కావలసిన పదార్థాలు :
- దోసకాయలు. 1 కిలో
- పచ్చిమిర్చి. 6
- వెల్లుల్లి. 2 రెబ్బలు
- ఎండుమిర్చి. 2
- పోపుగింజలు. సరిపడా
- నూనె. 25 గ్రా
- ఉప్పు. సరిపడా
తయారు చేయు విధానం :
దోసకాయల పై చెక్కుతీసి చేదులేకుండా చూసుకుని చిన్న
చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి.పచ్చిమిర్చి వేరే ప్లేటులోకి ముక్కలుగా
తరిగి తీసుకోవాలి.
నూనె కాచి వెల్లుల్లి ఎండుమిర్చి పోపుగింజలు
కరివేపాకూ వేసి చిటపటలాడాక పచ్చిమిర్చి కూడా వేసి ఆ వెనకే దోసముక్కల్ని
అందులో పోసి మూత పెట్టాలి.
ముక్క బాగా మెత్తబడ్డాక ఉప్పు చల్లుకుని కలిపి దింపుకోవాలి. అంతే దోసకాయ కూర రెడీ. ఇది చపాతీల్లోకి బాగుంటుంది.
No comments:
Post a Comment