Showing posts with label ఆహారం. Show all posts
Showing posts with label ఆహారం. Show all posts

Friday, May 18, 2012

హెల్తీఫుడ్ అంటే ఏదో మీకు తెలుసా..!?

హెల్తీఫుడ్ అంటే ఏది రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి. వారంలో ఎన్ని రోజులు మాంసాహారం తీసుకోవచ్చు అనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. మీకూ ఈ అనుమానముంటే.. ఈ కథనం చదవాల్సిందే. తాజా కూరగాయల్లోనూ, పండ్లలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వారంలో ఐదు రోజులు పండ్లు, కూరగాయలు తీసుకోండి.

ముఖ్యంగా పళ్లలో మెదడును రక్షించే యాంటీ యాక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలిఫ్లవర్‌లలో ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడానికి అంతగా ఇష్టపడని మహిళల్లో మెదడు వారి వయస్సు కంటే ఒకటి రెండెళ్లు తక్కువగా ఉంటుంది. యాపిల్స్, గ్రేప్స్, ఆనియన్స్, వైన్, టీ, డార్క్ చాకెలెట్‌లో కూడా యాంటీఅక్సిడెంట్లు ఉన్నాయి. వారంలో ఐదు రోజులు వీటిని తీసుకుంటే యాంటీ యాక్సిడెంట్లకు కొదవే ఉండదు.

అలాగే ఆలివ్‌ఆయిల్, నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, అవొకొడస్‌లో యాంటీ అక్సిడెంట్‌గా పనిచేసే ఇ-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అల్జీమర్స్ వ్యాధికి బాగా పనిచేస్తుంది. తరచుగా వీటిని తీసుకునేవారిలో అల్డీమర్ వ్యాధి బారిన పడే అవకాశం 67 శాతం తగ్గిపోతుంది. కాబట్టి వీటిని వారంలో ఒకరోజైనా మీ మెనూలో ఉండేలా చూసుకోవాలి.

వారానికి రెండు సార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కొవ్వు పదార్థాలు తీసుకోవడం ద్వారా విచారానికి చెక్!?

కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా విచారం, దుఃఖం వంటి మానసిక రుగ్మతలను తగ్గిస్తుందని ఓ పరిశోధనలో తేలింది.

ఇదేంటి.. కొవ్వు పదార్థాలు తీసుకోవడం ద్వారా ఊబకాయం, హృద్రోగ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటే.. ఫాటీ ఫుడ్ తీసుకోవడం ద్వారా విచారం, దుఃఖానికి చెక్ పెట్టవచ్చని చెపుతున్నారు అనుకుంటున్నారా.

ఇది నిజం.. బెల్జియంకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ ల్యూవెన్ పరిశోధక బృందం నిర్వహించిన పరిశోధనలో తేలినట్టు వెల్లడైంది. మానసిక రుగ్మతలకు చెక్ పెట్టే విధంగా ఫాట్ సొల్యూషన్ పనికివస్తుందని ఓ పరిశోధనలో తేలింది.

విచారంతో పాటు.. ఒబేసిటీ, మానసిక ఒత్తిడి కూడా ఫాటీ ఫుడ్ తీసుకోవడం ద్వారా తగ్గుతుందని వెల్లడైంది. ఫాటీ ఫుడ్‌తో విచారణ కలిగించే నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చునని ఈ పరిశోధన నిర్వహించిన బెల్జియం యూనివర్శిటీ ఆఫ్ ల్యూవెన్ పరిశోధకులు వెల్లడించారు.

ఆహారాన్ని నమిలి తింటే బరువు తగ్గుతారట..!!

ఆధునిక యుగంలో మనమందరం ఉరుకులు పరుగులతో జీవితాన్ని గడిపేస్తున్నాం. ఫాస్ట్ లైఫ్‌లో కొంతమందికి ఆహారం తీసుకునేందుకు కూడా సమయం దొరకట్లేదు. కొంతమందైతే టిఫిన్ తీసుకోవడమే కాదు.. సరైన సమయానికి ఆహారం తీసుకోవడంలోనూ హడావుడి చేస్తుంటారు.

ఇలా హడావుడిగా ఆహారం తీసుకోకూడదని, ఆహారాన్ని నమిలి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఆహారాన్ని నమిలి తినడం ద్వారా బరువు తగ్గుతారని తాజా అధ్యయనంలో తేలింది. తీసుకునే ఆహారాన్ని నమిలి తినడం ద్వారా కెలోరీల శాతం తగ్గుతుందని, దీంతో బరువు తగ్గడం జరుగుతుందని చైనాకు చెందిన హర్బిన్ మెడికల్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

ఇలా నమిలి తినడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. దాదాపు 15 నిమిషాల పాటు లేదా నలభై సార్లు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం ద్వారా 12 శాతం బరువు తగ్గగలరని ఆ అధ్యయనంలో తెలియవచ్చింది. ఇంకా 90 నిమిషాల పాటు ఆహారాన్ని నమిలి తినడం ద్వారా ఊబకాయం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆ స్టడీలో తేలింది.

పొటాటో ప్రియులకు ఓ శుభవార్త..!?

పొటాటో ప్రియులకు ఓ శుభవార్త. బంగాళాదుంపతో తయారు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా బరువు పెరగుతారంటూ ఇప్పటి వరకు ఉన్న ప్రచారం తప్పు అని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పొటాటోతో చేసే చిప్స్ వంటి చిరు తిళ్లు తినడం ద్వారా ఊబకాయ సమస్య తలెత్తుతాయని భావిస్తున్నారా? అలాందేమీ లేదని కొత్త స్టడీ తేల్చేసింది.

బరువు తగ్గేందుకు బంగాళాదుంపలను తీసుకోవడం ఆపేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బంగాళాదుంపలు సైతం కెలోరీల శాతాన్ని తగ్గిస్తాయని యూనివర్శిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. బంగాళాదుంపలతో ఆరోగ్యానికి మేలేనని, బరువు తగ్గించే ప్రక్రియలోనూ బంగాళదుంపలు ఉపయోగపడుతాయి.

దాదాపు 12 వారాల పాటు భారీ బరువు గల మహిళలు, పురుషులపై జరిపిన పరిశోధనలో బంగాళాదుంపలను తీసుకోవడం ద్వారా కెలోరీల శాతం తగ్గుముఖం పట్టడం, రక్తంలో సుగర్ లెవల్స్, కార్బోహైడ్రేడ్లను నియంత్రిస్తున్నట్లు తెలియవచ్చింది. ఒక బంగాళాదుంపలో 110 కెలోరీలు, పొటాషియం 620 గ్రాములున్నట్టు గుర్తించారు.

స్లిమ్‌గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి!?

స్లిమ్‌ ఉండాలని ఏవేవో వ్యాయామాలు, యోగాలు, ఆహార నియమాలు పాటిస్తున్నారా అయితే ఈ కథనం చదవాల్సిందే. స్లిమ్‌గా ఉండాలంటే కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్లు, పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కాఫీ, టీలను తగ్గించి లెమన్ లేదా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు.

ఉదయం పూట ఒక గ్లాస్ పాలు తీసుకోవచ్చు. ఇక మధ్యాహ్న భోజన విషయానికి వస్తే రోటీలు, సోయా ఆయిల్‌లో సగం ఉడికిన కూరగాయలు, దాల్, సలాడ్ వంటివి తీసుకోవచ్చు. సాయంత్రం సమయంలో పండ్లు, ఇడ్లీలు, చపాతీలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు.

అలాగే మితమైన చక్కెర కలిపిన టీ, కాఫీ, పాలును కూడా సాయంత్రం పూట తీసుకోవచ్చు. ఇక రాత్రిపూట భోజన విషయానికి వస్తే నిద్రకు ఉపక్రమించేందుకు మూడు గంటల ముందే డిన్నర్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పూట మితమైన ఆహారంతో పాటు సూప్, సలాడ్, రోటీలు తీసుకుంటే తప్పకుండా బరువు తగ్గుతారని వారు చెబుతున్నారు.

బ్రెస్ట్ క్యాన్సర్‌కి చెక్‌ పెట్టే కూరగాయలు

నేటి మహిళలను ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. జీవనశైలిలో మార్పులు ఇతరత్రా పలు కారణాల వల్ల పట్టణ మహిళల్లో ఇది ఎక్కువగా కన్పిస్తోంది. దగ్గరి సంబంధీకుల్లో ఎవరైనా ఈ మహమ్మారినుంచీ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే మొదటినుంచీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

* బీటా కెరొటిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మామూలు క్యారట్ల కన్నా బేబీ క్యారట్లలో ఉండే బీటా కెరొటిన్‌ను శరీరం తేలిగ్గా గ్రహించగలుగుతుంది. ఆ తేడా ఏకంగా 500 శాతం ఎక్కువ. కాబట్టి లేలేత క్యారట్లను ఆహారంలో తప్పనిసరి అంశం చేసుకోవడం మంచిది.

* నిండు ఎరుపుతో నోరూరించే చెర్రి పండ్లు తినండి. వాటిల్లో ఉండే ఒక పదార్థం క్యాన్సర్‌ని నిరోధిస్తుందని మంచి పేరు.

* వెల్లుల్లి సైతం క్యాన్సర్ కణాల్ని చంపేస్తుంది. అయితే దాన్ని వండుతున్నట్లైతే మాత్రం పొట్టు తీసి, తరిగి ఒక పదినిమిషాలు ఉంచండి. తర్వాతే వంటలో వేయండి. పొట్టు తీయగానే వేడి చేస్తే అందులో క్యాన్సర్‌తో పోరాడే పదార్థాలు తయారయ్యే అవకాశం తగ్గుతుంది.

* విటమిన్ డి తగుపాళ్లలో తీసుకునే వన్నిటల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తక్కువ. కాబట్టి వైద్య సలహాతో తగినంత విటమిన్ డి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

* టమాటాలు వాడండి. కూరల్లో, సూపుల్లో, రసం తీసి... ఏదో ఒక రూపంలో టమాటా తీసుకుంటే అందులో ఉండే లైకోపిన్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

* రిఫైన్‌డ్ ధాన్యం కన్నా తక్కువ పాలిష్ పట్టిన ధాన్యం వాడాలి. పూర్తిగా రిఫైన్‌డ్ ధాన్యం వాడిన మహిళల్లో బ్రెస్ట క్యాన్సర్ ఎక్కువగా వచ్చినట్లు అధ్యయనాలు చెప్తున్నాయి.

* చల్లగా అయినా, వేడిగా అయినా గ్రీన్ టీ తాగండి.

* వారానికి రెండుసార్లు పాలకూర తిన్నవాళ్లలో... బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం సగానికి సగం తగ్గినట్లు పరిశోధనలో తేలింది.

బీన్స్ ఎక్కువగా తీసుకుంటే.!?

బీన్స్ ఎక్కువగా, వరి అన్నం తక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని కోస్టా రికా అధ్యయనంలో తేలింది. దాదాపు రెండువేల మంది మహిళలు, పురుషుల మీద నిర్వహించిన పరిశోధనలో ఎక్కువ బీన్స్‌ను తక్కువ మోతాదులో అన్నాన్ని తీసుకునే వారిలో మధుమేహం తగ్గుముఖం పట్టిందని తేలింది.

బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా 25 శాతం వరకు డయాబెటిస్‌ను నియంత్రించవచ్చునని తెలిసింది. అలాగే వరి అన్నం శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది కాబట్టి రైస్‌ను కాస్త తక్కువ మోతాదులో తీసుకోవడం ఎంతో మంచిదని బోస్టన్‌లోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఫ్రాంక్ హు తెలిపారు. వరి అన్నం కంటే బీన్స్‌లో ఫైబర్, ప్రోటీన్స్ ఉండటంతో మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తుందని ఫ్రాంక్ వెల్లడించారు.

బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే...

రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే మహిళలు తాజా కూరగాయలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. తాజా కూరలతో మహిళలకు పెను సమస్యగా మారిన బ్రెస్ట్ క్యాన్సర్‌ను నియంత్రించాలంటే.. తాజా కూరగాయలతో పాటు ఆకుకూరలు తీసుకోవాలని చైనీస్ అధ్యయనంలో తేలింది.

ఆకుకూరలు, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటివి తీసుకుంటే క్యాన్సర్ మరణాలు తగ్గుముఖం పడుతున్నాయని ఆ అధ్యయనం తేల్చింది. దాదాపు ఐదేళ్ల పాటు జరిగిన ఈ అధ్యయనంలో ఐదువేల మంది మహిళలపై పరిశోధకులు పరిశోధన చేశారు.

వీరిలో ఆకుకూరలు, కూరగాయలు తీసుకునే మహిళలు ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ఆకుకూరలు, కూరగాయలు తీసుకునే వారిలో 62 శాతం నుంచి 22 శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిందని తెలియవచ్చింది.

వారానికి రెండుసార్లు చేపలు తినండి..

మహిళలు వారానికి రెండుసార్లు చేపలను ఆహారం తీసుకోవడం ద్వారా అడినోమాకు చెక్ పెట్టవచ్చునని కొత్త అధ్యయనంలో తేలింది. వారానికి రెండుసార్లు కాకపోయినా ప్రతి రెండువారాలకు ఒకసారి చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళలకు అడినోమా వ్యాధి సోకదని బోస్టన్‌లోని హర్వాద్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఎడ్వర్డ్ గియోవానుసికీ తెలిపారు.

అడినోమా అనేది పుట్టగొడుగు పరిణామంలో మహిళల్లో కొలొరెక్టల్ క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఎడ్వర్డ్ చెప్పారు. ఈ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే చేపలను వారంలో ఒక్కసారైనా తీసుకోవాలని ఆయన వెల్లడించారు. ఇంకా వారంలో ఒక్కసారి ఆహారంలో చేపను తప్పకుండా చేర్చుకోవడం ద్వారా పలు రోగాలను నయం చేయవచ్చునని పరిశోధనలో తేలినట్లు ఎడ్వర్డ్ చెప్పారు. 

టమోటో జ్యూస్‌తో ఎముకల బలాన్ని పెంచుకోండి..!!

పాలు తాగడం ద్వారా ఎముకలు బలపడతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎముకల్లో బలాన్ని పెంచడానికి టొమాటో రసం కూడా బాగా ఉపయోగపడుతుందని కెనెడియన్ తాజా అధ్యయనంలో తేలింది. టొమాటోల్లో ఉండే లైకోపన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎముకలు బలపడతాయని తెలిసింది. రుతుక్రమం ఆగిపోయిన కొందరు మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో టొమాటో రసం వల్ల ఎముకలు బలపడతాయని నిరూపితమైంది.

అయితే తాజా టొమాటో జ్యూస్ వల్లే ఈ ఫలితం ఉంటుందని, దాన్ని సాస్, కెచప్ రూపంలో నిల్వ ఉంచడం వల్ల లైకోపిన్ తగ్గుతుందని తేలింది. ఈ లైకోపిన్ అన్నది ఎర్ర రంగులో ఉండే క్యారట్, పసుపుపచ్చరంగులో ఉండే బొప్పాయి. పింక్ రంగులో ఉండే ద్రాక్షపళ్లలోనూ ఉంటాయని నిరూపితమైంది. ఇకపై ఎముకల బలానికి టొమాటో జ్యూస్‌నూ తీసుకోవచ్చు.

ఒకవేళ టొమాటోను జ్యూస్‌గా తీసుకోవడం ఇష్టం లేకపోతే... రుచికరంగా ఉండే క్యారట్, బొప్పాయి, ద్రాక్షలనూ ట్రై చేయవచ్చు. కానీ వాటన్నింటిలో కంటే టొమాటో జ్యూస్‌లో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది.

ఆహారంతో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోండిలా..!

పౌడర్లు, క్రీములు వాడితేనే చర్మం సౌందర్యవంతం కాదు. ఆహారంతో కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. తాజా కూరగాయలు, ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో విటమిన్ల శాతం అవసరమైనంత మేరకు పెరుగుతుంది విటమిన్లు చర్మాన్ని తాజాగా వుంచుతాయి. అందువలన అవసరమైనన్నీ పాలే తాగాలి.

పప్పు ధాన్యాలు, పచ్చని కూరలు, అరటి పళ్ళలో విటమిన్ బి కాంప్లక్స్ వుంటుంది. చర్మం మొద్దు బారకుండా ఈ మిటమిన్ కాపాడుతుంది. చర్మం అడుగు పొరలలోని జీవకణాలను బలంగా ఉంచటంలో విటమిన్ సి ప్రధాన పాత్ర వహిస్తుంది. బత్తాయి, మామిడి, టమోచా పళ్ళు, ఆకుకూరల్లో ఈ విటమిన్స్ లభిస్తాయి.

రక్తంలో లోహాల శాతం కూడా చర్మం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. క్రీములే అందాన్ని పెంచుతాయనుకోవడం భ్రమ. ఎక్కువసార్లు మొహం కడిగేవారు ప్రతీసారి సోపువాడకుండా కేవలం నీళ్ళతో మాత్రం కడుక్కోవాలి. రిలాక్స్‌గా ఉండటం కొద్ది వరకు చర్మానికి మంచిది.

ఎముకల పటుత్వానికి మహిళలు ఏం చేయాలంటే..!?

రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగులలో అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించిన పొడిచేసిన పిండిని కలిపి తాగించినట్లయితే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది.

రాగులలో కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. వృద్ధాప్యంలో వున్నవారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్ధాలను భుజించడం వల్ల శరీరానికి బలం. శక్తి చేకూరుతాయి.

ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్ ఎముకలు పటుత్వానికి థాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది.

వేసవిలో కొత్త శక్తిని పొందాలంటే.. నిమ్మరసం తీసుకోండి!

వేసవిలో నిమ్మకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వేడికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు బలాన్నిచ్చే టానిక్ నిమ్మరసం. నిమ్మరసానికి చల్లని నీటిని కలిపి చిటికెడు ఉప్పు, రెండు చెంచాల తేనె కలిపి తాగితే వేసవిలో కొత్త శక్తిని పొందగలుగుతారు.

ఇంకా నిమ్మకాయలో సి విటమిన్ విరివిగా లభిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు సి విటమిన్ అవసరం. అనారోగ్యంతో వున్నవారు, కోలుకుంటున్నవారు నిమ్మకాయ వాడాలి.

అలాగే కాలిన గాయాలతో బాధపడేవారు నిమ్మకాయ తీసుకోవడం వల్ల త్వరగా కోలుకుంటారు. నిమ్మరసాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. సి విటమిన్‌ను శరీరం గ్రహించేందుకు కొంత సమయం పడుతుంది.

ఆహారంలో కొవ్వు పదార్థాన్ని అధికంగా తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా వుంటే.. ఆ ఇబ్బంది నుంచి బయట పడేందుకు నీళ్ళలో కలిపిన తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

క్యాబేజీతో క్యాన్సర్‌కు బై...బై...!


మనం ప్రతిరోజూ తీసుకునే కూరగాయల్లో క్యాబేజీని కూడా చేర్చుకున్నట్లయితే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను దరిచేరకుండా చేయవచ్చు. అదెలాగంటే... క్యాబేజీలో ఉండే రసాయనాలు క్యాన్సర్ నివారకాలుగా పనిచేస్తాయంటున్నారు పరిశోధకులు.

ఎక్కువగా ఉడికించవద్దు క్రూసిఫెరా కుటుంబానికి చెందిన క్యాబేజీ, కాలిఫ్లవర్‌లాంటి వాటిలో ఐసోసయనేట్స్ అనే రసాయనాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి  మంచిది. అయితే, వీటిని ఎక్కువగా ఉడికిస్తే మాత్రం అందులో ఉన్న యాంటీ క్యాన్సర్ కారకాలు నశించిపోయే ప్రమాదం    

క్యాబేజీలో ఉండే ఐసోసయనేట్లకు క్యాన్సర్‌ను నిరోధించే సామర్థ్యం కలదని ఇటీవలి పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు ఇది చక్కటి మందుగా పనిచేస్తుందని ఆ అధ్యయనాల్లో వెల్లడైంది. దేశంలో ప్రతి సంవత్సరం అనేకమంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నవారే కాగా, వారిలో 15 శాతం మంది పొగతాగని వాళ్లే కావడం గమనార్హం.

ఇందులో భాగంగా... పొగతాగనివారిపైన, మహిళలపైన పరిశోధన చేయగా, ప్రతిరోజూ లేదా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా క్యాబేజీ తీసుకుంటున్న వారిలో శ్వాసకోశాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. కాబట్టి, వారానికి ఒకసారి వెజిటబుల్ సలాడ్‌లో సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలను కూడా చేర్చి తీసుకోవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.

క్రూసిఫెరా కుటుంబానికి చెందిన క్యాబేజీ, కాలిఫ్లవర్‌లాంటి వాటిలో ఐసోసయనేట్స్ అనే రసాయనాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే, వీటిని ఎక్కువగా ఉడికిస్తే మాత్రం అందులో ఉన్న యాంటీ క్యాన్సర్ కారకాలు నశించిపోయే ప్రమాదం ఉంది.

అందుకనే క్యాబేజీలను సలాడ్‌గా గానీ, ఆవిరితోగానీ ఉడికించి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అయితే పొగత్రాగని వారైనా, మహిళలైనా జన్యు పదార్థాలను బట్టి వీటి ప్రభావం ఉంటుందని గమనించాలి. ఇదిలా ఉంటే... క్యాబేజీ తినడం వల్ల క్యాన్సర్ బారినుండి తప్పించుకోవచ్చన్న అంశంపై ఇంకా రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి.

సాధారణంగా రోజుకు ఐదు లేదా ఆరు రకాల కూరగాయలను తప్పనిసరిగా తీసుకుంటే ఆయుర్దాయం పెరుగుతుందని ఎన్నో రకాల పరిశోధనలు రుజువు చేశాయి.

చర్మ సౌందర్యానికి దివ్యౌషధం ద్రాక్ష

చర్మం నలిగిపోయినట్లు, నల్లగా, కాంతిహీనంగా, పొడిబారిపోయినట్లు ఫీలవుతుంటే మాత్రం ఎవరైనా ద్రాక్ష పళ్లకు జేజేలు చెప్పాల్సిందే మరి. ఆఫీసుల్లో, ఇళ్లలో ఎక్కడున్నా సరే చిట్లిపోయిన, మొరటుగా మారిన చర్మం చాలా అసౌకర్యంగా ఉంటుంది. తిరిగి సహజమైన చర్మకాంతిని మీరు పొందాలంటే సౌందర్య సాధనాలవైపు చూపు సారించడానికి బదులు చౌకగా దొరికే ద్రాక్ష పళ్లను ఆరగించడం ఒక చక్కని పరిష్కారం..

ఒక మాటలో చెప్పాలంటే.. ఏ రంగు చర్మం కలవారికైనా ద్రాక్ష పళ్ల రసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. మండే ఎండల నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి పాతతరం అందగత్తెలు ఈ విధంగానే తమ అందాన్ని కాపాడుకునేవారట. పైగా శరీరంలో వేడిని పోగొట్టుకోవడానికి ద్రాక్ష ఎంతో మేలు చేస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

అందుకే తప్పనిసరిగా ద్రాక్ష పళ్ల రసం క్రమం తప్పకుండా తాగుతుండండి. ద్రాక్ష పళ్ల రసాన్ని తాగడంతో మాత్రమే సరిపెట్టుకోక ద్రాక్ష పళ్లను చర్మానికి పూతగా కూడా తయారు చేసుకుని నిగారింపులు తీసుకురావచ్చు. ఎలాగంటే

ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్‌కు కొద్దిగా పౌడర్‌ను కలిపి దాన్ని పేస్టులా తయారు చేయండి. దానికి కీరదోస జ్యూస్ కాని, ద్రాక్ష రసం కాని కలుపుకుని చర్మానికి రాయండి. ఒక గంట తర్వాత దాన్ని తీసేసి శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజ్ రాసుకుంటే మెరిసే నున్నని, మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.

గుడ్లు తింటే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గే అవకాశం..

గుడ్లు వంటి బలవర్థక ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. గుడ్ల వినియోగానికి, బ్రెస్ట్ క్యాన్సర్‌కి మధ్య సంబంధాన్ని నిరూపించే అదనపు సాక్ష్యాన్ని ఈ కొత్త అధ్యయనం బయటపెట్టింది.

ఉత్తర కరోలినా యూనివర్శిటీకి చెందిన స్టీవెన్ జైసెల్ అధ్వర్యంలో జరిగిన ఈ వ్యాధి నివారణ అధ్యయనానికి గాను దాదాపు 3 వేలమంది మహిళలను పరిగణనలోకి తీసుకున్నారు. బి కాంప్లెక్స్ విటమిన్‌ను కలిగివుండే కోలైన్ పదార్థం ఎక్కువగా ఉండే గుడ్లను ఆహారంలో తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 24 శాతం తగ్గిపోతాయని ఈ అధ్యయనంలో తేలింది.

కోలైన్ పదార్థాన్ని అధికంగా తీసుకున్న మహిళలు సగటున రోజుకు 455 మిల్లీ గ్రాముల కోలైన్‌ను వినియోగించారని, వీరు కాఫీ, గుడ్లు, స్కిమ్ మిల్క్ వంటి వాటిని ఎక్కువగా వాడుతూ వచ్చారని స్టీవెన్ తెలిపారు. అలాగే రోజుకు సగటున 196 మిల్లీ గ్రాముల కంటే తక్కువ కోలైన్‌ను తీసుకునే మహిళలను సైతం ఈ అధ్యయనంలో పరీక్షించినట్లు చెప్పారు.

కణాలు సాధారణ రీతిలో పనిచేసేందుకు కోలైన్ చాలా అవసరం. వయసు, లింగంతో పనిలేకుండా ప్రతి ఒక్కరూ కోలైన్ అధికంగా ఉండే పదార్ధాలను తీసుకోవచ్చు. మహిళలకు, ప్రత్యేకించి పిల్లలను పెంచే వయసులో ఉన్న మహిళలకు ఇది చాలా అవసరమని జైసెల్ పేర్కొన్నారు.

మనం తీసుకునే ఒక గుడ్డులో కనీసం 125.5 మిల్లీ గ్రాముల కోలైన్ ఉంటుంది. రోజూ మనం తీసుకోవాల్సిన కోలైన్ శాతంలో ఇది పావుభాగం అన్నమాట. అందుకే ఆహారంలో తప్పనిసరైన ఈ పోషక పదార్థాన్ని పొందాలంటే గుడ్లు తినడం చాలా అవసరం. గుడ్డులోని పచ్చసొనలో కోలైన్ అధికంగా ఉంటుంది. ఇకపోతే కాలేయం, గోధుమ మొలకలు, కాలిఫ్లవర్స్‌లో కూడా తగుమాత్రంలో కోలైన్ ఉంటుంది.

అయితే మనుషుల ఆహారంలో కోలైన్ తప్పనిసరి బలవర్థక పదార్థంగా ఉన్నప్పటికీ, చాలామందికి దీని గురించి కనీసం తెలియదని స్టీవెన్ పేర్కొన్నారు. రోజువారీ ఆహారంలో ఎంత కోలైన్ తీసుకోవాలో అమెరికన్ ప్రజలకు తెలియజేయవలసి ఉందని తెలిపారు.

కణాల సాధారణ పనితీరులో కోలైన్ కీలక పాత్ర వహించడమే గాదు... మెదడు, నరాలు, కాలేయ జీవ రసాయన ప్రక్రియ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. పైగా శరీరమంతటా పోషకపదార్థాలను సరఫరా చేయడంలో కూడా ఇది ఉపకరిస్తుంది. పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడమే కాక, మన జ్ఞాపకశక్తిని కూడా మెరుగు పరుస్తుందని స్టీవెన్ జైసెల్ తెలిపారు.

ఈ అధ్యయనం అమెరికా మహిళలను ఉద్దేశించి చేపట్టిందే అయినప్పటికీ ప్రపంచంలో మహిళలందరికీ ఇది వర్తిస్తుంది కాబట్టి కోలైన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడంపై ప్రచారం చేయవలసిన అవసరం ఉంది కదూ..

పోషక విలువలున్న ఫలం అరటి..!

మహిళలు బహు సుకుమారులు. అయితే నేటి పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా స్త్రీలు పోటీ పడుతున్నారు. పురుషులు ఎంత శ్రమిస్తున్నారో... మహిళలు కూడా అంతే శ్రమిస్తున్నారు. మరిలాంటి పోటీ ప్రపంచంలో ఆరోగ్య పరంగా నిలుదొక్కుకోవాలంటే మంచి పౌష్టిక, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి.

అధిక పోషకవిలువలున్న వాటిల్లో పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ ఫలాల్లో అత్యంత పోషక విలువలున్నది అరటి పండు. చౌకగా దొరికేదే కాకుండా ఔషధగుణాలను కూడా కలిగినది అరటి. రోగాలబారిన పడిన వ్యక్తులకు అరటి పళ్లను ఆహారంగా ఇవ్వడం ద్వారా త్వరగా కోలుకుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అరటిపండు త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా జీర్ణక్రియకు తోడ్పడటును అందిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్త్రీలలో వచ్చే అధికరక్తస్రావాన్ని తగ్గిస్తుందంటున్నారు.

పాలతో పండంటి ఆరోగ్యం

నేటి ఆధునిక యుగంలో స్త్రీలు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఇంటా బయట నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కాలంతో పోటీ పడుతు పరుగులు తీసే మహిళల ఆరోగ్యానికి సరైన పోషక ఆహారం ఎంతైనా అవసరం. కానీ సమయా భావం కారణంగా సరైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. అటువంటివారికి పాలు చక్కగా ఉపకరిస్తాయి.

మహిళలకు అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారమైన పాలు ఒకటి. పాలు అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. మహిళలకు వయస్సు మీరే కొద్ది కాల్షియం తగ్గి ఎముకలు విరగడం, ఎముకలకు సంబంధించి వ్యాధులు సోకడం వంటివి జరుగుతున్నాయి.

కనుకనే స్త్రీలు చిన్న వయస్సు నుంచే పాలను తీసుకోవడం ఎంతైన అవసరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నోటిలో దంతాలు ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడానికి కూడా కాల్షియం బాగా ఉపకరిస్తుందని వారు తెలుపుతున్నారు.

పాలలో 87 శాతం నీరు, 4 శాతం క్రొవు పదార్ధాలు, 4.9 శాతం కార్బోహైడ్రేట్లు, 3.35 శాతం ప్రోటీన్లు, 0.75 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి. పాలలో లాక్టోసు అనే విశిష్టమైన చక్కెర పూర్తిగా కరిగిపోయి ఉంటుంది. అంతేకాక ఇందులో ఎ, బి, సి, మరియు డి విటమిన్లు కూడా లభిస్తాయని వారు అంటున్నారు.

చిన్న వయస్సు అంటే 7-10 వయస్సు గల అమ్మాయిలు రోజుకు సుమారు 3-4 గ్లాసుల పాలు, పెరిగే వయస్సులో నాలుగు గ్లాసుల కంటే ఎక్కువ పాలు, పాతికేళ్ళ వయస్సులో 2 గ్లాసుల పాలు రోజూ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పాలు తాగేందుకు ఇష్టపడని వారైతే పాల నుంచి తయారైన పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, ఐస్ క్రీములు, చాక్లేటులు మొదలైన వాటిని తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు

శరీరానికి పండ్లు చేసే మేలు

మానవ శరీరానికి పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. మనిషికి ప్రాధమిక దశ నుంచి వృద్ధాప్య దశ వరకు వివిధ రకాల పండ్లు, వివిధ దశల్లో ప్రాముఖ్యత వహిస్తున్నాయి. ప్రతి మనిషి ఆరోగ్యానికి పండ్లు తీసుకోవడం తప్పనిసరి. వాటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ మనిషి పెరుగుదలకు తోట్పడటమే కకుండా. ఆరోగ్య వంతమైన జీవితానికి సహకరిస్తాయి.

ఆపిల్, ఖర్జూరం, సపోట, మామిడి మొదలగు పండ్లు నిత్యము సేవించే వారికి, నాడీమండలము చైతన్యవంతముగా ఉంటుంది. మానశిక అలసట, చికాకు తగ్గి - జ్ఞాపకశక్తి అధికమవుతుంది. ఇకా నపుంసకత్వము నివారించబడుతుంది. నిద్రలేమి నశిస్తుంది.

ఏపిల్, కమలా, అరటి, నిమ్మ మొదలకు వాటిలో కాల్షియమ్, ఐరన్, ఏ, బీ, సీ విటమిన్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెను సక్రమంగా పని చేయించుటలో బహు చక్కని పాత్రను నిర్వహిస్తాయి. గర్భవతులైన స్త్రీలు - ఫల రసాలను నిత్యము సేవిస్తూ వుంటే... ఎంతో మంచిది

ఎందుకంటే పిండము ఏర్పడిన కొద్దికాలము నుండే - ఆ పిండము ఏర్పడిన కొద్దికాలము నుండే ఆ పిండము యొక్క, గుండె పని చేస్తుంది. గుండె పని చేయుటలో తల్లి సేవించిన పండ్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. రక్తపోటు గలవారికి పుచ్చకాయ అమోఘముగా పని చేస్తుంది.

సంపూర్ణ ఆరోగ్యానికి ఇవే...

గుండె ఆరోగ్యానికి కింది ఉదహరించిన వంటకాలవంటివాటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవటం ద్వారా హృద్రోగాలకు దూరం కావచ్చును. రోజులో ఆయా వేళల్లో తీసుకోవాల్సిన పదార్థాలను, తయారీ విధానాలు దిగువ ఇవ్వబడ్డాయి.

ఉదయపు ఫలహారంగా బీట్‌రూట్, ఆరంజ్ సలాడ్ తీసుకోండి. దీనికి కావలసిన పదార్థాలు...
1 కిలో బీట్‌రూట్ (చిన్నవి), 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, ఉప్పు మరియు మిరియాలు, 20 ఉల్లిపాయలు తరిగినవి, 2 ఆరంజ్‌లు తొనలు, 2 స్పూన్ హేజల్‌నట్ ఆయిల్, 1 స్పూన్ తరిగిన కొత్తిమీర, 1/2 కప్ ఆరంజ్ జూస్, 2 స్పూన్ హేజల్‌నట్స్ వేయించినవి

తయారీ విధానం: ఒవెన్‌ను 400 డిగ్రీల ఫారన్‌హీట్‌లో ఉంచాలి. బీట్స్ తరిగి ఉంచుకోవాలి. పాన్‌లో బీట్స్ ఉంచి ఆయిల్ ఆయిల్, ఉప్పు మరియు మిరియాల పొడితో 25 నిమిషాల వరకు వేయించాలి. ఉల్లిపాయలను ఆలివ్ ఆయిల్, ఉప్పు మరియు మిరియాల పొడితో 15 నిమిషాలు వేయించాలి.

ఆరంజ్‌లను చిన్నని తొనలుగా చేసి ఉంచాలి. చిన్న పాత్రలో హేజల్‌నట్ ఆయిల్, కొత్తిమీర మరియు ఆరంజ్ జూస్‌ను కలిపి ఉంచుకోవాలి. పాత్రలో బీట్‌రూట్, ఆరంజ్ తొనలను ఉంచి, వాటిపై వేయించిన ఉల్లిపాయలు ఉంచి, చివరగా కొత్తిమీర, హేజల్‌నట్స్ మరియు తురిమిన చీస్‌తో అలంకరించండి.

ఇక మధ్యాహ్న భోజనంగా గోధుమ పాస్తాను తీసుకోవచ్చు. దీనితయారీకి కావలసినవి... 1 ఉల్లిపాయ, 1 బంచ్ కాబేజీ, 1 ముల్లంగి సన్నగా తరిగినవి, 1 స్పూన్ చెర్రీ వైన్ వినిగర్, 1/2 స్పూన్ ఆరంజ్ రసం, 3/4 స్పూన్ ఉప్పు, వేయించి పొడి చేసిన మిరియాలు, 3 స్పూన్ ఆలివ్ ఆయిల్, 7 ఔన్స్ చీస్

తయారీ విధానం: ఒక పాత్రలో ఉల్లిపాయలను ఉంచి వాటిలో చల్లటి నీరు పోసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. మరో పాత్రలో నీరు పోసి వాటిని ఉడికించాలి. కాబేజీని కూడా ముందు చల్లని నీటిలో ఉంచి ఆ తరువాత ఉడికించాలి. అందులో ముల్లంగి ముక్కలు వేసి 30 సెకన్లకు ఉడికించాలి. వాటిని వడగట్టి వెంటనే చల్లటి నీటిలో వేయాలి.

పాస్తాను కూడా 8 నుంచి 9 నిమిషాల వరకు ఉడికించి, నీటిని వడగట్టి పక్కనే ఉంచాలి. పెద్ద పాత్రలో వినిగర్, ఆరంజ్ రసం, ఉప్పు మరియు మిరియాల పొడిని వేసి బాగా కలపాలి. అందులో ఉడికించి ఉంచిన కాయకూరలు, పాస్తా, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. కాబేజీ, ముల్లంగి మరియు ఉల్లిపాయలతో అలంకరించి వడ్డించాలి.

సాయంత్రంవేళల్లో స్నాక్స్‌గా మామిడి స్ట్రాబెర్రీ కోన్స్ వంటివాటిని భుజించవచ్చు....
కావలసినవి: 2 మామిడి పండ్లు తరిగినవి, 1 స్పూన్ స్ట్రాబెర్రీలు తరిగినవి, 1 స్పూన్ నిమ్మరసం, 8 కప్స్ ఐస్, పుదీనా

తయారీ విధానం: మామిడి పండ్లు మరియు స్ట్రాబెర్రీలను బాగా చిలక్కొట్టి, అందులో నిమ్మరసాన్ని కలపాలి. ఐస్ క్యూబ్‌లను చిన్న ముక్కలుగా చేసి అందులో పండ్ల రసాన్ని కలిపి పుదీనా ఆకులతో అలంకరించి వడ్డించాలి.

ఇక రాత్రి భోజనంగా వాల్‌నట్ ఆపిల్ సలాడ వంటివి గుండెకు బలాన్ని, అదే సమయంలో హానిచేయని పదార్థాలను తీసుకోవచ్చు. కావలసినవి: 1/2 కప్ వాల్‌నట్ బద్దలు, 1/2 కప్ పెరుగు, 2 స్పూన్ మమనీస్, 2 స్పూన్ పార్‌స్లీ, ఆకులు, 1 స్పూన్ తేనె, 1/2 నిమ్మకాయ తరిగినది, వేయించి పొడి చేసిన నల్ల మిరియాలు, 2 ఆపిల్, 2 రిబ్స్ సెలరీ,
1/4 కప్ కిస్‌మిస్, 1/2 స్పూన్ నిమ్మరసం

తయారీ విధానం: ఒవెన్‌ను 350 డిగ్రీ ఫారన్‌హీట్‌లో ఉంచాలి. బేకింగ్ షీట్‌లో వాల్‌నట్స్‌ వేసి 8 నుంచి 10 నిమిషాల వరకు వేయించాలి. పాత్రలో పెరుగు, మయనీస్, పార్‌స్లీ, తేనె మరియు నిమ్మకాయ మిరియాల పొడిని వేసి బాగా కలపాలి. వాటిలో కట్ చేసి ఉంచిన ఆపిల్‌, సెలరీని వేసి వాటిపై నిమ్మరసం చల్లి, వడ్డించాలి.