Tuesday, July 17, 2012

అక్షర తౄతీయ


‘వైశాఖ మానస్య చయా తౄతీయ


న నమ్యసా కార్తీక శుక్ల పక్షే


నభస్య మాసస్య తమిప్ర పక్షే


త్రయోదశీ పంచదశీ చ మాఘే’


అంటే వైశాఖ శుద్ధ తౄతీయ రోజు కౄతయుగము, కార్తీక శుక్ల నవమి నాడు త్రేతాయుగము, భాద్రపద బహుళ త్రయోదశినాడు ద్వాపర యుగము, మాఘ బహుళ అమావాస్యనాడు కలియుగం ప్రారంభమైందని విష్ణుపురాణంలో పేర్కొనబడింది. దీని ప్రకారం వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ ‘కౄత యుగాదీ అంటే కౄతయుగం ప్రారంభమైన రోజు. దీనినే మనం ‘అక్షయ తౄతీయా పర్వదినంగా జరుపుకుంటూ ఉన్నాము.


‘అక్షయం’ అంటే క్షయం లేకుండుట. ఏదీ పూర్తిగా అయిపోకుండా వుండడమని చెప్పవచ్చు. జీవితంలో అన్నింటినీ అక్షయం చేసే రోజు కనుక దీనికి ‘అక్షయ తౄతీయా అనే పేరు ఏర్పడింది. పూర్వం ఈ పర్వదిన ప్రాశస్త్యమును గురించి స్వయంగా శ్రీకౄష్ణపరమాత్మ పాండవాగ్రజుడు అయిన ధర్మరాజుకు వివరించునట్లు భవిష్యోత్తరణ పురాణంలో పేర్కొనబడగా ఈ పండుగను గురించి విధి విధానాలను గురించి భవిష్య శివ, విష్ణుపురాణాల్లో వివరించబడింది. ఈ పండుగానాడే మన రాష్ట్రంలోని ప్రసిధ్ధ నారసిమ్హక్షేత్రమైన సిమ్హాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసిమ్హస్వామివారికి చందనోత్సవం జరుగుతుంది. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారు చందనం లేకుండా నిజ రూపంలో దర్శనమిస్తారు. ఈ దినం సాయంత్రం నుంచి చందనమద్దే చందనోత్సవం ప్రారంభమవుతుంది. బదరీనాధ క్షేత్రంలోని శ్రీ బదరీ నారాయణస్వామి వారి ఆలయాన్ని ఈ దినం తెరుస్తారు. ఈ దినం శ్రీ బదరీ నారాయనస్వామివారి అలయాన్ని దర్శిస్తే మూడు యోజనములు వెడల్పు, పనెండ్రు యోజనముల పోడవు కలిగిన పాపాలు కూడా పూర్తిగా నశిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి అక్షయ తౄతీయరోజు ఎటువంటి పుణ్యదినమంటే వారం వర్జ్యం చూసుకోకుండా ఏ శుభకార్యాన్ని అయినా ఈ దినం జరుపుకొనవచ్చని శాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి.


అక్షయ తౄతీయనాడు ఏం చేయాలి?


అక్షయ తౄతీయ రోజు తెల్లవారుఝామునే నిద్ర లేచి కాలకౄత్యాలు తీర్చుకుని శిరస్నానం చేయవలెను. ఈ దినం గంగానదిలో స్నానమాచరించాలని శాస్త్ర వచనం. వీలులేనివారు గంగానదిని స్మరిస్తూ పుణ్యనదులు, కాలువలు, చెరువులు, బావులవద్దగానీ, అందుకు కూడా వీలు కాకుంటే ఇంట్లోనే నీటిని ‘గంగ….గంగ…గంగా అంటూ మూడుసార్లు కలియబెట్టి స్నానమాచరించవలెను. తరువాత పితౄదేవతలను స్మరించిం తర్పణాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం దేవతాపూజ చేయవలెను. శ్రీ లక్ష్మీ సమేత నారాయణుడు, గౌరీ సమేత త్రిలోచనుడులతోపాటు ఇష్ట దేవతలను పూజించవలెను. ముఖ్యంగా శ్రీకౄష్ణ పరమాత్మ ప్రతిమను ఒకదానిని ప్రతిష్టించి పూజించడంతోపాటు స్వామివారిని చందనంతో కప్పివేయవలెను.


‘య:కరోతి తౄతీయాయాం కౄష్టం చందన భూషితం


వైశాఖస్య సితే పక్షే సయాత్యచ్యుత మందిరం’ అని శాస్త్రవచనం. అంటే అక్షయ తౄతీయనాడు శ్రీకౄష్ణ పరమాత్మకు చందన లేపనం ఇచ్చిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుందని అర్థం.


ఈ విధంగా పూజ ముగించిన అనంతరం దానాలు చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అనేక దానాలు ఉన్నా ఉదకుంభదానం ఈనాటి దానాల్లో ప్రధానమైంది. దీనిని దేవతల ప్రీత్యర్థం, పితౄదేవతల ప్రీత్యర్థం చేయాలని శాస్త్రం. దేవతల ప్రీత్యర్థమైతే -


‘శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ముదకుంభ దానోక్త


ఫలవ్యాప్యార్థం బ్రాహ్మణా యోదకుంభ దానం కరిష్యే


తదంగ కలశ పూజాం కరిష్యే’ అనీ -


పితౄదేవతల ప్రీత్యర్థమైతే -


‘పితౄణామక్షయ్య తౄప్త్యర్ధ ముదకుంభ దానం కరిష్యే’ అనీ సంకల్పించి గంధము, పసుపు, కుంకుమలతో నీటితో నింపిన కుండను లేదా కళశమును అలంకరించి దానిని, బ్రాహ్మణుడిని పూజించి -


‘ఏషధర్మఘటోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక:


అస్యప్రదానాత్సకలామమసంతు మనోరథా’ అనే శ్లోకాన్ని కుండ లేదా కళశమిపై వ్రాసి దానిని -


‘ఏష ధర్మఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక:


అస్యప్రదానాత్తౄప్యంతు పితర్స్స పితామాహా:


గంధోదకతిలైర్యుక్తం స్నానం కుంభఫలాన్వితం


పితౄభ్యస్సంప్రదాస్యామి అక్షయ్యముపతిష్టతూ


అనే శ్లోకాన్ని పఠిస్తూ బ్రాహ్మణుడికి దానం ఇవ్వవలెను. దీనితోపాటు విసనకర్ర, లడ్డూలను దానం చేయవలెను. ఈ రెండూ దానం చేసినవారికి వైకుంఠం, శివలోకం ప్రాప్తిస్తుందని శాస్త్ర వచనం. ఇంకా నవధ్యాన్యాలు, గోధుమలు, దధ్Yఓజనము, గొడుగు, పాదరక్షలు, వస్త్రాలు, ఆవు, భూమి, బంగారం వంటి వాటిని కూడా శక్తిమేరకు దానమివ్వవలెను.


ఈవిధమైన దానాలవల్ల అనంతమైన పుణ్యఫలాలతోపాటూ జీవితంలో అన్ని అక్షయమవుతాయి. అక్షయ తౄతీయరోజు ఒక పూట భోజనం, మరోపూట ఉపవాసం  పాటించవలెను. చక్కెర  కలిపిన పేలపిండిని, ఉప్పులేని అహారమును స్వీకరించడం శ్రేష్ఠం, కాగా అక్షయ తౄతీయరోజు బంగారం కొనాలనే ఆచారం ఈ మధ్యకాలంలో అమల్లోకి రాగా బంగారం వ్యాపారుల ప్రకటనల ద్వారా మరింతగా ప్రాచుర్యంలోని తెచ్చారు కానీ శాస్త్ర ఆధారమేమిలేదు.


ఈవిధంగా అక్షయ తౄతీయను జరుపుకొనడంవల్ల అన్నీ అక్షయమవుతాయని చెప్పే గాథా ఒకటి పురాణాల్లో వుంది. పూర్వం నిర్థనుడు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. నిర్థనుడు పేదవాడు. దైవభక్తిపరుడు. ఉత్తమ గుణ సంపన్నుడు.


చిన్న వ్యాపారం చేస్తూ వచ్చినదానితో నిరాడంబరంగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. అట్టి నిర్థనుడు అక్షయతౄతీయను గురించి తెలుసుకుని అక్షయ తౄతీయకోసం ఎదురుచూసి అక్షయ తౄతీయనాడు విధులను యధాతంగా నిర్వహించి శక్తిమేరకు దానాలను చేసాడు. ఫలితంగా మరుజన్మలో నిర్థనుడు కుశాప్తి నగరంలో రాజకుటుంబంలో జన్మించాడు. యువరాజుగా సకల సంపదలను అనుభవించాడు. తండ్రి మరణానంతరం రాజ్యపాలకుడు అయి ప్రజలందరూ అక్షయ తౄతీయను జరుపుకునేటట్లు చేసాడు. ఫలితంగా రాజ్యం సుభిక్షంగా వర్థిల్లినట్లు పురాణకథనం.


పరశురామ జయంతి


శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాల్లో ఆరో అవతారం పరశురాముడు. పరశురాముడు జన్మించినది అక్షయ తౄతీయ రోజే. కాబట్టి ఈనాటి సాయంత్రం పరశురాముడిని పూజించి -


‘జామదగ్న్య మహావీర క్షత్రియాంత కర ప్రభో


గౄహాణార్ఘ్యం మాయాదత్తం కౄపయా పరమేశ్వరా’ అనే శ్లోకాన్ని పఠించి అర్ఘ్యం ఇవ్వవలెను.

No comments:

Post a Comment