Thursday, May 10, 2012

పనీర్‌ బచ్చలి కర్రీ


కావలసిన పదార్థాలు


  • బచ్చలికూర. 3 కట్టలు
  • పనీర్. 1/4 కేజీ
  • పండు టొమాటోలు. 4
  • ఉల్లిపాయలు. 2
  • కారం. 1 స్పూను
  • ఉప్పు. తగినంత
  • పసుపు. చిటికెడు
  • గరంమసాలా పొడి. 1 టీస్పూ//
  • వెల్లుల్లి. 10 రేకలు
  • అల్లం. చిన్నముక్క
  • నూనె. 1 కప్పు
  • కొత్తిమీర. 1 కట్ట

తయారీ విధానం


బచ్చలిని శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి, ఉడికించి, మిక్సీలో కొద్దిగా గ్రైండ్‌ చేసి ఉంచాలి. ఉల్లిపాయలు తరిగి అల్లం వెల్లుల్లితో సహా మిక్సీలో గ్రైండ్‌ చేయాలి.

పనీర్‌‌ను చిన్నచిన్న ముక్కలుగా కోసి, నూనెలో దోరగా వేయించి తీయాలి.

రుబ్బి ఉంచిన ఉల్లిపాయల మిశ్రమాన్నికూడా దోరగా వేయించి. అందులో టొమాటో, ఉప్పు, పసుపు, కారం, పనీర్‌ ముక్కలు వేసి ముక్కలు మునిగేలా నీళ్లు పోసి ఉడకనివ్వాలి.

బాగా ఉడికిన తరవాత రుబ్బి ఉంచిన బచ్చలి కూడా వేసి, మరో 2 నిమిషాలు ఉడికించి దించాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీరచల్లి దించేయాలి. అంతే పనీర్ బచ్చలి కర్రీ రెఢీ.

No comments:

Post a Comment