కావలసిన పదార్థాలు
- వెల్లుల్లిపాయలు... 4
- చింతపండు... 150 గ్రా
- నూనె... 100 గ్రా
- పసుపు. 1/2 టీస్పూ//
- మినపప్పు. 100 గ్రా
- శనగపప్పు... 100 గ్రా
- ఉప్పు.. సరిపడా
- ఎండుమిర్చి. 200 గ్రా
తయారీ విధానం
వెల్లుల్లి పొట్టువలిచి రేకలు విడిగా ఉంచుకోవాలి.
నూనె కాచి అందులో పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లిరేకలు వేయించి తీసుకుని
ఉప్పు, పసుపు కలిపి మెత్తగా దంచాలి.
చింతపండు మిగిలిన సగం పచ్చి వెల్లుల్లి రేకలు కూడా ఆ దంపినదానికి కలిపి మరింత మెత్తగా దంచుకోవాలి.
అంతే వెల్లుల్లి కారంపొడి రెడీ అయినట్లే..! దీన్ని ఇడ్లీ, దోశెల్లోకి నూనె లేదా నెయ్యి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment