Wednesday, July 1, 2015

జీ మెయిల్‌లో ఈ ఫీచర్స్ మీకు తెలుసా!


కంపోజ్‌ చేయడం, ఫైల్‌ను అటాచ్‌ చేయడం, సెండ్‌ కొట్టడం, అప్పుడప్పుడూ చాట్‌ చేయడం.. ఈ ఫీచర్స్‌ని ఉపయోగించడం అందరూ చేసేదే. ఇవే కాకుండా జీమెయిల్‌లో బోలెడు ఫీచర్స్‌ ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే మరింత ఉపయోగం..
 
అన్‌డు సెండ్‌
చకా చకా మెయిల్‌లో టైప్‌ చేస్తారు. తొందరలో తప్పులను గుర్తించకుండా సెండ్‌ కొట్టేస్తారు. ఆ తరువాత అయ్యో తప్పులున్నాయి కదా అని తలపట్టుకుంటారు. ఒక్కసారి సెండ్‌ కొడితే మెయిల్‌ వెళ్లిపోయినట్లే కదా. కాని జీమెయిల్‌లో ఒక ఫీచర్‌ ఉంది. చాలా మందికి ఈ ఫీచర్‌ గురించి తెలియదు. సెండ్‌ కొట్టిన మెయిల్‌ను అన్‌డు కొట్టొచ్చు. అంటే మెయిల్‌ వారికి చేరకముందే ఆగిపోతుంది. ఇందుకోసం చేయాల్సిందల్లా జీమెయిల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అన్‌ డు సెండ్‌ని ఎనేబుల్‌లో పెట్టుకోవాలి. ఎన్ని సెకన్ల పాటు వెయిట్‌ చేయాలో ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి 30 సెకండ్లు సెలక్ట్‌ చేసుకుంటే కనుక మీరు మెయిల్‌ సెండ్‌ కొట్టిన 30 సెకండ్ల తరువాతే మెయిల్‌ వెళుతుంది. ఆ లోపు కావాలంటే అన్‌డు కొట్టొచ్చు.
 
కీబోర్డ్‌ షార్ట్‌కట్స్‌
షార్ట్‌కట్స్‌ను ఇష్టపడని వారు ఎవరుంటారు? కాని జీమెయిల్‌లో షార్ట్‌కట్స్‌ ఎలా? అంటే జీమెయిల్‌ ల్యాబ్స్‌లో కస్టమ్‌ కీబోర్డ్‌ షార్ట్‌కట్స్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఇందులో మీ సొంత షార్ట్‌కట్స్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు.
 
ఆటో అడ్వాన్స్‌
మీ జీమెయిల్‌ ఇన్‌బాక్స్‌లోకి రోజూ లెక్కలేనన్ని మెయిల్స్‌ వచ్చిపడుతూ ఉంటాయి. వాటిని ఓపెన్‌ చేసి పనికి రానివి డిలీట్‌ చేయడం, వెంటనే మళ్లీ ఇన్‌బాక్స్‌ స్ర్కీన్‌ ఓపెన్‌ కావడం... ఇదంతా తలనొప్పిగా ఉంటుంది. అలా కాకుండా జీమెయిల్‌ ల్యాబ్స్‌లో ఉన్న ఆటో అడ్వాన్స్‌ ఫీచర్‌ని ఎంచుకుంటే కనుక మెయిల్‌ డిలీట్‌ చేయగానే ఆ తరువాత మెయిల్‌ ఓపెన్‌ అవుతుంది. సింపుల్‌గా అనిపించినా ఈ ఫీచర్‌ మీ సమయాన్ని ఆదా చేస్తుంది.
 
సెండ్‌ అండ్‌ ఆర్చివ్‌
జీమెయిల్‌ జనరల్‌ సెట్టింగ్స్‌లో ‘షో సెండ్‌ అండ్‌ ఆర్చివ్‌’ బటన్‌ని ఎంచుకోవాలి. ఈ మెయిల్‌కు రిప్లై ఇచ్చాక సెండ్‌ కొడితే ఆ మెయిల్‌ ఇన్‌బాక్స్‌లో ఉండకుండా ఆర్చివ్‌ థ్రెడ్‌లోకి వెళుతుంది. సెంట్‌ మెయిల్‌లో ఆ మెయిల్‌ను చెక్‌ చేసుకోవచ్చు. ఇన్‌బాక్స్‌ క్లీన్‌గా ఉంచుకోవడానికి ఈ ఫీచర్‌ ఉపకరిస్తుంది.
 
యాప్స్‌ సెర్చ్‌
ఒకవేళ మీరు గూగుల్‌ డాక్స్‌, గూగుల్‌ సైట్స్‌ ఉపయోగిస్తున్నట్లయితే యాప్‌ సెర్చ్‌ ఫీచర్‌ మీకు బాగా ఉపయోగపడుతుంది. ల్యాబ్స్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. జీమెయిల్‌లో మీరు సెర్చ్‌ చేస్తున్నట్లయితే ఈ ఫీచర్‌ మీకు డాక్స్‌, సైట్స్‌లో ఉన్నవి కూడా సెర్చ్‌ చేసి చూపిస్తుంది. జీమెయిల్‌లో నుంచే ఫైల్‌ ఎక్కడుందీ వెతకొచ్చు.
 
రిప్లై ఆల్‌ను డిఫాల్ట్‌గా ఎంచుకోండి
కొన్ని మెయిల్స్‌ మల్టిపుల్‌ పీపుల్‌కి పంపించాల్సి ఉంటుంది. ఈమెయిల్‌ థ్రెడ్‌లో మల్టిపుల్‌ పీపుల్‌ ఇన్‌వాల్వ్‌ అయి ఉంటారు. మెయిల్‌ పంపించే సమయంలో రిప్లై ఆల్‌కు బదులుగా రిప్లై బటన్‌ని ఎంచుకుంటే ఒక్కరు తప్ప అందరూ ఆ మెయిల్‌ని మిస్‌ అయిపోతారు. అలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండాలంటే జీమెయిల్‌ జనరల్‌ సెట్టింగ్స్‌లో ఉన్న డిఫాల్ట్‌ రిప్లై బిహేవియర్‌లో రిప్లై ఆల్‌ని ఎంచుకోవాలి.
 
క్విక్‌ లింక్స్‌
ముఖ్యమైన మెయిల్స్‌కు స్టార్‌ పెట్టుకోవడం తెలిసిందే. అయితే అంతకన్నా సులభంగా ముఖ్యమైన మెయిల్స్‌ని యాక్సెస్‌ చేసుకునే విధంగా పెట్టుకోవాలంటే క్విక్‌ లింక్స్‌ని ఎంచుకోవాలి. జీమెయిల్‌ ల్యాబ్స్‌లో ఉన్న క్విక్‌ లింక్స్‌ని ఒక్కసారి ఎనేబుల్‌ చేస్తే చాలు. మెయిల్‌లో ఎడమవైపు ఒక బాక్స్‌ కనిపిస్తుంది. మీరు బుక్‌మార్క్‌ చేసుకున్న మెయిల్స్‌ అన్నీ ఇందులో ఒక్క క్లిక్‌ చేసుకునే విధంగా ఉంటాయి. ప్రత్యేక మెసేజ్‌లు, లేబుల్స్‌, సెర్చ్‌ చేసినవి..ఇలా అన్నీ ఇందులో ఉంటాయి.
 
అన్‌రీడ్‌ ఐకాన్‌
మీకు న్యూ మెయిల్‌ వచ్చినపుడు జీమెయిల్‌ ట్యాబ్‌ తెలియజేస్తుంది. కాని మీ ఇన్‌బాక్స్‌లో ఎన్ని అన్‌రీడ్‌ మెయిల్స్‌ ఉన్నాయో తెలుసుకోవాలంటే జీమెయిల్‌ ల్యాబ్స్‌లోని ‘అన్‌రీడ్‌ మేసేజ్‌ ఐకాన్‌’ ఉపయోగపడుతుంది.

స్పామ్‌ హ్యాండ్లింగ్‌
జీమెయిల్‌ అడ్ర్‌సలో డాట్‌కు ఉన్న ప్రాధాన్యం ఎంతో మీకు తెలుసా? ఉదాహరణకి మీ మెయిల్‌ durga.reddy@gmail.comఅనుకుందాం. అప్పుడు durgareddy@gmail.com లేక d.urgareddy@gmail.com మెయిల్‌ అడ్ర్‌సతో పంపిన మెయిల్స్‌ కూడా మీ ఇన్‌బాక్స్‌లోకి వస్తుంటాయి. ఈ ఇబ్బంది పోవాలంటే ఫిల్టర్‌ రూల్స్‌ని సెటప్‌ చేసుకోవాలి. ఒక్కసారి రిజిస్టర్‌ చేసుకుంటే చాలు. ఏయే మెయిల్‌ ఐడీల నుంచి మెయిల్స్‌ వచ్చే అవకాశం ఉందో ఆ మెయిల్‌ఐడీలను టైప్‌ చేసి ఈమెయిల్‌ ఫిల్టర్‌ క్రియేట్‌ చేసుకోవాలి. అప్పుడు ఆ ఐడీలతో వచ్చే మెయిల్స్‌ అన్నీ ఆటోమెటిక్‌గా డిలీట్‌ అవుతాయి.
 
సార్టింగ్‌ సులువు
ఎన్నో చోట్ల మెయిల్‌ ఐడీ ఇస్తుంటారు. ఎన్నో మెయిల్స్‌ వస్తుంటాయి. ఏ మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే అన్నీ చెక్‌ చేయాల్సిందే. అలా కాకుండా మెయిల్‌ ఐడీని ఇచ్చే సమయంలోనే + ఫీచర్‌ని ఉపయోగించినట్లయితే సార్టింగ్‌ చేయడం సులువవుతుంది. ఉదాహరణకి మీరు ఆఫర్స్‌కు సంబంధించిన సమాచారం కోసం రిజిస్టర్‌ చేసుకుని ఐడీ ఇచ్చారనుకుందాం. ఆ సమయంలోనే ఐడీలో + ఫీచర్‌ని జోడించాలి. ఉదాహరణకి మీ మెయిల్‌ ఐడీ durga.reddy@gmail.com అయితే కనుక durga.reddy+offers@gmail.com అని టైప్‌ చేసి ఇవ్వాలి. ఇలా ఇచ్చినా మెయిల్స్‌ మీ ఇన్‌బాక్స్‌లోకే వస్తుంటాయి. మీరు సెర్చ్‌ చేసే సమయంలోoffers అని టైప్‌ చేస్తే చాలు. అక్కడి నుంచి వచ్చిన మెయిల్స్‌ అన్నీ కనిపిస్తాయి. అలా మీరు ఐడీ ఇచ్చిన ప్రతీ చోట ఒక్కో ఫిల్టర్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు.
 
రీస్టోర్‌ అడ్రస్‌
స్మార్ట్‌ఫోన్‌లో నుంచి కాంటాక్ట్స్‌ను డిలీట్‌ చేస్తే గూగుల్‌ అకౌంట్‌లో నుంచి కూడా డిలీట్‌ అయిపోతాయి. అయితే డిలీట్‌ చేసిన ముప్పై రోజుల్లోగా వాటిని రికవరీ చేసుకోవచ్చు. ఇందుకోసం కాంటాక్ట్స్‌లోకి వెళ్లి, మోర్‌లో రీస్టోర్‌ కాంటాక్ట్స్‌పై క్లిక్‌ చేయాలి. డిలీట్‌ అయిన కాంటాక్ట్స్‌ అన్నీ స్టోర్‌ అవుతాయి.
 
డైలీ షెడ్యూల్‌
క్యాలెండర్‌ ఫీచర్‌ సహాయంతో రోజు వారి, నెల వారి షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసుకోవచ్చు. క్రియేట్‌ చేసుకున్న క్యాలెండర్‌ను మెయిల్‌లో ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లోనూ ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. జీమెయిల్‌ క్యాలెండర్‌ ఫీచర్‌ని ఉపయోగించుకోవాలంటే మెయిల్‌ కుడివైపు పైభాగంలో ఉన్న గేర్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ల్యాబ్స్‌ని ఎంచుకోవాలి. తరువాత గూగుల్‌ క్యాలెండర్‌ గ్యాడ్జెట్‌ బటన్‌ని ఎనేబుల్‌లో పెట్టుకుని ఛేంజె్‌సని సేవ్‌ చేయాలి. సింపుల్‌గా ఉన్నా ఈ ఫీచర్స్‌ బాగా ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు కదూ.

కాంటాక్ట్స్‌ మెర్జ్‌
మెయిల్‌లో డూప్లికేట్‌ కాంటాక్ట్స్‌ ఉంటే చాలా చికాకుగా ఉంటుంది. ఏ ఐడీకి మెయిల్‌ పంపించాలో ఒక్కోసారి అర్థంకాదు. అలాంటప్పుడు కాంటాక్ట్స్‌ని మెర్జ్‌ చేస్తే సరిపోతుంది. ఇందుకోసం మెయిల్‌లో ఎడమవైపు పైభాగంలో ఉన్న కాంటాక్ట్స్‌లోకి వెళ్లాలి. అందులో ఫైండ్‌ డూప్లికేట్‌ కాంటాక్ట్స్‌ని ఎంచుకుంటే డూప్లికేట్స్‌ అన్నీ కనిపిస్తాయి. మోర్‌ ఆప్షన్‌లోకి వెళ్లి మెర్జ్‌ కాంటాక్ట్స్‌ని ఎంచుకుంటే కాంటాక్ట్స్‌ అన్నీ మెర్జ్‌ అవుతాయి.

No comments:

Post a Comment