కావలసిన పదార్థాలు
- క్యాప్సికం. 1/4 కేజీ
- టొమోటోలు. 100 గ్రా.
- ఉల్లిగడ్డ. పెద్దది 1
- అల్లంవెల్లుల్లి పేస్ట్. 1 టీస్పూ//.
- షాజీరా, దాల్చిన చెక్క పొడి. 1/2 టీస్పూ//.
- ధనియాలపొడి. 1 టీస్పూ//.
- ఉప్పు, కారం. తగినంత
- కొబ్బరిపొడి. 1 టీస్పూ//.
- నూనె. తగినంత
- పసుపు. చిటికెడు
- కొత్తిమీర. కొద్దిగా
తయారు చేయు విధానం :
ముందుగా క్యాప్సికం, ఉల్లిపాయ, టొమోటోలను ముక్కలుగా కోసుకోవాలి.
స్టవ్ మీద బాణెలి పెట్టి నూనె వేసి వేడయ్యాక. ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి.
ఆ తరువాత క్యాప్సికమ్ ముక్కలు వేసి చిన్న మంటమీద
పది నిమిషాలు వేయించాలి. తరువాత టొమోటో ముక్కల్ని కూడా అందులో వేసి మరో ఐదు
నిమిషాలు మగ్గబెట్టాలి.
ఆపై తగినంత ఉప్పు, కారం వేసి కలియబెట్టి షాజీరా దాల్చిన చెక్క పొడి, ధనియాలపొడి, కొబ్బరిపొడి, పసుపు కలపాలి.
కూర దగ్గరికి వచ్చేదాకా చిన్నమంటమీద అలాగే మరో ఐదు
నిమిషాలు ఉడికించి, చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే క్యాప్సికమ్
కర్రీ రెడీ.
No comments:
Post a Comment