కావలసిన పదార్థాలు :
- పుట్టగొడుగుల. 1/4 కేజీ
- ఉల్లిపాయలు. 3
- వెల్లుల్లి పేస్ట్. 1 టీస్పూ//.
- కారం. 2 టీస్పూ//.
- పచ్చిమిర్చి. ఐదు
- పసుపు. 1/4 టీస్పూ//.
- కొత్తిమీర. 2 కట్టలు
- నూనె. 100 గ్రా.
- గోంగూర. 3 కట్టలు
తయారు చేయు విధానము :
పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగి, ఉడికించి పక్కన
ఉంచాలి. గోంగూరను శుభ్రంగా కడిగి ఓ గ్లాసు నీళ్లు పోసి పచ్చిమిర్చి వేసి
ఉడికించాలి.
తరువాత ఈ ఆకుల్ని మెత్తగా మెదపాలి. ఒక గిన్నెలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి దోరగా వేయించాలి.
అందులోనే అల్లం వెల్లుల్లి, కారం, పసుపు వేసి కలపాలి.
చివరిగా ఉడికించిన పుట్టగొడుగు ముక్కలను, గోంగూర,
కొత్తిమీర, చగినంత ఉప్పు వేసి కలిపి ఓ ఐదు నిమిషాలు వేయించి దించేయాలి.
అంతే గోంగూర పుట్టగొడుగుల కర్రీ రెడీ.
No comments:
Post a Comment