Thursday, May 10, 2012

పాలకూర కర్రీ


కావలసిన పదార్థాలు


  • పాలకూర. 4 కట్టలు
  • మెంతికూర. 2 కట్టలు
  • ఆవకూర. 1/2 కప్పు
  • పచ్చిమిర్చి. 8
  • నూనె. 4 టీస్పూ//.
  • వెల్లుల్లి. 8 రెబ్బలు
  • అల్లం. చిన్నముక్క
  • జీలకర్ర. 2 టీస్పూ//.
  • ఇంగువ. చిటికెడు
  • ధనియాలపొడి. 1 టీస్పూ//.
  • పసుపు. 1/4 టీస్పూ//
  • బియ్యప్పిండి. 2 టీస్పూ//.
  • పెరుగు. 4 టీస్పూ//.
  • మంచినీళ్లు. 4 కప్పులు
  • ఉప్పు. తగినంత

తయారు చేయు విధానము :


పాలకూర, మెంతికూర, ఆవకూర. అన్నీ శుభ్రంగా కడగాలి. ప్రెషర్‌ పాన్‌లో ఆకులన్నీ వేసి, పచ్చిమిర్చి చిలికలు వేసి బాగా ఉడికించాలి.
కాస్త పులుపు కావాలనుకుంటే 2 టొమాటోలు వేసుకోవచ్చు.
మరో బాణెలిలో నూనె వేసి కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద వేసి ఎర్రగా వేగాక జీలకర్ర, ఇంగువ, మెంతులు, పసుపు వేసి తాలింపు పెట్టి ఉడికించిన ఆకుకూర కూడా అందులో కలపాలి. తరువాత ధనియాలపొడి, ఉప్పు వేయాలి.
బియ్యప్పిండిలో కొద్దిగా నీళ్లు పోసి జారుగా కలిపి కూరలో కలపాలి.
అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి, పెరుగువేసి మూతపెట్టి పది నిమిషాలుఉడికించి దించాలి. దించేముందు కొద్దిగా నెయ్యి వేయాలి. అంతే వేడివేడి పాలక్ గ్రీన్‌ కర్రీ రెఢీ.

No comments:

Post a Comment