కావలసిన పదార్థాలు
- వంకాయలు: ¼ కిలో
- బంగాళ దుంపలు : 100 గ్రాములు
- పల్చటి చింతపండు పులుసు : 1టీస్పూ//.
- పచ్చి మిరపకాయలు: 3 (నిలువుగ తరిగినవి)
- ఉప్పు : తగినంత
- పసుపు ; చిటికెడు
- కూర/మెంతి పొడి:2 టీస్పూ//.
- పోపు: ఆవాలు, జీలకర్ర,శనగ పప్పు, మినపప్పు,ఎండు మిరపకాయలు, కరివేపాకు,
- నూనె: 3 టీస్పూ//
- కూర/మెంతి పొడికి:
- ధనియాలు: 2 టీస్పూ//
- సనగ పప్పు: 2 టీస్పూ//
- మినపప్పు: 2 టీస్పూ//
- ఎండు మిరపకాయలు : 3
- మెంతులు:4 లేదా 6
- పై పధార్ధాలన్నిటిని బాణెలి లో 1/4 టీస్పూ// నూనే వేసి చిన్న మంట మీద దోరగ వేయించుకుని, మెత్తగ పొడి చేసుకోవాలి. ఈ పొడి నిలవ కూడ వుంటుంది.
తయారీ విధానం
ఒక బాణెలి లో ఒక చిన్న చెంచా నూనె వేసి బంగాళదుంపలు, వంకాయ ముక్కలు చింతపండు పులుసు పోసి ఉడికించుకోవాలి.
ముక్కలు ఉడికిన తర్వాత, వాటిని ఒక జల్లి పళ్ళెంలోకి మార్చుకుని నీరు వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
ఒక బాణెలి లో నూనె వేసి పోపు వేసుకుని అది వేగాక
ఉడికించిన బంగాళదుంప, వంకాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి,నిలువుగ
తరుగుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి.
ముక్కలు కొంచెం వేగాక(అంటే 2 నిమిషాల తర్వాత) పైన తయారు చేసుకున్న కూర పొడి వేసుకోవాలి. అంతే కూర తయర్.
No comments:
Post a Comment