Tuesday, June 18, 2013

షుగర్ కంట్రోల్ ఎలా...?!!

డయాబెటిస్ అనేది తీవ్ర అనారోగ్య సమస్య అయింది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి రోగుల సంఖ్య పెరుగుతోంది. నయం చెయ్యడం కుదరని ఈ వ్యాధిని నియంత్రించాల్సి వుంటుంది. అలా నియంత్రించేందుకు కొన్ని చిట్కాలు 

*ప్రతిరోజు ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాస్ నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేవగానే ఆ నీళ్ళు తాగి, నానిన మెంతులు తింటే అది ఇన్సులిన్‌లా పనిచేస్తుందంటారు.

*ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా విత్తనాలు తీసేసిన కాకరకాయ రసాన్ని తాగాలి.

*పచ్చి అరటిపండు పైతొక్క తీసి ఒక పాత్రలో వేసి దానిమీద నీళ్ళు పోసి రాత్రంతా వుంచి తెల్లవారిన తర్వాత ఆ నీటిని మూడు భాగాలు చేసి పగలు మూడుసార్లు తాగాలి.

*ఒక కప్పు నీళ్ళలో మామిడి ఆకులు 13 నుండి 16 వేసి బాగా మరిగించి, రాత్రంతా చల్లారనిచ్చి ఉదయం వడకట్టి ఆ నీటిని పరగడుపున తాగాలి.

*వెల్లుల్లి తినాలి లేదా వెల్లుల్లి కలిగిన మాత్రలు సేవిస్తే షుగర్ వ్యాధి అదుపులో వుంటుంది.

జలుబు వచ్చిందా... వెల్లుల్లి రెబ్బను కొరకుతూ ఉండండి..!!

జలుబును తగ్గించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుందంటారు. వెల్లుల్లిపాయ పైపొర తీసేసి నోట్లో ఉంచుకోవాలి. తరుచుగా ఆ వెల్లుల్లిని కొరుకుతూ దాని నుంచి వచ్చే రసం మింగుతుండాలి. అలా నాలుగైదు గంటలకు ఓసారి కొత్త వెల్లుల్లిపాయను నోట్లో ఉంచుకుని రసం మింగాలి.

ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే ఇబ్బంది ఒకటి రెండు రోజుల్లోనే తొలగిపోతుంది. జలుబు చేసినపుడు ముక్కు దిబ్బడ వల్ల ఇబ్బంది పడుతుంటే వేడి వేడి లేదా మసాలా వాడిన ఆహారాన్ని తీసుకోవాలి. అందువల్ల మూసుకుపోయిన నాసికా రంధ్రాలు తెరుచుకుంటాయి. అనవసరంగా 'నోస్ డ్రాప్స్' లాంటివి కూడా వాడే పరిస్థితి తప్పుతుంది.

కొన్ని నిమిషాలపాటే శక్తి అంతా ఉపయోగించి వ్యాయామం చేసినా ఫలితం వుంటుంది. అప్పుడు మీ శరీరానికి ఆక్సిజన్ అవసరం పెరుగుతుంది. దాంతో మీరు గాఢంగా శ్వాసించడంతో జలుబు వల్ల మూసుకునే నాసికా రంధ్రాలు సహజంగానే తెరుచుకుంటాయి. ఛాతీ దగ్గర ఇబ్బంది కూడా తొలిగిపోతుంది.

జలుబు చేసినపుడు వేడివేడి వెనిగర్ ద్రావణం లేదా వైట్‌వైన్ వాసన పీల్చినా ఫలితం ఉంటుంది. కొన్ని నిమిషాలసేపు వాటి వాసనలు పీలిస్తే ఉపశమనం లభిస్తుంది. బలుబుతోపాటు వచ్చే దగ్గు, గొంతు గరగరలకి కూడా కొన్ని గృహ వైద్య చిట్కాలున్నాయి. ఓ పెద్ద నిమ్మకాయను తీసుకుని దానంతట అది రెండుగా విడిపోయేదాకా నెమ్మదిగా వేయించి, అప్పుడు దాని రసం తీసి దానికి అరస్పూన్ తేనే కలిపి తాగాలి. దగ్గు తగ్గుతుందనిపించేంత వరకూ గంటకోసారి ఇలా చేస్తుండాలి.

మహా మొండి చుండ్రు.. వదలగొట్టుకునేదెలా...?!!

చుండ్రుకు బాహ్యకారణాలు దారితీస్తాయని అందరూ సాధారణంగా భావిస్తారు. జీన్స్, చర్మతత్వాలు అంతర్గతంగా ప్రధాన పాత్ర వహించే కారణాలు. ఇతర బాహ్యకారణాలు చర్మ పరిస్థితిని తీవ్రతరం చేస్తాయి. సాధారణ ఆరోగ్య స్థితిగతులు చుండ్రుకు దారితీస్తాయన్నది నిపుణుల అభిప్రాయం.

ఎలా నివారించాలి :
నిజం చెప్పాలంటే చుండ్రు నివారణకు ప్రత్యేక చికిత్స లేదు. చుండ్రును నియంత్రించే ఉద్దేశ్యంతో రూపొందించిన షాంపూలు చర్మ పరిస్థితిని నియత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. షాంపూను తలకు పట్టించి, మరగ వచ్చేవరకు రుద్ది కడిగేయడం వల్ల ఎటువంటి ఫలితమూ వుండదు. మాడుపై షాంపూ అప్లయ్ చేశాక కనీసం ఏడెనిమిది నిమిషాలు అలా ఉంచేసుకుని కడగాలి. దీనివల్ల యాంటీ ఫంగల్ లక్షణాలు బాగా పనిచేస్తాయి.

ఎందుకు తొలగించాలి :
చుండ్రువల్ల జుట్టురాలిపోతుంది. ముఖం, వీపు, మెడమలపై మొటిమలకు కారణమయ్యే అవకాశం ఉంది. చుండ్రుతోపాటు ముఖంపై అవాంఛిత రోమాలు, స్థూలకాయం, పాలిసిస్టిక్ ఓవరియస్ సిండ్రోమ్ వుందేమో తెలిపే వైద్య పరీక్ష చేయించుకోవాల్సి వుంటుంది.

చుండ్రుతో తరచూ ఇబ్బందిపడే వారు మాడుపై పొట్టురేగడం తగ్గగానే, యాంటీడాంట్రఫ్ షాంపూ వాడకూడదు. చాలా మంది స్త్రీ, పురుషులకు వేర్వేరు షాంపూలుంటాయని అంటుంటారు. కాని ఇది నిజంకాదు. చుండ్రుకు లింగవివక్ష వుండదు. చికిత్స ఎవరికైనా ఒక్కటే.

వేడినీటి స్నానంతో విసుగు, చికాకులను వాష్ చేసేయండి...

రోజంతా పని...పని విపరీతమయిన అలసటతో ఇంటికి చేరగానే హాయిగా వేడినీటితో వీలైనంత ఎక్కువసేపు స్నానం చేస్తే ఆ పని తాలుకూ ఒత్తిడులన్నీ దూరం అవుతాయి. వేడినీటి స్నానంతో విసుగును, చిరాకును వాష్ చేసేయవచ్చు. శరీరంలో సెన్సులన్నీ చురుగ్గా మారేందుకు, వేడెక్కిన ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి ప్రశాంతంగా మారేందుకు దీనికి మించిన మందు బహుశా లేనేలేదు.

చర్మానికి కూడా మంచిది. నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నీటిలో కలుపుకుంటే మనస్సంతా తేలిక పడుతుంది. మంచి మూడ్‌లోకి వచ్చేస్తారు. సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకోండి. తడి టవల్‌ను తలకు చుట్టుకుని కొద్దిసెపు రిలాక్సవ్వండి. మంద్రమైన సంగీతాన్ని ఆస్వాదించండి. ఇలా చేయడం వలన కొద్ది నిమిషాల తరువాత అద్భుతమయిన ఆనందం స్వంతం అవుతుంది. కాంతులతో తాజాగా బయటకు వచ్చేస్తారు.

శిరోజ సంరక్షణ కోసం....

శిరోజాల కొసలు చిట్లుతుంటే గోరువెచ్చని ఆముదంలో ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించండి. శిరోజాలను టవల్‌తో చుట్టి ఒక అరగంట సేపు అలా ఉంచండి. తర్వాత షాంపూతోపాటు గుడ్డలోని పచ్చసోనను కలిపి తలంటి స్నానం చేయండి.

మరో చిట్కా- గ్యాలన్ చన్నీటికి అరకప్పు యాపిల్ సిడెర్ వెనిగర్‌ను కలిపి ఆ నీళ్ళతో శిరోజాల్ని శుభ్రం చేసుకోవాలి. శిరోజాలపై ఏమీ మిగలకుండా మంచి నీళ్ళతో మళ్ళీ మళ్ళీ శుభ్రం చేసుకోవాలి.

జుట్టు పలచబడుతున్నట్టయితే సల్ఫర్ అధికంగా వున్న ఆహారాలను ఎక్కువుగా తీసుకోండి. క్యాబేజి, బ్రస్సెల్స్, మొలకెత్తిన గింజలు, క్యాలీఫ్లవర్లో సల్ఫర్ ‌అధిక మోతాదులో వుంటుంది. బి విటమిన్లు అధికంగా వున్న ఆహారాలను కూడా ఎక్కువుగా తినాలి

పురుషుల పల్చని జుట్టుకు ఎలాంటి చికిత్స చేయాలి?

మహిళలకు సమానంగా పురుషులు వివిధ హెయిర్ స్టయిల్స్‌పై మక్కువ చూపుతున్నారు. అయితే జట్టు మాత్రం పల్చగా ఉందని బాధపడుతున్నారా అయితే ఏం చేయాలంటే.. ఆకుకూరలు, కాయగూరలు వంటివి తీసుకుంటూనే.. స్టయిలింగ్ జెల్స్ వాడండి.

* స్ప్రే జెల్స్ చిన్ని చిన్ని పాలిమర్స్ డ్రాప్ లెట్స్‌ను వెలువరిస్తాయి. తద్వారా మీకు నచ్చిన స్టయిల్లో హెయిల్ స్టయిల్ చేసుకోవచ్చు.
* ఇక పోమేడ్స్ నూనె ఆధారితంగా ఉండి జుట్టుకు అదనపు మెరుపునిస్తాయి.
* హెయిర్ వ్యాక్స్‌లు వాడితే శిరోజాలను దగ్గరగా పేర్చి గట్టిగా ఉండేలా చూపుతాయి.
* పేస్ట్ ఆయిల్, వ్యాక్స్ కలయికతో ఉంటుంది.

* హెయిర్ క్రీమ్స్, నూనె, వ్యాక్స్, పాలిమర్స్ కలగలిసి ఉండి పూర్తిస్థాయి నియంత్రణకు అవకాశం ఇస్తాయి. ఏది ఎంచుకున్నావిడిగా, దానిపై సూచనల మేరకు వాడాలి. కొద్దిపాచి జెల్ చాలు. అరచేతిలో వేసుకుని శిరోజాలకు పట్టించాలి. మాడు పొడిగా ఉన్నా, చుండ్రు ఉన్నా ఆల్కహాల్ లేని స్టయిలింగ్ జెల్ వాడాలి.

మీ కళ్ళు తాజాగా వుండాలంటే ఏం చేయాలి?

ఆపిల్ పండు ముక్కలను మరిగించి వడకట్టి చల్లారిన తర్వాత తేనెకలిపి ఆ నీటిని కంటిని శుభ్రపరిచేందుకు వాడుకుంటే కళ్ళు తాజాగా ఉంటాయి. ఆపిల్ రసము తీసుకుంటే మలబద్ధకం తగ్గిపోతుంది.

అలాగే హృదయ రుగ్మతలకు అక్రోట్ అంజూ పండ్లు తీసుకుంటే హృదయశూల తగ్గుతుంది. కమలాపండు రసం తాగితే దంతాలలో ఏర్పడే రంధ్రాలను తొలగిస్తుంది. లేత మామిడి చిగురు పంటి నొప్పులు, దగ్గులను తగ్గిస్తుంది.

మ్యాంగ్ షెల్‌లను రోజుకు రెండుసార్లు తాగితే బరువు పెరుగుతారు. ఇక నారింజ పెచ్చులు నాలుగు గ్రాములను రెండు కప్పుల నీటితో కాచి ఆ కషాయాన్ని సేవిస్తే గర్భస్రావం జరగకుండా నివారిస్తుంది.