కావలసిన పదార్థాలు
- పెసరపప్పు. 1/4 కేజీ
- పాలకూర.4 కట్టలు
- అల్లంవెల్లుల్లి. 1 టీస్పూ//.
- పచ్చిమిర్చి. 2
- పసుపు. 1/4 టీస్పూ//.
- కొత్తిమీర. కాస్తంత
- నూనె. 4 టీస్పూ//.
- నిమ్మకాయ. 1
- తాలింపు కోసం
- ఆవాలు. 1/2 టీస్పూ//.
- జీలకర్ర. 1/2 టీస్పూ//.
- ఎండుమిర్చి. 4
- కరివేపాకు. 4 రెమ్మలు
- వెల్లుల్లి. 6 రెబ్బలు
- నూనె లేదా నెయ్యి. 4 టీస్పూ//.
తయారీ విధానం
పెసరపప్పులో ఉప్పు, పసుపు, 4 గ్లాసుల నీళ్లు పోసి ఉడికించి పక్కన ఉంచాలి.
బాణీలి లో నూనె పోసి వేడయ్యాక అల్లంవెల్లుల్లి వేసి ఓ రెండు నిమిషాలు వేయించి, ఆపై సన్నగా తరిగిన పాలకూరను వేసి ఉడికించాలి.
పాలకూర బాగా ఉడికిన తరువాత ఉడికించిన పెసరపప్పునూ కూడా వేసి కొద్దిగా నీళ్లు పోయాలి.
అందులోనే పచ్చిమిర్చిని కూడా వేసి మరో 10 నిమిషాలు తక్కువ మంటమీద ఉడికించాలి.
ఆ తరువాత కొత్తిమీర చల్లి నిమ్మరసం పిండితే సరి.
చివర్లో.విడిగా బాణీలి పెట్టి నూనె లేదా నెయ్యి వేసి ఎండుమిర్చి, ఆవాలు,
జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకులతో పోపు వేసి పప్పులో కలపితే వేడి వేడి
పెసరపప్పు పాలకూర రెడీ అయినట్లే.
No comments:
Post a Comment