Friday, January 11, 2013

నిత్య యవ్వనులుగా కనిపించాలంటే...!

సాధారణంగా కొంతమంది ఫేస్ ఏంటో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. చర్మం తేజోవంతంగా ప్రకాశిస్తుంటుంది. తమ చర్మం కూడా అలా మెరవాలంటే ఏం చేయాలో తెలీక, వాళ్ళమెరుపుకు రహస్యం అర్థంకాక అనేక మంది యువతులు బాధపడుతుంటారు. నిజానికి అదేమంత కష్టమైనా పని కాదు. మన శరీరం మీద మనకు కొంచెం శ్రద్ధ, ఆసక్తి ఉంటే, అలాంటి ఆకర్షణీయమైన చర్మాన్ని మనమూ సొంతం చేసుకోవచ్చని చర్మ సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యాపిల్ :  వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి తేజస్సు సమకూర్చుకోవచ్చని చెపుతున్నారు. కనుక రోజూ ఓ కప్పు యాపిల్ జ్యూస్ కనుక తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం. చర్మ సౌందర్యం వస్తుందని చెపుతున్నారు. అలాగే, క్యారెట్ జ్యూస్‌ ఆరోగ్యానికి మహా మంచిదంటున్నారు. ఇది ముఖానికి తేజస్సును ఇవ్వడమే కాకుండా, కళ్ళకు ఏంతో మంచిదని చెపుతున్నారు. అసిడిటీని సైతం తగ్గిస్తుందట. క్యారెట్‌లో విటమిన్ ఏ, సీలు మాత్రమే కాకుండా మరెన్నో పోషక విలువలు ఉంటాయని వారు చెపుతున్నారు.

బీట్రూట్ :   జ్యూస్ బీట్రూట్ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. పైగా ఇది లివర్‌‌కు మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటె పోతాయాట. అన్నిటికంటే ముఖ్యంగా ఎర్ర రక్త కణాల సమాఖ్య పెంచుతుందంటున్నారు. అలాగే, కడిగిన టొమాటోలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుందని చెపుతున్నారు.

టమోటా జ్యూస్:  నిత్యయవ్వనులుగా కనిపించాలంటే టమోటా జ్యూస్, సూప్ వంటివి తీసుకుంటే చాలునని తాజా అధ్యయనంలో తేలింది. వయసు మీదపడటంతో ఏర్పడే ముడతలకు చెక్ పెట్టాలంటే టమోటా గుజ్జుతో ప్యాక్ వేసుకుంటే సరిపోతుందని అమెరికాలోని ఒక పరిశోధన సంస్థకు చెందిన నిపుణులు నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఎర్రని టమోటాల గుజ్జును ముఖానికి ప్యాక్ వేసుకోవడమే కాకుండా క్రమం తప్పకుండా టమోటా జ్యూస్ తాగడం, వంటల్లో అధికంగా టమోటాలను చేర్చడంతో మహిళల అందం మరింత పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.  

ఋతు సమయంలో ‘‘ నొప్పి’’ కి కొన్ని చిట్కాలు...!

మహిళలను ముఖ్యంగా బాధించే పెద్ద సమస్య మెన్సనల్ ప్రాబ్లమ్‌ ప్రతినెల నెలసరి సమయంలో తప్పకుండా వచ్చే కడుపు నొప్పి తట్టుకోలేక విలవిలాడుతారు. ఏవేవో టిప్స్ పాటిస్తుంటారు. ఆ మూడు రోజులు ఏ పని చేయలేరు. చాలా నరయకయాతనపడతారు. ఆడపిల్లల్లో 21 ఏళ్లదాకా శారీరక ఎదుగుదల కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఎత్తు, బరువు, శరీరఛాయ, శరీరాకృతి అనేవి జన్యుపరంగా నిర్ధారించబడి ఉంటాయి.

 కొంత మందికి నెలసరికీ నెలసరికీ మధ్యలోనూ రక్తస్రావం అవుతుంది. నెలసరి సమయంలో గానీ లేదా అంతకు ముందు గానీ తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. కొంతమందిలో నెలసరి ఈ నొప్పి మరింత తీవ్రదశలో ఉంటుంది. ఋతువు ప్రారంభానికి ఒక రోజు ముందు పొత్తికడుపులో కండరాలు ఎవరో గట్టిగా పట్టుకుని సలుపుతు ఉన్నట్లుగా మొదలై అది ఋతు సమయంలో మరింత ఎక్కువగా ఏర్పడుతుంది.

 దీనితో పాటే కడుపులో వికారం, సొమ్మసిల్లిపోవడం వంటి లక్షణాలు ఏర్సడుతాయి. ఇవి ఎపుడైతే ఏర్పడుతాయో అపుడే మీరు ఈ నొప్పి చాలాతీవ్రంగావుంది అని గ్రహించాలి. వెంటనే తగు చికిత్స కోసం వైద్యులను సంప్రదించాలి. మహిళలకు వచ్చే నెలసరి రుతుక్రమంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ స్ధాయిలు తగ్గుతాయి.

 ఈ సమయంలో వీరికి కడుపులో నొప్పులు, కోపతాపాలు అధికమవుతాయి. ఎంతో చికాకుగా వుంటారు. క్షణ క్షణానికి మూడ్ మారుతూంటుంది. దీనికి కారణం హార్మోన్లలో వచ్చే మార్పులు. హాయిని కలిగించే సెరోటోనిన్ తగ్గిపోవటం. ఎండార్ఫిన్లు మాయమవటం. తీవ్ర మనోవేదన కలిగి వుంటారు. మరి వీరి పరిస్ధితిని అదుపులో వుంచి ఆనందపరచాలంటే... కొన్ని చిట్కాలు ఉన్నాయి.

చిట్కాలు...   

హెర్బల్‌ టీ: టీ పోడితో కాకుండా ఆకులతో చేసిన టీ తాగితే నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. వేడి నీళ్ల స్నానం: వేడి నీళ్లతో స్నానం చేయడంవల్ల వెన్ను నొప్పి, ఒంటి నొప్పులను ఎదుర్కొనవచ్చు. ఇదే కాకుండా ఒత్తిడి నుంచి రిలాక్స్‌ అవ్వటానికి ఏదైన మంచి చిత్రం చూడటం లేదా ఏదైనా చిక్సిత తీసుకుంటేనొప్పి నుంచి కొంత రిలాక్స్‌నెస్‌ పొందవచ్చు.

మసాజ్‌::::: :::  వెన్ను మర్దన వల్ల వెన్ను, కడుపు నొప్పి చాలా వరకు తగ్గుతుంది.

వేడి నీళ్ల కాపడం: వేడి నీళ్లు ఒక సంచిలో పోసి దానితో వెన్ను, కడుపు చుట్టూ పెట్టడంవల్ల నొప్పి వల్ల కలిగే అసౌకర్యాన్ని దూరం చేయడంలో సహాయపడుతుంది. చాక్లెట్‌: చాక్లెట్‌ బార్‌ తినడం వల్ల కూడా ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

వ్యాయామం: కొన్ని యోగా భంగిమలు కమలాసనం, సీతాకోకచిలుక ఆసనం వంటివి పీరియడ్‌వల్ల కలిగేనొప్పిని, అసౌకర్యాన్ని దూరం చేస్తాయి.    

కొబ్బరి నీటితో జీర్ణకోశ బాధలకు చెక్

మన ఆరోగ్యానికి కోకనట్ వాటర్ శ్రేష్టమైనవి అనే సంగతి అందరికి తెలిసిన సత్యమే. సమ్మర్లోనే మాత్రమే కాదు ఏ కాలంలోనైనా తాగే పానీయాలలో ముఖ్యమైనవి, ఆరోగ్యాన్నిచ్చేవి కొబ్బరి నీళ్ళు. అందరికి అందుబాటులో ఉండే మధురమైన లేత కొబ్బరిబొండం నీటిలో అనేక ఔషధ విలువలు ఉన్నాయి. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా వేసవిలో మాత్రం రోజుకు ఒక కొబ్బరి బొండం తాగితే వేసవి రుగ్మతల నుంచి రక్షణ లభిస్తుంది. కొబ్బరి నీళ్ళలో దివ్య ఔషధాలు ఉన్నాయి. దాహం తీర్చడమే గాక ఇందులో ఉండే మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అంతేగాకుండా కొబ్బరి నీళ్లలో శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంది. కొబ్బరి నీళ్ళు సేవించడం వల్ల అనేక రోగాలు దరికి రావు. వాత, పిత్త గుణాలను హరిస్తాయి.

 కొబ్బరి నీరు : లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, క్రొవ్వులు అస్సలుండవు, చెక్కెర పరమితం గాను ఉండును. కొబ్బరి బొండం నీటిలో పొటాసియం ఎక్కువగా ఉంటుంది.  శరీరములో నీటి లేమిని కరక్ట్ చేస్తుంది. ఆరోగ్య పరంగా జీర్ణకోశ బాధల తో బాధపడే చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారము,  విరోచనాలు అయినపుడు ఓరల్ రి-హైద్రాషన్ గా ఉపయోగపడుతుంది, కొబ్బరి నీటిలో ఉండే పొటాసియం గుండె జబ్బులకు మంచిది, వేసవి కాలములో శరీరాన్ని చల్లబరుస్తుంది, వేసవిలో చెమట కాయలు, వేడి కురుపులు, అమ్మవారు జబ్బు పొక్కులు తగ్గేందుకు కొబ్బరినీతిని లేపనంగావాడాలి.

 కొన్ని రకల పొట్టపురుగులు కొబ్బరి నీటివల్ల చనిపోతాయి, ముత్రసంభందమైన జబ్బులలోను , కిడ్నీ రాళ్ళు సమస్యలలో ఇది మంచి మందుగా పనిచేస్తుంది. మినెరల్ పాయిజన్ కేసులలో పాయిజన్ ని క్లియర్ చేస్తుంది. కొబ్బరి రక్త శుద్ధిలో కొబ్బరి నీళ్ళ పాత్ర ఆమోఘం ఒక్క మాటలో చెప్పాలంటే కొబ్బరి నీరు గ్లాసు పాలకంటే కూడా పుష్టికరం. పైగా ఇందులో తల్లిపాలలో ఉండే లారిక్‌యాసిడ్‌ లాంటి సుగునాలన్నీ కూడా కలగలిసి ఉన్నాయి. చక్కెర పదార్థాలు, ఖనిజలవణాలు విటమిన్లతో సమృద్ధమైన కొబ్బరి నీరు ఎంత అలసటనైనా సరే ఇట్టే పోగొట్టేస్తుంది. వేడిని తగ్గిస్తాయి.

విరేచనాలను అరికడతాయి. గుండె జబ్బులను తగ్గిస్తాయి. అన్నిటినీ మించి, శక్తిని, బలాన్ని అందిస్తాయి. కొబ్బరికాయలో ఉండే అమూల్యమైన గుణాలు ఎన్నో ఉన్నాయి. అందుచేత రోజూవారీగా ఓ కొబ్బరి బొండాంలోని నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే కొబ్బరి నీళ్లను తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరగడంతో వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.   

పిల్లలకు – తులసీ పాకము

 తులసీ ఆకుల రసం ఒక లీటరు పటిక బెల్లంపొడి పావు కేజి ఈ రెండు పధార్థాలకు సేకరించి తులసీ రసములో పటికి బెల్లం పొడి కలిపి, కరిగించి పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి నిదానముగా చిన్న మంటపైన లేద పాకము వచ్చే వరకు మరిగించి దించి తడి తగలకుండా జాగ్రత్తగా నిలువవుంచుకోవాలి.

 పిల్లలకు దగ్గు జలుబు, జ్వరము, మొదలైన సమస్యలు వచ్చినపుడు ఒక కప్పు నులి వెచ్చని నీటిలో ఈ పాకమును ఒక చెంచా మోతాదుగా కలిపి కరిగించి ఆ నీరు త్రాగించాలి. ఈ నీరు సువాసనగా రుచిగా ఉంటాయి. కాబట్టి పిల్లలు బాగా తాగుతారు. ఈ విదంగా రెండుపూటలా తాగించాలి.

ఉపయోగాలు. : పిల్లల కప తత్వము క్రమముగా మారుతుంది. నిరంతరముగా దగ్గు, జలబు, జ్వరముతో పీడించబడే బాలలకు ఈ తులసి పాకము అమృతములాగా చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది. పిల్లల వయసును బట్టి ఈ పాకము పావు టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదు వరకు నీటిలో కలిపి తాగించాలి.   

జుట్టు రాలుతుందా..? నివారణ జాగ్రత్తలు..!

జుట్టు రాలుటకు కారణాలు:  పోషక పదార్థాలున్న ఆహారం తీసుకోకపోవడం. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, థైరాయిడ్‌ లోపాలుం డటం, మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. నిద్రలేమితో బాధపడటం. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వలన చర్మం ప్రభావితమై జుట్టు రాలుతుంది. వెంట్రుకల కుదుళ్ళలో ఏర్పడే ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన వెంట్రుకలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వలన, కొందరిలో శరీరతత్వం బట్టి కూడా జుట్టు రాళడం జరుగుతుంది.

 నివారణకు జాగ్రత్తలు: జుట్టు నిర్మాణానికి, అది ఎదగడానికి 97 శాతం ప్రోటీన్ల పాత్రే అధికంగా ఉంటుంది. కావున ప్రోటీన్ల లోపం రాకుండా జాగ్రత్త పడటం ముఖ్యం. హార్మోన్లు సమతుల్యంగా ఉండటానికి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. సబ్బులను డాక్టర్‌ సలహామేరకే వాడాలి. షాంపూ లేదా ఆయిల్‌ను వెంట్రు కల కుదుళ్ళలో, వేళ్లతో నెమ్మదిగా ఎక్కువసేపు మర్దన చేయటం వలన ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

 బయటకు వెళ్ళేటప్పుడు తలకు ‘టోపీ’ ధరించడం మంచిది. కొవ్వు, నూనె సంబంధిత పదార్థాలు ఎక్కువగా తీసు కోకూడదు. మానసిక ఒత్తిడి కూడా ‘జుట్టు రాలుట’పై ప్రభావం చూపు తుంది. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ప్రతి రోజు యోగా, వ్యాయా మం విధిగా చేయాలి.   

పిల్లల తెల్లవెంట్రుకలు నివారణకు ...!

పిల్లల తెల్లవెంట్రుకలకు ఆధునిక విషసంస్కృతి ప్రభావంతో పసితనం నుండే బిడ్డలకు షాంపూల వంటి రసాయన పధార్థాలను తలస్నానానికి వాడటంవల్ల, ఫ్రిజ్ లలోని అతి చల్లని పధార్థాలను తినిపించడం వల్ల, తెల్లబియ్యంలాంటి నిర్జీవధాన్యాలను ఆహారంగా పెట్టడంవల్ల పిల్లలకు పసితనంలోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి.

అలాంటి పిల్లలకు అద్భుతమైన ఆహారౌషధాన్ని వాడవలసిందిగా తల్లులకు సూచిస్తున్నారు ఆయుర్వేధ వైద్యులు. అయిదు నుండి పది ఎండి ఉసిరికాయముక్కలు ఒకగిన్నెలో వేసి మునిగే వరకు నీళ్ళుపోసి మూతపెటట్టి రాత్రంతా నానపెట్టాలి. ఉధయం నీరు తీసి వేసి ఆ ముక్కలను నేతితో చిన్నమంటపైన దోరగావేయించి ఆ ముక్కలను పిల్లలతో తినిపించడం గాని లేదా అన్నంలో కలిపిపెట్టడంగానీ రోజూ విడవకుండా చేయాలి. ఇలా ఆరుమాసాలు చేస్తే పిలల తెల్లవెంట్రుకలు పూర్తిగా నల్లబడుతాయి.  

గుండెకు నొప్పి వచ్చినపుడు స్వొంత వైద్యం

1. నొప్పి వచ్చినపుడు చేస్తున్న పనిమానేసి కూర్చుని విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ నడుస్తోంటే ఆగి, నిలబడిపోవాలి. కొద్ది నిముషాలలోనే నొప్పి తొలగిపోతుంది.

2.నొప్పి వస్తున్నపుడు మీరేదన్నా పనిని చేస్తుంటే ఆ పనిని కంటిన్యూ చేయవద్దు. పని ఆపేసి విశ్రాంతి తీసుకోకపోతే నొప్పి తగ్గదు. నొప్పి వచ్చినపుడు మీరు ఇంకా పనిని చేస్తుంటే అది ప్రమాదానికి దారి తీస్తుంది.

 3. డాక్టరు ఏవయినా ఎక్సర్ సైజుల్ని సూచించితే వాటిని పాటించాలి. అయితే మీకు అసౌకర్యాన్ని కలిగించేంత అతిగా మాత్రం చేయకూడదు.

 4. పొగ తాగటాన్ని ఆపేయాలి. 

5. కడుపు పగిలేట్లుగా భారీ భోజనాన్ని చేయకూడదు. చిన్న చిన్న పరిమాణంలో ఎక్కువసార్లు తినండి. పరవాలేదు.

6.భోజనం చేయగానే కొద్దిసేపు రెస్టు తీసుకోవాలి. తిన్న వెంటనే ఏ పనిలోనూ పాల్గొనకూడదు.

 7.బాగా చలి, లేక గాలి వీస్తున్న వాతావరణంలోకి వెళ్ళకూడదు.

 8.కొవ్వు పధార్థాలు తినటం మానేయాలి.

 9. మరీ శ్రమతో కూడుకున్న పనుల్ని చేయకూడదు.

 10.వీలయినంతలో కోపాన్ని తెప్పించే, తిక్క పుట్టించే పరిస్థితులకు దూరంగా వుండాలి.  

గర్భవతి మహిళ నిద్రకు ప్రధానమైన పది చిట్కాలు

- విశ్రాంతి బాగా తీసుకోండి. ఎంత అధిక సమయం వీలైతే అంత అధికంగా మీ బెడ్ టైమ్ కు చేర్చండి.

 - ప్రతిరోజు రాత్రులందు ఒక సమయంలో నిద్రిస్తే మీకు, బిడ్డకు కూడా చాలా ప్రయోజనంగా వుంటుంది.

 - తల, మెడ ఎత్తులో వుండి పడుకునేలా చేసుకోండి.

 - మానసికంగా ఎటువంటి పీడకలలు మైండ్ కి రాకుండా చూడండి. దీనికి గాను మీకు గల భయాలు మీ పార్టనర్ కు తెలిపి హాయిగా రిలాక్స్డ్ గా వుండండి. రాత్రులందు డిన్నర్ అధికంగా చేయకండి.

 - మీ మోకాళ్ళకు పొట్టకు మధ్య అదనపు తలగడ వుంచండి. పడుకునే భంగిమ సౌకర్యంగా వుంటుంది.

 - మీరు పెట్టుకునే తలగడ పొడవుగా వుండి పొట్టనుండి మో కాళ్ళవరకు విస్తరించి సౌకర్యాన్ని కలిగించాలి. ఈ రకమైన తలగడ ప్రత్యేకించి మార్కెట్లలో లభ్యం అవుతుంది.

 - ఎడమవైపుకు తిరిగి పడుకోండి. గర్భాశయానికి కడుపులోని పిండానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. గుండెకు కూడా రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

 - గర్భిణీ స్త్రీ నెలలు నిండుతున్నాయంటే సరిగా నిద్రించలేదు. కనుక మంచి నిద్ర పట్టేంతవరకు టి.వి. చూడటం, వీనులవిందైన మ్యూజిక్ వినటం వంటివి చేయాలి.

 - గర్భిణీ స్త్రీలకు కాళ్ళలో నొప్పులు వస్తాయి. కొన్నిమార్లు రక్తప్రసరణ సరిగా లేక కొంకర్లు పోతాయి. అటువంటపుడు కాళ్ళను తిన్నగా పెట్టుకోవడం, బెడ్ పై పరుండినపుడు మోకాళ్ళను వంచి రక్తప్రసరణ బాగా జరిగేలా చూడాలి. బరువైన పనులు చేయరాదు. ప్రతిరోజూ వ్యాయామం, పోషక విలువలు కల ఆహారం వీరికి ప్రధానావసరాలు.  

వింటర్ సీజన్ లో మీ పాదాలకు - కొన్ని జాగ్రత్తలు

చలికాలంలో మన పాదాలు, చేతులు రంగుమారిపోతాయి. పగుళ్లు వచ్చి అశయంగా కనిపిస్తాయి. వీటిపై సంరక్షణ తీసుకుంటే పాదాలు, చేతులను కోమలంగా ఉంచగలుగుతాం. చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

అంతే కాదు ఈ సీజన్ లో ఎక్కువగా పొడిబారడం జరుగుతుంది. చర్మం అతి త్వరగా పొడిబారి, పగుళ్ళు ఏర్పడి, చారలు కనబడుతుంటాయి. కాళ్ళు మరింత అసహ్యంగా కనబడుతాయి. కాబట్టి... ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందమైన పాదాలు సొంతం చేసుకోవాలంటే 15 రోజులకోసారి పెడిక్యూర్ చేయించాలి. పెడిక్యూర్ కోసం పార్లర్‌కు వెళ్లలేని వారు ఇంట్లో దొరికే వస్తువులతోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు.

గోరు వెచ్చని నీటిలో కొంచెం ఉప్పు, హైడ్రోజన్‌పెరాకె్సైడ్ లేదా డెటాల్, షాంపూ వేయాలి. అందులో 15 నుంచి 20 నిమిషాలపాటు కాళ్లను నానబెట్టాలి. బయటకు తీసి ప్యూమిక్‌స్టోన్ లేదా స్క్రబ్బింగ్ స్టోన్ లేదా బ్రష్ ఉపయోగించి రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. తరువాత ఒక నిమ్మకాయ చెక్క తీసుకుని దానిపై గ్లిజరిన్ వేసి బాగా రుద్దాలి.

అనంతరం ఆలివ్ ఆయిల్‌తో కాలును మొత్తం మసాజ్ చేయాలి. అనంతరం పాదాలకు సాక్స్ వేసుకోవాలి. ముల్తానీ మట్టిలో గులాబీనీరు కలిపి పాదాలకు పూత వేసి.. పావుగంటయ్యాక కడిగి మాయిశ్చరైజర్‌ రాయాలి. తరచూ ఇలా చేయడం వల్ల చర్మం మీద మృతకణాలు తొలగిపోయి.. మృదువుగా మారతాయి.

గులాబీ నీళ్లు, గ్లిజరిన్‌ సమపాళ్లలో తీసుకొని పాదాలకు మసాజ్ చేయాలి. మర్నాడు గోరువెచ్చటినీళ్లలో షాంపూ కలిపి కడిగితే.. పాదాల మీద మురికి సులువుగా తొలగిపోతుంది. ఫుట్‌క్రీమ్‌కానీ, లోషన్‌గానీ, పాదాలకు రాసుకోవచ్చు. ఫుట్‌లోషన్‌ను ఎలా తయారు చేయాలంటే గాఢమైన రంగున్న సీసాను సిద్ధం చేసుకోండి.

అందులో ఒక చెమ్చా బాదం ఆయిల్‌, ఒక చెమ్చా ఆలివ్‌ ఆయిల్‌, ఒక చెమ్చా వీట్‌ ఓర్మ్‌ఆయిల్‌; 12 చుక్కల యూకలిప్టస్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ను కలపండి. చల్లని నీడ ఉన్న ప్రదేశంలో దీన్ని వుంచండి. పాదాలను శుభ్రం చేసుకున్న తర్వాత ఆరిపోయాక ఈ ఆయిల్‌ను పట్టించండి. పాదాలను ఎంత శుభ్రంగా ఉంచుతామో కాలి వేళ్ళు, గోళ్ళు కూడా అంతే శుభ్రంగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వండి. గోళ్ళు తరచూ కట్ చేసుకొంటుండాలి.

ఆ తర్వాత ఒక బకెట్లో పావు భాగం వరకు నీళ్ళు తీసుకుని అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ విటమిన్ ఇ నూనె, చెంచ వంటసోడా వేసి ఒక అరగంట పాటు కాళ్ళు అందులో ఉంచాలి. ఇలా చేస్తే పాదాలు మృదువుగా ఉంటాయి. ప్రతిరోజూ స్నానం చేసేటపుడు కనీసం మూడు నిమిషాలైనా పాదాలకోసం కేటాయించండి. పాదాలను ప్యూమిన్ రాయితో రుద్దితే మృతచర్మం చాలావరకు తొలగిపోతుంది.

ప్యూమిన్ రాయి, నెయిల్ బ్రష్, మంచి స్క్రబ్ కొని తెచ్చుకోవాలి. బ్రష్‌తో గోళ్లలో ఉండే మట్టిని తొలగించవచ్చు. స్నానం పూర్తయ్యాక వేళ్ల మధ్య, అరికాలు పూర్తిగా తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ రాయాలి. పాదాల సంరక్షణలో భాగంగా సాక్సులు వాడుతుంటారు చాలామంది. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచి ధరించాలి. లేదంటే దుమ్ము, మురికి చేరిపోయి చెమట పట్టినప్పుడు పాదాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉంటుంది.

అలానే నైలాన్‌ సాక్సుల కంటే కాటన్‌వి సౌకర్యంగా ఉంటాయి. రాత్రిపూట తప్పనిసరిగా గోరువెచ్చటి నీళ్లతో కాళ్లు కడుక్కొని పొడి తువాలుతో తుడిచి కొబ్బరి నూనె రాయాలి. కొద్దిసేపు పాదాలను మునివేళ్లతో నొక్కుతూ ఉంటే రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. మర్నాటికి పాదాలు మెత్తబడతాయి.   

ఆరోగ్యానికి ఏడు అద్భుతమైన ఆహారాలు...!

మునగకాయ: దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. పంటగా కూడా సాగు చేసే మునగలోని మంచి గుణాలు ఎన్నో ఉన్నాయి.

బీట్‌రూట్: బీట్‌రూట్ కేన్సర్‌తో పోరాడే అద్భుత గుణాలున్న బీట్‌రూట్‌లోని ఎర్రటి పిగ్మెంట్‌ సహజమైనది. అంతేకాకుండా ఇందులో ఫోలేట్‌లు అధికంగా వున్నాయి. దీని లాభాలు ఎన్నో తెలుసా! బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.

క్యాబేజ్: క్యాబేజీ ఒక ఆకుకూర. ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. పోషకాలు నిండుగా వున్న క్యాబేజ్‌ను మనం భలే నిర్లక్ష్యం చేస్తాం. ఇందులో వున్న సల్ఫోరాఫేన్‌ కేన్సర్‌ను పోరాడే ఎంజైమును అధికంగా వుందని తెలిస్తే? వాడకాన్ని పెంచుతాం కదూ?!

కాలీఫ్లవర్: పచ్చటి ఆకుల మధ్య ముద్దగా కనిపించే తెల్లటి పూలగుచ్ఛమే కాలీఫ్లవర్‌. ఇది ప్రకృతి సిద్ధమైన ఫ్లవర్‌ బొకేలా ముచ్చటగా వుంటుంది. క్యాలీప్లవర్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్‌ బి5, బి6, మాంగనీస్‌, ఫాటీ యాసిడ్లు కూడా అందులో వుంటాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, సోడియం మినరల్స్‌ కూడా కాలీఫ్లవర్‌లో లభిస్తాయి. కాలీఫ్లవర్‌ను అతిగా తినడం వల్ల కొందరిలో కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం జరుగుతుంది. వీటిలో వుండే ప్యురీన్లు అనే పదార్థాలు దీనికి కారణం. అయితే అందరికీ ఈ సమస్య ఎదురుకాదు.

 ఎలా తినాలి: కాలీఫ్లవర్ ను రకరకాలుగా తయారు చేస్తుంటారు. క్యాలీఫ్లర్ కుర్మా, కాలీఫ్లవర్ ఖీమా, కాలీఫ్లవర్ పరోటా, సైడ్ డిష్, సలాడ్, ఖుర్మా, ఫ్రై ఇలా రకరాకలుగా తయారు చేసి తినవచ్చు.

 కాకరకాయ: కాకరకాయ చేదుగా ఉన్నా ఎంతో ఆరో గ్యాన్నిస్తుంది. జ్వరం, రక్త దోషములను తొలగిస్తుంది. మధుమేహంను తగ్గిస్తుంది. జ్వరం, నులి పురుగులను నశింప చేస్తుంది. శరీరానికి కావల్సిన పోషకాలను ఫొలేట్‌, మెగ్నీషియం, జింక కూడా సమృద్ధిగా అందిస్తుంది. ఎటువంటి వ్యాధి లేని వారు కూడా మంచి షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉంచుకోవటం కోసం మరియు ఆరోగ్యాన్ని బాగా చూస్కోవటం కోసం కాకర కాయని తిస్కోవాలి. ఇందులో ఐరన్ బాగా ఎక్కువగా ఉండటం వలన మరియు కేలోరిస్ తక్కువగా ఉండటం వలన రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఆరోగ్యానికి దోహదపడే దీన్ని అస్సలు పక్కన పెట్టొద్దు. ఇందులోని కెరోటినాయిడ్స్‌ మనకు అన్నివిధాలా మంచివి.

పాలకూర: మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు. * దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి. ఆరోగ్యానికి దోహదపడే దీన్ని అస్సలు పక్కన పెట్టొద్దు. ఇందులోని కెరోటినాయిడ్స్‌ మనకు అన్నివిధాలా మంచివి. పాలకూరలో లభించే విటమిన్ సి, ఏలు మరియు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి.

ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. ఈ కూరలో ఇంకా క్యాల్షియం, సోడియం, క్లోరిన్, ఫాస్ఫరస్, ఇనుము, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సీ‌ తదితరాలుంటాయి. ఎలా తినాలి: పప్పు, కూర, పాలక్‌ పన్నీర్‌, పాలక్ చపాతీ, పాలక్ రైస్, ఎన్నెన్నో!

గుమ్మడి మరియు గుమ్మడి గింజలు: గుమ్మడిలో విటమిన్‌ ఎ పుష్కలంగానూ, కేలరీలు తక్కువగానూ కలిగిన కూరగాయ. ఇందులో ఫైబర్‌ ఎక్కువశాతం వుంది. అంతేకాక వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఎలా తినాలి: కూర, పులుసు, సాంబారు, హల్వా... ఏదైనా సరే! గుమ్మడి గింజల్లో మెగ్నీషియం మెండుగా వుంది. ఇంకా మినరల్స్‌ అత్యధికంగా పోగుపడ్డ గింజలు. అంతేకాదు వీటికి ఆహారంలో భాగస్వామ్యం కల్పిస్తే మన జీవితకాలం మరింత పెరుగుతుందట! ఎలా తినాలి: దోరగా వేపుకుని స్నాక్స్‌ రూపంలో తినొచ్చు. లేదంటే ముద్దలా నూరి కూరలో వేయొచ్చు. దానివల్ల గ్రేవీ రుచిగా తయారవుతుంది.

చిక్కుడు: చిక్కుడు కాయగురాల్లో చాలామంచిది. బీన్స్ ఉడికించి తెన్నా వేయించి తెన్నా మన శరీరానికి మేలుచేస్తాయి . వారానికి ఒకసారైనా తినాలి . ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి . చిక్కుడు లో పీచుపదర్ధము ఎక్కువ ఉండడం వల్ల రక్తం లోని కొలెస్టరాల్ ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది . అనినో ఆమ్లాలు , పొటాసియం ఉన్నందున గుండె ఆరోగ్యం గా పనిచేయడానికి దోహదం చేస్తుంది. బి విటమిన్లు , ఫోలేట్ సంవృద్దిగా ఉంటాయి .

చిక్కుడు ఫాబేసి కుటుంబం కు చెందినవి. రకరకాల చిక్కుడు గోరు చిక్కుడు, సోయా చిక్కుడు, పందిరి చిక్కుడు వంటలలో, లేత చిక్కుడులో గింజలుండవు, తొక్కలతో తక్కువ సెల్యులోస్ ఉంటుంది, కనుక త్వరగా ఉడికి రుచిగా ఉంటుంది. ఎలా తినాలి: వీటిని ఉడికించి తీసుకోవాలి. లేదా కూరల రూపంలో తీసుకోవాలి.    

ఎదిగే పిల్లలకు మేలు చేసే నెయ్యి!!

నెయ్యిలో ఔషధగుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.పాలు, పాల పదార్థాలు కొందరికి నచ్చదు అలాంటి వారు లాక్టోజ్‌ శాతం తక్కువగా ఉండే నెయ్యిని వాడొచ్చు. ఇందులో లభించే పోషకాలు శరీరంలోని క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. కాలేయం, పేగులు, గొంతులోని మలినాలను బయటకు పంపుతుంది. నెయ్యి తీసుకొంటే కొలెస్ట్రాల్‌ సమస్య వస్తుందని అందరి నమ్మకం.

అయితే ఇది అందర్నీ బాధిస్తుందని మాత్రం చెప్పలేం. ముందు నుంచి కొలెస్ట్రాల్‌ సమస్య ఉన్నవారు నెయ్యి వాడకం తగ్గించాలి. ఒక్కోసారి శరీరంలో కొవ్వు శాతం పెరగడానికి శారీరక మార్పులు, ఇతర మార్పులు, ఇతర ఆహార పదార్థాలుకూడా కారణమయ్యే అవకాశం ఉంది. నెయ్యి బలహీనంగా ఉన్న వారికి చాలా మేలు చేస్తుంది. వాతాన్ని తగ్గిస్తుంది. చర్మానికి కాంతిని ఇస్తుంది. మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. నిపుణులు దీన్ని మానసిక సమస్యలకు ఔషధంగా కూడా ఇస్తారు.

ఇంకా తీసుకొన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆకలి మందగించినప్పుడు మిరియాల పొడిలో నెయ్యి కలిపి మొదటి ముద్దలో తీసుకొంటే చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముక పుష్టిగా ఉండేందుకు గ్లాసు పాలలో చెంచా నెయ్యి వేసి తాగిస్తే మంచిది. అరటి పండు గుజ్జులో, కాసిని పాలు, కొద్దిగా నెయ్యి కలిపి పిల్లలకు తినిపిస్తే అవయవాలు దృఢంగా అవుతాయి. బరువు పెరుగుతారు.

పొడి చర్మతత్వం, ఎగ్జిమా, సోరియాసిస్‌ వంటి సమస్యలతో బాధపడేవారు పావు చెంచా వేప గింజల పొడిలో, పావుచెంచా నెయ్యి జోడించి మొదటి ముద్దతో కలిపి తింటే సత్వర ఉపశమనం దొరుకుతుంది. కాలిన బొబ్బల మీద నెయ్యిని పైపూతగా రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగా మానిపోతాయి. ముక్కు నుంచి రక్తస్రావమవుతుంటే రంధ్రాల్లో మూడు నాలుగు చుక్కలు నెయ్యి వేస్తే ఫలితం కనిపిస్తుంది.

పసి పిల్లలకు నెయ్యి లేదా వెన్నను ఒంటికి రాసి కాసేపయ్యాక స్నానం చేయిస్తే చర్మం మృదువుగా మారుతుంది. క్షయవ్యాధి, మలబద్ధకం, విరేచనాలు, జ్వరంతో బాధపడేవారు, వృద్ధులు నెయ్యికి దూరంగా ఉండాలి.  

గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవానికి జాగ్రత్తలు

గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి, దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. ఆరోగ్యమైన శిశువు కొరకు తీసుకోవలసిన ఆహారం ఏమిటో చూద్దాం... 

 పౌష్ఠిక ఆహారం: పాలు, పండ్లు, ఆకు కూరలు ,పప్పు, మాంసము ,చేపలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. వైద్యుల సలహాలు, వారిచ్చే మందులు, టానిక్కులు క్రమం తప్పకుండా వాడుతుండాలి. ఎట్టి పరిస్థితుల్లోను ఒత్తిడికి గురికాకూడదు. భయం అనేది అస్సలు ఉండకూడదు. దీంతో ప్రసవ సమయంలో శిశువుకు కష్టతరమౌతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

 గర్భము, ప్రసవము అనేటివి సృష్టిలో సర్వసాధారణం. మొదటి ఆరు నెలలూ నెలకొకసారి, ఏడు,ఎనిమిది నెలల్లో నెలకు రెండుసార్లు, తొమ్మిదవ నెలలో వారానికొకసారి వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. సాధారణంగా కొందరు స్త్రీలు ఎత్తు మడమల చెప్పులు వాడుతుంటారు. గర్భం ధరించిన తర్వాత ఎత్తు మడమలున్న చెప్పులు వాడకండి. మీరు దూరప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు కుదుపులు లేకుండా చూసుకోండి. కాన్పు అయిన తర్వాత బిడ్డకు చనుపాలు ఇవ్వడానికి వీలుగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చివరి 3 నెలల్లో మీ వైద్యనిపుణుల సలహాలు తీసుకోండి.

 సుఖప్రసవం జరిగేందుకు శ్వాసక్రియ వ్యాయామాలు, శరీర బరువు పెరగకుండా ఇతర తేలికపాటి వ్యాయామాలు వైద్యుల సలహాలననుసరించి చెయ్యాలి. గర్భిణీస్త్రీలు క్రమం తప్పకుండా విశ్రాంతిని తీసుకుంటుండాలి. రాత్రిపూట 8నుంచి 10గంటలపాటు శరీరానికి విశ్రాంతినివ్వాలి. నిద్ర పోయేటప్పుడు ఒక ప్రక్కకు వీలైతే ఎడమ వైపు పడుకోవడం ఉత్తమం అంటున్నారు వైద్యులు.