Showing posts with label పచ్చళ్ళు. Show all posts
Showing posts with label పచ్చళ్ళు. Show all posts

Monday, May 7, 2012

దానిమ్మపచ్చడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పుల్లటి దానిమ్మగింజలు. 1 కప్పువేయించి
  • పొట్టుతీసిన వేరుశెనగపప్పు. 1/2 కప్పు
  • పండుమిరపకాయలు.. 5
  • వెల్లుల్లి.. 10 రేకలు
  • జీలకర్ర.. 2 టీస్పూ//.
  • నూనె.. 1/2 టీస్పూ//.
  • ఉప్పు.. రుచికి సరిపడా

తయారీ విధానం

నూనెలో పండుమిర్చి, వెల్లుల్లి రేకలు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేయించాలి.
మిక్సీలో వేరుశెనగ గింజలు, జీలకర్ర, మిర్చి, వెల్లుల్లి రేకలతో పాటు దానిమ్మగింజలు, ఉప్పు జతచేసి గ్రైండ్ చేసుకోవాలి.
ఇష్టమైతే మినప్పప్పు, ఆవాలు, కరివేపాకులతో తిరగమోత పెట్టుకోవచ్చు.
లేకపోతే అలాగే అయినా తినవచ్చు. అంతే రుచికరమైన దానిమ్మపచ్చడి రెడీ. 

కాకర పచ్చడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • కాకరకాయలు. 1/4 కేజీ
  • చింతపండు. కాస్తంత
  • ఉప్పు. తగినంత
  • ఎండుమిర్చి. 4
  • ధనియాలు. 2 టీస్పూ//
  • మినప్పప్పు. 1 టీస్పూ//
  • పచ్చిశెనగపప్పు. 1 టీస్పూ//
  • ఇంగువ. చిటికెడు
  • పోపుకోసం ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు.. తగినంత

తయారీ విధానం

కాకరకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
ఒక గిన్నెలోకి చింతపండు తీసుకుని ఉడికించి, గుజ్జులా చేసుకుని దాంట్లో కాకరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కాసేపు ఉడికించాలి.
దించిన తరువాత నీటిని వంపేసి, ముక్కల్ని బాగా పిండేయాలి. బాణెలి లో నూనె కాగిన తరువాత కాకర ముక్కల్ని వేసి వేయించాలి.
మరో చిన్న బాణెలి లో కాస్త నూనె వేసి ఎండుమిర్చి, ధనియాలు, మినప్పప్పు, పచ్చి శెనగపప్పు వరుసగా వేసి, అవి దోరగా వేగిన తరువాత కొంచెం ఇంగువ వేసి వేయించాలి.
దించి చల్లారిన తరువాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా నూరాలి.
ఆ తరువాత కాకరముక్కలు, ఉప్పు, చింతపండు గుజ్జుల్ని కూడా వేసి మెత్తగా రుబ్బాలి.
ఆ తర్వాత పోపుకోసం తీసుకున్న పదార్థాలతో పోపుపెట్టి పచ్చడిలో కలపాలి. అంతే చేదు తక్కువగా, రుచి ఎక్కువగా ఉండే కాకర పచ్చడి తయార్.

ఉసిరి చట్నీ


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • ఉసిరి ముక్కలు.2 కప్పులు
  • కారం. 3 టీస్పూ//.
  • మెంతిపొడి. 1. టీస్పూ//.
  • ఆవాల పొడి. 2 టీస్పూ//.
  • పసుపు.. చిటికెడు
  • నూనె.. 5 టీస్పూ//.
  • ఆవాలు.. 1/2 టీస్పూ//.
  • నిమ్మకాయ. 1
  • ఇంగువ పొడి. చిటికెడు
  • ఉప్పు. తగినంత

తయారీ విధానం

ఓ బాణెలి లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, ఇంగువ, మెంతిపొడి, పసుపు వేసి వేయించాలి.
ఆపై ఉసిరి ముక్కల్ని కూడా వేసి రెండు లేదా మూడు నిమిషాలపాటు కలుపుతూ వేయించాలి.
తరువాత కారం, ఆవపిండి, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. చల్లారిన తరువాత ఓ చిన్న జాడీలోగానీ, ఏదేని తడిలేని సీసాలోగానీ భద్రపరచుకోవాలి. అంతే ఉసిరి చట్నీ సిద్ధం. 

బెండకాయ పచ్చడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బెండకాయలు. 1/4 కిలో
  • ఎండుమిరప కాయలు. 10
  • చింతపండు. నిమ్మకాయంత.
  • పసుపు, ఇంగవ. చిటికెడు
  • పోపు దినుసులు. 3 టీస్పూ//.

తయారీ విధానం

బెండకాయల్ని శుభ్రం చేసుకుని ఆరబెట్టి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
వేడయిన బాణెలి లో నూనెను పోసి వేడయ్యాక బెండకాయ ముక్కల్ని వేసి వేయించాలి. బాగా వేగాక ఆ బాణెలి ని స్టౌవ్‌మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి.
మరో బాణెలి లో నూనెను పోసి బాగా కాగాక అందులో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి వేయించి తీసి కాసేపు ఆరబెట్టిన తరువాత రోట్లో వేసి దంచుకోవాలి.
దీనికి చింతపండును కలిపి నూరి, ఆపై వేయించిన బెండకాయ ముక్కల్ని కూడా కలిపి దంచాలి.
తరువాత నూరిన పచ్చడిని తీసి పోపు పెట్టుకోవాలి. అంతే బెండకాయపచ్చడి రెడీ. 

బెండ రైతా


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బెండకాయలు. 5
  • పెరుగు. 1 కప్పు
  • కారం. ¼ టీస్పూ//
  • వేయించిన జీలకర్ర పొడి... ¼ టీస్పూ//
  • కొత్తిమీర. కొద్దిగా
  • ఉప్పు. తగినంత
  • చక్కెర. తగినంత

తయారీ విధానం

బెండకాయల చివర్లు తీసేసి రెండు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
వీటిని నూనెలో వేయించి న్యూస్ పేపర్ మీద వేసి, నూనె పీల్చుకున్న తరువాత తీసి పక్కన ఉంచాలి.
ఈలోపు పెరుగును చిలక్కొట్టి దానికి కారం, జీరాపొడి, ఉప్పు, చక్కెర చేర్చాలి.
ఆ తర్వాత బెండకాయ ముక్కల్ని వేసి పైన కొత్తిమీరతో అలంకరించి అతిథులకు సర్వ్ చేయాలి. అంతే బెండ రైతా తయార్. 

పొడి చెట్ని


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • శనగ పప్పు:1 కప్పు
  • మినపప్పు: 1 కప్పు
  • చింతపండు:చిన్న నిమ్మకాయంత
  • ఎండు మిరపకాయలు(ముక్కలు చేసినవి): 1/2 కప్పు
  • ఎండు కొబ్బరి(తురిమినది):1 కప్పు
  • బెల్లం: 1/2 కప్పు
  • ఉప్పు: తగినంత

తయారీ విధానం

ముందుగా బాణెలి లో శనగ పప్పు, మినపప్పు, ఎండు మిరపకాయలు, చింతపండు, ఎండు కొబ్బరి విడివిడిగా వేయించుకోవాలి.
ముందుగ పప్పులు రెండు మిక్సిలో వేసి మెత్తగ పొడి చేసుకోవాలి. కొంచెం పొడి విడిగా తీసుకుని మిగిలిన పొడిలో చింతపండు వేసి పొడి చేసుకోవాలి.
ఆ పొడిని పైన విడిగ తీసుకున్న పొడిలో కలుపుకోవాలి.
మళ్ళీ కొంచెం పొడి విడిగా తీసుకుని దానికి ఎండు మిరపకాయలు కలిపి పొడి చేసుకుని దీనిని మొత్తం పొడిలో కలుపుకోవాలి.
ఇలానే ఎండు కొబ్బరి, బెల్లం కూడా విడివిడిగా మిక్సిలో వేసుకుని పొడి చేసుకోవాలి.
ఇలా అన్ని పొడిచేసుకున్న తర్వాత ఉప్పు వేసి కలుపుకుని నెయ్యి వేసి పోపు వేసుకోవాలి.
ఈ పొడి కొంచెం తియ్యగా వుంటుంది. అన్నంలో, దోస, ఇడ్లీలలోకి బాగుంటుంది. 

గుమ్మడి పచ్చడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • కందిపప్పు... 1 కప్పు
  • ఎండుమిర్చి. 5
  • గుమ్మడి తురుము. 1/2 కప్పు
  • ధనియాలు, జీలకర్ర. 2 టీస్పూ//
  • వెల్లుల్లి... 1 రెబ్బ
  • చింతపండు.2 రెబ్బలు
  • నూనె. తగినంత
  • ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు... తగినంత

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె వేడిచేసి కందిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.
దాంట్లోనే మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర గుమ్మడి వేసి వేయించాలి. వీటన్నింటిని మిక్సీలో వేసి రుబ్బాలి.
దీంట్లో కొత్తిమీర, చింతపండు, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి రుబ్బి గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత ఇంగువతో తాళింపు పెట్టుకోవాలి. అంతే గుమ్మడి చట్నీ సిద్ధమైనట్లే.

కాలిఫ్లవర్ కారట్ పచ్చడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • తోలు వలిచిన కేరట్స్... ౩
  • మెత్తటి బెల్లం. 1/2 కప్పు
  • పసుపు... 1 టీస్పూన్
  • ఉప్పు తగినంత
  • కాలిఫ్లవర్. 1
  • వెనిగర్.1/4 టీస్పూ//
  • కారం..సరిపడా

తయారీ విధానం

కేరట్లను సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాలిఫ్లవర్‌ను సన్నగా తరగాలి. కారం, కేరట్, కాలిఫ్లవర్‌, పసుపు తీసుకుని బాగా కలుపుకోవాలి.
వీటిని ఓ గిన్నెలో వేసి ఎండలో నాలుగు రోజులపాటు ఉంచాలి. వెనిగర్ గోరువెచ్చగా చేసి, దాంట్లో బెల్లం వేసి బాగా కలపాలి.
బెల్లం కరిగేదాకా వెనిగర్‌ను వేడిచేసి, చల్లారిన తరువాత ఎండబెట్టి ఉంచుకున్న కేరట్, కాలిఫ్లవర్ మిశ్రమాన్ని కలపాలి.
దీన్ని మరో గిన్నెలోకి తీసుకుని ఐదు రోజులపాటు ఉంచిన తరువాత తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

కాప్సికమ్ చట్నీ


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • కాప్సికమ్. 1/4 కేజీ
  • పచ్చిమిర్చి. తగినన్ని
  • ఉప్పు. సరిపడా
  • వెల్లుల్లిపాయలు. రెండు
  • నిమ్మకాయ... సగం చెక్క
  • నూనె... సరిపడా
  • ఉప్పు... తగినంత
  • ఆవాలు, జీలకర్ర... పోపుకు సరిపడా
  • కరివేపాకు... సరిపడా
  • మినప్పప్పు... చిటికెడు
  • ఎండుమిర్చి. 2

తయారీ విధానం

కాప్సికమ్‌లను విత్తనాలు తీసి ముక్కలుగా కత్తిరించుకోవాలి. కాప్సికమ్‌, పచ్చిమిర్చి, ఉప్పు, కాసిన్ని వెల్లుల్లిపాయలను వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
దీనికి సగం నిమ్మచెక్క నుండి తీసిన రసాన్ని కూడా కలుపుకోవాలి.
స్టవ్‌పై బాణెలి పెట్టి... నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి.
దీంట్లో నూరి ఉంచుకున్న క్యాప్సికం మిశ్రమాన్ని కలిపి, ఉప్పు సరిజూసుకోవాలి. అంతే కాప్సికమ్ పచ్చడి చట్నీ రెడీ అయినట్లే.

అరటి కాండం పచ్చడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • అరటి కాండం... 1 కేజీ (నార తీసి ముక్కలుగా తరిగింది)
  • నిమ్మకాయలు... 15 కాయలు
  • ఎండు మిరపకాయలు... 50 గ్రా
  • ఆవాలు... 50 గ్రా
  • పెరుగు... 250 మిలీ
  • పసుపు... 5 గ్రా
  • ఉప్పు... 25గ్రా
  • కరివేపాకు... సరిపడా
  • పోపుదినుసులు... సరిపడా

తయారీ విధానం

ముందుగా అరటి కాండం ముక్కలు, ఎండుమిరపకాయలు, ఆవాలను కాస్తంత నూనెలో వేయించి, ఆపై రుబ్బి ఉంచుకోవాలి.
తరువాత నిమ్మకాయలను ముక్కలుగా చేసుకుని నూరుకున్న మిశ్రమానికి కలపాలి.
తరువాత దీనికి సరిపడా ఉప్పు, పసుపు, పెరుగులను కూడా కలుపుకోవాలి.
ఆపై కరివేపాకు, పోపు దినుసులతో పోపు పెట్టుకోవాలి. అంతే అరటికాండం పచ్చడి సిద్ధమైనట్లే.
ఈ అరటికాండం పచ్చడి మధుమేహ వ్యాధి (షుగర్) ఉన్నవారికి మంచిది.
అంతేగాకుండా ఇది దోసె, చపాతీలకు కూడా మంచి సైడ్‌డిష్‌ అని చెప్పవచ్చు.

మామిడికాయ పచ్చడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • మామిడికాయ... 1 పెద్ద సైజుది
  • బెల్లం... 90 గ్రా
  • ఉప్పు... 1/2 టీస్పూ//
  • పచ్చిమిరపకాయలు... 2
  • బియ్యంపిండి... సరిపడా

తయారీ విధానం

మామిడికాయను పై పొట్టు తీయనక్కరలేదు. మరీ మందంగా ఉంటే మాత్రం తొక్క తీసుకోవాలి.
లీటరులో 5వ వంతు నీటిని వేడి చేసుకోవాలి.
అందులో ఈ మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి.
మామిడికాయ ఉడికిన తరువాత బెల్లం కలపాలి. ఆ తరువాత బియ్యంపిండిని నీళ్ళలో కలిపి అందులో పోయాలి.
రెండు టీ స్పూన్ల నూనెలో ఆవాలు, పచ్చిమిరపకాయలు వేసి పోపు పెట్టుకోవాలి. అంతే మామిడికాయ పచ్చడి రెడీ. ఇది ఇడ్లీ, దోశెల్లోకి అద్భుతంగా ఉంటుంది.

వెల్లుల్లి అల్లం పచ్చడి


Picture  Recipe


కావలసిన పదార్థాలు

  • వెల్లుల్లిరేకులు... 3 కప్పులు
  • అల్లం పేస్ట్.... 1/2 కప్పు
  • కారం... 1 కప్పు
  • ఉప్పు... సరిపడ
  • మెంతిపొడి... 1/4 కప్పు
  • జీలకర్ర... 1 టీ స్పూ//
  • ఆవపిండి..1/2 కప్పు.
  • ఇంగువ... 1/2 టీస్పూ//.
  • నిమ్మరసం...1 కప్పు
  • నువ్వులనూనె... 2 కప్పులు.
  • పసుపు.. 1/2 టీస్పూన్

తయారీ విధానం

ముందుగా వెల్లుల్లి రేకుల్ని, అల్లం ముక్కల్ని పొట్టుతీసి శుభ్రం చేసుకోవాలి.
ఓ బాణెలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, ఇంగువ, మెంతిపొడి, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి రేకులు, అల్లం పేస్ట్‌ను వేసి బాగా దోరగా వేయించాలి.
వెల్లుల్లి రెబ్బలు బాగా వేగాక నిమ్మరసం వేసి బాగా కలిపాలి. తరువాత మిగిలిన నువ్వుల నూనెను వేడిచేసి పచ్చడిమీద పోయాలి.
ఈ పచ్చడిని పొడిగా ఉన్న ఓ గాజు పాత్రలోకి నిల్వ ఉంచుకుంటే మూడునెలలపాటు అలాగే ఉంటుంది. 

నేతి బీరకాయని సిల్క్ స్క్వాష్ (చైనీస్ ఓక్రా)


Picture  Recipe


కావలసిన పదార్థాలు

  • నేతి బీరకాయ................ఒకటి
  • చింతపండు......చిన్న ఉసిరికాయంత
  • పచ్చిమిరపకాయలు.........ఆరు
  • నూనె............తగినంత
  • ఉప్పు.............తగినంత
  • వెల్లుల్లి రెబ్బలు......నాలుగు
  • జీలకర్ర.......... ఒక చిన్న చెంచా
  • కొత్తిమీర..........చిన్న కట్ట
  • కరివేపాకు........రెండు రెమ్మలు

తయారీ విధానం

నేతి బీరకాయల తోలు తియ్యక్కరలేకుండా, కాయని బాగా శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి. బాణెలిలో రెండు చెంచాల నూనె వేసి, అది వేడి అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించి తీసుకోవాలి.
తరువాత బీరకాయ ముక్కలు వేసి వాటిలో నీరు పోయేంతవరకు వేయించి తీసుకోవాలి. వేగాక ఈ ముక్కల్లో కాస్త చింతపండు పెట్టుకోవాలి. ముక్కలు చల్లారాక ముందుగా పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు మిక్సీలో వేసి మెత్తగా నూరుకోవాలి. తరువాత నేతి బీరకాయ ముక్కలు వేసి ఒక్కసారి తిప్పీ తిప్పనట్టు తిప్పితే సరిపోతుంది.
చివరగా కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లియ, జీలకర్ర వేసి ఒక్కసారి కచ్చాపచ్చాగా నూరుకుని పచ్చట్లో కలుపుకోవాలి.
ఎండుమిరపకాయలు, మినపపప్పు, శనగపప్పు, ఆవాలతో పోపు పెట్టుకోవచ్చు కూడా.
వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యితో పాటు ఈ పచ్చడి వేసుకు తింటే అద్భుతంగా ఉంటుంది! చపాతీలలోకి కూడా బాగుంటుంది. 

కాలీప్లవర్‌ పచ్చడి


కావలసిన పదార్థాలు

  • కాలీఫ్లవర్‌ ముక్కలు. 2 కప్పులు
  • నూనె. మూడు టీస్పూ//.
  • జీలకర్ర. 1/2 టీస్పూ//.
  • ఆవాలు. 1/2 టీస్పూ//.
  • మెంతులు. 1 టీస్పూ//.
  • ఆవపిండి. మూడు టీస్పూ//.
  • కారం. 2 టీస్పూ//.
  • మెంతిపిండి. చిటికెడు
  • ఉప్పు. తగినంత
  • నిమ్మకాయలు. మూడు

తయారీ విధానం

కాలీఫ్లవర్‌ని కడిగిన తరువాత ముక్కలుగా విడదీసి బట్టమీద ఆరబెట్టాలి.
ఓ బాణెలిలో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి అవి చిటపటమన్నాక కాలీఫ్లవర్‌ ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు వేయించి దించాలి.
ఈ ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ వేసి కలపాలి. చివరగా నిమ్మరసం పిండి మరోసారి కలిపితే కాలీఫ్లవర్‌ పచ్చడి రెడీ.

కంది పచ్చడి


కావలసిన పదార్థాలు

  • కందిపప్పు. 1 కప్పు
  • ఎండుమిర్చి. 5
  • వెల్లుల్లి రెబ్బలు. 4
  • చింతపండు గుజ్జు. కొద్దిగా
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • కొబ్బరిపొడి. 2 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత

తయారీ విధానం

సన్నటి సెగపై బాణెలిని ఉంచి. నూనె లేకుండా కందిపప్పు, ఎండుమిర్చిని వేయించి పక్కన పెట్టుకోవాలి.
పప్పు బాగా చల్లారాక తగినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు గుజ్జు, జీలకర్ర, కొబ్బరి పొడి, తగినంత నీరు పోసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
ఇష్టాన్ని బట్టి పచ్చడి మరీ మెత్తగా లేదా కాస్త బరకగా ఉండేలా రుబ్బుకోవాలి. అంతే కమ్మగా అలరించే కంది పచ్చడి రెడీ.

మామిడికాయ కొబ్బరి పచ్చడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు
  • మామిడికాయ. 1
  • కొబ్బరికాయ. 1
  • శనగపప్పు. 1 టీస్పూ//.
  • మినప్పప్పు. 1 టీస్పూ//.
  • ఆవాలు. 1 టీస్పూ//.
  • మెంతులు. 1 టీస్పూ//.
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • ఎండుమిర్చి. 10
  • పచ్చిమిర్చి. 5
  • ఉప్పు. తగినంత
  • పసుపు. చిటికెడు
  • ఇంగువ. తగినంత
  • నూనె. 1 టీస్పూ//.

తయారీ విధానం

ముందుగా కొబ్బరికాయను, మామిడికాయను విడివిడిగా ముక్కలు చేసి పక్కన ఉంచుకోవాలి.
తరువాత స్టౌమీద బాణెలి పెట్టి నూనె వేసి. అందులో వరుసగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వరుసగా వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
మిక్సీలో ముందుగా పోపు సామాను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
తరువాత కొబ్బరి వేయాలి. అది కూడా మెత్తగా నలిగాక, చివరగా మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు, ఇంగువ వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ. 

పెరుగు పచ్చడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • అరటికాయలు. 2
  • పచ్చిమిర్చి. 4
  • ధనియాలు. 2 టీస్పూ//.
  • చింతపండు. 25 గ్రా.
  • వెల్లుల్లి. పది రేకలు
  • జీలకర్ర. 5 గ్రా.
  • పెరుగు. 1/4 లీ.
  • ఉల్లిపాయ. 1
  • కరివేపాకు. 2 రెబ్బలు
  • కొత్తిమీర. 1 కట్ట
  • ఆవాలు. 1/2 టీస్పూ//.
  • నూనె. సరిపడా
  • ఉప్పు. తగినంత

తయారీ విధానం

అరటికాయలు తొక్కు తీసి ముక్కలుగా కోసి ఉడకబెట్టాలి. బాణెలి లో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి, దనియాలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి వేయించాలి.
చింతపండు, ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు , పచ్చిమిర్చి పోపు. అన్నీ మిక్సీలో లేదా రోట్లో వేసి మెత్తగా రుబ్బాలి.
ఇందులో పెరుగు వేసి కలపాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలుతో పోపు చేసి పచ్చడిలో కలిపితే పెరుగు పచ్చడి రెడీ.

కొత్తిమీరతో కొబ్బరి చట్నీ


Picture  Recipe


కావలసిన పదార్థాలు

  • కొత్తిమీర. 2 కట్టలు
  • కొబ్బరికాయలు. 2 చిన్నవి
  • అల్లం. 10 గ్రా.
  • వెల్లుల్లి. 10 గ్రా.
  • పచ్చిమిర్చి. 200 గ్రా.
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • నిమ్మరసం. 2 టీస్పూ//.
  • పంచదార. 2 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత

తయారీ విధానం

కొబ్బరి చిప్పలను తురిమి ఉంచుకోవాలి. కొత్తిమీరను శుభ్రంగా కడిగి కోయాలి.
పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కొబ్బరికోరు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ కలిపి రుబ్బాలి.
ఆ తరువాత ఉప్పు, పంచదార కూడా వేసి రుబ్బి, చివరగా నిమ్మరసం కలిపితే కొత్తిమీరతో కొబ్బరి చట్నీ రెఢీ.

పండుమిరప పచ్చడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పండుమిరపకాయలు. 100 గ్రా.
  • నీరు. 1 గ్లాసు
  • నూనె. 50 గ్రా.
  • చింతపండు. 25 గ్రా.
  • ఉల్లిపాయ. 1
  • వెల్లుల్లి రేకలు. 6
  • ధనియాలు. 1 టీస్పూ//.
  • ఆవాలు. 1 టీస్పూ//.
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • మెంతులు. 1/4 టీస్పూ//.
  • కరివేపాకు. 2 రెబ్బలు
  • ఉప్పు. తగినంత

తయారీ విధానం

ముందుగా బాణెలిలో నూనె పోసి వేడి చేయాలి. అందులో మెంతులు, కరివేపాకు, పండుమిర్చి వేసి వాటి రంగు మారకుండా వేయించి దించాలి.
అందులోనే చింతపండు, ధనియాలు, జీలకర్ర వేసి 1/2గంటసేపు నాననివ్వాలి.
వీటికి వెల్లుల్లి, ఉల్లిపాయముక్కలు, ఉప్పు కూడా చేర్చి రుబ్బితే. నోరూరించే పండుమిరప పచ్చడి రెఢీ.

మామిడికాయ - చిలగడదుంప పచ్చడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు
  • మామిడికాయ. 1
  • చిలగడదుంపలు. 3
  • నూనె. 50 గ్రాములు
  • ఎండుమిర్చి. 5
  • మెంతులు. కాస్తంత
  • ఆవాలు. 1 టీస్పూ//
  • ఉప్పు, పసుపు. తగినంత
  • ఇంగువ. కొద్దిగా

తయారీ విధానం

ముందుగా మామిడికాయ, దుంపలను శుభ్రంగా కడిగి పైచెక్కు తీసి తురిమి ఉంచుకోవాలి.
బాణెలిలో నూనె వేసి కాగిన తరువాత ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి.
ఆ తరువాత స్టవ్‌పై నుంచి బాణే లిని దించేసి, కాసేపు ఆరిన తరువాత రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి.
తరువాత అందులోనే తురిమి ఉంచుకున్న మామిడికాయ, చిలగడదుంపల కోరును కూడా కలిపి నూరాలి.
చివరగా ఉప్పు, పసుపు వేసి మరి కాసేపు నూరాలి. అంతే మామిడికాయ. చిలగడదుంప పచ్చడి రెడీ.