Wednesday, May 9, 2012

శనగ రోల్స్ కూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • శనగపిండి. 1/4 కేజీ
  • కారం. 2 టీస్పూ//
  • జీలకర్ర. 1 టీస్పూ//
  • ధనియాలపొడి. 2 టీస్పూ//
  • ఇంగువ. చిటికెడు
  • గరంమసాలాపొడి. 1/2 టీస్పూ//
  • పసుపు. 1 టీస్పూ//
  • చిలికిన మజ్జిగ. 1 కప్పు
  • పచ్చిమిర్చి. 4
  • కొత్తిమీర. 1 కట్ట
  • ఉప్పు. రుచికి సరిపడా
  • నూనె... తగినంత

తయారీ విధానం

శనగపిండిలో ఒక టీస్పూన్ కారం, గరంమసాలా పొడి, ఉప్పు, రెండు టీస్పూన్ల నూనె వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి.
ఈ పిండిని దళసరి చపాతీల్లాగా తయారు చేసి పొడుగ్గా అంగుళం వెడల్పున కట్ చేసుకుని రోల్స్‌లాగా చుట్టుకోవాలి.
తరువాత వీటిని వేడినీటిలో ఉడికించాలి. దీంతో అవి గట్టిపడి, తెల్లగా అయిన తరువాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
కడాయిలో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడయిన తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి, తక్కిన దినుసులు వేసి వేయించాలి.
తరువాత అందులో మజ్జిగ, ఒక కప్పు నీటిని కూడా పోసి మరో మూడు నిమిషాలపాటు ఉడికించాలి.
చివరగా కూర ఉడుకుతుండగా, పక్కన పెట్టుకున్న శనగపిండి రోల్స్‌ను అందులో వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి.అంతే శనగ రోల్స్ కూర రెడీ.

No comments:

Post a Comment