Monday, May 7, 2012

మునక్కాయ పప్పుచారు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • మునక్కాయ.1
  • కందిపప్పు. 1 కప్పు
  • టొమోటో. 1
  • ఉల్లిపాయ. 1
  • పచ్చిమిర్చి. 2
  • మెంతిపొడి. 1 టీస్పూ//.
  • చింతపండు. కొద్దిగా
  • పసుపు. చిటికెడు

తయారీ విధానం

పప్పను విడిగా ఉడికించి మెత్తగా మెదిపి పక్కనుంచాలి.
మునక్కాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమోటోలను ముక్కలు చేసుకోవాలి.
చింతపండును నానబెట్టి రసం తీసుకోవాలి.
మరో పాత్రలో పోపుపెట్టి దినుసులు వేసి వేగిన తరువాత ఉల్లిపాయ, టొమోటో ముక్కలు, మిర్చి ముక్కలు వేసి అవి వేగిన తరువాత అందులో చింతపండు రసం పోయాలి.
పులుసు మరిగేటప్పుడు మెంతిపొడి, మెదిపిన పప్పు వేసి కలిపి దించేయాలి.
అంతే వేడి వేడి మునక్కాయ పప్పుచారు సిద్ధం.
ఇందులో కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేదా పోపులో కరివేపాకు వేస్తారు కాబట్టి మానేయనూ వచ్చు. 

No comments:

Post a Comment