Tuesday, July 17, 2012

ఇంద్రుడంటే….?


కళంకితా? కన్యా? ఏది నిజం అన్న సందేహం సహజంగానే కలుగుతుంది. ఇటువంటి సందర్భాలలోనే ఇలాంటి కథలను దౄష్టికోణాన్ని మార్చుకుని చూడాలి. ఎందికంటే పురాణకర్తలు సూటిగా కథ చెప్పరు. పైకి విడ్డూరంగా కనిపించే కథల్లో అంతర్లీనంగా ఆధ్యాత్మిక విషయాలు చొప్పిస్తూ ఉంటారు. ఉదాహరణకు అహల్య, ఇంద్రుల వౄత్తాంతమే  చూద్దాం. ఇంద్రుడంటే ఇంద్రియాలని అర్థం చెబుతారు. ఇంద్రియాలకు లొంగితే ఎటువంటి పతనం సంభవిస్తుందో అహల్యకు, ఇంద్రునికి గౌతముడిచ్చిన శాపాలు సూచిస్తాయి. ఆ పతనం నుంచి బయటపడడానికి భగవచ్చింతనే మార్గం. శ్రీరామపద స్పర్శతో నీకు శాపవిమోచనం కలుగుతుందని గౌతముడు అహల్యకు చెప్పడంలో అర్థమిదే. అలాగే వికౄత చింతనతో అపరాధభావంతో చేయకూడని పనిచేసినప్పుడు దాని ఫలితం కూడా వికౄతంగానే ఉంటుందని రెండో కథ చెబుతుంది.


అహల్యాగౌతములకు అంజన అనే కూతురు కాక మరో పుత్రిక, శతానందుడు, శరద్వంతుడు అనే కుమారులు కూడా ఉన్నారు. శతానందుడు మిథిలను పాలించే జనకమహారాజు వద్ద పురోహితుడు. శరద్వంతుడు ధనుర్విద్యలో నిష్ణాతుదు. మహాభారతంలోని ద్రోణాచార్యుని భార్య కౄపి, కౄపాచార్యుడు ఇతని సంతానమే.


మహాభారతంలోని మరో ప్రసిద్థముని ఉందకుడు గౌతముని శిష్Yఉడు. గౌతముడు ఇతనికి యవ్వనాన్ని ప్రసాదించి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. అందుకు సంతోషించిన ఉదంకుడు ఏదైనా కోరితే తెచ్చి ఇస్తానని గురుపత్ని అయిన అహల్యతో అంటాడు. మిత్రసహుడనే రాజు భార్య మదయంతి ధరించే కుండలాలను తెచ్చి ఇమ్మని అహల్య అడుగుతుంది. ఉందంకుడు వాటిని తీసుకువస్తుండగా మార్గ మధ్యంలో ఒక సర్పం వాటిని అపహరింస్తుంది. ఉదంకుడు వాటిని తిరిగి సంపాదించి గురుపత్నికి ఇస్తాడు. సర్పం తనకు చేసిన అపకారానికి కోపించిన ఉదంకుడు తర్వాత సర్పయాగం చేసి సర్పాలన్నింటినీ వధించమని పరీక్షుత్తు కుమారుడైన జనమేజయుని ప్రోత్సహిస్తాడు.


గౌతముని గురువు అగ్నిదేవుడు. గౌతముడు అంగిరస పరంపరకు చెందినవాడు. అగ్నిని పూనించిన వారిలో అంగిరసులు ప్రముఖులు, గౌతమ గోత్రీకులకు అంగిరసుడు, ఆయాస్యుడు, గౌతముడు ౠషులు.


తన మేథాశక్తిని తపశ్శక్తిని మేళవించి అనేక అద్భుతాలు చేసి ప్రజలను ఆదుకున్న నిస్వార్థ సేవా తత్పరుడు గౌతముడు. ఆయనకు అర్థాంగిగా అన్నింటా చేదోడుగా ఉన్న నారీరత్నం అహల్య.
ఆ దంపతుల స్మరణ ఎంతో పుణ్యప్రదం.

No comments:

Post a Comment