కావలసిన పదార్థాలు
- సొరకాయ ముక్కలు. 2 కప్పులు
- శనగపిండి. 1 కప్పు
- జీలకర్ర.1 టీస్పూ//.
- వాము. 1 టీస్పూ//.
- ఉప్పు. రుచికి సరిపడా
- వేరుశెనగపప్పు. 1/4 కప్పు
- పచ్చిమిర్చి. 2
- కారం. 1 టీస్పూ//.
- కరివేపాకు. 2 రెమ్మలు
- కొత్తిమీర. 4 రెమ్మలు
- నూనె. తగినంత
తయారీ విధానం
సొరకాయ ముక్కల్లో శనగపిండి, జీలకర్ర, వాము, ఉప్పు వేసి అవసరమైతే కొద్దిగా నీటిని చిలకరించి, పకోడీల పిండిలాగా కలుపుకోవాలి.
బాణీలి లో నూనె వేసి కాగాక మిశ్రమాన్ని పలుకులుగా పడేటట్లు వేసి దోరగా కాలాక తీసి పక్కన ఉంచాలి.
ఒక్కొక్క సొరకాయ ముక్క విడిగా పడేటట్లు వేసుకుంటే, సమంగా కాలి వేపుడు రుచిగా ఉంటుంది.
బాణీలి లో ఒక టీస్పూన్ నూనె ఉంచి మిగిలినదాన్ని ఓ గిన్నెలోకి తీసేయాలి.
అందులో వేరుశెనగపప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి,
కరివేపాకు వేసి వేగిన తరువాత ముందుగా వేయించి పక్కన ఉంచిన సొరకాయ పకోడీలను
వేసి కలపాలి.
అవసరమైతే మరికొంత ఉప్పు, కారం చల్లుకోవచ్చు. చివరగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
అంతే జీలకర్ర సొరకాయ తయార్.
No comments:
Post a Comment