కావలసిన పదార్థాలు
- బెండకాయలు. 5
- పెరుగు. 1 కప్పు
- కారం. ¼ టీస్పూ//
- వేయించిన జీలకర్ర పొడి... ¼ టీస్పూ//
- కొత్తిమీర. కొద్దిగా
- ఉప్పు. తగినంత
- చక్కెర. తగినంత
తయారీ విధానం
బెండకాయల చివర్లు తీసేసి రెండు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
వీటిని నూనెలో వేయించి న్యూస్ పేపర్ మీద వేసి, నూనె పీల్చుకున్న తరువాత తీసి పక్కన ఉంచాలి.
ఈలోపు పెరుగును చిలక్కొట్టి దానికి కారం, జీరాపొడి, ఉప్పు, చక్కెర చేర్చాలి.
ఆ తర్వాత బెండకాయ ముక్కల్ని వేసి పైన కొత్తిమీరతో అలంకరించి అతిథులకు సర్వ్ చేయాలి. అంతే బెండ రైతా తయార్.
No comments:
Post a Comment