Saturday, February 9, 2013

వేదకాలంలో "ట్రాన్స్‌పోర్ట్" ఇలా ఉన్నదట..!!

నిశితంగా పరిశీలించినపుడు, 20 శతాబ్దంలో సంభవించిన అనేక శాస్త్రీయ ఆవిష్కరణలు, మన వేదాలలో, పురాణేతిహాస గ్రంథాలలో విపులీకరించబడ్డాయనేది ఎవరు కాదన్నా...యదార్థం! నేటి విజ్ఞానశాస్త్రం వివరించడానికి సాధ్యం కాదంటున్న విషయాలను గురించీ వేల సంవత్సరాల క్రితమే మన పూర్వులు వివరించి చెప్పారు. ఉదాహరణకు ముండకోపనిషత్తులో సృష్టి ఆవిర్భావం గురించి ఇలా వివరించారు.

యధోర్ణనాభిః సృజతేగృహ్ణ తేజ
యథా పృదివ్యా దోషధయః సంభవంతి
యథా సతః పురుషాత్కేశలో మాని
తథాక్షరాత్సంభవంతీహ విశ్వం
సాలెపురుగు ఏ విధంగా తనలోనుండి దారాలను సృష్టించి, మళ్ళీ తనలోకి గ్రహించుకుంటుందో, మానవశరీరంలో నుండి రోమాలు ఏవిధంగా పుడుతున్నాయో, భూమి నుండి ఓషధులు ఏవిధంగా ఉద్భవిస్తున్నాయో, అదేవిధంగా అక్షరుడైన పరమాత్మ వలన ఈ ప్రపంచం పుడుతోంది.

అదేవిధంగా వేదవ్యాసుడు గాంధారి గర్భాన్ని కాపాడేందుకు కుండను ఉపయోగించడం, నేటి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రయోగంవంటిదన్నమాట అదే విధంగా గణత విజ్ఞాన విభాగాలైన వర్గ సమీక రణాలు, త్రికోణమితి, కలనగణితం గురించి మన పురాతన గ్రంథాలలో వివరణలున్నాయి.

ఇంకా చెప్పాలంటే, గణితశాస్త్రంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన పైథాగరస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పైథాగరస్ భారతదేశానకి వచ్చి, ఇక్కడ మన గణిత, వేదాంత శాస్త్రాలను అభ్యసించి తన మేధకు పదును పెట్టుకున్నాడన్న విషయం నిజం. అలాగే ఈ శతాబ్దపు మేటి ఆవిష్కరణగా ప్రసిద్ధిగాంచిన "పరమాణుగడియారం" గురించి మన పురాణాలలో తగిన వివరణలున్నాయి.

ఇలా మన వేదసంస్కృతిని ఆకళింపు చేసుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనకు గోచరమవుతాయి. ఇక వేదకాలంలో ప్రయాణవిధానాలను పరిశీలించినపుడు 1. రహదారి మార్గం, 2. నదీ, సముద్ర మార్గం, 3. వాయుమార్గం అంటూ మూడు పద్ధతులను మనం గమనించవచ్చు. అదేవిధంగా నేడు నాలుగులేన్ల రోడ్లవలె, నాటి రహదారులు కూడ మూడు విధాలుగా విభజింపబడ్డాయి.

1. పాదచారులు కోసం, 2. ఎద్దుల బండ్ల కోసం, 3. రథాల కోసం - అంటూ ప్రతి ప్రధాన రహదారి మూడు భాగాలుగా విభజింపబడింది. ఆరోజుల్లో ప్రజల రవాణా కోసం ఎక్కువగా ఎద్దుల బండ్లపైనే ఆధారపడేవారు. ఇప్పటికీ మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఎద్దుల బండ్లే ప్రయాణాసాధనాలు.

ఋగ్వేదంలోని మంత్రంలో (1-37-1) స్పోర్ట్స్ కారు ప్రస్తావన ఉంది. అధర్వవేదంలోని మంత్రంలో (2076-2)నేటి పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్ సిస్టం గురించిన ప్రస్తావన ఉంది.

ఇక, వాయుయానానికి సంబంధించినంత వరకు రైట్ సోదరులకు కొన్నివేల సంవత్సరాలకు ముందే విమానాల గురించి మనకు తెలుసు. 'సమరాంగణ సూత్రధార' అనే గ్రంథం విమానాలు ప్రయాణించే ఎత్తులు, వేగాలు, అవరోహణం వంటి తారతమ్య లక్షణాల ఆధారంగా దీర్గంగా చర్చించింది. ఒక విమాన నిర్మాణం గురించి ఈ క్రింది విధంగా వివరించబడింది.

విమాన యంత్రాన్ని పాదరసంతో నింపి, పైభాగంలో మంటతో వేడి చేసినట్లయితే, సింహంవంటి గర్జనతో ఆ విమానం శక్తి పుంజుకుని, మరుక్షణంలో ఆకాశంలోకి ఎగిరిపోతుందనేది ఆ వివరణ. ఇలా వాయుగతి శాస్త్ర వివరణలు వేదాలలో ఉన్నాయి.

రామాయణంలో పుష్పక విమానవర్ణనను, దాని వేగాన్ని చూడగలం విశ్వకర్మచే నిర్మితమై పుష్పక విమానం మేరు పర్వతంపై ఉండేది. ఆ విమాన భాగాలన్నీ బంగారంతో చిత్రవిచిత్రంగా అమర్చబడి ఉన్నాయి.

వైఢ్యూర్యమణిమయమైన ఆ విమానం ధగధగా మెరిసి పోతోంది. విమానంలో ఎన్నో వేది కలు, మంటపాలున్నాయి. అంతే కాదు. ఆ విమానంలో కాంచన హర్మ్యలు నిర్మించబడి. వాటి శిఖరాలు స్ఫటికాలు, వైఢూర్యాలతో తాపడం చేసి ఉన్నాయి.

విమాన అంతస్తు కిటికీలకు ముత్యాలు, మణులు, పొదగబడి ఉన్నాయి. దానిపై బంగారు ధ్వజాలు, తెల్లటి పతకాలు తాపడం చేసి ఉన్నాయి. ఆ విమానం ఆకాశంలో మధుర ధ్వనులు చేస్తూ, దానికి కట్టి ఉన్న చిన్న చిన్న గంటలూ, పెద్ద పెద్ద గంటలూ గణగణ మోగుతూ మనోవేగంతో పోసాగింది. ఆ విమానంలో ఉన్న సీతారామ లక్ష్మణులు, సుగ్రీవ సహిత వానర సమూహం, విభీషణ పరివారం ఎక్కి అయోధ్యకు పయనమయ్యారనేది కథ.

గర్భస్థ శిశువు మన మాటలను వింటుందట..!

గర్భిణీ స్త్రీలను వీలైనంత ప్రశాంతంగా ఉండమని చెబుతుంటారు. ఎంత మంచి మాటలు వింటే అంత మంచిదని, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటే శిశువు అంత ఆరోగ్యంగా పుట్టి పెరుగుతుందని సూచిస్తుంటారు. అంతేకాదు.. గర్భస్థ శిశువు మన మాటలను వింటుంది.

నేర్చుకోవడం అనేది గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమౌతుందని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. ఇదే విషయాన్ని ఆధ్యాత్మిక పరంగా పురాణాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

అభిమన్యుడు పెరిగి పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదని, తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు.

అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. కనుకనే తర్వాతి కాలంలో అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే రాక్షస రాజు హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉండగా నారదుడి మాటలు విని ఆకళింపు చేసుకున్నాడు. అందువల్లనే పుడుతూనే విష్ణుభక్తుడు అయ్యాడని చెప్తారు. నారదుడు లీలావతికి చేసిన ఉపదేశం ఆమె కంటే కూడా ఆమె గర్భంలో పెరుగుతున్న ప్రహ్లాడునికే ఎక్కువ ఉపయోగపడిందని పురాణాలు చెబుతున్నాయి.

ఆహారం తీసుకునేటప్పుడు తుమ్మితే ఏం చేయాలి?

దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు.

ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు.

అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు చెబుతున్నాయి. దొండకాయ తింటే వెంటనే బుద్ధి నశిస్తుంది. రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకునుగాని, పాత్రనుగాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు.

రాత్రి తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్ళు చల్లడం, దేవతను స్మరింపచేయడం ఆచారంగా ఉంది. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపివాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది. రాత్రిళ్లు కాచిన పెరుగును మజ్జిగపులుసు మొదలైనవి) వాడకూడదు.

ఆవునేయి కంటికి మంచిది. ఆవు మజ్జిగ చాలా తేలికైనది. అందులో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుందని, పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. తేగలు, బుర్రగుంజు, జున్ను, తాటిపండు మొదలైనవి వేదవేత్తలు తినరు. మునగ, పుంస్త్వానికి (మగతనానికి) మంచిదంటారు.

ఆకలితో బాధపడేవారు కోడి, కుక్క మొదలైనవి చూస్తూ ఉండగా తినకూడదన్నారు.
దృష్టిదోషం పోవడానికి ఇది చదవాలి.
అన్నం బ్రహ్మ రసోవిష్ణు: బోక్తా దేవో మహేశ్వర:
ఇతి సంచింత్య భుంజానం దృష్టిదోషో నబాధతే
అంజనీగర్భంసంభూతం కుమారం బ్రహ్మచారిణం
దృష్టిదోషవివానాశాయ హనుమంతం స్మరామ్నహం||
అనగా అన్నం బ్రహ్మం, అన్నరసం విష్ణురూపమై ఉన్నది. తినువాడు మహేశ్వరుడు, ఇట్లా చింతిస్తే దృష్టిదోషం ఉండదని పండితులు అంటున్నారు.

మంచి నడవడికకు 9 సూత్రాలు.. అవేంటో తెలుసుకుందామా..?

సమాజం అనేది భిన్నమతాలు, భాషలు, కులాలతో కూడిన మనుష్యుల సమూహం. ఏ ఒక్కరూ ఏకపక్షంగా, ఒంటరిగా జీవించలేరు. సంఘీభావంతో అనేకులతో కలసి జీవించాలి. నిత్యం మనకు ఎదురుపడే రకరకాల మనుష్యులను అర్థం చేసుకున్ని వారికి తగ్గటుగా ప్రవర్తించాలి. ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకుని నేర్పుతో జీవిస్తేనే గౌవరం సిద్ధిస్తుంది.... అని భర్తృహరి 'నీతిశతకం' చెబుతుంది.

మంచి నడవడికకు తొమ్మిది సూత్రాలను చెబుతారు.
1. స్వజనుల పట్ల దాక్షిణ్యభావం. 2. సేవకుల పట్ల దయాగుణం. 3. దుష్టుల పట్ల అప్రియభావం. 4. సాధువుల పట్ల ప్రీతి. 5. పండితుల పట్ల గౌరవం. 6. శత్రువుల పట్ల పరాక్రమం. 7. పెద్దల పట్ల సాహస భావం. 8. కోపతాపాలు ప్రదర్శించకూడదు. 9. స్త్రీల పట్ల దిట్టభావం... తప్పనిసరిగా కలిగివుండాలి.

స్వజనులు అంటే బంధువులు. బంధువులతో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కలసిమెలసి ఉండాలి. ఒకరు సమస్యల్లో ఉంటే మరొకరు సాయం చేయడానికి ముందుకు రావాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవించాలి. సేవకులను బానిసలుగా భావించకూడదు. వారిశ్రమను దోపిడి చేయకూడదు. వారిపట్ల జాలి, దయ, కరుణ చూపాలి. చెడ్డవారితో స్నేహం పాము విషంతో సమానం.

సాధువులు అంటే మతపెద్దలు. వీరిని గౌరవంగా చూడాలి. భక్తి వినయం వంటివి హృదయం నుంచి పుట్టుక రావాలి. మోక్షం పేరుతో నిరుపేదలకు దాన ధర్మాలు విరివిగా చేయాలి. ఆత్మశుద్ధికి ఉపకరించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నాలి. రాజులయిన వారు రాజ్యం పట్ల నీతినిజాయితీలతో ప్రవర్తించాలి. రాజ్యం ప్రజలకు రక్షణ కనిపిస్తుంది.

అజ్ఞానం అనే చీకటిని తరిమి జ్ఞానం అనే వెలుగును ఇచ్చేది పండితుడు. పండితుని ద్వారా భావిపౌరులు తయారయ్యి, దేశపరిస్థితులను నిర్దేశిస్తారు. ఇటువంటి పండితుని పట్ల సదా గౌరవాన్ని కలిగి ఉండాలి. దేశానికి హాని చేసే శత్రుమూకల్ని పరాక్రమంతో పారదోలాలి. జీవితానుభవాలను అనుభవించిన పెద్దలు చెప్పే మాటలను విశ్వసించాలి. తొందపరాటు, కోపతాపాలు ప్రదర్శించకూడదు. స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుష అహంకారంతో స్త్రీలపట్ల చులకన భావం ఉండకూడదు.

మంచిపుస్తకాలు చదవటం, క్రమశిక్షణతో మెలగటం, ప్రకృత్తి పట్ల ప్రేమ దానిని పరిరక్షించడం మొదలైనవి విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలి. మంచి నడవడిక వ్యక్తిత్వ వికాసానికి పునాది. మహత్కార్యలకు వరం. గౌరవానికి హేతువు. కీర్తికి మార్గం. కాబట్టి మనిషికి మంచి నడవడిక చాలా అవసరం. మంచి నడవడికతోనే పురుషులు పుణ్యపురుషులు అవుతారు.    

నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే మీరు ఏం చేస్తున్నారు!?

నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే ఇష్టమైన వారి ముఖాన్ని చూడటం చేస్తారు. మరికొందరు దేవుడి పటాలను చూస్తారు. అయితే నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కళ్లు తెరవాలని పండితులు అంటున్నారు. తర్వాత కుడి అరచేతిని చూసుకోవాలి. కరాగ్రంలో లక్ష్మి, కర మధ్య సరస్వతి, కరమునకు వెనకవైపు గోవిందుడు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రభాత వేళలో కరదర్శనం శుభప్రదం.

శ్లో|| కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |
కర పృష్ఠే చ గోవిందః ప్రభాతే కరదర్శనమ్ ||
దక్షిణహస్తం పురుషార్థాలను పొందడానికి కారణమవుతుంది. పుస్తకాన్ని పట్టుకూంటుంది. రాతలు రాస్తుంది. జపమాల తిప్పుతుంది.

నా కుడిచేతిలో పురుషార్థముంది. ఎడమచేతిలో విజయముందని
"కృతం మే దక్షిణే హస్తే జయో మే సవ్య ఆహితః " అని వేదాలు చెప్తున్నాయి.

ఆయం మే హస్తో భగవానయం మే భగవత్తరః
ఆయం మే విశ్వభేషజోయం శివాభిమర్శినః ||
నా ఈ హస్తం భగవంతుడు. అంతేకాదు.. భగవంతుడిని మించిది కూడా. ప్రపంచానికే ఔషధం వంటిది. ఇదజి స్పర్శమాత్రంతోనే క్షేమాన్ని కలిగిస్తుంది. ఈ మంత్రంలో కరస్పర్శవల్ల రోగం బాగవుతుందని విశ్వాసం. మనచేతుల్లో ఒక రకమైన విద్యుత్ ప్రవాహముందని దాన్ని విధివిధానంగా ప్రయోగిస్తే ఎంతటి జబ్బైనా బాగైపోతుందని పండితులు చెబుతున్నారు.

డబ్బు కావాలా, మనశ్శాంతి కావాలా!

మీకు డబ్బు కావాలా మనశ్శాంతి కావాలా! అని మనం ఎవరినైనా అడిగితే చాలా మంది ముందుగా డబ్బు కావాలని అంటారు. అదే డబ్బున్న వారిని అడిగితే మనశ్శాంతి కావాలని అంటారు. ఇది అక్షరాల నిజం. డబ్బును సంపాదించవచ్చు కానీ, మనశ్శాంతిని సంపాదించడం చాలా కష్టం.

ప్రస్తుతం మన జెట్ యుగంలో ప్రతి ఒక్కటీ వేగమే. అందుకే మనం ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోతున్నాం. అసలు ఇంతకీ మనకి ఏం కావాలి? ఎందుకీ పరుగు? డబ్బు ఎంత సంపాదించినా తృప్తి తీరదు. అదే మనశ్శాంతి కాస్త ఉన్నా తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా భ్రతుకు జీవినం సాగించగలం.

వాస్తు అనేది ఇక్కడే కచ్చితంగా పనిచేస్తుంది. వాస్తురీత్యా గృహము నిర్మిస్తే గృహస్థులకు మనశ్శాంతి లభిస్తుంది. ఎంత డబ్బు ఉన్నా, మనశ్శాంతి లేనప్పుడు ఏం చేస్తారు. డబ్బు సంపాదించిన వారికి మనశ్శాంతి విలువ బాగా తెలుస్తుంది.

వాస్తు పాటిస్తే గృహమునందలి గృహస్థులకు తప్పకుండా మనశ్శాంతి లభిస్తుంది. అయితే వాస్తు పాటించినంత మాత్రాన మీరు కోట్లకు అధిపతులు త్వరగా కాలేరు. ఒక విషయం మాత్రం నిజం. మీకు మనశ్శాంతి లభిస్తుంది. అదే వాస్తు బలం, వాస్తు పాటించి కోట్లకు కోట్లు సంపాదిస్తారు అని ఎవరైనా చెబితే నమ్మాల్సిన అవసరం లేదు. కావాల్సినంత మనశ్శాంతి లభిస్తుంది అంటే మాత్రం నమ్మండి.

వాస్తు పాటిస్తే కచ్చితంగా కోటీశ్వరులు కాలేరు. అయ్యే అవకాశమైతే ఉంటుంది. అయితే తప్పకుండా మీకు మనశ్శాంతి లభిస్తుంది. 

భోజనం చేసిన తరువాత ఆచరించాల్సిన నియమాలు

భోజనం చేసిన తరువాత చాలామార్లు పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఆచమనం చేయాలి. నీటితో కళ్ళు తుడుచుకోవాలి. అగస్త్యుడు మొదలైన వారిని తలుచుకోవాలి. "అన్నం విష్ణు స్వరూపం, ఆత్మ పరిణామ రూపం అనే భావనలతో నేను తిన్న అన్నం బాగా కావాలి. అగస్త్యుడు, అగ్ని, సూర్యుడు, అశ్వని దేవతలు-అను ఈ ఐదుగురిని అన్నం తిన్న తరువాత స్మరిస్తే అన్నం బాగా జీర్ణం అవుతుంది". అనే అర్థం ఇచ్చే శ్లోకం చదవాలి.



ఇదీ శ్లోకం
విష్ణురాత్మా తథైవాన్నం
పరిణామశ్చ వై యథా
సత్యేన తేన మద్భుక్తం
జీర్యతు అన్నమిదం తథా
అగస్తిరగ్నిర్బడబానలశ్చ
భుక్తం మమాన్నం జరయంత్వ శేషం
సుఖంచమే తత్పరిణామ సంభవం
యచ్ఛంత్వరోగం మమచాస్తు దేహం
అంగారక మగస్తించ పావకం సూర్యమశ్వినౌ
పంచైతాన్ సంస్మరేన్నిత్యం భుక్తం తస్యాశు జీర్యతి.

ఇలా చెబుతూ తన చేతితో పొట్టను రాసుకోవాలి. శర్యాతిని, సుకన్య, చ్యవన, ఇంద్ర, అశ్వినీ దేవతల్ని అన్నం తిన్న తరువాత స్మరిస్తే కంటికి మంచిదని ఈ క్రింది శ్లోకం చెబుతోంది.
దీన్ని కూడా చదవాలి.

శర్యాతించ సుకన్యాంచ చ్యవనం శక్రమశ్వినౌ
భోజనాంతే స్మరేన్నిత్యం తస్య చక్షుర్నహీయతే

తిన్న తరువాత వేంటనే నిద్ర పోకూడదు. కఫం, పిత్త ప్రకోపం కలిగి జఠరాగ్ని మందమవుతుంది. తిన్న తరువాత నూరడుగులైనా వేయాలని వైద్య శాస్త్రం చెబుతోంది.