కావలసిన పదార్థాలు
- కాకరకాయలు. 1/2 కేజీ
- ఉల్లిపాయలు. 4
- ఆవాలు. 1/4 టీస్పూ//
- ఎండుమిర్చి.. 2
- నువ్వులు.. 2 టీస్పూ//
- వేరుశెనగపప్పు.. 50 గ్రా.
- ఎండుకొబ్బరి.. 50 గ్రా.
- ధనియాలపొడి. 1 టీస్పూ//
- కారం. 1 టీస్పూ//
- కరివేపాకు. 1 కట్ట
- నూనె.. సరిపడా
- చింతపండురసం.. 2 కప్పులు
- బెల్లం.. కాస్తంత
- ఉప్పు.. తగినంత
తయారు చేయు విధానం :
కాకరకాయ ముక్కలను కోసి నూనెలో వేయించి తీసి పక్కనపెట్టాలి.
నువ్వులు, వేరుశెనగపప్పు, ఎండుకొబ్బరిలను విడివిడిగా వేయించి చల్లారాక ముద్దలా నూరి పక్కన ఉంచాలి.
ఓ గిన్నెలో సుమారుగా అరకప్పు నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకులతో తాలింపు వేయాలి.
తరువాత అందులో సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.
ఇప్పుడు కారం, ధనియాలపొడి, మసాలా ముద్ద కూడా వేసి బాగా కలిపి, నూనె పైకి తేలేవరకూ వేయించాలి.
ఆపై చింతపండురసం, ఉప్పు, బెల్లం అన్నీ వేసి సన్నని మంటమీద ఉడికించాలి.
చివరగా, వేయించి తీసిన కాకరముక్కల్ని కూడా వేసి మరో పది నిమిషాలు ఉడికించి, ఉప్పు సరిచూసి దించేయాలి. అంతే బగారా కరెలా సిద్ధం.
No comments:
Post a Comment