Thursday, May 17, 2012

వంకాయ కొబ్బరికూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు :


  • వంకాయలు. 1/4 కేజీ
  • పచ్చికొబ్బరి చిప్ప. 1
  • తెల్ల నువ్వులు. 50 గ్రా.
  • గసగసాలు. 2 టీస్పూ//
  • పచ్చిమిరపకాయలు. 8
  • నూనె. 1/2 కప్పు
  • పసపు. చిటికెడు
  • ఉప్పు. తగినంత

తయారు చేయు విధానం :


వంకాయల్ని గుత్తివంకాయ కూరలో మాదిరిగా కోసి నీళ్లలో వేయాలి.
కొబ్బరి, నువ్వులు, గసగసాలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు మెత్తగా గ్రైండ్‌ చేసి కాయల్లో కూరాలి.
తరువాత బాణెలి లో నూనె వేసి వంకాయలు సమానంగా సర్దాలి. పైన పసుపు వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి మూతపెట్టాలి. మూత మీద కూడా నీళ్లు పోయాలి.
అలా చేయడం వల్ల కూరలో నేరుగా నీళ్లు పోయకపోయినా ఆవిరి లోపలికి వెళ్లి తక్కువ నూనెతో బాగా ఉడుకుతుంది.
మధ్యమధ్యలో కడాయిని రెండు చేతులతో పట్టుకుని కిందికీ పైకీ కుదపాలి. అలాచేస్తే కాయలు విడిపోకుండా ఉంటాయి.
మెత్తగా ఉడికిన తరువాత దించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

No comments:

Post a Comment