Thursday, May 10, 2012

శనగపప్పుతో బఠాణీల కూర


కావలసిన పదార్థాలు


  • పచ్చి శెనగపప్పు. 1/4 కేజీ
  • పచ్చిబఠాణీలు. 150 గ్రా.
  • పచ్చిమిర్చి. 4
  • ఆవాలు. 2 టీస్పూ//.
  • అల్లం. చిన్న ముక్క
  • పంచదార. 1 టీస్పూ//.
  • ఆమ్‌చూర్. 1/2 టీ//.
  • నిమ్మకాయ. 1
  • నూనె. 100 గ్రా.
  • కొత్తిమీర. 1 కట్ట
  • కొబ్బరి తురుము. 2 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • కారం. 1 టీస్పూ//.

తయారీ విధానం


ముందుగా శెనగపప్పును శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోయాలి. అందులోనే బఠాణీలు, ఉప్పు వేసి ఉడికించాలి. అల్లం, పచ్చిమిర్చి కలిపి ముద్దగా నూరుకోవాలి.
బాణెలి లో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, పసుపు, అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసి వేయించాలి.
తరువాత అందులో ముందుగానే ఉడికించిన పప్పు, బఠాణీలతో పాటు ఉప్పు, కారం వేసి కలపాలి.
తరువాత పంచదార, ఆమ్‌చూర్, కొబ్బరి తురుము వేసి మరో 2 నిమిషాలు ఉడికించాలి.
చివర్లో నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వేడి వేడి శనగపప్పు బఠాణీల కూర రెడీ. 

No comments:

Post a Comment