని తీసుకొచ్చి మంత్రించి భార్యయైన సత్యవతికి యిచ్చి ‘దేవి! నీ తండ్రికి పుత్రసంతానం లేదుకదా! ఈ చెరుకు రెండుభాగాలుగా అభిమంత్రించి పట్తుకొచ్చాను. యిందు ఒకటి నువ్వు భుజించు. నీకు మహా తపోసంపన్నుడైన పుత్రుడు పుడతాడు. రెండవది నీ తల్లికియ్యి. ఆ మహారాణికి క్షత్రియ శక్తిసంపన్నుడైన పరాక్రమవంతుడైన కొడుకు పుడతాడూ అని చెప్పాడు. సత్యవతి ఆ రెండు చెరుకూ భాగాలనీ చూచి చాలా ఆనందించింది. తల్లిదండ్రులు వస్తే ఆమె తల్లికి ఆ రెండు భాగాలుయిచ్చి చూపించి వాటి ప్రభావం చెప్పింది.
దైవయోగంచేత సత్యవతి తీసుకోవలసిన భాగం ఆమె తల్లి తీసుకోవలసిన సగం సత్యవతి భక్షించింది. కాలగర్భంలో యిద్దరూ గర్భవతులయ్యారు. తపోధనుడైన రుచీకుడు తన తపశ్శక్తిచే జరిగిన పొరపాటు గ్రహించగలిగాడు. దైవవిధిగా భావించాడు. సత్యవతికి జమదగ్ని పుట్టాడు. అతనికి పరశురామ భగవానుడు పుట్టాడు. గాధిపత్నికి యజ్ణ్జ చెరుకు ప్రభావంతో మహర్షి విశ్వామిత్రుడు పుట్టాడు. ఆ విశ్వామిత్రునికి చాలామంది పుత్రులు పుట్టారు. అదే కుశక వంశంగా వర్ధిల్లింది.
విశ్వామిత్రుని విజయాలు
విశ్వామిత్రుడు పట్టుదల, దీక్ష, తపోనిష్టా గరిష్టుడు. దీక్షతో సాధించలేనిది లేదని లోకానికి చెప్పేందుకే ఈయన చరిత్ర సాక్ష్యం. మనస్సు లగ్నం చేసి అనేక మార్లు తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి రాజర్షి పదవిలోంచి బ్రహ్మర్షి స్థానం పొంది లోకపూజ్యుడయ్యాడు. సప్తర్షులలో అగ్రగణ్యుడయ్యాడు. ౠషిశ్రేష్ఠులందరి చేత వందనీయుడయ్యాడు.
ఆయన తపశ్శక్తి చేత సమాధి నిష్ఠాగరిష్ఠత చేత అనేక మంత్రార్థాలు కొత్త కొత్త మంత్రాల దర్శనం కూడా పొందాడు. యిన్ని మంత్రాల ద్రష్ట విశ్వామిత్రుడు ఒక్కడే. అందుకే ఆయనవి మంత్రద్రష్టా ౠషి అంటారు. ౠగ్వేదంలో పది మండలాలలో మూడవమండలమును వైశ్వామిత్ర మండలం అంటారు. యిందులో 62 సూక్తులు వున్నాయి. ఈ మంత్రాలన్నీ విశ్వామిత్రుడు చేసినవే. ఈ తౄతీయ మండలంలో ఇంద్ర, అదితి, అగ్నిపూజ, ఉష, అశ్వనీ, రుభు, మొదలుగువారి స్తోత్రాలున్నాయి. మళ్ళీ అనేక జ్ణ్జాన విజ్ణ్జాన ఆధ్యాత్మిక విషయాలు కూడా ఉన్నాయి. గోమాత వర్ణన ప్రాశస్త్యాలు వున్నాయి.
ఈ వైశామిత్ర మండలములో బ్రహ్మ గాయత్రీ మహామంత్రానీ చూచి ప్రజలకి, లోకానికి చూపించాడు. ఆయన వల్లనే గాయత్రీ మహామంత్రం పైకి తౄతీయ మండలంలో 62వ సూక్తిలో 10వ మంత్రం గాయత్రీ మహామంత్రంగా విఖ్యాతిగాంచింది.
‘ఓం భూర్ భువ స్వ:తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్ ‘
విశ్వామిత్రుడు లేకపోతే ఈ గాయత్రీ మహామంత్రం మనకి లభ్యమయ్యేది కాదు. ఈ మహామంత్రం వేదమంత్రాలకి మూలం . అన్ని మంత్రాలకీ బీజం. ఈ మంత్రానికున్న శక్తి అపారమైంది. ఉపనయనములో ఈ మహామంత్రాన్ని తండ్రి వటువు చెవిలో ఉపదేశించి ‘ద్విజత్వాన్నీ ప్రసాదిస్తాడు. విశ్వామిత్ర మహర్షి యొక్క దయవల్లనే ప్రతిరోజు సంధ్యావందనములో ఉభయ సంధ్యలందు ఈ మహామంత్రాన్ని జపించి బుద్ధిబలం, యశం అన్నీ పొంది తరిస్తున్నారు ప్రజలు.
విశ్వామిత్రుడు సమ్హిత, విశ్వామిత్ర స్మౄతి అనే గ్రంథములలో గాయత్రీదేవి యొక్క ఆరాధన, వర్ణన కూడా సొగసుగా చేశాడు. గాయత్రీ మహామంత్ర జపంతో అన్ని మంత్రాల యొక్క జపసిద్ధి కలుగుతుంది.
విశ్వామిత్ర మహర్షి తపస్సంపన్నుడు. ఆయనకి గాయత్రీ మాత అనుగ్రహం వల్లనే ప్రతిసౄష్టి చేయగలిగిన అపరబ్రహ్మ కాగలిగాడు.
భగవత్రీ గాయత్రీ మాత రూపు ఏమిటి? స్వరూపమేమిటి? ఆరాధన ఎలా చేయాలి? ఈ విషయాలన్నీ మనకి తెలియచేసిన ప్రథమ గురువు విశ్వామిత్ర మహర్షే.  ఆవిడ ఈ చరాచర జగత్తు నడిపే తల్లి. స్థూల, సూక్ష్మ భేధాలన్నీ ఆ తల్లి విగ్రహమే. ఉపాసన ధ్యానములు యొక్క దౄష్టిచేత ఆవిడ మూల స్వరూపమేమిటి? అనే విషయాన్ని ఆయన వ్రాసిన ఈ శ్లోకమే చెబుతుంది.
శ్లో!! ముక్తా విద్రుమహేమనీల ధవళ ఛాయైర్ముఖై: స్త్రీ క్షణై:
యుక్తా మిందు నిబద్దరత్నమకుటాం తత్వార్ధ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశ కశాంశుభ్రం కపాలం గుణాం
శంఖం చక్ర మధారవిందయుగళం హస్తెర్వహంతీం భజే!!
ఆతల్లి ముత్యాలు, మణిమాణిక్యాలు, ముంగాలు, బంగారం, నీలమణి, ఉజ్వల కాంతితో సమానమైనన ఐదు ముఖాలతో మెరుస్తూంటుంది. ఆవిడ మూడునేత్రాలతో విరాజిల్లుతోంది. ఆవిడ ముఖకాంతి అనుపమానం. ఆవిడ రత్న మయకిరీటంలో చంద్రుడు ప్రకాశిస్తుంటాడు. ఆవిడ 24 కాంతులతో ప్రకాశిస్తుంటుంది. ఆవిడ వరప్రదాయిని. గాయత్రీ చేతులలో అంకుశము, వరముద్ర కుశ, పాశ, శుభ్రం కపాలము, గద, శంఖం, చక్రం, రెండు కమలాలనీ ధరిస్తుంది. ఆవిడని ధ్యానించగల మహా సంపదని శ్రీ విశ్వామిత్ర మహర్షి ప్రజలకి చల్పించాడు.
ఆయన భక్తేకాదు, శ్రీరామచంద్రుడం తటివానికి ‘బల, అతిబలా అనే మహా ఆస్త్రాలని ఉపదేశించగల విలుకాడు. అన్ని శాస్త్రార్థాలనీ విశదీకరించి చెప్పాడు. జగద్గురుదేవులకే గురువయ్యాడు.
శాంత స్వరూపుడైన వశిష్ఠునితో నందినీ ధేనువు కోసంవివాదం పెట్టుకోవటం అయింది. అది కూడా లోకానికి పాఠం చెప్పటంలో భాగమే. ఆ కథవల్ల గోమహిమ లోకవిదితమైంది. తపస్సుకెంత శక్తివుందో మానవకోటికి అర్ధమైంది. దౄఢ నిశ్చయంతో పురుషుడెలా విజయం సాధించాలో విదతమైంది. వ్యక్తి మోహపాశాలు పనికిరావనే హెచ్చరిక కనబడుతోంది. రాక్షస ప్రవౄత్తి విడిచి దైవ సంపద చేకొనాలని నేర్చుకొంటారు ప్రజలు. కామక్రోధాలవల్ల వచ్చే అరిష్టం తెలుస్తోంది.  మోహపాశాల వల్ల వచ్చే అనర్థాలు బోధపడుతున్నాయి. ఎప్పటి వరకు మానవులు అరిషడ్వార్గాలని విడవడో అప్పటి వరకు దు:ఖం తప్పదు. అనే సత్యం తెలుస్తోంది.
దైవి సంపదవల్ల వచ్చే లాభాలు కూడా ఆయనచరిత్ర చెప్పింది. బ్రహ్మదేవుని గురించి దీక్షగా తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై బ్రహ్మర్షి అనే బిరుదు ప్రదానం చేశాడు. అప్పుడు వశిష్ఠమహర్షి ఆయన్ని కౌగలించుకున్నాడు. దేవతలు వారిద్దరి కలయికకి అనందించి పుష్పవర్షం కురిపించారు.
హరిశ్చంద్ర మహారాజుని పరీక్షించినప్పుడు ఆయన క్రూరమైన పాత్ర వహించినట్లు కనబడుతుంది. కాని ఆయన హరిశ్చంద్రుని సత్యవ్రత దీక్ష విశ్వవ్యాప్తం చేయాలని, దానివల్ల హరిశ్చంద్రుని కీర్తి ఆచంద్రార్కం భూలోకలో నిలవాలనే సత్సంకల్పమే. ఆయనకి కక్షేవుంటే లోహితాస్యుణ్ణి మళ్ళీ బతింకిచేవాడు కాదు.
ఐతరేయ బ్రాహ్మణములో విశ్వామిత్రుడు, శునశ్చేపుల వౄత్తాంతం చెప్పబడింది. అక్కడా కూడా విశ్వామిత్రమహర్షి యొక్క ప్రస్తావన వచ్చింది. ఆయన గోత్రీకులు చాలా మేధావంతులు, మహాత్ములు. ప్రపంచ రహస్యాలన్నీ యెరిగిన జ్ణ్జానులు. కౌశికస, వైశ్వామిత్ర గోత్రాలకి అధిపది ఆయనే. విశ్వామిత్రుడు సమర్ధుడు. అతీంద్రయ ద్రష్ట. అధ్వర్యం చేయటంలో నిష్ణాతుడు. సుదాసు మహారాజు యజ్ణ్జానికి అధ్వర్యం వహించిన మహా విద్వాంసుడు. యజ్ణ్జకర్త. ఆ మహామునీశ్వరుని గురించి మనకెంత తెలిసినా అల్పమే అవుతుంది.
విశ్వామిత్ర మహర్షి పేరు ప్రఖ్యాతలు ప్రపంచ విఖ్యాతమే. ‘జగమెరిగిన బ్రాహ్మణుడుకి జంధ్యమేలా అనే సామెత తెలుగు నాట రోజూ వనబడేదే. అలాంటిదే విశ్వామిత్రునిగురించి చెప్పుకోవటం. కానీ మహర్షుల, మహా తపస్సంపన్నుల, మంత్రవేత్తల చరిత్రలను మననం చేసుకుంటేనే మనోల్లాసం, మన: సంతౄప్తి కదా. ఆ మంత్ర వేత్తని స్మరించాలని ఆకాంక్ష!

మహర్షి విశ్వామిత్రుని జన్మవౄత్తాంతం మహాభారతంలోనూ, పురాణాలలోను కూడా చెప్పబడింది. ఈయన మహా తపస్సంపన్నుడైన భౄగుమహర్షి సుపుత్రుడు రుచీకుని యొక్క కుమారుడు. ఈయన జన్మమే విలక్షణంగా అయింది. ఈయన మాతామహుడు గాధి అనే మహారాజు. ఆయనకి సత్యవతి అనే సద్గుణ సంపన్నురాలు ఏకైక కుమార్తె. ఆ కుమార్తెకు రుచీకునికిచ్చి వివాహం చేశాడు. ఆవిడ మహాపతివ్రత. సౌందర్యరాశి. భర్తకి ఏలోటూ రాకుండా ఆయన మనసెరిగి మసలుకొంటూవుండేది. ఆవిడ పతిభక్తికి మెచ్చి రుచీకుడొకనాడు యజ్ణ్జము చేసినటువంటి చెరుకుని తీసుకొచ్చి మంత్రించి భార్యయైన సత్యవతికి యిచ్చి ‘దేవి! నీ తండ్రికి పుత్రసంతానం లేదుకదా! ఈ చెరుకు రెండుభాగాలుగా అభిమంత్రించి పట్తుకొచ్చాను. యిందు ఒకటి నువ్వు భుజించు. నీకు మహా తపోసంపన్నుడైన పుత్రుడు పుడతాడు. రెండవది నీ తల్లికియ్యి. ఆ మహారాణికి క్షత్రియ శక్తిసంపన్నుడైన పరాక్రమవంతుడైన కొడుకు పుడతాడూ అని చెప్పాడు. సత్యవతి ఆ రెండు చెరుకూ భాగాలనీ చూచి చాలా ఆనందించింది. తల్లిదండ్రులు వస్తే ఆమె తల్లికి ఆ రెండు భాగాలుయిచ్చి చూపించి వాటి ప్రభావం చెప్పింది.
దైవయోగంచేత సత్యవతి తీసుకోవలసిన భాగం ఆమె తల్లి తీసుకోవలసిన సగం సత్యవతి భక్షించింది. కాలగర్భంలో యిద్దరూ గర్భవతులయ్యారు. తపోధనుడైన రుచీకుడు తన తపశ్శక్తిచే జరిగిన పొరపాటు గ్రహించగలిగాడు. దైవవిధిగా భావించాడు. సత్యవతికి జమదగ్ని పుట్టాడు. అతనికి పరశురామ భగవానుడు పుట్టాడు. గాధిపత్నికి యజ్ణ్జ చెరుకు ప్రభావంతో మహర్షి విశ్వామిత్రుడు పుట్టాడు. ఆ విశ్వామిత్రునికి చాలామంది పుత్రులు పుట్టారు. అదే కుశక వంశంగా వర్ధిల్లింది.

విశ్వామిత్రుని విజయాలు


విశ్వామిత్రుడు పట్టుదల, దీక్ష, తపోనిష్టా గరిష్టుడు. దీక్షతో సాధించలేనిది లేదని లోకానికి చెప్పేందుకే ఈయన చరిత్ర సాక్ష్యం. మనస్సు లగ్నం చేసి అనేక మార్లు తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి రాజర్షి పదవిలోంచి బ్రహ్మర్షి స్థానం పొంది లోకపూజ్యుడయ్యాడు. సప్తర్షులలో అగ్రగణ్యుడయ్యాడు. ౠషిశ్రేష్ఠులందరి చేత వందనీయుడయ్యాడు.

ఆయన తపశ్శక్తి చేత సమాధి నిష్ఠాగరిష్ఠత చేత అనేక మంత్రార్థాలు కొత్త కొత్త మంత్రాల దర్శనం కూడా పొందాడు. యిన్ని మంత్రాల ద్రష్ట విశ్వామిత్రుడు ఒక్కడే. అందుకే ఆయనవి మంత్రద్రష్టా ౠషి అంటారు. ౠగ్వేదంలో పది మండలాలలో మూడవమండలమును వైశ్వామిత్ర మండలం అంటారు. యిందులో 62 సూక్తులు వున్నాయి. ఈ మంత్రాలన్నీ విశ్వామిత్రుడు చేసినవే. ఈ తౄతీయ మండలంలో ఇంద్ర, అదితి, అగ్నిపూజ, ఉష, అశ్వనీ, రుభు, మొదలుగువారి స్తోత్రాలున్నాయి. మళ్ళీ అనేక జ్ణ్జాన విజ్ణ్జాన ఆధ్యాత్మిక విషయాలు కూడా ఉన్నాయి. గోమాత వర్ణన ప్రాశస్త్యాలు వున్నాయి.

ఈ వైశామిత్ర మండలములో బ్రహ్మ గాయత్రీ మహామంత్రానీ చూచి ప్రజలకి, లోకానికి చూపించాడు. ఆయన వల్లనే గాయత్రీ మహామంత్రం పైకి తౄతీయ మండలంలో 62వ సూక్తిలో 10వ మంత్రం గాయత్రీ మహామంత్రంగా విఖ్యాతిగాంచింది.

‘ఓం భూర్ భువ స్వ:తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్ ‘


విశ్వామిత్రుడు లేకపోతే ఈ గాయత్రీ మహామంత్రం మనకి లభ్యమయ్యేది కాదు. ఈ మహామంత్రం వేదమంత్రాలకి మూలం . అన్ని మంత్రాలకీ బీజం. ఈ మంత్రానికున్న శక్తి అపారమైంది. ఉపనయనములో ఈ మహామంత్రాన్ని తండ్రి వటువు చెవిలో ఉపదేశించి ‘ద్విజత్వాన్నీ ప్రసాదిస్తాడు. విశ్వామిత్ర మహర్షి యొక్క దయవల్లనే ప్రతిరోజు సంధ్యావందనములో ఉభయ సంధ్యలందు ఈ మహామంత్రాన్ని జపించి బుద్ధిబలం, యశం అన్నీ పొంది తరిస్తున్నారు ప్రజలు.

విశ్వామిత్రుడు సమ్హిత, విశ్వామిత్ర స్మౄతి అనే గ్రంథములలో గాయత్రీదేవి యొక్క ఆరాధన, వర్ణన కూడా సొగసుగా చేశాడు. గాయత్రీ మహామంత్ర జపంతో అన్ని మంత్రాల యొక్క జపసిద్ధి కలుగుతుంది.
విశ్వామిత్ర మహర్షి తపస్సంపన్నుడు. ఆయనకి గాయత్రీ మాత అనుగ్రహం వల్లనే ప్రతిసౄష్టి చేయగలిగిన అపరబ్రహ్మ కాగలిగాడు.

భగవత్రీ గాయత్రీ మాత రూపు ఏమిటి? స్వరూపమేమిటి? ఆరాధన ఎలా చేయాలి? ఈ విషయాలన్నీ మనకి తెలియచేసిన ప్రథమ గురువు విశ్వామిత్ర మహర్షే.  ఆవిడ ఈ చరాచర జగత్తు నడిపే తల్లి. స్థూల, సూక్ష్మ భేధాలన్నీ ఆ తల్లి విగ్రహమే. ఉపాసన ధ్యానములు యొక్క దౄష్టిచేత ఆవిడ మూల స్వరూపమేమిటి? అనే విషయాన్ని ఆయన వ్రాసిన ఈ శ్లోకమే చెబుతుంది.

శ్లో!! ముక్తా విద్రుమహేమనీల ధవళ ఛాయైర్ముఖై: స్త్రీ క్షణై:
యుక్తా మిందు నిబద్దరత్నమకుటాం తత్వార్ధ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశ కశాంశుభ్రం కపాలం గుణాం
శంఖం చక్ర మధారవిందయుగళం హస్తెర్వహంతీం భజే!!


ఆతల్లి ముత్యాలు, మణిమాణిక్యాలు, ముంగాలు, బంగారం, నీలమణి, ఉజ్వల కాంతితో సమానమైనన ఐదు ముఖాలతో మెరుస్తూంటుంది. ఆవిడ మూడునేత్రాలతో విరాజిల్లుతోంది. ఆవిడ ముఖకాంతి అనుపమానం. ఆవిడ రత్న మయకిరీటంలో చంద్రుడు ప్రకాశిస్తుంటాడు. ఆవిడ 24 కాంతులతో ప్రకాశిస్తుంటుంది. ఆవిడ వరప్రదాయిని. గాయత్రీ చేతులలో అంకుశము, వరముద్ర కుశ, పాశ, శుభ్రం కపాలము, గద, శంఖం, చక్రం, రెండు కమలాలనీ ధరిస్తుంది. ఆవిడని ధ్యానించగల మహా సంపదని శ్రీ విశ్వామిత్ర మహర్షి ప్రజలకి చల్పించాడు.

ఆయన భక్తేకాదు, శ్రీరామచంద్రుడం తటివానికి ‘బల, అతిబలా అనే మహా ఆస్త్రాలని ఉపదేశించగల విలుకాడు. అన్ని శాస్త్రార్థాలనీ విశదీకరించి చెప్పాడు. జగద్గురుదేవులకే గురువయ్యాడు.

శాంత స్వరూపుడైన వశిష్ఠునితో నందినీ ధేనువు కోసంవివాదం పెట్టుకోవటం అయింది. అది కూడా లోకానికి పాఠం చెప్పటంలో భాగమే. ఆ కథవల్ల గోమహిమ లోకవిదితమైంది. తపస్సుకెంత శక్తివుందో మానవకోటికి అర్ధమైంది. దౄఢ నిశ్చయంతో పురుషుడెలా విజయం సాధించాలో విదతమైంది. వ్యక్తి మోహపాశాలు పనికిరావనే హెచ్చరిక కనబడుతోంది. రాక్షస ప్రవౄత్తి విడిచి దైవ సంపద చేకొనాలని నేర్చుకొంటారు ప్రజలు. కామక్రోధాలవల్ల వచ్చే అరిష్టం తెలుస్తోంది.  మోహపాశాల వల్ల వచ్చే అనర్థాలు బోధపడుతున్నాయి. ఎప్పటి వరకు మానవులు అరిషడ్వార్గాలని విడవడో అప్పటి వరకు దు:ఖం తప్పదు. అనే సత్యం తెలుస్తోంది.

దైవి సంపదవల్ల వచ్చే లాభాలు కూడా ఆయనచరిత్ర చెప్పింది. బ్రహ్మదేవుని గురించి దీక్షగా తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై బ్రహ్మర్షి అనే బిరుదు ప్రదానం చేశాడు. అప్పుడు వశిష్ఠమహర్షి ఆయన్ని కౌగలించుకున్నాడు. దేవతలు వారిద్దరి కలయికకి అనందించి పుష్పవర్షం కురిపించారు.

హరిశ్చంద్ర మహారాజుని పరీక్షించినప్పుడు ఆయన క్రూరమైన పాత్ర వహించినట్లు కనబడుతుంది. కాని ఆయన హరిశ్చంద్రుని సత్యవ్రత దీక్ష విశ్వవ్యాప్తం చేయాలని, దానివల్ల హరిశ్చంద్రుని కీర్తి ఆచంద్రార్కం భూలోకలో నిలవాలనే సత్సంకల్పమే. ఆయనకి కక్షేవుంటే లోహితాస్యుణ్ణి మళ్ళీ బతింకిచేవాడు కాదు.

ఐతరేయ బ్రాహ్మణములో విశ్వామిత్రుడు, శునశ్చేపుల వౄత్తాంతం చెప్పబడింది. అక్కడా కూడా విశ్వామిత్రమహర్షి యొక్క ప్రస్తావన వచ్చింది. ఆయన గోత్రీకులు చాలా మేధావంతులు, మహాత్ములు. ప్రపంచ రహస్యాలన్నీ యెరిగిన జ్ణ్జానులు. కౌశికస, వైశ్వామిత్ర గోత్రాలకి అధిపది ఆయనే. విశ్వామిత్రుడు సమర్ధుడు. అతీంద్రయ ద్రష్ట. అధ్వర్యం చేయటంలో నిష్ణాతుడు. సుదాసు మహారాజు యజ్ణ్జానికి అధ్వర్యం వహించిన మహా విద్వాంసుడు. యజ్ణ్జకర్త. ఆ మహామునీశ్వరుని గురించి మనకెంత తెలిసినా అల్పమే అవుతుంది.

అష్టాదశ పురాణాలు – అందలి విషయాలు – శ్లోకసంఖ్య


వ్యాసభగవానుడు రచించిన 18 పురాణాల పేర్లను ఈ క్రింది శ్లోకమందు కూర్చబడినది.
శ్లో!! మద్వయం భద్వయం చైవ
బ్రత్రయం వచతుషటయం
అనాపలింగ కూస్కానీ
పురాణాని ప్రచక్షత!!


మద్వయం: మ కారంతో 2. అవి మత్స్య పురాణం. మార్కండేయ పురాణం.
భద్వయం: భ కారంతో 2. అవి భాగవత పురాణం. భవిష్యత్ పురాణం.
బ్రత్రయం: బ్ర కారంతో 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం.


వచుతష్టయం: వకారంతో 4. అవి వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం.


అ కారంతో అగ్ని పురాణం, నా కారంతో నారద పురాణం, ప కారంతో పద్మ పురాణం, లి కారంతో లింగ పురాణం, గ కారంతో గరుడ పురాణం, కూ కారంతో కూర్మ పురాణం మరియు స్క కారంతో స్కంద పురాణం రచించిరి.


1. మత్స్య పురాణం: దీనొలో 14000 శ్లోకములన్నవి. మత్స్యావతార మెత్తిన విష్ణువుచే మనువుకు బోధింపబడినది. కార్తికేయ, మయాతి, సావిత్రుల చరిత్రలు. ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యములు చెప్పబడినవి.


2. మార్కండేయ పురాణము: ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివవిష్ణువుల మహత్మ్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్మ్యములు మరియు సప్తపతి (లేక దేవి మహత్మ్యము) చెప్పబడినవి. చండీ హోమము, శతచండీ సహస్ర చండీ హోమ విధానమునకు ఆధారమయినది ఈ సప్తశతియే.


3. భాగవత పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేద వ్యాసుని వలన శుకునకు, శుకుని వలన పరీక్షత్ మహారాజునకు 12 స్కందములులో మహా విష్ణు అవతారలు శ్రీ కౄష్ణ జనన, లీలాచరితాలు వివరించబడినవి.


4. భవిష్య పురాణము: దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్Yఓపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం. భవిష్యత్తులో జరుగబోవు విషయాల వివరణ ఇందు తెలుపబడినది.


5. బ్రహ్మపురాణము: దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీ కౄష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ – నరకాలను గూర్చి వవరించబడినవి.


6. బ్రహ్మాండ పురాణము: దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకౄష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు. శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు, శివకౄష్ణ సోత్రాలు, గాంధర్వం, ఖగోళశాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందు వివరించబడినది.


7. బ్రహ్మ వైవర్త పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకౄష్ణుల వైభవములు, సౄష్టికర్త బ్రహ్మ, సౄష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకౄతి) మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచ శక్తుల ప్రభావము గురించి వివరించబడినది.


8. వరాహ పురాణము:  దీనిలో 24,000 శ్లోకములు కలవు. వరాహ అవతార మొత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణూమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. ప్రమేశ్వరీ, ప్రమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు, పుణ్య క్షేత్రవర్ణనలు ఈ పురాణములో కలవు.


9. వామన పురాణము: దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్వ ౠషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము – ౠతు వర్ణనలు వివరించబడినవి.


10. వాయు పురాణము: దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహాత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినది.
11. విష్ణు పురాణము: ఇందు 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి బోధించినది. విష్ణుమహాత్మ్యము, శ్రీ కౄష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి.


12. అగ్ని పురాణము: దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానునిచే వశిష్ణునకు శివ, గణేస, దుర్గా భగవదుపాసన, వ్యాకరణం, చంధస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాము, జ్యొతిషం మొదలగు విషయాలు చెప్పబడినవి.


13. నారద పురాణము: ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతరన్ అను నలుగురు బ్రహ్మామానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము  (శివస్తోత్రము) ఇందు కలదు వేదాంగములు, వ్రతములు, బదరీ ప్రయాగ,  వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు.


14. స్కంద పురాణము:  దీనిలో 81,000 శ్లోకములు కలవు.  ఇది కుమారస్వామి (స్కందుడు) చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహాత్యము, ప్రదోష  స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవా ఖండము (సత్యనారాయణ వ్రతము ఇందులోనివే), వైష్ణవ ఖండము (వేంకటాచల క్షేత్రము), ఉత్కళ ఖండము (జగన్నాధ క్షేత్రము), కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము), బ్రహ్మ ఖండము (రామేశ్వర క్షేత్రము) బ్రహోత్తర ఖండము. (గోకర్ణక్షేత్రము, ప్రదోషపూజ), అవంతికాఖండము (క్షీప్రానదీ, మహాకాల మహాత్మ్యము) మొదలగునవి కలవు.


15. లింగ పురాణము: ఇది శివుని ఉపదేశములు. లింగరూప శివ మహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు. ఖగోళ జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి.


16. గరుడ పురాణము: ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహావిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ – నరక ప్రయాణములు తెలుపబడినవి.


17. కూర్మ పురాణము: ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతార మెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ నారసిమ్హ అవతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళముతో వారణాసి, ప్రయోగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి.


18. పద్మపురాణము: ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పొగొట్టగలిగేది ఈ పద్మపురాణము. అష్టాదశ పురాణాలలో కెల్ల అత్యధిక పొగొట్టగలిగేది ఈ పద్మ పురాణము. 85,000  శ్లోకములలో కెల్ల అత్యధిక శ్లోకాలు కల్గినది విశేషాలను మనుకు తెలియజేస్తుంది. మరియు మదుకైటభవధ, బ్రహ్మసౄష్టికార్యము, గీతార్థసారం – పఠనమహాత్య్మం, గంగామహాత్మ్యం, పద్మగంధి దివ్యగాధ, గాయత్రీ చరితము, రావివౄక్షమహిమ, విభూతి మహాత్మ్యం, పూజావిధులు – విధాణం, భగవంతుని సన్నిథిలో ఏ విధంగా ప్రవర్తించాలో  పద్మపురాణంలో వివరంగా తెలియజేయబడింది.


ఈ విధముగా పురాణములందలి విషయములు క్రమముగా సంక్షిప్త రూపమున వేద వ్యాస పీఠ మందిరము నందు రచింపబడి నైమిశారణ్యమునందు ప్రసిద్ధములైయున్నవి.

విభూతి


వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మ స్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగ్ను. బాహ్య ప్రపంచ జ్ణ్జానము కలుగును. విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిచుచుండిన లలాటమున్ బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారగును. విభూతి (భస్మం) ధరించినప్పుడు “ఓం నమ: శివాయా అను మంత్రమును జపించుచు ధరించవలెను. విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికిగాని ధరించకూడదు. విభూతిధారణ దేవతాపూజ, జపము, యజ్ణ్జము, హోమము, శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధించును. తప్పక ధరించవలెను. విభూతి భస్మం, తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్ధప్రసాదములు స్వీకరించ కూడదు. భస్మము ఐదు విధముల పేర్లతో ఉన్నట్లు తెలియచున్నది.

1. భస్మం
2. విభూతి
3. భసితము
4. క్షారము
5. రక్షయని

పేర్లతో చెప్పబడుచున్నవి. 1. విభూతి కపిలవర్ణము, 2. భసితము కౄష్ణ వర్ణము, 3. భస్మము శ్వేత వర్ణము, 4. క్షారము ఆకాశవర్ణము, 5. రక్ష రక్తవర్ణము కలుగి యుండును. బ్రహ్మాది దేవతలు నారదాది మహర్షులు సనక సనందనాది యోగులు బాణాసురాది దానవులు శివునిపై గల భక్తి భావములతో నిత్యం భస్మ స్నానమోనర్చి పాప విముక్తి పొందిరి. ఓం నమ: శివాయ అను మంత్రముతో భస్మమును అభిమంత్రించి ఒడలిపై ధారణ చేయవలెను. త్రిపుండ్రములను ధరించవలెను. శిరమున, నుదుట్, కర్ణమున, కంఠమునందు, భుజములందు ఈ విధముగా పదునైదు తావులందు త్రిపుండ్రధారణ చేయవలెను. కుడిచేతి నడిమి మూడు వేళ్ళతో ఎడమ నుండి కుడివైపునకు, బొటన వేలుతో కుడినుండి ఎడమవైపునక్ త్రిపుండ్రములను దాల్చ వలెను. శివపూజ సాధకులెల్లరును తప్పక ఈ విధముగా భస్మధారణ చేయవలెను. నిత్యము ఈ విధముగా ధరించడంవలన సమస్త పాపములు నశించును.  గంగా, యమున, సరస్వతి సంగమ స్నానము వలన కలుగు ఫలితములు ఈ భస్మస్నానము వలన కలుగును. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవతలు ఈ భస్మ స్నానము వలననే గొప్పవారైరి. త్రిపుండరేఖలలో త్రిమూర్తులు ఉన్నారు. మొదటి రేఖ బ్రహ్మ, రెండవ రేఖ విష్ణువు, మూడవ రేఖ శివుడు. కావున మూడు రేఖలను లలాటమున ధరించుట శ్రేష్టము. ఎల్లప్పుడూ కుడి చెయ్యి మధ్య మూడు వేళ్ళతో భస్మధారణ చేయవలెను. భస్మ స్నానము కంటే పవిత్ర స్నానము లేదని చెప్పుచూ శివుడు  మొదట భస్మ ధారణచేసి సమస్త దేవతలకు ప్రసాదించెను. అనాటి నుండి బ్రహ్మాది సర్వ దేవతలు భస్మధారణ మహా ప్రసాదముగా స్వీకరించారు. చంద్రశేఖరుడైన శివునకు భస్మము అర్పించిన చాలా సంతసించును. యాగములు, దానములు, తపస్సు మొదలైన వానికంటే శివునకు భస్మధారన అధిక సంతౄప్తినిచ్చును. ఒకసారి మహేశ్వరుని భస్మంతో తౄప్తిపరిచిన సర్వాభీష్టములు నెరవేరును.

బ్రాహ్మీ ముహుర్త ప్రాశస్త్యం


బ్రాహ్మీ ముహూర్తకాలం అంటే, తెల్లవారు జామున మూడుగంటలు దాటినప్పటి నుండి నాలుగున్నర మధ్యకాలాన్ని బ్రాహ్మిముహూర్త కాలం అంటారు. బ్రాహ్మీ ముహూర్తకాలంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో భగవంతుని సుప్రభాత సేవతో పాటు ప్రత్యేక పూజలు జరుపబడతాయి. వాటిని చూడటానికి ఆ సమయానికి ఎందరో భక్తులు అక్కడకు చేరుకుంటారు.


బ్రాహ్మీ అంటే సరస్వతీదేవికి మరో పేరు. బ్రహ్మబుద్ధినీ, జ్ణ్జానాన్ని కలుగజేసే దేవత. బుద్ధిని పెంపొందింపజేసే సమయం కనుక ఆకాలాన్ని బ్రాహ్మీముహూర్తకాలం అంటారు. ఆ సమయంలో ఏ పనిచేసినా, ఆలోచన చేసినా, చదువుకున్నా బుద్ధి వికసించి సరియైన ఫలితం వస్తుంది. బ్రాహ్మీ ముహూర్తకాలంలో పూజలు, జపాలు, గాయత్రీ మంత్రోచ్ఛారణ చేయడం వలన వారికి తేజస్సు కలిగి, అద్భుతమైన శక్తి కూడా కలుగుతుందని వేదాలు, పురాణ గ్రంథాలలో తెలియ చేయబడింది.


ఆధ్యాత్మిక పరంగానే కాక, వైజ్ణ్జానిక పరంగాకూడా బ్రాహ్మీ ముహూర్తకాలం మానసిక, శారీరక ఆరోగ్యాలకు మంచిది. రాత్రంతా నిద్రపోయి విశ్రాంతి తీసుకున్నవారు బ్రాహ్మీముహూర్త కాలంలో నిద్రలేవడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. బుద్ధి వికసించి, ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఆ సమయంలో వీచే చల్లని గాలి మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. రక్తప్రసరణ శరీరమంతా చక్కగా జరుగుతుంది. చదువుకునే పిల్లలు తెల్లవారు జామునే, సూర్యోదయానికి ముందే నిద్రలేచి చదువుకుంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఏకాగ్రతతో చదువగలుగుతారు. అంతే కాకుండా ఆ చదువు వారి మెదడులో నిక్షిప్తమైపోతుమి. బ్రాహ్మి ముహూర్తకాలంలో నిద్రలేచేవారు ఎంతో హుషారుగా, చురుకుగా ఉంటారు. బ్రాహ్మీ ముహూర్తకాలానికి ఆధ్యాత్మికంగాను, శాస్తీయపరంగాను కూడా ఎంతో విశేషం, ప్రాధాన్యత, ప్రాశస్త్యం ఉన్నాయి.

అరుంధతీ (నక్షత్రం) ఎందుకు వందనీయమైంది?


ఈ ప్రశ్న నేటిదికాదు, నాటిదేనని చెబుతున్నది ‘సూత సమ్హితా శౌనకాది మహర్షి గణాలకు ఒకసారి ఇదే సందేహం కలిగింది. దీనిని వారు త్రికాలవేత్త సమస్త పురాణ వ్యాఖ్యానదక్షుడు అయినటువంటి సూతుని ముందుంచగా, ఆయన ‘అరుంధతీ దేవి ప్రాముఖ్యతను ఇలా వివరించాడు.

“అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీసతీ
తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం!!’

అనగా అరుంధతీ, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది. ఈ అయిదుగురు స్త్రీ మూర్తులు సదా వందనీయులని తెలుస్తున్నది. అరుంధతిదేవి పతివ్రతలో అగ్రగామి. ఈమె చరిత్రను స్మరించినంతనే పుణ్యం కలుగుతుందని ‘నైమిసమ్హితా పేర్కొంటోంది. అసక్తికరమైన అరుంధతి జన్మవౄత్తాంతాన్ని ఇపుడు మీకు చెప్పబోతున్నాను అన్నాడు సూత మహాముని.

ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత తేజోవితయైన ఒక కన్యను, వర్ణింపనలవికాని ఓక సుందరుని సౄష్టించాడు. ఆ కన్య పేరు ‘సంధ్యా. యువకుని పేరు మన్మథుడు. సౄష్టికార్యంలో తనకు సాయపదమని చెబూతూ బ్రహ్మ ఆ యువకునికి -

అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా
నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చసాయకా!! అంటూ

అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు సమ్మోహన బాణాలను అందించాడు. బాణశక్తిని పరీక్షింపదలచిన మన్మథుడు వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టగా, బ్రహ్మతో సహా అందరూ అక్కడే ఉన్న ‘సంధ్యా ను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుని ప్రార్థించగా, స్వామి అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబరిచాడు. రెప్పపాటుకాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సౄష్టికర్త కోపించి మన్మథుని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపం ఇచ్చాడు.

తనవల్లనే కదా ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధభావంతో ‘సంధ్యా చంద్రభాగా నదీతీరంలో తపస్సు పేరిట తనువు చాలించదలచి పయనమై పోయింది. అపుడు  బ్రహ్మ వశిష్టమహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించమని కోరగా, వశిష్టుడు ఆమెకు ‘శివా మంత్రానుష్టానమును వివరించి తన ఆశ్రమానికి వెడలిపోయాడు. సంధ్య తదేకనిష్టలో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మని కోరగా, ఆమె “ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాదనే’ వరాన్ని అనుగ్రహించమంది. శివుడు ఆమె లోకోపకార దౄష్టికి సంతోషించి మరో వరాన్ని కోరుకోమన్నాడు. అపుడు సంధ్య ‘నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదౄష్టిలో చూచినట్లయితే, వారు నపుంసకులుగా మారాలి, అంతేకాదు నేను పుట్టగానే అనేకమంకి కామవికారాని కల్గించాను. కాబట్టి ఈ దేహం నశించిపోవాలీ అని కోరింది. శివుడు ‘తథాస్తూ అని మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదౄశ్యురాలివై శరీరాన్ని దగ్దం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావు. నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో! అతడే నీ భర్త అవుతాడని చెప్పి అంతర్థానమయ్యాడు.
శివాజ్ణ్జగా సంధ్యా శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుండి తిరిగి జన్మించింది. సంస్కౄత భాషలో ‘అరుం’ అంటె అగ్ని, తేజము, బంగారువన్నె అనే అర్థాలున్నాయి. ‘ధతీ అంటె ధరించినది అనే అర్థం వున్నది. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె ‘అరుంధతీ అనబడింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి – వశిష్టునకు ఇచ్చి వివాహం జరిపించాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వలన త్రిలోకపూజ్యురాలైంది. ఈ దంపతులకు పుట్టినవాడే ‘శక్తీ. శక్తికి పరాశరుడు, పరాశరునకు వ్యాసుడు జన్మించారు. అరుంధతిని మనవారు ‘ఆరని జ్యోతీ అని ‘అరంజ్యోతీ అని పిలుస్తూంటారు. విష్ణుసహస్రనామాల్లో సైతం అరుంధతి సంతతి గురించి, మనమలు, మునిమనమలు గురించి ప్రస్తావించబడివుంది.

అరుంధతీ నూతన దంపతులకు ఇచ్చే దీవెనలు ఏమిటి? అంటే, కొత్త పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తర్థి మండలంలో వున్న వశిష్టుని తారకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపిస్తారు. దీనివెనుక ఒక ప్రధాన కారణమున్నది. వశిష్ట, అరుంధతీ ద్వయం ఆదర్శ దంపతులకు ఒక ప్రతీక. కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు ఆ దంపతులిద్దర్ని తారారూపంలో వీక్షింపచేస్తూ రావడం ఒక సాంప్రదాయమైంది

ఇంద్రుడంటే….?


కళంకితా? కన్యా? ఏది నిజం అన్న సందేహం సహజంగానే కలుగుతుంది. ఇటువంటి సందర్భాలలోనే ఇలాంటి కథలను దౄష్టికోణాన్ని మార్చుకుని చూడాలి. ఎందికంటే పురాణకర్తలు సూటిగా కథ చెప్పరు. పైకి విడ్డూరంగా కనిపించే కథల్లో అంతర్లీనంగా ఆధ్యాత్మిక విషయాలు చొప్పిస్తూ ఉంటారు. ఉదాహరణకు అహల్య, ఇంద్రుల వౄత్తాంతమే  చూద్దాం. ఇంద్రుడంటే ఇంద్రియాలని అర్థం చెబుతారు. ఇంద్రియాలకు లొంగితే ఎటువంటి పతనం సంభవిస్తుందో అహల్యకు, ఇంద్రునికి గౌతముడిచ్చిన శాపాలు సూచిస్తాయి. ఆ పతనం నుంచి బయటపడడానికి భగవచ్చింతనే మార్గం. శ్రీరామపద స్పర్శతో నీకు శాపవిమోచనం కలుగుతుందని గౌతముడు అహల్యకు చెప్పడంలో అర్థమిదే. అలాగే వికౄత చింతనతో అపరాధభావంతో చేయకూడని పనిచేసినప్పుడు దాని ఫలితం కూడా వికౄతంగానే ఉంటుందని రెండో కథ చెబుతుంది.


అహల్యాగౌతములకు అంజన అనే కూతురు కాక మరో పుత్రిక, శతానందుడు, శరద్వంతుడు అనే కుమారులు కూడా ఉన్నారు. శతానందుడు మిథిలను పాలించే జనకమహారాజు వద్ద పురోహితుడు. శరద్వంతుడు ధనుర్విద్యలో నిష్ణాతుదు. మహాభారతంలోని ద్రోణాచార్యుని భార్య కౄపి, కౄపాచార్యుడు ఇతని సంతానమే.


మహాభారతంలోని మరో ప్రసిద్థముని ఉందకుడు గౌతముని శిష్Yఉడు. గౌతముడు ఇతనికి యవ్వనాన్ని ప్రసాదించి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. అందుకు సంతోషించిన ఉదంకుడు ఏదైనా కోరితే తెచ్చి ఇస్తానని గురుపత్ని అయిన అహల్యతో అంటాడు. మిత్రసహుడనే రాజు భార్య మదయంతి ధరించే కుండలాలను తెచ్చి ఇమ్మని అహల్య అడుగుతుంది. ఉందంకుడు వాటిని తీసుకువస్తుండగా మార్గ మధ్యంలో ఒక సర్పం వాటిని అపహరింస్తుంది. ఉదంకుడు వాటిని తిరిగి సంపాదించి గురుపత్నికి ఇస్తాడు. సర్పం తనకు చేసిన అపకారానికి కోపించిన ఉదంకుడు తర్వాత సర్పయాగం చేసి సర్పాలన్నింటినీ వధించమని పరీక్షుత్తు కుమారుడైన జనమేజయుని ప్రోత్సహిస్తాడు.


గౌతముని గురువు అగ్నిదేవుడు. గౌతముడు అంగిరస పరంపరకు చెందినవాడు. అగ్నిని పూనించిన వారిలో అంగిరసులు ప్రముఖులు, గౌతమ గోత్రీకులకు అంగిరసుడు, ఆయాస్యుడు, గౌతముడు ౠషులు.


తన మేథాశక్తిని తపశ్శక్తిని మేళవించి అనేక అద్భుతాలు చేసి ప్రజలను ఆదుకున్న నిస్వార్థ సేవా తత్పరుడు గౌతముడు. ఆయనకు అర్థాంగిగా అన్నింటా చేదోడుగా ఉన్న నారీరత్నం అహల్య.
ఆ దంపతుల స్మరణ ఎంతో పుణ్యప్రదం.

గోదావరి పుట్టుక


ఈ దివ్యసూచ చేసినందుకు ఆ బ్రాహ్మణునికి మొక్కి కౄతజ్ణ్జతలు చెప్పుకొని గౌతముడు సతీసమేతంగా హేమవనానికి వెళ్ళాడు. అక్కడ ఒంటికాలు మీద నిలిచి శివుని గురించి తీవ్ర తప్పస్సు చేశాడు. శివుడు మెచ్చి తన జడపాయనొకదానిని పెరికి గౌతమునికిచ్చి పిండమన్నాడు. పిండగా నీరు నేలమీద పడి నదిగా ప్రవహించింది. ఆ నదే గోదావరి. గౌతముని తపోఫలంగా అవతరించింది కనుక ‘గౌతమీ అయింది. గోవును బతికించింది కనుక గోదావరి అయింది.


ఈ కథకే పాఠాంతరం ఉంది. గౌతముని అతిథ్యం పొందిన బ్రాహ్మణులే అతని కీర్తినీ, అన్న సంపదనూ చూసి ఓర్వలేక మాయ గోవును సౄష్టించి అతని పొలంలోకి విడిచిపెట్టారని, గౌతముడు అదలించబోగా అది మరణించడంతో గోహత్యా కళంకాన్ని అతనికి అపాదించారని దీని సారాంశం. అయితే రెండు కథల్లోనూ ఉమ్మడిగా ఉన్న అంశం కరవుకాటకాలతో ప్రజలను గౌతముడు అదుకోవడం, గంగను నేలమీదికి రప్పించడం. దీనినిబట్టి గౌతముడు నదీజలాలను పంట భూములకు మళ్ళించి కరవుకాటకాలను నివారించడంలో ప్రముఖపాత్ర వహించిన మేధావి అనీ, నేటి భాషలో చెప్పుకోవాలంటే గొప్ప ‘ఇరిగేషన్ ఇంజనీర్ ‘ అని అర్థమవుతుంది. ఇలా తన మేధాశక్తిని లోకకల్Yఆణానికి వినియోగించాడు. కనుకనే గౌతముడు మహర్షిగా చరితార్థుడయ్యాడు.

అక్షర తౄతీయ


‘వైశాఖ మానస్య చయా తౄతీయ


న నమ్యసా కార్తీక శుక్ల పక్షే


నభస్య మాసస్య తమిప్ర పక్షే


త్రయోదశీ పంచదశీ చ మాఘే’


అంటే వైశాఖ శుద్ధ తౄతీయ రోజు కౄతయుగము, కార్తీక శుక్ల నవమి నాడు త్రేతాయుగము, భాద్రపద బహుళ త్రయోదశినాడు ద్వాపర యుగము, మాఘ బహుళ అమావాస్యనాడు కలియుగం ప్రారంభమైందని విష్ణుపురాణంలో పేర్కొనబడింది. దీని ప్రకారం వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ ‘కౄత యుగాదీ అంటే కౄతయుగం ప్రారంభమైన రోజు. దీనినే మనం ‘అక్షయ తౄతీయా పర్వదినంగా జరుపుకుంటూ ఉన్నాము.


‘అక్షయం’ అంటే క్షయం లేకుండుట. ఏదీ పూర్తిగా అయిపోకుండా వుండడమని చెప్పవచ్చు. జీవితంలో అన్నింటినీ అక్షయం చేసే రోజు కనుక దీనికి ‘అక్షయ తౄతీయా అనే పేరు ఏర్పడింది. పూర్వం ఈ పర్వదిన ప్రాశస్త్యమును గురించి స్వయంగా శ్రీకౄష్ణపరమాత్మ పాండవాగ్రజుడు అయిన ధర్మరాజుకు వివరించునట్లు భవిష్యోత్తరణ పురాణంలో పేర్కొనబడగా ఈ పండుగను గురించి విధి విధానాలను గురించి భవిష్య శివ, విష్ణుపురాణాల్లో వివరించబడింది. ఈ పండుగానాడే మన రాష్ట్రంలోని ప్రసిధ్ధ నారసిమ్హక్షేత్రమైన సిమ్హాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసిమ్హస్వామివారికి చందనోత్సవం జరుగుతుంది. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారు చందనం లేకుండా నిజ రూపంలో దర్శనమిస్తారు. ఈ దినం సాయంత్రం నుంచి చందనమద్దే చందనోత్సవం ప్రారంభమవుతుంది. బదరీనాధ క్షేత్రంలోని శ్రీ బదరీ నారాయణస్వామి వారి ఆలయాన్ని ఈ దినం తెరుస్తారు. ఈ దినం శ్రీ బదరీ నారాయనస్వామివారి అలయాన్ని దర్శిస్తే మూడు యోజనములు వెడల్పు, పనెండ్రు యోజనముల పోడవు కలిగిన పాపాలు కూడా పూర్తిగా నశిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి అక్షయ తౄతీయరోజు ఎటువంటి పుణ్యదినమంటే వారం వర్జ్యం చూసుకోకుండా ఏ శుభకార్యాన్ని అయినా ఈ దినం జరుపుకొనవచ్చని శాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి.


అక్షయ తౄతీయనాడు ఏం చేయాలి?


అక్షయ తౄతీయ రోజు తెల్లవారుఝామునే నిద్ర లేచి కాలకౄత్యాలు తీర్చుకుని శిరస్నానం చేయవలెను. ఈ దినం గంగానదిలో స్నానమాచరించాలని శాస్త్ర వచనం. వీలులేనివారు గంగానదిని స్మరిస్తూ పుణ్యనదులు, కాలువలు, చెరువులు, బావులవద్దగానీ, అందుకు కూడా వీలు కాకుంటే ఇంట్లోనే నీటిని ‘గంగ….గంగ…గంగా అంటూ మూడుసార్లు కలియబెట్టి స్నానమాచరించవలెను. తరువాత పితౄదేవతలను స్మరించిం తర్పణాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం దేవతాపూజ చేయవలెను. శ్రీ లక్ష్మీ సమేత నారాయణుడు, గౌరీ సమేత త్రిలోచనుడులతోపాటు ఇష్ట దేవతలను పూజించవలెను. ముఖ్యంగా శ్రీకౄష్ణ పరమాత్మ ప్రతిమను ఒకదానిని ప్రతిష్టించి పూజించడంతోపాటు స్వామివారిని చందనంతో కప్పివేయవలెను.


‘య:కరోతి తౄతీయాయాం కౄష్టం చందన భూషితం


వైశాఖస్య సితే పక్షే సయాత్యచ్యుత మందిరం’ అని శాస్త్రవచనం. అంటే అక్షయ తౄతీయనాడు శ్రీకౄష్ణ పరమాత్మకు చందన లేపనం ఇచ్చిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుందని అర్థం.


ఈ విధంగా పూజ ముగించిన అనంతరం దానాలు చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అనేక దానాలు ఉన్నా ఉదకుంభదానం ఈనాటి దానాల్లో ప్రధానమైంది. దీనిని దేవతల ప్రీత్యర్థం, పితౄదేవతల ప్రీత్యర్థం చేయాలని శాస్త్రం. దేవతల ప్రీత్యర్థమైతే -


‘శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ముదకుంభ దానోక్త


ఫలవ్యాప్యార్థం బ్రాహ్మణా యోదకుంభ దానం కరిష్యే


తదంగ కలశ పూజాం కరిష్యే’ అనీ -


పితౄదేవతల ప్రీత్యర్థమైతే -


‘పితౄణామక్షయ్య తౄప్త్యర్ధ ముదకుంభ దానం కరిష్యే’ అనీ సంకల్పించి గంధము, పసుపు, కుంకుమలతో నీటితో నింపిన కుండను లేదా కళశమును అలంకరించి దానిని, బ్రాహ్మణుడిని పూజించి -


‘ఏషధర్మఘటోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక:


అస్యప్రదానాత్సకలామమసంతు మనోరథా’ అనే శ్లోకాన్ని కుండ లేదా కళశమిపై వ్రాసి దానిని -


‘ఏష ధర్మఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక:


అస్యప్రదానాత్తౄప్యంతు పితర్స్స పితామాహా:


గంధోదకతిలైర్యుక్తం స్నానం కుంభఫలాన్వితం


పితౄభ్యస్సంప్రదాస్యామి అక్షయ్యముపతిష్టతూ


అనే శ్లోకాన్ని పఠిస్తూ బ్రాహ్మణుడికి దానం ఇవ్వవలెను. దీనితోపాటు విసనకర్ర, లడ్డూలను దానం చేయవలెను. ఈ రెండూ దానం చేసినవారికి వైకుంఠం, శివలోకం ప్రాప్తిస్తుందని శాస్త్ర వచనం. ఇంకా నవధ్యాన్యాలు, గోధుమలు, దధ్Yఓజనము, గొడుగు, పాదరక్షలు, వస్త్రాలు, ఆవు, భూమి, బంగారం వంటి వాటిని కూడా శక్తిమేరకు దానమివ్వవలెను.


ఈవిధమైన దానాలవల్ల అనంతమైన పుణ్యఫలాలతోపాటూ జీవితంలో అన్ని అక్షయమవుతాయి. అక్షయ తౄతీయరోజు ఒక పూట భోజనం, మరోపూట ఉపవాసం  పాటించవలెను. చక్కెర  కలిపిన పేలపిండిని, ఉప్పులేని అహారమును స్వీకరించడం శ్రేష్ఠం, కాగా అక్షయ తౄతీయరోజు బంగారం కొనాలనే ఆచారం ఈ మధ్యకాలంలో అమల్లోకి రాగా బంగారం వ్యాపారుల ప్రకటనల ద్వారా మరింతగా ప్రాచుర్యంలోని తెచ్చారు కానీ శాస్త్ర ఆధారమేమిలేదు.


ఈవిధంగా అక్షయ తౄతీయను జరుపుకొనడంవల్ల అన్నీ అక్షయమవుతాయని చెప్పే గాథా ఒకటి పురాణాల్లో వుంది. పూర్వం నిర్థనుడు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. నిర్థనుడు పేదవాడు. దైవభక్తిపరుడు. ఉత్తమ గుణ సంపన్నుడు.


చిన్న వ్యాపారం చేస్తూ వచ్చినదానితో నిరాడంబరంగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. అట్టి నిర్థనుడు అక్షయతౄతీయను గురించి తెలుసుకుని అక్షయ తౄతీయకోసం ఎదురుచూసి అక్షయ తౄతీయనాడు విధులను యధాతంగా నిర్వహించి శక్తిమేరకు దానాలను చేసాడు. ఫలితంగా మరుజన్మలో నిర్థనుడు కుశాప్తి నగరంలో రాజకుటుంబంలో జన్మించాడు. యువరాజుగా సకల సంపదలను అనుభవించాడు. తండ్రి మరణానంతరం రాజ్యపాలకుడు అయి ప్రజలందరూ అక్షయ తౄతీయను జరుపుకునేటట్లు చేసాడు. ఫలితంగా రాజ్యం సుభిక్షంగా వర్థిల్లినట్లు పురాణకథనం.


పరశురామ జయంతి


శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాల్లో ఆరో అవతారం పరశురాముడు. పరశురాముడు జన్మించినది అక్షయ తౄతీయ రోజే. కాబట్టి ఈనాటి సాయంత్రం పరశురాముడిని పూజించి -


‘జామదగ్న్య మహావీర క్షత్రియాంత కర ప్రభో


గౄహాణార్ఘ్యం మాయాదత్తం కౄపయా పరమేశ్వరా’ అనే శ్లోకాన్ని పఠించి అర్ఘ్యం ఇవ్వవలెను.

108 ఉపనిషత్తులు


1. ఈశావాస్యోపనిషత్ 
2. కేసోపనిషత్ 
3. కఠోపనిషత్ 
4. ప్రశ్నోపనిషత్
5. ముండకోపనిషత్ 
6. మాండూక్యోపనిషత్  
7. తైత్తిరీయోపనిషత్
8. ఐతరేయోపనిషత్ 
9. ఛాందోగ్యోపనిషత్ 
10. బౄహదారణ్య కోపనిషత్
11. బ్రహ్మోపనిషత్ 
12. కైవల్యోపనిషత్ 
13. జాబాలోపనిషత్
14. శ్వేతాశ్వతరోపనిషత్ 
15. హంసోపనిషత్ 
16. అరుణికోపనిషత్
17. గర్భోపనిషత్ 
18. నారాయణోపనిషత్ 
19. పరమహంసోపనిషత్
20. అమౄతబిందూపనిషత్ 
21. అమౄతబిందూపనిషత్ 
22. అథర్వనాదోపనిషత్
23. అథర్వఖోపనిషత్ 
24. మైత్రాయణ్యుపనిషత్ 
25. కౌషితకీబ్రాహ్మణోపనిషత్
26. బౄహజ్జాబాలోపనిషత్ 
27. నౄసిమ్హతాపిన్యుపనిషత్ (పూర్వతాపిని, ఉత్తరతాపిని)
28. కాలాగ్నిరుద్రోపనిషత్ 
29. మైత్రేయోపనిషత్ 
30. సుబాలోపనిషత్
31. క్షురికోపనిషత్ 
32. మంత్రికోపనిషత్ 
33. సర్వసారోపనిషత్
34. నిరాలంబోపనిషత్ 
35. శుకరహస్యోపనిషత్ 
36. వజ్రసూచ్యుపనిషత్
37. తేజోబిందూపనిషత్ 
38. నాదబిందూపనిషత్ 
39. ధ్యానబిందూపనిషత్
40. బ్రహ్మవిద్యోపనిషత్ 
41. యోగతత్వోపనిషత్ 
42. ఆత్మబోధోపనిషత్
43. నారదపరివ్రాజకోపనిషత్ 
44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్ 
45. సీతోపనిషత్
46. యోగచూడామణ్యు పనిషత్ 
47. నిర్వాణోపనిషత్ 
48. మండల బ్రాహ్మణోపనిషత్
49. దక్షిణామూర్త్యుపనిషత్ 
50. శరభోపనిషత్ 
51. స్కందోపనిషత్
52. మహానారాయణోపనిషత్ 
53. అద్వయతారకోపనిషత్ 
54. రామరహస్యోపనిషత్
55. రామతాపిన్యుపనిషత్ (పూర్వతాపిన్యుపనిషత్ ,  ఉత్తరతాపిన్యుపనిషత్)
56. వాసుదేవోపనిషత్ 
57. ముద్గలోపనిషత్ 
58. శాండిల్యోపనిషత్
59. పైంగలోపనిషత్ 
60. భిక్షుకోపనిషత్ 
61. మహోపనిషత్
62. శారీరకోపనిషత్ 
63. యోగశిఖోపనిషత్ 
64. తురీయాతీతోపనిషత్
65. సన్న్యాసోపనిషత్ 
66. పరమహంసపరివ్రాజకోపనిషత్ 
67. అక్షమాలికోపనిషత్
68. అవ్యక్తోపనిషత్ 
69. ఏకాక్షరోపనిషత్ 
70. అన్నపూర్ణోపనిషత్
71. సూర్యోపనిషత్ 
72. అక్ష్యుపనిషత్
73. అధ్యాత్మోపనిషత్ 
74. కుండికోపనిషత్
75. సావిత్ర్యుపనిషత్ 
76. ఆత్మోపనిషత్ 
77. పాశుపతబ్రహ్మోపనిషత్
78. పరబ్రహ్మోపనిషత్ 
79. అవధూతో పనిషత్ 
80. త్రిపురతాపిన్యుపనిషత్
81. శ్రీదేవ్యుపనిషత్ 
82. త్రిపురోఒపనిషత్ 
83. కఠరుద్రోపనిషత్ 
84. భావనోపనిషత్
85. రుద్రహౄదయోపనిషత్ 
86. యోగకుండల్యుపనిషత్ 
87. భస్మజాబాలోపనిషత్
88. రుద్రాక్షజాబాలోపనిషత్ 
89. గణపత్యుపనిషత్ 
90. దర్శనోపనిషత్
91. తారసారోపనిషత్ 
92. మహావాక్యోపనిషత్ 
93. పంచబ్రహ్మోపనిషత్
94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్ 
95. గోపాలతాపిన్యుపనిషత్ 
96. కౄష్ణోపనిషత్
97. యాజ్ణ్జవల్క్యోపనిషత్ 
98. వరాహోపనిషత్ 
99.  శాట్యాయనీయొపనిషత్
100. హయగ్రీవోపనిషత్ 
]101. దత్తత్రేయోపనిషత్ 
102. గారుడోపనిషత్
103. కలిసంతారణోపనిషత్ 
104. బాల్యుపనిషత్ 
105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్
106. సరస్వతీ రహస్యోపనిషత్ 
107. బహ్వౄచోపనిషత్ 
108. ముక్తికోపనిషత్

Monday, July 16, 2012

తూర్పుదిశగా వంటగదిలో ఓ కిటికి ఎందుకు ఉండాలి?


ప్రాచీన భారతీయుల వంటగదులు నిర్ధేశ స్థలంలోనే ఏర్పాటు చేయబడేవి. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి వంటగదిలో తూర్పుదిశగా ఓ కిటికి ఏర్పాటు చేయబడి వుండేది. నేటి కాలంలో కూడా కిటికీని వంటగదిలో తూర్పు దిశగా ఏర్పాటు చేయాలని కొత్తగా ఇండ్లు కట్టుకునేవారు చెబుతుంటారు.


ఇలా కిటికిని ఏర్పాటు చేయడానికి గల ఒక కారణం ఏమిటంటే, వంట చేసేటప్పుడు వచ్చే పొగ కిటికీ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఉదయం వేళఖీ ఎక్కువగా వంటగదిలో కుటుంబ సభ్యులు ఉండే అవకాశం ఎక్కువ. తూర్పుదిశగా కిటికీ ఉండడంవల్ల విటమిన్లు పుష్కలంగా కూడుకున్న సూర్యకిరణాలు వంటగదిలోకి ప్రవేశిస్తాయి. ఆ ప్రయోజనం కోసమై అలా చెప్పబడింది.


అలాగే కిటికీ గుండా ప్రవేశించిన గాలి పొగను, మరియు ఇంటిలోని కలుషిత గాలిని బయటకు నెట్టివేస్తుంది.

తలుపు గడపై ఎందుకు కూర్చోరాదు?


పిల్లలను పెద్దలు గడపపై కూర్చోనివ్వక పోతుండెను. కాస్త పెద్దలు సాహసం చేసి కూర్చున్నా కేకలేసి వారిని క్రిందికి దింపించేవారు.


ఇది ఓ మూడనమ్మకంగా గత కొద్దికాలం వరకు భావింపబడేది. ‘డ్రౌసింగ్ రాడ్ ‘ ను కనుగొన్న తరువాత గడపపై కూర్చోరాదనడంలో శాస్త్రీయ అంశం ఉందని తెలియవచ్చింది.


‘డ్రౌసింగ్ రాడ్ ‘ అనే పరికరాన్ని తలుపు ఫ్రేంవద్ద ఉంచిన, అక్కడ ప్రతికూలశక్తి నలుదిశలా వెదజల్లబడడం మనం గమనించవచ్చు. కాబట్టే జ్ణ్జానవంతులైన మన పూర్వులకు ఈ విషయం ముందుగానే తెలుసుకాబట్టి, ఇలాంటి నిషేదం పెట్టారు. కాబట్టే తలుపు ఫ్రేం వద్ద ఎలాంటి పనులకు తావు ఇవ్వలేదు. అలా నిషేదించడానికి, తలుపు ఫ్రేం వద్ద ప్రతికూల శక్తి ప్రసారం ఉండడమే ఈ నిషేదం వెనుక రహస్యం.


ఇలా తలుపు ఫ్రేం నుండి ప్రతికూల శక్తి తరంగాల ప్రసారం ఉండటానికి గల కారణం ఫ్రేం చతురస్రాకారంలో ఉండడమే. ఈ విషయాన్ని గ్రహించే కాబోలు చైనీయులు కిటికీలను, తలుపులను పైభాగంలో వంపుగా ఆర్చ్ మాదిరి నిర్మిస్తారు.


మన దేవాలయాలు మరియు చర్చీలు కూడా ద్వారల వద్ద పైభాగం వంపుగా ఆర్చీల మాదిరి నిర్మించబడి ఉన్నవి.

ఉపవాసాలు ఎందుకు పాటించాలి?


భారతీయ సంప్రదాయంలో ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగింది. మన అన్ని పురాణాలు మరియు ఇతిహాసాలు అత్మజ్ఞానం కలగడానికి ఉపవాసాన్ని ఓ సాధనంగా సూచించాయి. పద్మపురాణం, విష్ణుపురాణం, భాగవతం మొదలైనవి ఏకాదశి వ్రతంలో (ఉపవాసాన్ని ఒకానొక రోజు చేయాలని) పాతించే ఉపవాసం ఎంతో శుభప్రదమని చెప్పినాయి.


తిండి మానేసి కూర్చోవడమే ఉపవాసం అనుకోవడం పోరపాటు. ఉపవాసంతో కూడిన భగవధ్యానం సంపూర్ణ ఉపవాసంగా భావించవచ్చు. మనసు దుష్ట తలంపుల నుండి మరియు ప్రాపంచిక ఆందోళనల నుండి విడివడి వండటం అవసరం. ఉపవాసం దీక్షలో మానసిక శద్దత్వం ఓ నియమంగా చెప్పబడింది. అలా మానసిక పారిశుద్దత భక్తితో కూడిన ధ్యానం లేకుంటే ఉపవాసం అంటే తిండెలేక అలమటించడమే అవుతుంది.


ఏకాదశి రోజులలో నెలకు రెండు రోజులు పూర్తి ఉపవాసాన్ని పాటించాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే షష్టి రోజులలో నెలకు రెండుసార్లు రోజులో కొంతభాగం ఉపవాసం పాటించాల్సిందిగా తెలుపబడింది. ఈ రోజులలో ఉపవాసాన్ని పాటించడంవల్ల భగవంతుడి కృపను నిస్సందేహంగా పొందవచ్చు.


ఆధునిక సైన్స్ ప్రకారం ఉపవాసం శరీరానికి మరియు మనస్సుకు ఎంతో ప్రయోజనకారి. ప్రార్ధనలు, ధ్యానం మరియు శుభకరమైన మంచి ఆలోచన మనస్సును చైతన్యవంతం చేసి ఏకాగ్రత మరియు ఆత్మస్థైర్యమెనే శక్తిని పెంచుతాయి. శరీరాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లయితే ఉపవాసం రక్తాన్ని మరియు జీర్ణవ్యవస్థని శుద్దచేస్తుంది. ఎప్పుడు కడుపు నిండా తిండి ఉంటే ప్రేగులు ఎప్పుడూ నిండుగా ఉంటాయి. జీర్ణవ్యవస్థకు కాస్త విరామం కలిగించడం కోసం ఉపవాసాలు ఎంతో సహకరిస్తాయి. అలా శరీరానికి శుద్ధికూడా ఉపవాసం కలిగిస్తుంది. అలా శరీరంలో అవసరానికి మించి వున్న కొవ్వు మరియు ఇతరాలు ఉపవాసాలవల్ల తొలగిపోతాయి.
ఇలా అనేక విధాలుగా ఉపవాసం దీక్షలు శరీరానికి మరియు మనస్సుకు ఎంతో క్షేమం కలిగిస్తాయి.


భారతీయ సంప్రదాయంలో ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగింది. మన అన్ని పురాణాలు మరియు ఇతిహాసాలు అత్మజ్ఞానం కలగడానికి ఉపవాసాన్ని ఓ సాధనంగా సూచించాయి. పద్మపురాణం, విష్ణుపురాణం, భాగవతం మొదలైనవి ఏకాదశి వ్రతంలో (ఉపవాసాన్ని ఒకానొక రోజు చేయాలని) పాతించే ఉపవాసం ఎంతో శుభప్రదమని చెప్పినాయి.


తిండి మానేసి కూర్చోవడమే ఉపవాసం అనుకోవడం పోరపాటు. ఉపవాసంతో కూడిన భగవధ్యానం సంపూర్ణ ఉపవాసంగా భావించవచ్చు. మనసు దుష్ట తలంపుల నుండి మరియు ప్రాపంచిక ఆందోళనల నుండి విడివడి వండటం అవసరం. ఉపవాసం దీక్షలో మానసిక శద్దత్వం ఓ నియమంగా చెప్పబడింది. అలా మానసిక పారిశుద్దత భక్తితో కూడిన ధ్యానం లేకుంటే ఉపవాసం అంటే తిండెలేక అలమటించడమే అవుతుంది.
ఏకాదశి రోజులలో నెలకు రెండు రోజులు పూర్తి ఉపవాసాన్ని పాటించాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే షష్టి రోజులలో నెలకు రెండుసార్లు రోజులో కొంతభాగం ఉపవాసం పాటించాల్సిందిగా తెలుపబడింది. ఈ రోజులలో ఉపవాసాన్ని పాటించడంవల్ల భగవంతుడి కృపను నిస్సందేహంగా పొందవచ్చు.
ఆధునిక సైన్స్ ప్రకారం ఉపవాసం శరీరానికి మరియు మనస్సుకు ఎంతో ప్రయోజనకారి. ప్రార్ధనలు, ధ్యానం మరియు శుభకరమైన మంచి ఆలోచన మనస్సును చైతన్యవంతం చేసి ఏకాగ్రత మరియు ఆత్మస్థైర్యమెనే శక్తిని పెంచుతాయి. శరీరాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లయితే ఉపవాసం రక్తాన్ని మరియు జీర్ణవ్యవస్థని శుద్దచేస్తుంది. ఎప్పుడు కడుపు నిండా తిండి ఉంటే ప్రేగులు ఎప్పుడూ నిండుగా ఉంటాయి. జీర్ణవ్యవస్థకు కాస్త విరామం కలిగించడం కోసం ఉపవాసాలు ఎంతో సహకరిస్తాయి. అలా శరీరానికి శుద్ధికూడా ఉపవాసం కలిగిస్తుంది. అలా శరీరంలో అవసరానికి మించి వున్న కొవ్వు మరియు ఇతరాలు ఉపవాసాలవల్ల తొలగిపోతాయి.


ఇలా అనేక విధాలుగా ఉపవాసం దీక్షలు శరీరానికి మరియు మనస్సుకు ఎంతో క్షేమం కలిగిస్తాయి.

భారతీయులు ఆవును ఎందుకు పవిత్రంగా భావించేవారు?


భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించదం ఎంతో శుభశకునంగా భావించబడింది. శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నవి.


ఆవు పాలలోని వివిధ గుణాల కారణంగా ఆవు పాలను ‘అమృతం’ అని చెప్పబడింది. ఆవుపాలు ఔషదాలలో ఘటకాంశంగా నిలచింది. ప్రతిరోజు మన ఆహారంలో పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి మొదలగునవి వాడబడుతాయి. ఇతర ప్రాణుల మలాన్ని అశుద్ధంగా చెప్పబడినా, ఆవు పేడ మాత్రం ఎంతో సుభకరమైనదిగా చెప్పబడింది. సైన్స్ ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఆవు పేడ చెడువాసన లేనిదేకాక అనుకూల శక్తిని వెల్లడిస్తుందని అని చెప్పడం జరిగింది. మొక్కలకు మరియు చెట్లకు ఆవుపేడ మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఔషదాలలో ఆవు మాత్రం ఎంతో వైభవాన్ని కలిగివుంది. పూజల్లో సైతం ఆవు మూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. గొప్ప ఔషదగుణాలు కలిగిన గోరోజనము ఆవు నుదుటి భాగంలో ఓ సంచిలాంటి దానిలో ఉంటుంది. గోరోజనము ఆయుర్వేదం సూచించే ఓ గొప్పదిఎన ఔషదం. ఇన్నీ ప్రయోజనాలతో కూడిన, ఎంతో ఉపయోగాత్మకమైన ఆవుకు ‘గోమాతా అనే పేరు సార్ధకమైనదే.


భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించదం ఎంతో శుభశకునంగా భావించబడింది. శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నవి.

ఆవు పాలలోని వివిధ గుణాల కారణంగా ఆవు పాలను ‘అమృతం’ అని చెప్పబడింది. ఆవుపాలు ఔషదాలలో ఘటకాంశంగా నిలచింది. ప్రతిరోజు మన ఆహారంలో పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి మొదలగునవి వాడబడుతాయి. ఇతర ప్రాణుల మలాన్ని అశుద్ధంగా చెప్పబడినా, ఆవు పేడ మాత్రం ఎంతో సుభకరమైనదిగా చెప్పబడింది. సైన్స్ ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఆవు పేడ చెడువాసన లేనిదేకాక అనుకూల శక్తిని వెల్లడిస్తుందని అని చెప్పడం జరిగింది. మొక్కలకు మరియు చెట్లకు ఆవుపేడ మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఔషదాలలో ఆవు మాత్రం ఎంతో వైభవాన్ని కలిగివుంది. పూజల్లో సైతం ఆవు మూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. గొప్ప ఔషదగుణాలు కలిగిన గోరోజనము ఆవు నుదుటి భాగంలో ఓ సంచిలాంటి దానిలో ఉంటుంది. గోరోజనము ఆయుర్వేదం సూచించే ఓ గొప్పదిఎన ఔషదం.


ఇన్నీ ప్రయోజనాలతో కూడిన, ఎంతో ఉపయోగాత్మకమైన ఆవుకు ‘గోమాతా అనే పేరు సార్ధకమైనదే.

చాటపై పాదాలు ఎందుకు ఉంచరాదు?


సంప్రదాయ చాటను వెదురుతో కాని, ఈనెలతో కానీ చేస్తారు. ఇలాంటి చాటను ధాన్యాన్ని చెరగడానికి వాడేవారు. ధాన్యంలో ఉన్న పొట్టు చెరగడం వల్ల వంటకు వాడే ధాన్యం శుభ్రపడుతుంది. భారతీయులు వంట ధాన్యాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారు. కాబట్టి చాటను కూడా అలాగే భావించేవారు. 


సంప్రదాయక విశ్వాసం ప్రకారం చాటపై కాలు పెట్టడం పాపంగా పరిగణించేవారు. కావున ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించేవారు.
ఈ విశ్వాసంలో రెందు ప్రధానాంశాలు దాగి ఉన్నాయి. మొదటిది ఏమిటంటే చాట అల్లడానికి వాడిన వెదురు పదునుగా ఉంటుంది. కాబట్టి గాయం అయ్యే అవకాశం ఉంది. రెండవది శుభ్రతకు సంబంధిచినది. పాపభీతితో చాటపై కాలుపెట్టడానికి సందేహిస్తాము. కాబట్టి చాట శుభ్రంగా ఉండడమేకాక, చాటలో చెరిగే ధాన్యం కూడా మలినపడకుండా వుంటాయి.


దీనిని బట్టి మన సంప్రదాయక నమ్మకాలలో శాస్త్రీయమైన ఏదో అంతరార్ధం దాగివున్నదని మనము గమనించవచ్చు.