Thursday, May 10, 2012

తోవల్‌ రింగన్‌ నుషార్‌


కావలసిన పదార్థాలు


  • బీన్స్. 1/4 కేజీ
  • వంకాయలు. 100 గ్రా.
  • అల్లం. చిన్న ముక్క
  • వెల్లులి. 2 పాయలు
  • పచ్చిమిర్చి. 3
  • పసుపు. చిటికెడు
  • జీలకర్ర పొడి. 1/2 టీస్పూ//.
  • ఆవాలు. 1/4 టీస్పూ//.
  • బెల్లం. కాస్తంత
  • నిమ్మకాయ. 1
  • ఇంగువ. చిటికెడు
  • ఉప్పు. తగినంత
  • నూనె. 3 టీస్పూ//.

తయారీ విధానం


బీన్స్‌, వంకాయలను పెద్ద ముక్కలుగా తరగాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి.

బాణెలిలో నూనెను వేడిచేసి ఆవాలు, ఇంగువ, ఆ తరువాత బీన్స్‌ వేసి తగినంత నీటిని పోయాలి.

బీన్స్‌ కొద్దిగా ఉడికిన తరవాత బెల్లం కలపాలి. ఆపై వంకాయ ముక్కలను కూడా కలిపి ఉడికించాలి.

అందులోనే జీలకర్ర పొడి వేసి, నిమ్మకాయ రసం పిండాలి. చివరిగా 2 నిమిషాల సేపు ఉడికించి తీస్తే, తోవర్‌ రింగన్‌ నుషార్ రెఢీ.

No comments:

Post a Comment