Sunday, April 19, 2015

ఉదయాన్నే అద్దంలో ముఖం చూసుకుంటే అరిష్టాలే!

సాధారణంగా ప్రతిఒక్కరు ఉదయాన్నే లేవగానే రోజువారి కార్యక్రమాలు ముగించుకుని, తమ ఇష్టదైవాన్ని పూజించుకుంటారు. క్రైస్తవులు యేసు దేవునికి ప్రార్థన చేసుకోవడం, ముస్లిములు మసీదుకు వెళ్లి నమాజు చదువుకోవడం, హిందువులు ఇంట్లోనే పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల గృహంలో వున్న దోషాలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుందని అందరూ ప్రగాఢంగా నమ్ముతారు.

అయితే కొంతమంది మాత్రం వీటన్నింటికి వ్యతిరేకంగా ఉదయాన్నే లేవగానే అద్దంలో ముఖాలను చూసుకోవడం, చుట్టుపక్కల వున్న వస్తువులను చూడటం, ఇంకా తమకు నచ్చిన విధంగా రకరకాల పద్ధతులను అవలంభించడం జరుగుతుంది. కానీ ఇది ఎంతమాత్రం మంచిది కాదని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇలా చేస్తే ఆరోజు తలపెట్టుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయని, ఏ శుభకార్యక్రమం నిర్వహించిన దానికి విరుద్ధంగా సమస్యలు ఏర్పడుతాయని వారు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. అంతేకాదు.. ఉదయాన్నే లేవగానే పెరుగు, నెయ్యి, ఆవాలు, అద్దాలు వంటివి అస్సలు చూడకూడదని వారు హెచ్చరిస్తున్నారు.

కాబట్టి.. రోజంతా శుభప్రదంగా, ఆహ్లాదకరంగా గడిచిపోవాలనుకుంటే.. ఉదయాన్నే లేవగాన్నే లక్ష్మీ కరదర్శనం చేసుకుంటే మంచిది. చేయికి పైభాగంలో లక్ష్మీ, మధ్యభాగంలో సరస్వతి, చివరిభాగంలో గౌరీదేవి వున్నందువల్ల.. ప్రాత:కాలంలో ‘‘కరాగ్రే వసతే లక్ష్మీ.. కరమధ్యే సరస్వతి.. కరమూలే స్థితాగౌరి ప్రభాతే’’ అనే శ్లోకాన్ని చదివి, రెండు చేతులను కళ్లకు అద్దుకోవాలి. ఇలా కాకుండా లేవగానే మూడుసార్లు శ్రీహరి అని తలుస్తూ కరదర్శనం చేసుకుంటే.. ఆ రోజంతా మంచి ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు హిందూ శాస్త్రాల ఆధారంగా పేర్కొంటున్నారు.

ఇంతేకాకుండా.. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి సుమంగళిని, గోవును, వేదవేత్తను, అగ్నిహోత్రాన్ని చూసినా శుభఫలము కలుగుతుంది. మనం గతంలో చేసిన పాపాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. చెడు అలవాట్లకు దూరం అవుతారు. పెళ్లికాని యువతులకు మంచి లక్షణాలు కలిగిన వరుడు లభిస్తాడు. నది, సముద్రం, సరస్సులు వంటి వాటిని చూస్తే.. మన ఇళ్లల్లో వున్న దోషాలు, నష్టాలు పూర్తిగా నశించిపోతాయి. వ్యాపారాలను నిర్వహించుకునేవారికి మంచి లాభాలు అందుతాయి.

ఆరోగ్యరీత్యా ప్రతిరోజు నిద్రనుంచి మేలుకోగానే పసిదోసిళ్ల నీరును తాగితే ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల నిత్యం యవ్వనంగా వుండటంతోపాటు, నలుగురిలో ఎంతో అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తారు. ప్రతిరోజూ ఉదయాన్నే పెద్దలకుగానీ, పిల్లలకుగానీ నీరు తాగడం అలవాటు చేయిస్తే.. వారు జీవితాంతం అజీర్తి, మూత్రపిండాల వంటి వ్యాధుల బారినపడకుండా హాయిగా వుంటారు. హిందూ శాస్త్రాలు, సంప్రదాయాలపరంగా రాగి చెంబుతో నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పండితులు, జ్యోతిష్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు.

No comments:

Post a Comment