కావలసిన పదార్థాలు :
- బంగాళాదుంపలు. 4
- కాలీఫ్లవర్ ముక్కలు. 4 కప్పులు
- జీలకర్ర. 1 టీస్పూ//.
- అల్లంవెల్లుల్లి పేస్ట్. 2 టీస్పూ//.
- నూనె. 3 టీస్పూ//.
- కారం. 2 టీస్పూ//.
- ఉప్పు. తగినంత
- ఇంగువ. 1/2 టీస్పూ//.
- ధనియాలపొడి. 2 టీస్పూ//.
- గరంమసాలా. 2 టీస్పూ//.
- ఆమ్‌చూర్ పౌడర్. 1/2 టీస్పూ//.
- పసుపు. 1/2 టీస్పూ//.
తయారు చేయు విధానం :
నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి కాలీఫ్లవర్ ముక్కలను వేసి పది నిమిషాల తరువాత నీరంతా పోయేలా వడగట్టి పెట్టుకోవాలి.
బాణెలి లో నూనె వేడయ్యాక.. అల్లంవెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ధనియాలపొడి, కారం, పసుపు, నాలుగు టీస్పూ// నీటిని కలిపి వేయించాలి.
అందులోనే కాలీఫ్లవర్ ముక్కలను, ఉప్పును వేసి కలియబెట్టి మూతపెట్టి 5 నిమిషాలపాటు ఉడికించాలి.
ఆ తరువాత ఆలూ ముక్కల్ని కూడా వేసి కలిపి మూతపెట్టి మరో ఇరవై నిమిషాలపాటు ఉడికించాలి.
అయితే మధ్యమధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
ఆపై గరంమసాలా, ఆమ్‌చూర్ పౌడర్‌ని కూడా వేసి
కలియబెట్టి మూతలేకుండా మరో రెండు నిమిషాలు ఉడికించి.. చివర్లో కొత్తిమీర
తరుగు వేసి మూతపెట్టి దించేయాలి. అంతే వేడి వేడి ఆలూ గోబీ కర్రీ రెడీ.
No comments:
Post a Comment