Wednesday, September 12, 2012

రాగి,ఇత్తడి చేసే మేలు


శుభకార్యాలకు కళ తెచ్చే రాగి, ఇత్తడి వస్తువులు మానవుని ఆరోగ్యానికీ సాయపడుతున్నాయి. రాగి పాత్రలో ఉంచిన నీళ్లు మూడు గంటల కాల వ్యవధిలోనే క్రిమి రహితంగా మారి, వాటిని తాగే వారికి ఆరోగ్యాన్ని ఇచ్చేంతగా పరిశుద్ధత పొందుతాయి. పాత్రలలో నీటిని నిల్వ ఉంచడం వలన ఈ -కొలి బ్యాక్టీరియాలు సైతం నశించిపోతాయి. ఇత్తడి పాత్రలేమో జింక్, అలాయ్ మిశ్రమంతో తయారవుతాయి. జింక్ రోగ నిరోధక శక్తిని కలిగి ఉండటంతోపాటు ప్రొటీన్స్‌ను కూడా సమకూర్చేశక్తిని కలిగి ఉంటుంది. అందువలన ఇత్తడి ఆరోగ్యప్రదాయిగా గుర్తింపు పొందింది.

రాగి, ఇత్తడి వస్తువుల నుంచి వచ్చే కాంతి ఫ్రీక్వెన్సీలను నూతన సాంకేతిక పరిజ్ఞానమైన పిఐపి(పాలీకాంట్రాస్ట్ ఇంటర్‌ఫియరెన్స్ ఫోటోగ్రఫీ) అనే విధానం ద్వారా నిరూపించారు. పూణెలోని కాస్మిక్ స్పిరిచ్యువల్ ఎనర్జీ సెంటర్‌లో ఈ సదుపాయం ఉంది.ఇలా ఆధునిక పరిజ్ఞానమం కూడా రాగి, ఇత్తడి వలన కలిగే మేలును వివరిస్తూనే ఉన్నాయి. ఎంత రాగైనా, ఇత్తడైనా అవీ పదార్థాలే కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని శుభ్రపరుస్తుండాలి. వాతావారణంలోని తేమ మూలంగా రాగి, ఇత్తడి పాత్రలపై చేరే ఆక్సైడ్స్ పచ్చని పొర ఏర్పడటానికి కారణమవుతుంది. దీనిని ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి. గతంలో సున్నం, చింతపండు, జున్నుపాలు, బూడిద, మన్ను వంటి వాటితో రాగి, ఇత్తడి వస్తువులను శుభ్రపరిచేవారు.


ఇప్పుడు వీటి స్థానంలో మార్కెట్‌లో రాగి, ఇత్త డి వస్తువులను శుభ్రపరిచే చక్కని ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. వాటిని ఉపయోగిస్తే రాగి, ఇత్తడి వస్తువుల మన్నిక బాగుంటుంది. చింతపండు, తదితరాల్లో ఇతర పదార్థాల్లో తగినంత యాసిడ్ ఉండదు. అలాగే మన్ను, బూడిద వంటి వాటి వలన మెరిసే వస్తువులపై గీతలు ఏర్పడతాయి. అందువలన దీనికి పత్యామ్నాయంగా రాగి, ఇత్తడి వస్తువులను శుభ్రపరచడానికి మార్కెట్‌లో మంచి పౌడర్లు వస్తున్నాయి. ఇవి రాగి, ఇత్తడి వస్తువులను మెరిసేలా చేస్తున్నాయి. అప్పుడు ఇంట్లో జరిగే శుభకార్యంలో వాడే వస్తువులతో పాటు మనం కూడా ఆరోగ్యంతో కళకళలాడుతాము.

లంచ్‌ బాక్సుల్లో ఎలాంటి ఆహారం పెట్టాలి? ఎలాంటి స్నాక్స్‌ ఇవ్వాలి?


  • పిల్లలు నిత్యం చురుకుగా ఉంటూ చదువులో రాణించాలంటే వారికి ప్రతీ నాలుగు గంటలకు ఓ సారి సమతులమైన, పుష్టినిచ్చే ఆహారం తప్పనిసరి అందించాలి.
  • కూల్‌డ్రింక్స్‌తో పాటు బిస్కెట్లు, చాక్లెట్లు వదిలేయాలి.
  • ఇంటిల్లిపాదీ తినే ఆహారపదార్థాల్లో ఉప్పు వినియోగాన్ని తగ్గించి, పిల్లల ఆహారంలో పప్పు వినియోగాన్ని పెంచాలి.
  • స్కూలు దగ్గర ఏదో ఒకటి కొని తినే వారి కంటే ఇంట్లో ఉదయాన్నే అల్పాహారం తిన్న పల్లలు చదువులో రాణిస్తున్నారని పరిశోధనల్లో తేలింది.
  • పిల్లల ఆసక్తిని బట్టి వారికి ఇష్టమైన ఆహారపదార్థాలనే పుష్టినిచ్చే ఆకుకూరలు, కూరగాయలతో కలిపి వండి పెట్టవచ్చు. ఉదాహరణకు కొంతమంది పిల్లలు దోసెలంటే ఇష్టపడతారు. అలాంటి వారికి పాలకూర, తోటకూర, మెంతికూర లాంటి పలురకాల ఆకుకూరలు కలిపి గ్రైండ్‌ చేసి దోసెలు వేయవచ్చు. లేకుంటే చట్నీలోనూ ఆకుకూరలు కలిపి చేయవచ్చు. దీనివల్ల పల్లలకు పౌష్టికాహారం అందుతుంది.
  • క్యారెట్‌, బఠానీలు, బీన్స్‌లతో ఫ్రైడ్‌రైస్‌ చేసి లంచ్‌బాక్సులో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.
  • క్యారెట్‌, బీన్స్‌, పచ్చి బఠానీలు, బీట్‌రూట్‌లను చిన్నచిన్న ముక్కలు చేసి ఇడ్లీల్లో కలిపితే పోషక పదార్థాలు పిల్లలకు అందుతాయి. 
  • చాక్లెట్లకు ప్రత్యామ్నాయంగా పల్లీలతో చేసిన ఉండలు, చిక్కీలు, నువ్వులు, బెల్లంతో చేసిన ఉండలు పెట్టండి. ఇంటికొచ్చాక పిల్లలకు శనగలు, పల్లీలు, బఠానీలు గుప్పెడు ఇవ్వాలి.
  • అన్నం, పంచదార, ఎగ్‌లతో పుడ్డింగ్‌ చేసి పెడితే పెరిగే పిల్లలకు మంచిది.
  • మురుకులైనా ఏ పిండి వంటలైనా ఇంట్లో చేసుకోవాలి తప్ప, సూపర్‌మార్కెట్‌, బజార్‌లలో దొరికే పదార్థాలను పిల్లలకు పెట్టవద్దని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
  • జాతీయ పోషకాహార సంస్థ నిపుణులు హైదరాబాద్‌ మిక్స్‌ అన్న పేరుతో ఓ ఆహార మిశ్రమాన్ని రూపొందించారు. గోధుమలు, వేయించిన శనగపప్పు, వేరుశనగపప్పు, బెల్లాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

మతిమరపును నివారించే పాలకూర


  • పాలకూరలో లభించే విటమిన్‌ సి, ఏలు మరియు మెగ్నీషియం, ఫోలిక్‌ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. ఈ కూరలో ఇంకా క్యాల్షియం, సోడియం, క్లోరిన్‌, ఫాస్ఫరస్‌, ఇనుము, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, విటమిన్‌ ఏ, విటమిన్‌ సీ తదితరాలుంటాయి. 
  • పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువని ఇటీవలి పరిశోధనల్లో సైతం వెల్లడయ్యింది. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కళంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది, జ్వరం, పిత్త, వాయు శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం కూడా అధికంగా ఉంది.
  • స్ర్తీల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరను వెజిటబుల్‌ సూప్‌లోనూ, చపాతీలు చేసుకునే పిండిలోనూ, పకోడీల పిండిలోనూ, పన్నీర్‌తో కలిపి వండే కూరల్లోనూ.. అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇతర ఆకుకూరల్లాగా పాలకూరను కూరలాగా, వేపుడు చేసుకుని కూడా తినవచ్చు. ఎలాగైనా సరే ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలలో పాలకూరను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

మన శరీరంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. లలాట అధిదేవత బ్రహ్మ. పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుంచి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మస్థానమైన ల లాటం స్థానమయ్యింది. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు కాబట్టి ఎరుపురంగు బొట్టునే ధరించాలి. అంతేకాక, ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్రస్థానం... కనుబొమ మధ్య ఉండే ఆజ్ఞాచక్రం. కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల, మానసిక ప్రవృత్తులను నశింపజేసే ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్టేనని శాస్త్రాలు చెబుతున్నాయి.

పొట్ట ఫ్లాట్‌గా కావాలంటే...

మనలో చాలామందికి పొట్ట పెరిగినట్లు కనిపిస్తూ ఉంటే అసహ్యంగా అనిపించడం సహజమే. జారిపోయినట్లుగా ఉన్న పొట్ట తగ్గించుకోడానికి సులభమైన మార్గం టమ్మీ టక్. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. 


మహిళల్లో పొట్ట జారినట్లుగా పెరగడానికి గర్భధారణ, స్థూలకాయం, మేజర్ సర్జరీలు, వయసు పెరగడం వంటి అనేక అంశాలు కారణమవుతాయి. కొందరిలో జన్యుపరంగా పొట్ట జారినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ పొట్ట కండరాల్లో పటుత్వం తగ్గిపోవడం వల్ల ఇలా జరగడం సహజమే. ఇలాంటి వాళ్లు అబ్డామినోప్లాస్టీ అని పిలిచే టమ్మీ టక్ చేయించుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే కొందరికి మాత్రం టమ్మీటక్‌ను మేం వెంటనే సిఫార్సు చేయం. బరువు మరింతగా తగ్గాలని చికిత్స తీసుకునేవారు, మరో బిడ్డను కోరుకునేవారు వెంటనే టమ్మీ టక్ చేయించుకోకపోవడం మంచిది. ఎందుకంటే... ఇలా సర్జరీ చేయించాక వాళ్లు పొందాల్సిన గరిష్ట ప్రయోజనం పొందలేరు కాబట్టి. అయితే ఇలాంటి వారికి టమ్మీ టక్ కంటే మినీ టమ్మీ టక్ మంచిది. 

వర్షపునీటిలో నానిన పాదాల గురించి.....

వర్షంలో తడిచి ఇంటికి వెళ్లగానే ముందు తల తుడుచుకుంటారు. మరింత జాగ్రత్తగా ఉండేవారు వేడి నీళ్లతో స్నానం చేసి పడుకుంటారు. అంతేగాని...వర్షపునీటిలో నానిన పాదాల గురించి ఆలోచించరు. రోడ్డుపై ఉన్న చెత్తచెదాలతో కూడిన మురికినీటిలో నానిన పాదాలకు ఫంగస్ ఇన్షెక్షన్ వస్తుంది. ఎలర్జీల వల్ల దురదలు, పొక్కులు వంటివి కూడా వస్తాయి. ఈ సమస్యలేవి మీ పాదాలజోలికి రాకుండా ఉండాలంటే మసాజ్ ఒక్కటే మార్గం. ఇంటికెళ్లగానే గోరువెచ్చటి నీళ్లలో పదినిమిషాలు పాదాలను ఉంచి శుభ్రంగా కడుక్కోవాలి. ఆ నీళ్లలో కొద్దిగా పసుపు వేసుకుంటే మంచిది. తర్వాత పాదాలను శుభ్రంగా తుడిచి తడి ఆరిపోయాక ఏదైనా మాయిశ్చరైజింగ్ క్రీమ్‌తో ఓ పదినిమిషాలు మసాజ్ చేయాలి. వేళ్లమధ్య క్రీములేకుండా తుడిచేయాలి. లేదంటే నీళ్లలో నానిన పాదం కాబట్టి వేళ్లమధ్య తడి ఉంటే ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో సాక్సులు వేసుకోకపోవడమే ఉత్తతం. ఎందుకంటే వర్షంలో తడిచినపుడు నానిన సాక్సుల వల్ల కూడా ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది.

నలభైల్లో మంచి ఆరోగ్యం కోసం...


ఆరోగ్య సంరక్షణ అన్నది అందరికీ వర్తించినా, నలభైకి చేరువ అవుతుంటే మాత్రం వారు మరింత జాగరూకతతో ఉండాలి. సాధారణంగా ఆ వయసులో డయాబెటిస్, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు, ఆస్టియోపోరోసిస్ వంటివి కనిపిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మనం మంచి జీవనశైలి అంటే...మంచి ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లను విసర్జించడం వంటి అంశాలపై దృష్టినిలపడం అవసరం. 

మంచి ఆహారం ఆవశ్యకత: మన ఆహారంలో కాయధాన్యాలు, తాజా పండ్లు, ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నూనె పదార్థాలను వీలైనంత తగ్గించాలి. పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కొలెస్ట్రాల్, చక్కెర పాళ్లు తక్కువగా ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం. 

ప్రతిరోజూ వ్యాయామం : నలభైల్లో ఉండేవారు ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఫిట్‌నెస్‌ను దీర్ఘకాలం కాపాడుకోవడానికి వ్యాయామం ఎంతో అవసరం. అందునా శరీరాన్ని అతిగా కష్టపెట్టే బాడీ బిల్డింగ్ వ్యాయామాల కంటే తేలికపాటి శారీరక శ్రమ కలిగించే నడక వంటివి మంచి వ్యాయామ ప్రక్రియలని గుర్తుంచుకోవాలి. వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ 45 నిమిషాల పాటు నడవడం చాలా మంచిది.

చెడు అలవాట్లకు దూరంగా ఉండటం: పై జాగ్రత్తలతో పాటు పొగతాగడం, మద్యపానం, పొగాకు ఉత్పాదనలను నమలడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల మంచి జీవనశైలిని పాటించినట్లవుతుంది. దాంతో మంచి ఆరోగ్యం సమకూరుతుంది. 

హోమియో చికిత్సా ప్రక్రియలో మనిషి జీవన విధానం, అతడి వయసు, నివసించే ప్రదేశం, ఆహార అలవాట్లు, శారీరక లక్షణాలు, మానసిక దౌర్బల్యాల వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులు సూచిస్తారంటే జీవనశైలికి హోమియో విధానం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో తెలిసిపోతుంది. పైగా హోమియో విధానం స్వాభావికంగా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించి వ్యాధులను దూరం చేస్తుంది. ఇక జీవనశైలి సైతం స్వాభావికంగానే వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. కాబట్టి నలభైల్లో ఉన్నవారు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాల్సిన ఆవశ్యకత ఉంది. 

Blood Donors List In India


Monday, September 10, 2012

Learn English with Telugu for Beginner

Click Here for PDF File (or) JPEG Files (or) See below images