Showing posts with label పొడులు. Show all posts
Showing posts with label పొడులు. Show all posts

Monday, May 7, 2012

కరివేపాకు పొడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • కరివేపాకు. 1 కప్పు
  • ఎండుమిర్చి. 4
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • ధనియాలు. 2 టీస్పూ//
  • చింతపండు. సరిపడా
  • మినప్పప్పు. 2 టీస్పూ//.
  • శనగపప్పు. 2 టీస్పూ//
  • వేరుశనగలు. 4 టీస్పూ//
  • తురిమిన పచ్చి కొబ్బరి.. 1/4 కప్పు
  • వెల్లుల్లి. 5 రెబ్బలు
  • నెయ్యి. 2 టీస్పూ//
  • నూనె. 1 టీస్పూ// .
  • ఉప్పు. సరిపడా

తయారీ విధానం

మొదటగా కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లులి రెబ్బలు, వేరుశెనగలు, పప్పులు, చింతపండు అన్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే బాణెలి లో కరివేపాకు కూడా కరకర లాడేలా వేయించాలి. పై వాటినన్నిటినీ కలిపి తగినంత ఉప్పు వేసి రోట్లో వేసి పొడి చేసుకోవాలి.
బాణెలీ లో నెయ్యి వేడి చేసి కరివేపాకుతో చేసిన పొడికి కొబ్బరి పొడి కూడా కలిపి తడి ఆరిపోయి, పొడి పొడిగా అయ్యేదాకా వేయించి దింపేయాలి. అంతే కరివేపాకు పొడి రెడీ.



కంది పొడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • కంది పప్పు: 1 కప్పు
  • మినపప్పు: 1 కప్పు
  • శనగ పప్పు: 1 కప్పు
  • పెసర పప్పు: 1 కప్పు
  • ఎండు మిరప కాయలు(ముక్కలు చేసుకున్నవి): 1 కప్పు
  • జీలకర్ర ¼ టీస్పూ//
  • ఇంగువ: చిటికెడు
  • ఉప్పు: తగినంత

తయారీ విధానం

ముందుగా బాణెలి లో పప్పులన్నీ కంది పప్పు, శనగ పప్పు, పెసర పప్పు, మినపప్పు వరుసగ విడివిడిగా వేయించుకోవాలి.
చివరగ ఎండుమిరపకాయలు కొద్ది ఉప్పుతో వేయించుకోవాలి. పప్పులు వేడిగ వున్నప్పుడు జీలకర్ర వేసుకోవాలి.
అన్ని చల్లారాక మిక్సిలో వేసి మెత్తగ పొడి చేసుకోవాలి. ఆ పోడిలో మిగిలిన ఉప్పు వేసికలుపుకోవాలి.
ఈ పొడి వేడి అన్నంలో నూనే వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది.


వేరుశనగపప్పు పొడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • వేరుశనగపప్పు 200గ్రాములు(ఇంట్లో మనుషులను బట్టి కావలసినంత తీసుకొండి)
  • ఎండుకొబ్బరి తురుము1కప్పు
  • కారం-1చెంచా
  • ఉప్పు-సరిపడినంత
  • వెల్లుల్లిపాయలు-3
  • జీలకర్ర-2చెంచాలు
  • కరివేపాకు-4 రెబ్బలు

తయారీ విధానం

వేరుశనగపప్ఫు ఖాళీ బాణెలి లో వేపి(నూనే లేకుండా) మెత్తగా పొడి చేసుకోవాలి.
జీర, వెల్లుల్లి, కరివేపాకు,(వేయించి)మెత్తగా నూరి ఈ పొడులలో కలిపి ఎండుకొబ్బరి తురుము వేయించి నూరి ఈ పొడులలో కలిపితే రుచి బాగుంటుంది.
లేదా అన్ని కలిపి మిక్సి చేసుకోవచ్చు.


వెల్లుల్లిపాయ కారప్పొడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • వెల్లుల్లిపాయలు... 4
  • చింతపండు... 150 గ్రా
  • నూనె... 100 గ్రా
  • పసుపు. 1/2 టీస్పూ//
  • మినపప్పు. 100 గ్రా
  • శనగపప్పు... 100 గ్రా
  • ఉప్పు.. సరిపడా
  • ఎండుమిర్చి. 200 గ్రా

తయారీ విధానం

వెల్లుల్లి పొట్టువలిచి రేకలు విడిగా ఉంచుకోవాలి. నూనె కాచి అందులో పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లిరేకలు వేయించి తీసుకుని ఉప్పు, పసుపు కలిపి మెత్తగా దంచాలి.
చింతపండు మిగిలిన సగం పచ్చి వెల్లుల్లి రేకలు కూడా ఆ దంపినదానికి కలిపి మరింత మెత్తగా దంచుకోవాలి.
అంతే వెల్లుల్లి కారంపొడి రెడీ అయినట్లే..! దీన్ని ఇడ్లీ, దోశెల్లోకి నూనె లేదా నెయ్యి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.