కావలసిన పదార్థాలు :
- అరటికాయలు. 2
- నూనె. 50 గ్రా.
- పచ్చికొబ్బరి తురుము. 1 కప్పు
- ఉల్లికాడ తురుము. 1 కప్పు
- కొత్తిమీర తురుము. 1 కప్పు
- పచ్చిమిర్చి. 4
- నిమ్మరసం. 2 టీస్పూ//
- కరివేపాకు. 1 రెమ్మ
- ఛాయ మినప్పప్పు. 1 టీస్పూ//
- ఆవాలు. 1/2 టీస్పూ//
- జీలకర్ర. 1/4 టీస్పూ//
- కారం. 1/2 టీస్పూ//
- పసుపు. 1/4 టీస్పూ//
- ఉప్పు. తగినంత
- ఎండుమిర్చి. 1
- ఇంగువపొడి. 1/4 టీస్పూ//
తయారు చేయు విధానం :
అరటికాయల్ని రెండుగా కోసి ఆవిరి మీద ఉడికించి, తొక్క తీసి, పొడిపొడిగా చిదపాలి.
దీంట్లో పసుపు, ఉప్పు, నిమ్మరసం, కారం, పచ్చిమిర్చి ముద్ద, కొత్తిమీర తురుము, కొబ్బరి తురుము, ఉల్లికాడ తురుము వేసి కలపాలి.
బాణెలి లో నూనె పోసి కాగిన వెంటనే మినప్పప్పు వేసి కొద్దిగా వేయించాలి.
ఆ తరువాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు,
ఇంగువ కూడా వేసి దోరగా వేయించి, ఆపై అరటికాయ మిశ్రమాన్ని కూడా వేసి
అట్లకాడతో కదుపుతూ వేయించి దించేయాలి.
అంతే అరటికాయ పిట్టూ రెడీ.
No comments:
Post a Comment