కావలసిన పదార్థాలు
- మొలకెత్తిన పెసలు. 150 గ్రా.
- టొమోటోలు.. 4
- పచ్చిమిర్చి. 2
- కరివేపాకు. 1 కట్ట
- నూనె, ఉప్పు.. తగినంత
- జీలకర్ర.. ½ టీస్పూ//
- అల్లం వెల్లుల్లి ముద్ద. 2 టీస్పూ//
- ఉల్లిపాయలు.. 200 గ్రా.
- క్యారెట్, క్యాప్సికమ్ తరుగు.. 1/2 కప్పు
తయారు చేయు విధానము :
మొలకెత్తిన పెసలను ఉడికించి, వడగట్టి ఉంచాలి.
బాణెలిలో నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి.
అందులోనే పచ్చిమిర్చి తరుగు, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిముక్కల్ని వేసి వేయించాలి.
ఆపై అల్లం వెల్లుల్లి ముద్ద, టొమోటో ముక్కల్ని కూడా కలిపి కాసేపు వేయించాలి.
తరువాత ఉడికించిన పెసల్ని కూడా కలిపి, ఐదు నిమిషాలపాటు ఉడికించి చివర్లో కొత్తిమీర తరుగును పైన చల్లి దించేయాలి.
ఈ కూరను బ్రెడ్ ముక్కల మధ్యలో ఉంచి సాండ్విచ్ లాగా కూడా తినచ్చు
No comments:
Post a Comment