కావలసిన పదార్థాలు
- పొట్లకాయ. 1/2 కేజీ
- పచ్చికొబ్బరి. 1/4 చిప్ప
- పచ్చిమిర్చి. 6
- జీలకర్ర. 1/4 టీస్పూ//.
- కరివేపాకు. 1 కట్ట
- ఆవాలు. 1/4 టీస్పూ//.
- ఎండుమిర్చి. 2
- నూనె. 2 టీస్పూ//.
తయారీ విధానం
ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు వేసి తాలింపు వేయాలి.
తరవాత అందులోనే సన్నగా తరిగిన పొట్లకాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించి, తరవాత కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి.
పచ్చికొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి ముద్దగా
నూరాలి. ఇప్పుడొక బాణెలిలో కొంచెం నూనె వేసి మసాలా ముద్దను ఎర్రగా వేయించి
ఉడుకుతున్న పొట్లకాయలో వేయాలి.
కొంచెం ఉప్పు కూడా వేసి కలపాలి. కూర చిక్కబడ్డాక కరివేపాకు వేసి దించాలి. అంతే వూలన్ కోకోనట్ పొట్లకాయ రెడీ.
No comments:
Post a Comment