Showing posts with label పప్పులు. Show all posts
Showing posts with label పప్పులు. Show all posts

Tuesday, May 8, 2012

అరటిపువ్వు పప్పు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • కందిపప్పు. ఒక కప్పు
  • అరటిపువ్వు. 1
  • చింతపండుగుజ్జు. 1 టీస్పూ//
  • జీలకర్ర, 1 టీస్పూ//
  • ఆవాలు. 1 టీస్పూ//
  • ఇంగువ. చిటికెడు
  • ఎండుమిర్చి. 3
  • పచ్చిమిర్చి. 3
  • కరివేపాకు. 2 రెబ్బలు
  • నూనె. 1 టీస్పూ//
  • ఉప్పు. తగినంత
  • పసుపు. 1/4 టీస్పూ//

తయారీ విధానం


ముందుగా అరటిపువ్వును శుభ్రం చేసుకుని కచ్చాపచ్చాగా దంచి బాగా కడిగి వేడినీటిలో 5 నిమిషాలుంచి నీటిని వంపేసి పక్కనుంచాలి.
ప్రెషర్ కుక్కర్‌లో పప్పు, అరటిపువ్వు మిశ్రమం వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
పాత్రలో నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడిన తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చిలను వేసి వేయించాలి.
తరువాత అందులోనే కరివేపాకు, పసుపు, ఇంగువ, ఉడికించిన పప్పు-అరటిపువ్వు మిశ్రమాన్ని వేసి కలియబెట్టాలి.
అందులో చింతపండు గుజ్జు వేసి పదినిమిషాలు ఉడికించి దించేయాలి. దీనిపై తరిగిన కొత్తిమీర జల్లుకోండి.

గుమ్మడికాయ పప్పు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • గరంమసాలా.1 టీస్పూ//
  • కొబ్బరి తరుగు. 1/2 కప్పు
  • పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తరుగులు. సరిపడా
  • నూనె, 1 టీస్పూ//
  • మీగడ. 1 టీస్పూ//
  • కారం, ఉప్పు. సరిపడా
  • టమాటా తరుగు. 1/2 కప్పు
  • గుమ్మడి ముక్కలు. 1 1/2 కప్పు
  • బంగళాదుంపలు.1/2 కప్పు
  • ఉల్లిపాయ తరుగు. 1/2 కప్పు
  • పచ్చిమిర్చి తరుగు. 1/4 కప్పు

తయారీ విధానం

కందిపప్పు, బంగాళా దుంపల్ని కుక్కర్లో బాగా ఉడికించుకోవాలి.
స్టౌమీద బాణెలి లో వేడయ్యాక నూనెపోసి తాలింపు వేసి, తాలింపు వేగాక ఉల్లి, పచ్చిమిర్చి తరుగులను వేసి దోరగా వేయించాలి.
తర్వాత పుదీనా, కరివేపాకు, ఆలు, గుమ్మడి తరుగులు ఒక్కొక్కటిగా వేసి వేపాలి. తరువాత ఉప్పు, కారం, టమోటా, గరం మసాలా వేసి కొంచెం నీరు చేర్చి కాసేపు ఉడకనివ్వాలి.
పదినిమిషాల తర్వాత దించి ఓ పాత్రలోకి తీసుకుని కొత్తిమీర, మీగడ, కొబ్బరి చల్లి వేడివేడిగా సర్వ్ చేయాలి.
ఈ గుమ్మడి పప్పును రైస్‌తో పాటు రోటీలకు సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.

మసాలా మహారాణి దాల్


Picture  Recipe


కావలసిన పదార్థాలు

  • కందిపప్పు. 1/4 కేజీ
  • అల్లం. చిన్నముక్క
  • పచ్చికొబ్బరి. కాస్తంత
  • ఉల్లిపాయలు. 2
  • పచ్చిమిర్చి. 6
  • వెల్లుల్లి రెబ్బలు. 2
  • టొమోటోలు. 4
  • నూనె. 100 గ్రా.
  • పసుపు. చిటికెడు
  • నెయ్యి. 2 టీస్పూ//.
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • ఆవాలు. 1 టీస్పూ//.
  • కరివేపాకు. 2 రెమ్మలు
  • నిమ్మకాయ. 1
  • కొత్తిమీర. 1 కట్ట

తయారీ విధానం

కందిపప్పులో కొద్దిగా పసుపు వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరిని కలిపి ముద్దగా నూరి ఉంచాలి.
బాణెలిలో నూనె పోసి కాగిన తరువాత, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి, టొమోటో ముక్కలను కూడా వేసి వేయించాలి. ఇప్పుడు విడిగా ఉడికించి ఉంచిన పప్పను ఇందులో వేసి కలపాలి.
కాసేపటి తరువాత మసాలా ముద్దను కూడా వేసి బాగా కలిపి, ఉప్పు సరిజూడాలి. విడిగా మరో బాణెలిలో కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో తాలింపు చేసి ఉడుకున్న పప్పులో కలపాలి.
చివర్లో నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే మసాలా మహారాణి దాల్ రెడీ.


రాజ్మా దాల్‌


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • రాజ్మా. 1/2 కప్పు
  • మినప్పప్పు. 1/4 కప్పు
  • శెనగపప్పు. 1/4 కప్పు
  • టొమోటో గుజ్జు. 1/2 కప్పు
  • ఇంగువ. కొద్దిగా
  • కారం. 2 టీస్పూ//.
  • జీలకర్ర. 2 టీస్పూ//.
  • అల్లంముద్ద. 2 టీస్పూ//.
  • నూనె. తగినంత
  • ఉప్పు. సరిపడా
  • జీలకర్ర పొడి. 2 టీస్పూ//.
  • గరంమసాలా. 2 టీస్పూ//.
  • మెంతిపొడి. కొద్దిగా
  • పాలు. 2 కప్పులు
  • మీగడ. 4 టీస్పూ//.
  • వెన్న. 4 టీస్పూ//.
  • కొత్తిమీర. కొద్దిగా

తయారీ విధానం

ముందుగా పప్పులన్నీ శుభ్రంగా కడగాలి. ప్రెషర్‌కుక్కర్లో ఇవన్నీ వేసి కారం, ఉప్పు, ఇంగువ, కొద్దిగా నూనె వేసి ఉడికించాలి.
మరో బాణెలిలో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి.
తరవాత కారం, టొమాటో గుజ్జు, ఉప్పు, జీలకర్ర పొడి, గరంమసాలా, మెంతి పొడి, పాలు, మీగడ, వెన్న అన్నీ వేసి ఉడికించిన పప్పు కూడా వేసి కలిపి మరో 2 నిమిషాలు ఉడికించి దించాలి.
చివరగా కొత్తిమీర అలంకరించి వడ్డిస్తే సరి.!

పంచరత్ని దాల్‌


Picture  Recipe


కావలసిన పదార్థాలు

  • కందిపప్పు. 1 కప్పు
  • పెసరపప్పు. 1 కప్పు
  • సెనగపప్పు. 1 కప్పు
  • ఎర్ర కందిపప్పు. 1 కప్పు
  • పొట్టుతీయని పెసరపప్పు. 1 కప్పు
  • పసుపు. 2 టీస్పూ//
  • ఉల్లిపాయలు. 8
  • జీలకర్ర. 2 టీస్పూ//.
  • నెయ్యి. 8 టీస్పూ//.
  • కొత్తిమీర. కొద్దిగా
  • టొమాటో గుజ్జు. 1 కప్పు
  • జీలకర్ర పొడి. 2 టీస్పూ//.
  • గరంమసాలా. 2 టీస్పూ//.
  • ఎండుమిర్చి. 6
  • ఉప్పు. తగినంత

తయారీ విధానం

పప్పులన్నింటినీ శుభ్రంగా కడగాలి. వీటిని ఓ పాత్రలో వేసి ఉప్పు, పసుపు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
టొమాటో గుజ్జు, జీలకర్ర పొడి, గరంమసాలా అన్నీ కలిపి మరికాసేపు ఉడికించాలి.
విడిగా మరో బాణెలిలో నెయ్యి వేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలను వేసి, గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి.
తరవాత జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసి వేయించి, పప్పులో కలిపి సన్నగా కోసిన కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. అంతే పంచరత్ని దాల్ స్పెషల్ రెఢీ!

మామిడికాయ పప్పు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పచ్చి మామిడికాయలు.మూడు
  • కందిపప్పు. 1 కప్పు
  • నెయ్యి.. 2 టీస్పూ//
  • ఉప్పు.. తగినంత
  • జీలకర్ర, ఆవాలు, మెంతులు.. పోపుకు సరిపడా
  • పసుపు.. ½ టీస్పూ//

తయారీ విధానం

ముందుగా మామిడికాయలను సన్నగా తురిమి ఉంచుకోవాలి.
నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిలు వేసి పోపు పెట్టి తురిమి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను అందులో వేసి బాగా వేయించాలి.
ఆ తరువాత పప్పు, పచ్చిమిరపకాయల్ని కూడా దానికి కలిపి సరిపడేంత నీరు పోసి బాగా ఉడికించి దించేయాలి.

చింతకాయ పాలకూర పప్పు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • చింతకాయలు. ¼ కప్పు
  • కందిపప్పు.. 1 కప్పు
  • పాలకూర.. 1 కట్ట
  • ఉల్లిపాయ. 1
  • నూనె.. 1. టీస్పూ//
  • పచ్చిమిర్చి.4
  • ఎండుమిర్చి. 3
  • కరివేపాకు. 2 రెబ్బలు
  • ఉప్పు. సరిపడా
  • జీలకర్ర, 1 టీస్పూ//
  • ఆవాలు. 1 టీస్పూ//
  • ఇంగువ. చిటికెడు
  • కొత్తిమీర. తగినంత

తయారీ విధానం

ముందుగా ఒక పాత్రలో నీళ్లు పోసి చింతకాయ ముక్కలను వేసి మెత్తగా ఉడికించి, మెదుపుకోవాలి.
మెదిగిన చింతకాయ ముక్కలను గట్టిగా పిండి రసం తీసుకోవాలి.
తర్వాత, కుక్కర్‌లో రెండు కప్పుల నీటిని పోసి అందులో కందిపప్పు, పాలకూర, పచ్చిమిర్చి వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
ఇప్పుడు ఒక బాణెలిలో నూనె వేసి వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి.
తర్వాత, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి ఇంకో రెండు నిమిషాలు వేయించాలి.
ఇప్పుడు ఉడికించుకున్న పప్పు మిశ్రమాన్ని పోపులో పోసి, చింతకాయ గుజ్జు, ఉప్పు, తగినంత నీటిని అందులో కలిపి, పదిహేను నిమిషాలు ఉడికించి దించేయాలి.
చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వడ్డించాలి.

టొమోటో పాలకూర పప్పు


Picture  Recipe


కావలసిన పదార్థాలు

  • టొమోటోలు. 5
  • పాలకూర. 2 కట్టలు
  • కందిపప్పు. 1 కప్పు
  • పచ్చిమిర్చి. 5
  • ఎండుమిర్చి. 4
  • ఉల్లిపాయలు. 2
  • చింతపండు. కొద్దిగా
  • నెయ్యి. 1 టీస్పూ//
  • ఆవాలు, 1 టీస్పూ//
  • జీలకర్ర. 1 టీస్పూ//
  • శనగపప్పు. 1 టీస్పూ//
  • వెల్లుల్లి రేకలు. 4
  • కరివేపాకు. 2 రెమ్మలు
  • పసుపు. 1/4 టీస్పూ//
  • ఉప్పు.. తగినంత
  • కారం.. తగినంత
  • ధనియాలపొడి. 1 టీస్పూ//
  • నూనె. 1 టీస్పూ//

తయారీ విధానం

ముందుగా కందిపప్పును కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించాలి.
బాణెలిలో నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి దోరగా వేయించాలి.
అందులోనే పాలకూర టొమోటోలను కూడా వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఆపై చింతపండు రసం, ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి వేసి కలియబెట్టాలి.
ముందుగా ఉడికించుకున్న పప్పును కూడా ఇందులో కలిపి పది నిమిషాలపాటు ఉడికించాలి.
పోపు గిన్నెలో నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు వేసి తాలింపు పెట్టి.. దానిని పప్పు పాలకూరతో కలిపుకోవాలి. బాగా కలిసిన తర్వాత స్టవ్ మీద నుండి దించుకోవాలి

చింతచిగురు పప్పు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • చింతచిగురు. 1 కప్పు
  • కందిపప్పు లేదా పెసరపప్పు.. ½ కప్పు
  • ఉల్లిపాయ. 1
  • పచ్చిమిర్చి. 5
  • పసుపు. ¼ టీస్పూ//
  • ఉప్పు. తగినంత

పోపుకోసం

  • నూనె. 1 టీస్పూ//
  • జీలకర్ర, 1 టీస్పూ//
  • ఆవాలు. 1 టీస్పూ//
  • ఇంగువ. చిటికెడు
  • ఎండుమిర్చి. 3
  • కరివేపాకు. 2 రెబ్బలు

తయారీ విధానం

ఒక పాత్రలో ఒకటిన్నర కప్పు నీటిని తీసుకుని, దాంట్లో పప్పు, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి.
చింతచిగురును శుభ్రం చేసి, పప్పు సగం ఉడికిన తరువాత అందులో కలపి సన్నటి మంటమీద ఉడికించాలి.
ఇప్పుడు ఒక బాణెలిలో నూనె స్టవ్ మీద పెట్టుకొని, నూనె వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర చిటపటలాడుతుండగా.. ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి అర నిమిషంపాటు వేయించుకోవాలి.
దీనికి ఉడికిన చింతచిగురు, పప్పు మిశ్రమాల్ని.. ఉప్పుని కలిపి, ఒక నిమిషంపాటు ఉంచి దింపేయాలి.