Tuesday, July 17, 2012

ప్రార్థన ఎందుకుచేయాలి?

ఎంతటి అర్ధబలం ఉన్నా, అంగబలం ఉన్నా, అధికార బలంఉన్నా, మానవమాత్రుడైన ప్రతివ్యక్తికి తన జీవనయాత్రలో ఏనాడో ఒకనాడు క్లిష్టతర సమస్యలను ఎదుర్కొనక తప్పదు. పరమాత్మ కరుణకు పాత్రుడైనవాడు ఎట్టి కష్టాలనైనా సునాయాసంగా ఎదుర్కొనగలడు. ఆ దయా సముద్రుని కరుణకోసం మనకు లభించిన 24 గంటల కాలంలో కనీసం ఓ గంట అయినా త్రికరణసుద్ధిగా ఆ దేవదేవుని ప్రార్థించడం ఎంతైనా అవసరమే.  శ్రద్ధ, భక్తి విశ్వాసాల స్థాయికి అనుకూలంగా సకాలంలో సత్వర ఫలితాలను పొందవచ్చు. విశేషించి ఈ కలియుగంలో – ‘కలౌ స్మరణన్ ముక్తి:’ అన్న సూక్తిని సర్వదా జ్ణ్జప్తిలో ఉంచుకుంటూ భగవన్నామాన్ని స్మరించండి. భగవచ్ఛక్తి ఎట్టిదో, మహాత్మ్యాలు ఎంత శక్తి సంపన్నమైనవో వర్ణించగలవారు లేరు.  అందుకు మచ్చుతునకగా ఈ ఉదాహరణ.

ఓ భయంకర అరణ్య మధ్యభాగంలో పూర్ణగర్భవతి అయిన ఓ లేడి తన రెండ్ పిల్లలతో పచ్చిక కోసం తిరుగుతుండగ, వేట కోసం వేటగాడు పెట్టిన వలలో చిక్కుకు పోతాననుకుంటూ వెనుకకు మరలేసరికి, ఆ వైపు నుండి వేటకుక్కలు రెండు భయంకరంగా మొరుగుతూ తన వైపే రావడం చూసి, ఎడమవైపుకు తిరిగి అలా పోదామనుకునే సరికి, ఆహారం కోసం వస్తూన్న ఎలుగుబంటి తనమీదకు రావడం చూసింది.  పోని, కుడివైపు తిరిగి ఆ దిశగ పోదామంటే తమ వైపే శరవేగంతో వస్తున్న ఓ తోడేలు దాని కంటబడింది. భగవంతుడా? ఏమిటీ దశ? ఎలా పోదామన్నా మౄత్యువే కనబడుతున్నదే అనుకొంటూ ఉండగా, ఆ ప్రక్కనే ఉన్న మర్రిచేట్తునెక్కి తనవైపు గురుచూస్తూ వేటగాడు బాణాన్ని ధనస్సుకు సంధిస్తున్న దౄశ్యం కనబడింది.

అంతలోనే దావానలంవల్ల దగ్ధమవుతున్న అరణ్య పరిసర ప్రదేశమంతా కనిపిస్తోంది.  ఆ దావానలం నుండి బయల్వెడలిన పొగలకూ, అగ్నిజ్వాలలకూ కొండగుహలలో నిదురిస్తున్న సిమ్హాలు బయటకు వచ్చి, కొండ శిఖరాలను ఎక్కి భయంకరంగా గర్జించసాగాయి. ఆ భయంకర గర్జనలకు అరణ్యంలోని మౄగాలన్నీ తల్లడిల్లిపోసాగాయి.

అట్టి భయంకర విపత్కర పరిస్థితి ఎదురవడంతో, పిల్లలతో సహా ఆ లేడి గజగజలాడ సాగింది. అప్పుడు ఆ లేడి వేదన పడూతూనే – కన్నులు మూసికొని ‘లక్ష్మినాథ: త్వమిహశరణం కిం కరోమి క్వయామి?’ ఆర్తత్రాణ పరాయణా! ఆది నారాయణ! భయంకరమైన ఈ విపత్తు నుండి నీవు తప్ప మమ్మల్ని రక్షించగల వారెవరు తండ్రి! అంటూ ఆర్తనాదం చేసింది. మనసావాచాకర్మణా – పరమాత్మను నమ్మి చెడినవారు ఈ ప్రపంచంలో ఉన్నారా?
మర్రిచెట్టు మీదన్నున్న వేటగాణ్ణి కాలసర్పం కాటువేయడంతో  ’అబ్బా’ అంటూ వాడు నేలకూలాడు. వాడి చేతులోని నిశిత శరం వచ్చి ఎలుగుబంటికి తగిలి, అది వేంటనే మరణించింది. తమ వేట జంతువును తోడేలు కొట్టుకు పోతుందేమోనని వేటకుక్కలు దాని వెంటబడి తరుముకుంట్టు అడవిలోకి దూరంగా పోయాయి. ఈలోగా ప్రచండ వాయు ప్రేరణవల్ల దావానలం నుండి అగ్ని కణం ఒకటి వచ్చి వలమయంలోనే అంబరమంతా కారు మేఘాలతో నిండి కుంభవౄష్టి కురిసి దావానలమంతా చల్లారిపోయింది. పూర్ణ గర్భవతి అయిన ఆ హరిణి ప్రసవించ, నవజాత శాబకాలు మాతౄస్తన్యాన్ని పానం చేయసాగాయి!  చూశారా! కరుణాసముద్రుడైన  నారాయణ దేవుని అనుగ్రహం! ఆస్థితిని చూసి ఆ కురంగం ఎంతగా ఉప్పొంగిపోయింతో అనుభవైకవేద్యమైనది.  అపార కరుణావరుణాలయుడైన శ్రీహరిని స్మరించుకొంటూ అది తన బిడ్డలతో సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయింది.  ఇది కేవలం లేడి గురించి చెప్పిన కథ మాత్రం కాదు.  మనుష్యుడై పుట్టినవాడు తన జీవయాత్రలో ఎప్పుడో ఒకప్పుడు క్లిష్టతర సమస్యలను ఎదుర్కొనక తప్పదు.  వాని అంగబలం, అర్థబలం, అధికార బలం ఇవన్నీ కలిసినా సమస్యలు తీరవు.  వార్థక్యంలో సాధన చేద్దాంలే, ఇప్పటి నుండీ ప్రార్ధన ఎందుకు? అని అనుకోక, ధ్రువ, ప్రహ్లాదులవలె చిన్ననాటి నుండి దైవ ప్రార్థన చేసికొంటూ, కుటుంబపరివార, అనుచర, సహచర వర్గానికి కూడా దైవకరుణ, లీలామహాత్మ్యాదులను గురించి బోధించి అనేకులను తరింపజేసి, జన్మను చరితార్థం చేసుకోవాలి

No comments:

Post a Comment