కావలసిన పదార్థాలు
- టొమోటోలు. 1/2 కేజీ
- నూనె. సరిపడా
- గసగసాలు. 2 టీస్పూ//.
- జీడిపప్పులు. 20
- నువ్వులు. 2 టీస్పూ//.
- చింతపండు. 2 నిమ్మకాయలంత
- ఉల్లిపాయలు. 4
- ఉప్పు, కారం. తగినంత
- పసుపు. 1/2 టీస్పూ//.
- అల్లంవెల్లుల్లి పేస్ట్. 2 టీస్పూ.
- మసాలాపౌడర్. 2 టీస్పూ.
- కొత్తిమీర. 2 కట్టలు
తయారీ విధానం
ఒక టీస్పూన్ నూనెలో గసగసాలు, రెండు ఉల్లిపాయల తరుగు, జీడిపప్పు, నువ్వులు వేసి దోరగా వేయించాలి.
చల్లారిన తరువాత ముందే నానబెట్టి ఉంచిన చింతపండుతో సహా ఉప్పు, కారం జతచేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
స్టవ్‌పై బాణీలి పెట్టి.. రెండు ఉల్లిపాయల తరుగు వేసి దోరగా వేయించాలి.
తరువాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగి ఉంచుకున్న టొమోటో ముక్కల్ని వేసి వేయించాలి.
కాసేపటి తరువాత ముందే నూరి ఉంచుకున్న మసాలాను వేసి బాగా కలిపి పది నిమిషాలపాటు ఉడికించాలి.
దించేముందు మసాలాపొడి వేసి కలిపి. పైన కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. అంతేటొమోటో మసాలా కర్రీ సిద్ధమైనట్లే.
No comments:
Post a Comment