కావలసిన పదార్థాలు
- పెసరపప్పు. 1/2 కిలో
- పెరుగు. 1 లీ.
- జీలకర్ర. 2 టీస్పూన్లు
- ఎండుమిర్చి. 6
- ఆవాలు. 2 టీస్పూ//.
- కరివేపాకు. 1 కట్ట
- పచ్చిసెనగపప్పు. 1 టీస్పూ//.
- నూనె. వేయించేందుకు సరిపడా
- ఉప్పు. తగినంత
- అల్లం. చిన్నముక్క
- పచ్చిమిర్చి. నాలుగు
తయారీ విధానం
పెసరపప్పుని 15 నిమిషాలు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి ఉప్పు కలపాలి.
ఓ బాణెలిలో నూనె వేసి కాగాక పెసరపిండిలో కొంచెం పిండిని పక్కకు తీసి ఉంచి, మిగిలిన పిండిని పుణుకుల మాదిరిగా వేయాలి.
పెరుగుని బాగా గిలకొట్టి కొద్దిగా నీరు పోసి అందులోనే విడిగా తీసి ఉంచిన పెసరపెండిని కలపాలి.
అల్లం, పచ్చిమిర్చి నూరిన ముద్ద కూడా వేసి కలిపి స్టవ్‌మీద పెట్టి మరిగించాలి.
ఈ మిశ్రమం కాస్త చిక్కగా అయిన తరవాత ముందుగా వేయించుకున్న పుణుకులను వేసి కొద్దిసేపు ఉడికించాలి.
కొద్ది నూనెలో సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర,
కరివేపాకు అన్నీ వేసి పోపు చేసి పెసరపిండి పెరుగు మిశ్రమంలో కలపాలి. అంతే
పెసర పుణుకుల కడీ రెడీ .
No comments:
Post a Comment