Showing posts with label పులుసులు. Show all posts
Showing posts with label పులుసులు. Show all posts

Monday, May 7, 2012

మునక్కాయ తీపి పులుసు

కావలసిన పదార్థాలు

  • మునక్కాయలు. 4
  • చింతపండు. 2 నిమ్మకాయలంత
  • వరిపిండి. 2 టీస్పూ//
  • బెల్లం. కాస్తంత
  • ఉప్పు. సరిపడా
  • పసుపు. చిటికెడు
  • కారంపొడి. 2 టీస్పూ//
  • మసాలాపొడి.4 టీస్పూ//

తయారీ విధానం

మునక్కాయలను కోసి పక్కన ఉంచాలి. చింతపండును రసంతీసి ఉంచాలి.
అందులో ఉప్పు, పసుపు, కారం, మునక్కాయ ముక్కలు వేసి ఉడికించాలి.
ఇవి ఉడికేటప్పుడే వరిపిండి, బెల్లం కూడా కలిపి ఉడికించాలి.
మునక్కాయ ముక్కలు ఉడికిన తరువాత మసాలాపొడి వేసి బాగా కలిపి సన్నటి మంటమీద కాసేపు ఉంచి దించేస్తే మునక్కాయ తీపి పులుసు తయారైనట్లే.
పులుసు మరింత కారంగా కావాలనుకునేవారు కారంపొడి మోతాదును పెంచుకోవచ్చు.

బచ్చలి పులుసు


Picture  Recipe 

కావలసిన పదార్థాలు

  • అల్లం. 1/4 కేజీ
  • చింతపండు. తగినంత
  • బెల్లం తరుగు. 3 టీస్పూ//
  • నీళ్లు. 3 కప్పులు
  • వెల్లుల్లి. 5 రేకలు
  • ఉప్పు. తగినంత
  • పసుపు. చిటికెడు
  • నూనె. 2 టీస్పూ//
  • ఉల్లిపాయలు. 3
  • కరివేపాకు.. 2 రెమ్మలు
  • ఆవాలు.. ¼ టీస్పూ//
  • మెంతులు.. ½ టీస్పూ//
  • కొత్తిమీర.. 1 కట్ట

తయారీ విధానం

బచ్చలి కూరను కడిగి సన్నగా తరిగి బాణెలిలో వేయాలి. దీనికి ఉప్పు, పసుపు, చింతపండురసం చేర్చి ఉడికించాలి. పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి అందులో వేయాలి.
తరువాత సగం కప్పు నీళ్లలో బియ్యంపిండి కలిపి, దీన్నిపులుసులో వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించాలి.
ఆవాలను కొద్ది నీళ్లతో కలిపి రుబ్బి ఇందులో వెయ్యాలి. తరువాత మెంతులు, ఎండుమిర్చితో పోపు వేస్తే బచ్చలి పులుసు రెడీ అయినట్లే. 

మజ్జిగ పులుసు


కావలసిన పదార్థాలు

  • పచ్చి కొబ్బరి: 1 చిప్ప
  • పచ్చిమిరపకాయలు: 4 పెద్దవి
  • అల్లం చిన్నముక్క
  • ఆవాలు: ¼ టీస్పూ//
  • కొత్తిమీర కొంచెం
  • ధనియాలు: 1 టీస్పూ//
  • శనగ పప్పు: 1 టీస్పూ// (ముందుగా నానబెట్టుకోవాలి)
  • పసుపు చిటికెడు
  • పై పదార్ధాలన్ని కలిపి మెత్తగా ముద్దలాగా చెసుకోవాలి. కొంచెం మజ్జిగ కూడా కలిపి పల్చగా రుబ్బుకోవాలి.
  • చిక్కటి మజ్జిగ: 1/2 లీటరు
  • ఉప్పు తగినంత
  • కావలసిన కూరముక్కలు: బెండకాయ, ములక్కాడలు, క్యారెట్,సొరకాయ,టమాట,బచ్చలి కూర ఏదైన ఒకటి, లేక అన్నీ కూడా వేసుకోవచ్చు

తయారీ విధానం

ముందుగా కావలసిన కూరముక్కలని ఉప్పు లేకుండా ఉడికించుకోవాలి.
ఉడికిన కూరముక్కలు మిగిలిన మజ్జిగ, పైన రుబ్బుకున్న ముద్ద కలిపి 10 నిమిషాలు ఉడికనివ్వాలి.
స్టవ్ మీద నించి దించి కొంచెం చల్లరాక ఉప్పు వేసుకోవాలి.
స్టవ్ మీద వున్నప్పుడు లేదా వేడిగ వున్నప్పుడు ఉప్పు వేస్తె మజ్జిగ విరిగిపోయే ప్రమాదం వుంది.
ఒక మూకుడులో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఎండుమిరపకాయలు, తాజా కరివేపాకు పోపు వేసుకుని పై మజ్జిగ పులుసులో కలుపుకోవాలి. 

వంకాయ రసం


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • వంకాయలు. 100 గ్రా.
  • మిరియాల పొడి. 1 టీస్పూ//
  • జీలకర్ర పొడి. 1టీస్పూ//
  • ఎండు మిర్చి పొడి. 2 టీస్పూ//
  • టొమోటో. 1
  • చింతపండు. తగినంత
  • ఇంగువ పొడి.. చిటికెడు
  • పసుపు పొడి.. చిటికెడు

తయారీ విధానం

లేత వంకాయలను తీసుకుని నూనెలో వేయించాలి.
వేయించిన తర్వాత అందులోనే మిరియాలపొడి, జీలకర్ర, పసుపు, ఇంగువ పొడులను చేర్చాలి.
దానికి కాస్తంత చింతపండు రసాన్ని కలిపి, ఉప్పు కావలసినంత చేర్చి ఉడికించాలి. చింతపండు రసం వద్దనుకునేవారు టొమోటో రసాన్ని చేర్చుకోవచ్చు.
కాసేపటికి కొత్తిమీర తరుగుల్ని చేర్చి ఆ తరువాత చారును దించేయాలి. 

మెంతి ఆకులతో చారు


Picture  Recipe


కావలసిన పదార్థాలు

  • మెంతి ఆకులు.. గుప్పెడు
  • చింతపండు. నిమ్మకాయంత
  • ఉప్పు.. సరిపడా
  • పసుపు.. చిటికెడు
  • పచ్చిమిర్చి. 4
  • ఉల్లిపాయ. 1 (చిన్నది)
  • ఎండు మిర్చి. 3
  • ఆవాలు, 1 టీస్పూ//
  • మినపప్పు, 1 టీస్పూ//
  • జీలకర్ర, 1 టీస్పూ//
  • మెంతులు. 1 టీస్పూ//
  • కరివేపాకు. కొద్దిగా
  • వెల్లుల్లి. 2 రేకలు
  • నూనె. 2 టీస్పూ//

తయారీ విధానం

ఒక లీటరు నీటిలో చింతపండు, మెంతి ఆకులు, ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరిగించి దించాలి.
బాణలిలో నూనె వేసి పైన చెప్పిన పోపు సామగ్రి అంతా వేయించి చారులో కలపాలి.
ఈ మెంతి ఆకుల చారు మధుమేహ (షుగర్) వ్యాధి ఉన్న వారికి చాలా మంచిది.

పచ్చిపులుసు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • రసం. తగినంత
  • ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు. 1 కప్పు
  • పెద్ద వంకాయ. 1
  • బెల్లం. కొద్దిగా
  • పచ్చిమిరపకాయల తరుగు . 2 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • నూనె. 2 టీస్పూ//.
  • పోపు కోసం
  • మినప్పప్పు, ఆవాలు. తగినన్ని
  • ఇంగువ. కాస్తంత

తయారీ విధానం

చింతపండును నానబెట్టి పులుసు తీసుకోవాలి. వంకాయకు కాస్తంత నూనెరాసి నిప్పులపై కాల్చి లోపలి గుజ్జునంతా తీసి పక్కన ఉంచాలి.
తగినంత నూనె వేసి మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేయించాలి.
అవి చిటపటలాడాక ఉల్లి ముక్కలను, వంకాయ గుజ్జును చేర్చి దోరగా వేయించాలి.
ఇప్పుడు అందులో చింతపండు పులుసు పోసి. ఇంగువ, పసుపు, ఉప్పు వేసి దించేయాలి. అంతే పుల్లగా, కారంగా, పచ్చిగా ఉండే పచ్చిపులుసు రెడీ.

పాలకూర పెరుగు పులుసు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పాలకూర. 4 కట్టలు
  • పెరుగు. 3 కప్పులు
  • జీలకర్ర. 1/4 టీస్పూ//.
  • పచ్చిమిర్చి. ఐదు
  • బియ్యం. ఐదు టీస్పూ//.
  • కొబ్బరి. చిన్నముక్క
  • ధనియాలు. 1/2 టీస్పూ//.
  • ఆవాలు. 1 టీస్పూ//.
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • ఎండుమిర్చి. 2
  • నూనె. 2 టీస్పూ//.
  • ఉప్పు. సరిపడా.

తయారీ విధానం

పెరుగును గిలకొట్టి కప్పు నీళ్లు పోసి ఉంచాలి. ఇప్పుడు బియ్యం, పచ్చిమిర్చి, కొబ్బరి, ధనియాలు కలిపి మెత్తగా నూరాలి.
ఈ ముద్దను మజ్జిగలో కలిపి స్టవ్‌మీద పెట్టి మరిగించాలి. తరవాత బాగా కడిగి సన్నగా తరిగిన పాలకూరను మజ్జిగలో కలిపి ఐదునిమిషాలు ఉడికించి ఉంచాలి.
చిన్న బాణెలిలో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిలతో తాలింపు వేసి, మజ్జిగలో కలపాలి.
చివరగా ఉప్పు సరిజూసి దించేయాలి. అంతే పాలకూర పెరుగు పులుసు రెడీ.

ఉల్లికారం పులుసు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • చిన్న ఉల్లిపాయలు. 1/4 కేజీ
  • చింతపండు గుజ్జు. 2 కప్పులు
  • కొత్తిమీర తురుము. కొద్దిగా
  • పచ్చిమిర్చి. 3
  • ఎండుమిర్చి. 2
  • కారం. 2 టీస్పూ//.
  • ధనియాలపొడి. 3 టీస్పూ//.
  • అల్లం వెల్లుల్లి. 1 టీస్పూ//.
  • ఆవాలు, జీలకర్ర. చెరో 1/4 టీస్పూ//.
  • పసుపు. 1/4 టీస్పూ//.
  • బెల్లంపొడి. 1 టీస్పూ//.
  • శెనగపిండి. 1 టీస్పూ//.
  • కరివేపాకు. 2 రెమ్మలు
  • ఉప్పు. తగినంత

తయారీ విధానం

ఓ బాణెలిలో నూనె పోసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
ఉల్లిపాయలు వేసి ఉప్పు, పసుపు చల్లి మూతపెట్టి సన్నసెగమీద కాసేపు మగ్గనివ్వాలి. తరవాత అల్లంవెల్లుల్లి వేసి మంచి వాసన వచ్చేవరకూ వేపి కారం, ధనియాలపొడి చల్లాలి.
అందులోనే చింతపండు గుజ్జు వేసి నీళ్లుపోసి ఉడికించాలి. కొద్దిగా ఉడికిన తరవాత బెల్లంపొడివేయాలి.
చివరలో శెనగపిండి కలిపిన నీళ్లు పోసి మూతపెట్టి చిక్కబడేవరకూ ఉడికించి కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే ఘుమఘుమలాడే ఉల్లికారం పులుసు రెడీ. 

ఉసిరికాయలతో రసం


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • ఉసిరికాయలు. 8
  • ఎండుమిర్చి. 2
  • ఆవాలు. 1/4 టీస్పూ//.
  • జీలకర్ర. 1/4 టీస్పూ//.
  • వెల్లుల్లి. 5 రెబ్బలు
  • ధనియాల పొడి. 1.1/2 టీస్పూ//.
  • మిరియాల పొడి. 1/4 టీస్పూ//.
  • కరివేపాకు. 2 రెమ్మలు
  • కొత్తిమీర. 1 కట్ట
  • ఉప్పు. తగినంత

తయారీ విధానం

ఉసిరికాయలను రెండుగా విడదీసి ఆ ముక్కల్లో రెండు గ్లాసుల నీళ్లు పోసి ఉడికించి, తరవాత వడగట్టాలి.
విడిగా ఓ గిన్నెను తీసుకుని కొద్దిగా నూనెవేసి ఆవాలు, జీలకర్రలతో పోపుపెట్టి అందులో పప్పుతేట, వడగట్టిన ఉసిరిరసం కలిపి స్టవ్‌మీద పెట్టాలి.
రసం కాస్త మరగగానే దంచిన వెల్లుల్లి, ధనియాలపొడి, మిరియాలపొడి, కొత్తిమీర, కరివేపాకు వేసి ఐదునిమిషాల తరువాత దించాలి.
చివరగా ఉప్పు సరిచూడాలి.అంతే ఉసిరికాయలతో రసం రెఢీ.

మెంతులతో పులుసు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • మెంతులు. 200 గ్రా.
  • జీలకర్ర. 2 టీస్పూ//.
  • అల్లంముక్క. చిన్నది
  • పసుపు. 1/2 టీస్పూ//.
  • చింతపండు. 50 గ్రా.
  • ఉప్పు. సరిపడా
  • పంచదార. నాలుగు టీస్పూ//.
  • నూనె. ఆరు టీస్పూ//.

తయారీ విధానం

మెంతులు నానబెట్టి ఉంచాలి. చింతపండును కూడా నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టిన మెంతులను నీటిలో ఉడికించి, నీళ్లు వార్చేయాలి.
పొయ్యిమీద బాణెలి పెట్టి నూనె వేసి, బాగా కాగాక జీలకర్ర వేసి కొద్దిగా నీరుపోసి మెంతులను వేయాలి.
సన్నగా తరిగిన అల్లం ముక్కలను కూడా అందులోనే వేసి ఉడికించాలి.
తరువాత చింతపండు పులుసు పోసి, కొంచెం ఉడికిన తరువాత పంచదార, పసుపు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉడికిన తరువాత దించేయాలి. అంతే మెంతులతో పులుసు రెఢీ.

అరటికాయ పులుసు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • అరటికాయలు. 5
  • ఉల్లిపాయలు. 3
  • పచ్చిమిర్చి. 5
  • కరివేపాకు. 3 రెమ్మలు
  • వెల్లుల్లి.. ½ పాయ
  • ఎండుమిర్చి.. 5
  • చింతపండు. 100 గ్రా.
  • నూనె.. 150 గ్రా.
  • ఉప్పు, కారం.. తగినంత
  • ధనియాలపొడి.. 2 టీస్పూ//
  • పసుపు. 1/2 టీస్పూ// .
  • టొమోటోలు. ½ కేజీ
  • బెల్లం. 100 గ్రా.

తయారీ విధానం

ముందుగా అరటికాయను ముక్కలుగా కోసి పసుపు, ఉప్పు వేసి ఉడికించి పక్కనుంచాలి.
బాణెలి లో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి కాసేపు వేయించాలి.
ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను కూడా వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి.
ఉప్పు, కారం, ధనియాలపొడి కూడా వేసి కలియబెట్టి చింతపండు రసం, ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కలిపి బాగా ఉడికించి దించేయాలి. అంతే వేడి వేడి అరటికాయ పులుసు తయార్.

అల్లం పులుసు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • అల్లం. 1/4 కేజీ
  • చింతపండు. తగినంత
  • బెల్లం తరుగు. 3 టీస్పూ//
  • నీళ్లు. 3 కప్పులు
  • వెల్లుల్లి. 5 రేకలు
  • ఉప్పు. తగినంత
  • పసుపు. చిటికెడు
  • నూనె. 2 టీస్పూ//
  • ఉల్లిపాయలు. 3
  • కరివేపాకు.. 2 రెమ్మలు
  • ఆవాలు.. ¼ టీస్పూ//
  • మెంతులు.. ½ టీస్పూ//
  • కొత్తిమీర.. 1 కట్ట

తయారీ విధానం

ముందుగా చింతపండును పది నిమిషాలపాటు నానబెట్టాలి. అల్లం మెత్తగా గ్రైండ్ చేసి ఉంచాలి.
బాణెలి లో నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసి వేయించాలి.
ఆపై ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముద్ద వేసి కలిపి కాసేపు మగ్గనివ్వాలి.
తరువాత తగినంత ఉప్పువేసి చింతపండు పులుసు, బెల్లం తరుగు వేసి కాసేపు మరిగించాలి.
చివర్లో కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే వేడి వేడి అల్లం పులుసు తయార్.

తోటకూర పులుసు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • తోటకూర. 2 కట్టలు
  • ఉల్లిపాయలు. 4
  • టమోటాలు. 4
  • పచ్చిమిర్చి. 6
  • తాలింపుగింజలు. 3 టీస్పూ//
  • పచ్చిశెనగపప్పు. 50 గ్రా.
  • వెల్లుల్లి.. 4 రేకలు
  • ఉప్పు.. సరిపడా
  • కారం. సరిపడా
  • చింతపండు. సరిపడా

తయారీ విధానం

తోటకూరను శుభ్రంగా కడిగి తురుముకోవాలి. ఉల్లి, మిర్చి, టమోటాలను ముక్కలుగా తరుగుకోవాలి.
తరిగినవన్నీ ఒక గిన్నెలో వేసి దానిపై శనగపప్పు చల్లి ఉప్పు వేసి ఉడికించాలి.
తరువాత ఒక బాణెలి లో నూనె పోసి కాగిన తరువాత పోపుపెట్టి ఉడికించిన కూరలో వేయాలి.
దాంట్లో చిక్కగా కలుపుకున్న చింతపండు రసం పోసి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా ఉడకనిచ్చి, దింపేముందు కొత్తిమీర చల్లాలి. అంతే తోటకూర పులుసు సిద్ధం.

మునక్కాయ పప్పుచారు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • మునక్కాయ.1
  • కందిపప్పు. 1 కప్పు
  • టొమోటో. 1
  • ఉల్లిపాయ. 1
  • పచ్చిమిర్చి. 2
  • మెంతిపొడి. 1 టీస్పూ//.
  • చింతపండు. కొద్దిగా
  • పసుపు. చిటికెడు

తయారీ విధానం

పప్పను విడిగా ఉడికించి మెత్తగా మెదిపి పక్కనుంచాలి.
మునక్కాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమోటోలను ముక్కలు చేసుకోవాలి.
చింతపండును నానబెట్టి రసం తీసుకోవాలి.
మరో పాత్రలో పోపుపెట్టి దినుసులు వేసి వేగిన తరువాత ఉల్లిపాయ, టొమోటో ముక్కలు, మిర్చి ముక్కలు వేసి అవి వేగిన తరువాత అందులో చింతపండు రసం పోయాలి.
పులుసు మరిగేటప్పుడు మెంతిపొడి, మెదిపిన పప్పు వేసి కలిపి దించేయాలి.
అంతే వేడి వేడి మునక్కాయ పప్పుచారు సిద్ధం.
ఇందులో కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేదా పోపులో కరివేపాకు వేస్తారు కాబట్టి మానేయనూ వచ్చు. 

గుమ్మడి పప్పు పులుసు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • కందిపప్పు... 1/4 కేజీ
  • గుమ్మడికాయ... 100 గ్రా
  • పసుపు... 1/2 టీస్పూ//
  • తరిగిన ఉల్లిపాయ... 1
  • కారం... 1/2 టీస్పూ //
  • యాలకులు... 2
  • లవంగాలు... 2
  • దాల్చిన చెక్క... అంగుళం ముక్క
  • షాజీరా... 1/2 టీస్పూ //
  • ఎండుమిర్చి... 2
  • కరివేపాకు... 4 రెబ్బలు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్... 1 టీస్పూ //
  • చింతకాయలు... 5
  • గరంమసాలా పొడి... 1/2 టీస్పూ//
  • ఉప్పు... రుచికి సరిపడా
  • నెయ్యి... 2 టీస్పూ //

తయారీ విధానం

గుమ్మడికాయను ముక్కలుగా తరిగి పక్కనుంచుకోవాలి. కందిపప్పును కుక్కర్‌లో మెత్తగా ఉడికించాలి.
చింతకాయల్ని ఉడికించి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. బాణెలి లో నెయ్యి వేడిచేసి ఆవాలు, జీలకర్ర, గరంమసాలా దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
అందులోనే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దోరగా వేయించాలి.
తరువాత గుమ్మడికాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు కలిపి ఐదునిమిషాలపాటు వేయించాలి.
బాగా వేగిన తరువాత కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టి సన్నటి సెగమీద ఉడికించాలి.
గుమ్మడి ముక్కలు మగ్గిన తరువాత చింతపులుసు వేసి ఉడికించి, మెదిపి ఉంచుకున్న పప్పు, గరంమసాలా పొడి వేసి ఉడికిన తరువాత దించీవేయాలి.