Sunday, December 8, 2013

ఆహారశుద్ధి నియమం

భోజన సమయములో ఇతరులపైన కోపిగించుకోకూడదు, భయంకర వార్తలువింటూ కాని, దృశ్యాలు చూస్తూ కాని చేయకూడదు, అలా చేస్తే రోగాలపాలు అవుతాము, ఇది నేను చెప్పిన మాట కాదు, మన పెద్దలు చెప్పిన మాట.
మనస్సు మంచిగా ఉంటే ఎన్ని కష్టాలనైనా ఆనందంగా భరించగలుగుతాము. శారీరకముగా ఎన్ని సుఖములున్నను మనసు చెదిరతే దుఃఖమునే పెంచును.మనసుని ఉపయోగించుట మానవునికి లభించిన గొప్ప వరము. మనం తీసుకొనే ఆహారము యొక్క ప్రభావము, మన మనస్సు మీద ప్రభావం చుపిస్తుంది. అందుకని అనేక విధాలుగా మనసుని పనిచేయించు ఆహారము కూడా సరిఅయిన రీతిలో సంస్కరించి తీసుకోవలెను. సాత్వికమైన ఆహారము(అనగా శాఖాహారము) ఆరోగ్యరీత్యా మంచిదని మన పూర్వీకులు చెప్పారు, వారు అటువంటి నియమాలు పాటించుటవల్లనే సతాధికులుగా జీవించారు అని చెప్పటంలో సందేహమేమీ లేదు.
“జంతూనాం నరజన్మ దుర్లభం”–అన్నారు కదా మన పెద్దలు, అంటే మానవులను కూడా జంతువులమని చెప్పారు కదాని ఉత్తమమైన మానవుడు తనకంటే తక్కువగా అంచనా వేయు జంతువులను చంపి తినుట సంస్కారమేనా ? సంస్కరింప బడిన ఆహారము తినగలిగిన మనిషి, చెత్తా– చెదారము తినేటి జంతువులను చంపి ఆహారముగా తీసుకోవచ్చునా,.. ఒక జంతువుని చంపి తిని తిరిగే జంతువులను క్రూర మ్రుగమందురు. శాఖాహారము తినే జంతువులను చూసి ఎవ్వరం భయపడము, అటువంటి వాటిని ఇంటిలో పెంచుకుంటాము. కనుక నియమము తెలుసుకుని, శాఖాహారములై సమస్త ప్రాణుల శ్రేయస్సును కోరుట మానవుని కనీస ధర్మము. మనమూ అటువంటి ధర్మాన్ని పాటిద్దామా… ….

No comments:

Post a Comment