Thursday, May 10, 2012

వంకాయ చిక్కుడు గింజల కూర


కావలసిన పదార్థాలు


  • వంకాయలు. 1/2 కేజీ
  • చిక్కుడు గింజలు. 1/2 కప్పు
  • ఉల్లిపాయలు. 2
  • పసుపు. 1/2 టీస్పూ//.
  • ధనియాలపొడి. 1/2 టీస్పూ//.
  • కారం. 1 టీస్పూ//.
  • నూనె. 2 టీస్పూ//.
  • అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 టీస్పూ//.
  • పచ్చిమిర్చి. 8
  • కొత్తిమీర. 2 టీస్పూ//.
  • ఆవాలు, జీలకర్ర. 1 టీస్పూ//.
  • కరివేపాకు. 4 రెబ్బలు
  • ఉప్పు. సరిపడా

తయారీ విధానం


ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీరలను గ్రైండ్ చేసుకోవాలి. అలాగే చిక్కుడు గింజలను ఉప్పు వేసిన నీటిలో ఉడికించి ఉంచాలి.
ఒక పాత్రలో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో పోపు పెట్టాలి.
అందులోనే ఉల్లిపాయ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి.
తరువాత అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌లను జతచేసి బాగా కలిపి ఐదు నిమిషాలపాటు వేయించాలి.
పసుపు, కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి, సరిపడా ఉప్పును కూడా కలిపి ఉడికించాలి.
ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి కలిపి, సన్నటి మంటపై పది నిమిషాలపాటు ఉడికించాలి.
దాంట్లోనే కాసిన్ని నీళ్లు చిలకరించి మరికొంతసేపు ఉడికించాలి.
చివర్లో ఉడికించిన చిక్కుడు గింజల్ని కూడా జతచేసి ఐదు నిమిషాల తరువాత దించేయాలి.

No comments:

Post a Comment