కావలసిన పదార్థాలు :
- వంకాయలు. 1/4 కేజీ
- పెసరపప్పు.. 1 కప్పు
- పచ్చికొబ్బరి చిప్ప.. 1
- ఉప్పు.. తగినంత
- కరివేపాకు.. కాస్తంత
- పోపుకోసం.
- నూనె.. 2 టీస్పూ//
- మినప్పప్పు.. 1 టీస్పూ//
- జీలకర్ర. కాస్తంత
- ఎండుమిరపకాయలు.. 3
- ఇంగువ.. కొద్దిగా
- వెల్లుల్లి రేకలు. 10
తయారు చేయు విధానం :
వంకాయలు చిన్న ముక్కలుగా కోసి నీళ్లలో వేయాలి.
వాటిని పెసరపప్పుతో కలిపి మెత్తగా ఉడికించాలి.
ఉప్పు వేసి కిందకి దించాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణెలి ని పెట్టి నూనె వేసి పోపు సామాను అన్నీ వేసి ఎర్రగా వేయించాలి.
పచ్చికొబ్బరి వేసి బాగా కలిపి కరివేపాకు కూడా వేసి, ఉడికించి దించిన వంకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపితే వంకాయ కూటు రెడీ!
No comments:
Post a Comment