కావలసిన పదార్థాలు
- తోటకూర కాడలు లేతవి తగినన్ని
- యాలక్కాయలు 3
- ఉల్లిపాయలు 2
- లవంగాలు 4
- రెండు నూనె.. 3 టీస్పూ//.
- దాల్చిన చెక్క కాస్తంత
- ఉప్పు, కారం తగినంత
- గసగసాలు 2 టీస్పూ//.
- అల్లం చిన్న ముక్క
- వెల్లుల్లి 4 రెబ్బలు
- ఆవాలు 1/4 టీస్పూ//.
- జీలకర్ర 1 టీస్పూ//.
- మినప్పప్పు 1 టీస్పూ//.
తయారీ విధానం
ముందుగా తోటకూర కాడలను కడిగి ముక్కలు చేసుకోవాలి.
ఉల్లిపాయల్ని కూడా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి.
మసాలా దినుసులన్నీ పొడికొట్టుకుని వుంచుకోవాలి.
అల్లం వెల్లుల్లిని మెత్తగా నూరి ముద్దగా చేసుకోవాలి.
పొయ్యిమీద బాణెలి పెట్టి అందులో నూనె వేయాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు బాణెలిలో వేసి పోపు పెట్టాలి.
తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేయించిన, తర్వాత తోటకూర కాడల ముక్కలను వేయాలి.
కాసేపు వేగాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి
మసాలా పొడి, ఉప్పు, కారం, ముక్కలపై జల్లి, అవసరమైనంత నీరు పోసి కొంచెం సేపు
బాగ ఉడకనివ్వాలి.
సెగమీద నుండి దింపుకున్న తర్వాత కొత్తిమీర జల్లుకోవాలి
No comments:
Post a Comment