కావలసిన పదార్థాలు
- కందిపప్పు. 1/4 కేజీ
- అల్లం. చిన్నముక్క
- పచ్చికొబ్బరి. కాస్తంత
- ఉల్లిపాయలు. 2
- పచ్చిమిర్చి. 6
- వెల్లుల్లి రెబ్బలు. 2
- టొమోటోలు. 4
- నూనె. 100 గ్రా.
- పసుపు. చిటికెడు
- నెయ్యి. 2 టీస్పూ//.
- జీలకర్ర. 1 టీస్పూ//.
- ఆవాలు. 1 టీస్పూ//.
- కరివేపాకు. 2 రెమ్మలు
- నిమ్మకాయ. 1
- కొత్తిమీర. 1 కట్ట
తయారీ విధానం
కందిపప్పులో కొద్దిగా పసుపు వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరిని కలిపి ముద్దగా నూరి ఉంచాలి.
బాణెలిలో నూనె పోసి కాగిన తరువాత, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి, టొమోటో ముక్కలను కూడా వేసి వేయించాలి. ఇప్పుడు విడిగా ఉడికించి ఉంచిన పప్పను ఇందులో వేసి కలపాలి.
కాసేపటి తరువాత మసాలా ముద్దను కూడా వేసి బాగా
కలిపి, ఉప్పు సరిజూడాలి. విడిగా మరో బాణెలిలో కొద్దిగా నెయ్యి వేసి
జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో తాలింపు చేసి ఉడుకున్న పప్పులో కలపాలి.
చివర్లో నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే మసాలా మహారాణి దాల్ రెడీ.
No comments:
Post a Comment