Saturday, June 27, 2015

నిండు నూరేళ్లు… పళ్లు గట్టిగా ఉండాలంటే….?

ఇటీవల … నిజంగా జరిగిన ఘటన… ఓ 90 ఏళ్ల ముసలావిడ కన్నుమూశాక యధావిధిగా అంతిమసంస్కారాలు పూర్తిచేశారు. ఆశ్చర్యంగా దహనం తర్వాత బూడిదలో చూస్తే… ఆవిడ 32 పళ్లు అలాగే గట్టిగా ఉన్నాయి. అబ్బురపడ్డ బంధుమిత్రులతో ఆ ఇంటివాళ్లు చెప్పిన వృద్ధురాలి దంత రహస్యం ఏంటో తెలుసా…?
ఆవిడ ఆహార అలవాట్లు పద్ధతిగా పాటించటంతో పాటు.. వారానికోమారు త్రిఫల చూర్ణం రెండు చెంచాలు రాత్రంతా చెంబుడు నీళ్లలో కలిపి ఉంచి… ఉదయాన్నే అవి అయిపోయేదాకా పుక్కిలించేదట. దానివల్ల పళ్ల చిగుళ్లలో క్రిములతో పాటు… లోలోపల దాక్కున్న బాక్టీరియా సైతం పోయి…. అదిగో అలా 90 ఏళ్లు వచ్చినా… అన్ని పళ్లు… అంతే గట్టిగా ఉన్నాయన్న మాట.
అప్పట్లో… వజ్రదంతి యాడ్ వచ్చేది…. ఒక ముసలి వ్యక్తి చలాకీగా వాల్ నట్ కొరికేవాడు… అది ప్రచార ప్రకటన.. మరి నిజంగా జరుగుతున్నదేంటి…? ఇప్పుడు.. వీధికో దంతవైద్యుడు… అది పట్టణాళ్లో… మరి రాజధానిలో… వీధికి పది అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కారణం… జంక్ ఫుడ్ … అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు… అంటే… మరీ వేడిగా… లేదా టూమచ్ చల్లగా …. తినటం..తాగటం… వీటికి తోడు పిజ్జాలు, బర్గర్లు, పఫ్ లు, వివిధ రకాల కేక్స్… హిమక్రీములు… ఇంకా అనేకం. నాటి తరం వాళ్లు దంపుడు బియ్యంతో పాటు… సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే రకరకాల కూరగాయలు, పళ్లు తినేవాళ్లు. ఎప్పుడో పండగలప్పుడు మాత్రమే…. మిఠాయిలు… మరిప్పుడు… తినాలనిపిస్తే చాలు స్వీట్లు.
ఇక పిల్లలకైతే… పుట్టినప్పుడు మొదలుపెడితే… ఎల్కేజీ, యూకేజీ వచ్చేటప్పటికే.. కేజీల లెక్కన చాక్లెట్లు తిని పళ్లు పుచ్చిపోతున్నాయి. సో.. 90 సంగతి పక్కన పెట్టండి… పాతికేళ్లలోపే పండ్లు కట్టించుకోవాల్సిన పరిస్థితి…అందుకే డెంటల్ డాక్టర్లలోనూ రకరకాల స్పెషలైజేషన్లు… మనం కొనుక్కోవటానికి డిఫరెంట్ టారిఫ్ ల్లో … రకరకాల పళ్లు… కాబట్టి … పళ్లు కాపాడుకోవాలా….? కొనుక్కోవాలా…?
ఇది పూర్తిగా మనమీద ఆధారపడి ఉంది. ఎలా..అంటే…మన ఆహార అలవాట్లు కొద్దిగా మార్చుకోవటం మాత్రమేకాదు.. దంత సంరక్షణ కోసం … మరీ రసాయనిక పేస్టుల మీద ఆధారపడకుండా… సహజమైన ఉత్పత్తులు వాడితే మంచిది.

No comments:

Post a Comment