కావలసిన పదార్థాలు
- బంగాళాదుంప ముక్కలు. 1/2కప్పు
- కాలీఫ్లవర్. 1/2కప్పు
- క్యారెట్‌తరుగు. 1/4 కప్పు
- బఠాణీలు.1/4 కప్పు.
- బీన్స్‌ముక్కలు. 1/4 కప్పు.
- క్యాప్సికమ్. 1/2కప్పు.
- ఉల్లి తురుము. 1/2 కప్పు.
- పనీర్ ముక్కలు. 1/2కప్పు.
- నూనె. 2 టీస్పూ//.
- యాలకులు. 2
- పలావు ఆకు. 1
- కొత్తిమీర.కొద్దిగా
- మసాలాముద్ద కోసం :
- కొబ్బరితురుము. 2 టీస్పూ//.
- జీడిపప్పు. ఐదు
- ధనియాలు. 1/2టీస్పూ//.
- పసుపు. 1/4టీస్పూ//.
- అల్లం వెల్లుల్లి. 1 టీస్పూ//.
- సోంపు. 1/4టీస్పూ//.
- పెరుగు. 1/2 కప్పు
- గరంమసాలా. 1 టీస్పూ//.
- కారం. 1 టీస్పూ//.
తయారీ విధానం
మసాలాకోసం తీసుకున్న దినుసులన్నీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. దానికి కాస్త పెరుగు కూడా కలపాలి.
ఒక క్యాప్సికమ్ తప్ప కూరగాయ ముక్కలన్నీ కలిపి కొంచెం ఉప్పు వేసి ఉడికించి పక్కన ఉంచాలి.
బాణెలి లో నూనె వేసి యాలకులు, పలావు ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
రుబ్బిన మసాలా వేసి, ఆపై ఉడికించిన కూరగాయ ముక్కలు, వేయించిన పనీర్ ముక్కలు వేసి 1/2కప్పు నీళ్లు పోసి ఉడికించాలి.
కూర చిక్కగా ఉడికాక విడిగా వేయించి పెట్టిన క్యాప్సికమ్ ముక్కలు కలిపి కొత్తిమీర చల్లాలి. అంతే ఆల్ వెజిటబుల్ కర్డ్ కుర్మా రెడి.
No comments:
Post a Comment