కావలసిన పదార్థాలు :
- దొండకాయలు. 1/2 కేజీ
- స్టఫింగ్ కోసం
- ఉల్లిపాయ తరుగు. 4
- అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 టీస్పూ//. కారం. 2 టీస్పూ//.
- ధనియాలపొడి. 1.1/2 టీస్పూ//.
- పసుపు. 1/2 టీస్పూ//.
- సోంపు పొడి. 1/2 టీస్పూ//.
- వేరుశెనగపప్పు. 2 టీస్పూ//.
- కొత్తిమీర. 2 టీస్పూ//.
- ఉప్పు. తగినంత
- ఆవాలు. 2 టీస్పూ//.
- దాల్చిన చెక్క. చిన్న ముక్క
- మినప్పప్పు. 1 టీస్పూ//.
- కరివేపాకు. 4 రెమ్మలు
- నూనె. 2 టీస్పూ//.
తయారు చేయు విధానం :
ఉల్లిపాయ తరుగును వేయించాలి. స్టఫింగ్ కోసం చెప్పిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి నూరుకోవాలి.
దొండకాయలను శుభ్రపరచి, నిలువుగా నూనె వంకాయికి మల్లే కట్ చేసుకోవాలి. ఇందాక నూరుకున్న మిశ్రమాన్ని కట్ చేసిన దొండకాయల్లో కూరాలి.
పాన్‌లో నూనె వేడయ్యాక. మినప్పప్పును దోరగా వేయించి, ఆవాలు, కరివేపాకు, దాల్చినచెక్క వేసి వేయించాలి.
తరువాత ఇందులోనే దొండకాయలను వేసి, సన్నటి మంటమీద పది నిమిషాలపాటు ఉడికించాలి.
దొండకాయలు అన్నివైపులా ఉడికేలా చూసి దించేయాలి. అంతే స్టఫ్‌డ్ దొండకాయ రెడీ.
No comments:
Post a Comment