కావలసిన పదార్థాలు
- పొట్టుతీయని పెసరపప్పు. 1/4 కేజీ
- మీగడ. 1/4 కప్పు
- నూనె. 2 టీస్పూ//.
- పచ్చిమిర్చి. 10
- అల్లం. చిన్నముక్క
- ఉల్లిపాయలు. మూడు
- ఉప్పు. తగినంత
- టొమోటో గుజ్జు. 1.1/2 కప్పు
- నెయ్యి. 1 టీస్పూ//.
- పుదీనా. కొద్దిగా
- ఉల్లితరుగు. 1/4 కప్పు
తయారు చేయు విధానము:
బాణెలిలో నూనె వేసి, పెసరపప్పు దోరగా వేయించి తీయాలి. వేయించిన పప్పుని బాగా నీళ్లతో కడిగి తగినన్ని నీళ్లు, పసుపు వేసి ఉడికించాలి.
పప్పు ఉడికిన తరవాత పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయముక్కలు వేసి ఉడికించాలి. పప్పుని బాగా మెదపాలి.
తరవాత ఉప్పు, టొమాటో గుజ్జు వేసి, కలిపి సిమ్‌లో
పెట్టి ఉడికించాలి. చివరగా మీగడ కూడా కలిపి మరో మూడు నిమిషాలు సిమ్‌లో ఉంచి
దించేయాలి.
మరో బాణెలిలో నెయ్యి వేసి ఉల్లిపాయముక్కలు పుదీనా ఆకులు వేసి వేయించి పప్పులో కలపాలి. అంతే వేడి వేడి మీగడతో పెసరపప్పు కూర రెఢీ.
No comments:
Post a Comment